Parineeti Chopra Raghav Chadha Arrive to Mumbai Amid Wedding Rumours - Sakshi
Sakshi News home page

Parineeti Chopra: ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన ప్రేమజంట.. త్వరలోనే నిశ్చితార్థం!

Published Sun, Apr 2 2023 12:19 PM | Last Updated on Sun, Apr 2 2023 1:05 PM

Parineeti Chopra Raghav Chadha arrive to Mumbai amid wedding rumours - Sakshi

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్‌లో ఉన్నట్లు బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట  ఓ రెస్టారెంట్‌ వద్ద కలిసి వెళ్తూ కెమెరాల కంటపడగా.. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలైంది. అంతే కాకుండా మరో ఎంపీ సైతం వీరిద్దరి రిలేషన్‌ను నిజం చేస్తూ ట్వీట్‌ చేశారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన పరిణీతి చోప్రా అభిమానులు సైతం కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. అయితే వీరిద్దరి రిలేషన్‌పై ఎవరూ కూడా అధికారికంగా స్పందించలేదు. 

తాజాగా పరిణామాలతో ఈ లవ్‌ బర్డ్స్‌ అందరూ అనుకుంటున్నట్లుగానే డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసి జంటగా కనిపిస్తున్నారు.  మరోసారి పరిణీతి, రాఘవ్ చద్దా ఆదివారం ఉదయం ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో ఈ జంట కలిసి వెళ్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ జంట విమానాశ్రయంలో నవ్వుతూ కమెరాల కంటికి చిక్కారు.  ఢీల్లీ నుంచి బయలు దేరి నేరుగా ముంబయిలో వాలిపోయారు. 

(ఇది చదవండి: ఆప్‌ నేతతో పరిణీతి చోప్రా డేటింగ్.. ట్వీట్ వైరల్)

త్వరలోనే పరిణీతి-రాఘవ్ నిశ్చితార్థం?

తాజా నివేదికల ప్రకారం పరిణీతి, రాఘవ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. పరిణీతి, రాఘవ్ కుటుంబాలు ఎంగేజ్‌మెంట్ ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వారు తేదీని కూడా ప్రకటించే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement