
పది కిలోలు తగ్గడానికి పది లక్షలు!
పరిణీతి చోప్రా ఒంటిపై కత్తి పడింది.. అందుకే అలా అయిపోయారు’’ అని బాలీవుడ్‌లో తెగ చెప్పుకుంటున్నారు. దానికి కారణం
‘‘పరిణీతి చోప్రా ఒంటిపై కత్తి పడింది.. అందుకే అలా అయిపోయారు’’ అని బాలీవుడ్‌లో తెగ చెప్పుకుంటున్నారు. దానికి కారణం ఈ బ్యూటీ సన్నబడటమే. పరిణీతి కొంచెం బొద్దుగా ఉంటారనే విషయం తెలిసిందే. ‘ఇలా అయితే కష్టమే. కొంచెం తగ్గమ్మా’ అని వాళ్లూ వీళ్లూ సూచించడంతో పరిణీతి కూడా తగ్గితేనే బెటరనుకున్నారు. దాంతో పది కిలోలు వరకూ తగ్గేశారామె. ఈ తగ్గుదల వెనక ఉన్న రహస్యం సర్జరీ అన్నది పలువురి వాదన. కానీ, ఆస్ట్రియాలో పాల్గొన్న ‘డిటాక్స్ ప్రోగ్రామ్’ వల్లనే పరిణీతి సన్నబడ్డారట.
సర్జరీ అవసరం లేకుండా బరువు తగ్గించే ప్రోగ్రామ్ ఇది. అయితే, ఆ ట్రీట్‌మెంట్‌కి శరీరం తట్టుకుంటుందో లేదో కొన్ని పరీక్షలు చేసి, ఆ తర్వాత మొదలుపెడతారట. 15 నుంచి 30 రోజుల పాటు జరిగే ఈ కోర్స్‌కి అయ్యే ఖర్చు ఐదు నుంచి పది లక్షల రూపాయలని సమాచారం. ఈ కోర్స్‌లో భాగంగా ఇచ్చే డైట్‌ని ఆరు నెలలు పాటించాలట! వాళ్లు సూచించిన వర్కవుట్లు చేయాలట. పరిణీతి ఇవన్నీ కరెక్టుగా ఫాలో అయ్యి, తాను అనుకున్నట్లు బరువు తగ్గేశారు. ‘పది కిలోలు తగ్గడానికి పది లక్షలు ఖర్చు పెట్టిందా? బాగా డబ్బులున్నట్టున్నా’యని కొంతమంది చెప్పుకుంటున్నారట.