Snehal Rai Reveals Being Married to 21 Year Older Politician - Sakshi
Sakshi News home page

Snehal Rai: పొలిటీషియన్‌తో పెళ్లి.. వయసుతో పనేముంది?.. మనసులు కలిస్తే చాలు..!

Published Sat, May 27 2023 7:56 PM | Last Updated on Sat, May 27 2023 8:50 PM

Snehal Rai reveals being married to 21 year older politician - Sakshi

ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ ఉంటారు. నిజమే మనసులు కలిస్తే చాలు. ఏ వయసులోనైనా పెళ్లి చేసుకోవచ్చేనేది ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. వయసుతో  ఎలాంటి సంబంధం లేకుండానే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస‍్ట్రీ ఈ ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నట్లుంది. తాజాగా ఓ బుల్లితెర నటి తనకంటే 21 ఏళ్లు పెద్ద అయినా ఓ పొలిటీషియన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే పదేళ్ల క్రితమే వివాహం చేసుకున్న నటి తాజాగా ఈ విషయాన్ని బయపెట్టింది. గతంలో కూడా దిలీప్ కుమార్, సైరా బాను  జంట మధ్య వయస్సు అంతరం ఉన్నా వివాహబంధంతో ఒక్కటయ్యారు. 

(ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!)

కాగా.. బుల్లితెర నటి స్నేహల్ రాయ్ ఇష్క్ కా రంగ్ సఫేద్ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత జన్మో కా బంధన్, విష్, పర్ఫెక్ట్ పతి, ఇచ్ఛప్యారీ నాగిన్ టీవీ షోలలో నటించింది. పెళ్లైన మహిళల అందాల పోటీలో పాల్గొన్న స్నేహల్ రాయ్ తన వివాహం గురించి చెప్పుకొచ్చింది. పొలిటీషియన్ మధ్వేంద్ర కుమార్ రాయ్‌తో వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతుందని తెలిపింది. తన భర్త తనకంటే 21 ఏళ్లు పెద్దవాడని వెల్లడించింది. అంతే కాకుండా తన భర్త కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని చెప్పుకొచ్చింది భామ. 

(ఇది చదవండి: అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ)

తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో మధ్వేంద్రను కలిశానని స్నేహల్ రాయ్  వివరించింది.  ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకున్నామని తెలిపింది. మేమిద్దరం మా మధ్య వయసు అంతరం గురించి ఎప్పుడు ఆలోచిందని పేర్కొంది.  నా చిన్నతనంలో అమ్మ పడిన కష్టాలు దగ్గరుండి చూశానని.. నాన్నతో విడిపోయాక ఆహారం, డబ్బులేక కేవలం నీళ్లతోనే కడుపు నింపుకుని బతికామని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement