manchester attack
-
మాంచెస్టర్ ఘటనపై స్పందించిన హీరోయిన్
ముంబై : మాంచెస్టర్ బాంబు దాడి ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ట్విట్టర్లో స్పందించింది. ఉగ్రవాది జరిపిన దాడిని ఖండించింది. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆమె నివాళులర్పించింది. తాను మాంచెస్టర్ నగరంలో మూడేళ్లు ఉన్నానని, ఎంతో స్నేహపూర్వకమైన, అద్భుతమైన నగరమని చోప్రా తెలిపింది. అలాంటి ప్రశాంతమైన నగరంలో ఈ ఘటన జరిగిందంటే నమ్మలేకపోతున్నానని పరిణీతి పేర్కొంది. ఈ నెల 22న అమెరికన్ గాయకురాలు అరియానా గ్రాండె షోలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో 22 చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘాతుకంలో సుమారు 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 16 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. Cant believe what happened in Manchester.It was my home for 3 years,truly the friendliest and most loving city. #manchesterattack — BINDU (@ParineetiChopra) 30 May 2017 -
ప్రాణాలు కాపాడిన మొబైల్..
లండన్: మాంచెస్టర్ బాంబు పేలుళ్ల సంఘటనలో ఓ మహిళ ప్రాణాలను ఆమె మొబైల్ రక్షించింది. ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్న లీసా బ్రిడ్జెట్ అనే మహిళా బాంబు పేలుళ్లు సంభవించినపుడు ఒక నట్ ఆమె వైపు బలంగా దూసుకొచ్చింది. అది ఆమె ఫోన్‌కు తగలడంతో ప్రాణపాయం తప్పిందని తీవ్రంగా గాయపడ్డ లీసా మీడియాకు తెలిపింది. ఈ దాడిలో ఆ నట్ బలంగా ఆమెను తాకడంతో మధ్య వేలును కోల్పోయింది. ఆ నట్ ఫోన్‌కు తగలి ఆమె చెంపను తాకడంతో గాయాలతో బయటపడింది. నట్ మొబైల్‌కు తగలడంతో దాని వేగం తగ్గి లీసాకు ప్రాణపాయం తప్పిందని ఆమె భర్త స్టీవ్ తెలిపాడు. లీసా చీలిమండ, తొడలకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేయనున్నారని స్టీవ్ ఫేస్ బుక్‌లో పేర్కొన్నాడు.. ఈ బాంబు దాడిలో 22 మరణించగా 64 మంది గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 8 మందిని యూకే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
మనకంటే ముందే అమెరికాకు ఎలా?
మాంచెస్టర్ బాంబు పేలుడుకు సంబంధించిన సమాచారం లండన్ పోలీసులు మీడియాకు చెప్పడానికి ముందే అమెరికా మీడియాలో ఆ విషయాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. వాళ్లకు ఈ సమాచారం లీక్ కావడం బ్రిటిష్ హోం మంత్రికి బాగా చికాకు తెప్పించింది. పేలుడుకు సంబంధించి బయటకు వెళ్లే సమాచారం మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించి, తమ దర్యాప్తునకు విఘాగం కలగకుండా చూసుకోవడంలో బ్రిటిష్ పోలీసులకు అన్ని రకాలుగా స్పష్టమైన సూచనలు ఇచ్చామని, కానీ అదేమీ లేకుండా అమెరికన్ మీడియా మాత్రం ఇష్టారాజ్యంగా ఏవి పడితే అవి ప్రచురించిందని హోం మంత్రి అంబర్ రడ్ బీబీసీ రేడియోతో చెప్పారు. ఇది చాలా ఇరిటేటింగ్‌గా ఉందని, అధికార వర్గాల నుంచి కాకుండా వేరే వర్గాల నుంచి సమాచారం లీక్ అవ్వడానికి వీల్లేదని, ఇదే విషయాన్ని తన మిత్రులకు (అధికారులకు) మళ్లీ మళ్లీ చెబుతున్నానని ఆమె అన్నారు. దర్యాప్తు సక్రమంగా సాగకుండా అమెరికన్ అధికారులు ఏమైనా అడ్డుపడుతున్నారా అని ప్రశ్నించగా, తాను అంత దూరం వెళ్లబోనన్నారు. ఇక్కడి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని, ఇలాంటిది ఇంకోసారి జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అమెరికన్ పాప్ స్టార్ అరియానా గ్రేండ్ కచేరీ సాగుతుండగా సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో 22 మంది మరణించిన సంగతి తెలిసిందే. సల్మాన్ అబేది అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అతడి పేరు ముందుగా అమెరికన్ మీడియాలోనే వచ్చింది. అందుకే అక్కడి హోం మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దుష్ట సిద్ధాంతాన్ని నాశనం చేయాలి
