
రెండు టీ షర్టులు పది లక్షలా!
అది ఇండోనేషియాలోని జకార్తాలో గల షాపింగ్ మాల్. ఏదో షూటింగ్ నిమిత్తం అక్కడికెళ్లిన పరిణీతి చోప్రా ఆ మాల్‌కి వెళ్లారు.
అది ఇండోనేషియాలోని జకార్తాలో గల షాపింగ్ మాల్. ఏదో షూటింగ్ నిమిత్తం అక్కడికెళ్లిన పరిణీతి చోప్రా ఆ మాల్‌కి వెళ్లారు. పర్సు నిండా డబ్బులు, క్రెడిట్ కార్డులు పెట్టుకుని ఆమె ఆ షాపింగ్ మాల్‌లోకి వెళ్లారు. ఒక షాప్‌కి సంబంధించిన అద్దాల తలుపుల్లోంచి రంగు రంగుల టీ షర్టులు కనిపించాయి పరిణీతికి. దాంతో ఆ షాప్‌లోకి ఎంటరయ్యారు. ఓ రెండు టీ షర్టులు సెలక్ట్ చేసుకున్నారు. వాటి విలువ ఎంతో తెలుసా? అక్షరాలా పది లక్షల రూపాయలు. ఏంటీ... రెండు టీ షర్టులు పది లక్షలా? అని ఆశ్చర్యపోతున్నారా! నిజం కాదు అనుకుంటున్నారా? ఇది నిజంగా నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని పరిణీతియే ఫేస్‌బుక్ ద్వారా స్వయంగా పేర్కొన్నారు. ఈ వార్తను పూర్తిగా చదవనివాళ్లు ఎంత డబ్బుంటే మాత్రం పది లక్షలు పెట్టి రెండు టీ షర్టులు కొంటారా? అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. పూర్తిగా చదివితే... ఇండోనేషియా పది లక్షల కరెన్సీ మనకు ఐదువేల రూపాయలతో సమానం అని పరిణీతి పేర్కొన్న విషయం తెలుస్తుంది.