బాలీవుడ్ హీరోయిన్ పరిణీత చోప్రా మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయింది.
బాలీవుడ్ హీరోయిన్ పరిణీత చోప్రా మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయింది. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మేరి ప్యారీ బిందు' అనే సినిమాలో నటిస్తున్న ఈ భామ తాజాగా దుబాయ్‌లో షూటింగ్ పాల్గొంటున్నది. దుబాయ్ బీచ్‌లో విహారిస్తున్న వీడియోను ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే, బీచ్‌లో విహరిస్తున్న ఆమెకు ఎండ తగలకుండా గొడుగు ఎత్తులో పట్టుకొని.. ఎక్కడికి వెళ్లితే అక్కడి ఆమె అసిస్టెంట్ వెళ్లడం కనిపించింది.
అంతేకాదు ఆ అసిస్టెంట్ మూడు బ్యాగులు మోస్తున్నాడు. అందులో ఒక బ్యాగు పరిణీత చోప్రా హ్యాండ్‌బ్యాగ్ కూడా ఉంది. అంత బరువును మోస్తూ కూడా ఆమె ఎక్కడికి వెళితే.. అక్కడికి వెళ్తూ గొడుగు పట్టుకున్న అతని దీన స్థితి నెటిజన్ల కదిలించింది. అంతే ఈ భామ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. గతంలో లావుగా ఉన్న ఒక స్నేహితురాలిని ఎగతాళి చేస్తూ వీడియో పెట్టి కూడా పరిణీత చోప్రా ఇలాగే అభాసుపాలైంది. ఆమె చెప్పే ఆదర్శాలన్నీ ఉత్తవేనని, కానీ ఆచరణమాత్రం దారుణంగా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. 'ఆ గొడుగు వందకిలోల బరువు ఉండి ఉంటుంది' అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, గొడుగు పట్టుకున్న ఆయన మీ సహనటుడా అంటూ మరొకరు ఎద్దేవా చేశారు.