⇒ ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా పోరాడాలి: ట్రంప్ ⇒ మాంచెస్టర్ ఉగ్రదాడిని ఖండించిన ప్రపంచ నేతలు లండన్/బెత్లెహామ్: అమా యక ప్రజలను బలిగొన్న బ్రిటన్‌లోని మాంచెస్టర్‌పై ఉగ్రదాడిని ప్రపంచ నేతలు, ప్రముఖులు తీవ్రంగా ఖండిం చారు. పాప్‌స్టార్ అరియానా గ్రాండే ప్రదర్శన సమయంలో వేదిక వద్ద జరిగిన ఈ ఆత్మాహుతి బాంబు దాడి మృతులకు పాలస్తీనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘దుష్ట సిద్ధాంతాన్ని సర్వనాశనం చేయాలి. అమాయక ప్రజలకు రక్షణ కల్పించి తీరాలి. మన పౌరుల పవిత్ర హక్కయిన శాంతిభద్రతలను కాపాడేందుకు నాగరిక దేశాలన్నీ ఒక్కటి కావాలి’అని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు. బ్రిటన్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మాక్రాన్... ‘మనం ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాటం చేస్తున్నాం’అన్నారు. ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ: మాంచెస్టర్ ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ‘మాంచెస్టర్ దాడి వార్త విని ఎంతో బాధపడ్డా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. సిగ్గుమాలిన చర్య: పుతిన్ ‘ఈ సిగ్గుమాలిన, అమానవీయ చర్యను ఖండిస్తున్నాం. దీనికి బాధ్యులైనవారు శిక్ష నుంచి తప్పించుకోరని ఆశిస్తున్నా’అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. మాంచెస్టర్ ఘటనతో గుండె పగిలిందని, ఇలాంటి కిరాతకాలకు పాల్పడేవారిని తుదముట్టించాలన్న సంకల్పాన్ని మరింత ధృఢం చేసిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్క్లాడే జుంకర్ అన్నారు. ‘యువతను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి అత్యంత కిరాతకం’అని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడితో దిగ్భ్రాంతి కలిగించిందని కెనడా, జపాన్ల ప్రధానమంత్రులు జస్టిన్ ట్రుడ్యూ, షిన్జో అబే అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బ్రిటిషర్లకు చైనా ప్రజలు మద్దతుగా ఉంటారని ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్పారు. సోనియా, రాహుల్ దిగ్భ్రాంతి.. మాంచెస్టర్ దాడిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘సరిహద్దులు చెరిపేసి, మతాలకతీతంగా ప్రపంచమంతా ఒక్కటై ఉగ్రవాద భూతంపై పోరాడాలి’అని సోనియా తన సందేశంలో పేర్కొన్నారు. గుండె పగిలింది: అరియానా తన కార్యక్రమంలో జరిగిన ఈ దాడిపై పాప్ సింగర్ అరియానా గ్రాండె దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ‘గుండె పగిలింది. నన్ను క్షమించండి. మాటలు రావడం లేదు’అంటూ కన్నీటి పర్యంతమ య్యారు. ‘అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఆ ఘటన తలుచుకుంటుంటే కన్నీళ్లు ఉబుకుతున్నాయి’ అని గాయని, నటి డెమి లావాటో బాధను వ్యక్తం చేశారు. ‘మాంచె స్టర్ బాధితుల కోసం ప్రార్థిస్తున్నా. మరణించిన వారికి కన్నీటి వీడ్కోలు’అంటూ సెలెనో గోమెజ్, టేలర్ స్విఫ్ట్, బీబర్, జాన్ లెజండ్ బాధను పంచుకున్నారు. ‘ఇలాంటి హేయమైన చర్యల కు సమాధానం అందరం చేతులు కలిపి ప్రేమను పంచడ మొక్క టే’అని ఆస్కార్ పొందిన గాయకుడు శాంస్మిత్ అన్నారు. -
ఇది ఆరంభం మాత్రమే; ఐసిస్ ప్రకటన
-
ఇది ఆరంభం మాత్రమే; ఐసిస్ ప్రకటన
మాంచెస్టర్: ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ నగరంలో విధ్వంసానికి పాల్పడింది తామేనని ప్రకటించుకున్న ఐసిస్.. ఇది ఆరంభం మాత్రమేని హెచ్చరించింది. ఇలాంటి దాడులు మరిన్ని చేస్తామని భీకరవ్యాఖ్యలు చేసింది. మాంచెస్టర్‌లోని మాంచెస్టర్ ఎరీనా వద్ద శక్తిమంతమైన ’నెయిల్ బాంబు’ పేలుడులో 19 మంది మరణించగా, 50మంది గాయపడ్డారు. మాంచెస్టర్ పేలుళ్లు విజయవంతం కావడంపట్ల ఐసిస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు. ‘మోసుల్‌లో దాడులకు ప్రతీకారమే ఇది..’ అని కామెంట్లు పెట్టారు. అమెరికన్ పాప్ గాయని అరియానా షో ముగిసిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. ఎరీనా వద్ద బాంబు పేలిన తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. అక్కడికి సమీపంగా ఉన్న కేథడ్రల్ గార్డెన్‌లోనూ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మాంచెస్టర్ ఘటనతో ఉలిక్కిపడ్డ యూరప్ దేశాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. జనం ఎక్కువగా గుమ్మికూడే చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ, అదనపు బలగాలను మోహరించాయి. అటు అమెరికాసైతం సెక్యూరిటీని టైట్ చేసింది.