
పరిణీతీ చోప్రా
క్యారెక్టర్‌కి అనుగుణంగా మారిపోవడం పరిణీతీ చోప్రాకు చాలా ఇష్టం. అందుకే సినిమా సినిమాకు వ్యత్యాసం చూపించడానికి ట్రై చేస్తుంటారామె. తన లేటెస్ట్ సినిమా ‘జబరియా జోడీ’లో బిహారీ అమ్మాయిగా కనిపించనున్నారు. దాని కోసం భోజ్‌పురీ భాష నేర్చుకుంటున్నారట. భోజ్‌పురీ భాష సరిగ్గా పలకడం కోసం ఒక ట్యూటర్‌ని కూడా పెట్టుకున్నారు పరిణీతి. కొత్త భాష నేర్చుకోవడం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘యాక్టర్స్‌గా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, రకరకాల పాత్రల్లో కనిపించడం మా అదృష్టం. స్క్రీన్ మీద నన్ను నేను చాలెంజ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం ట్రైనింగ్ (భోజ్‌పురీ భాష నేర్చుకోవడం గురించి) చాలా సరదాగా నడుస్తోంది. చిన్న చిన్న డీటైల్స్ కూడా మిస్ అవ్వదలుచుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు పరణీతి.