మాంచెస్టర్‌ ఘటనపై స్పందించిన హీరోయిన్‌ | Parineeti Chopra upset over attack in friendliest city Manchester | Sakshi
Sakshi News home page

మాంచెస్టర్‌ ఘటనపై స్పందించిన హీరోయిన్‌

Published Tue, May 30 2017 6:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మాంచెస్టర్‌ ఘటనపై స్పందించిన హీరోయిన్‌ - Sakshi

మాంచెస్టర్‌ ఘటనపై స్పందించిన హీరోయిన్‌

ముంబై : మాంచెస్టర్‌ బాంబు దాడి ఘటనపై బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా ట్విట్టర్‌లో స్పందించింది. ఉగ్రవాది జరిపిన దాడిని ఖండించింది. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆమె నివాళులర్పించింది. తాను మాంచెస్టర్‌ నగరంలో మూడేళ్లు ఉన్నానని, ఎంతో స్నేహపూర్వకమైన, అద్భుతమైన నగరమని చోప్రా తెలిపింది.

అలాంటి ప్రశాంతమైన నగరంలో ఈ ఘటన జరిగిందంటే నమ్మలేకపోతున్నానని పరిణీతి పేర్కొంది. ఈ నెల 22న అమెరికన్‌ గాయకురాలు అరియానా గ్రాండె షోలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో 22 చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘాతుకంలో సుమారు 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 16 మంది అనుమానితులను  పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement