
సాక్షి ,ఖమ్మం: ఎన్నికల వేడి మొదలైంది...రాజకీయనాయకులు కొత్త కొత్త ..వింత వేషాలను వేస్తున్నారు. అందులో కొన్ని..
తిలకం దిద్ది..హారతి పట్టి
ఖమ్మంరూరల్: పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వెంకటగిరి, గుర్రాలపాడులో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.ఆయనకు కోట నారాయణపురంలో మహిళలు తిలకందిద్ది, హారతిపట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..ఇంకా విన్నవించారు.
చేపలు అమ్ముతా.. చక్కబెడతా
మణుగూరురూరల్: ప్రజల్లో కలిసిపోయి వారిలో ఒకరిగా ఉంటానని, అండగా నిలుస్తానని చెబుతూ..మణుగూరు టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ప్రచారంలో భాగంగా ఇదిగో ఇలా చేపలు విక్రయించారు. మత్సా్యలను చేతుల్లోకి తీసుకుని..తరాజుల్లో జోకుతూ అమ్మారు. ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపిస్తే..జనం పక్షాన నిలుస్తానని, ఈసారి తిరిగి ఆశీర్వదించి ఆదరించాలని కోరుతూ ఓట్లు అభ్యర్థించారు.
గడ్డం గీస్తా..వృద్ధిచేస్తా
వైరా: టీఆర్‌ఎస్ వైరా అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ మంగళవారం వైరా పట్టణ వీధుల్లో ప్రచారం చేశారు. ఈక్రమంలో ఓ మంగలి దుకాణంలో ఒకరికి చక్కగా గడ్డం గీశారు. ఎమ్మెల్యే అంటే..అందనంత దూరంలో ఉండనని, మీతోనే, మీ వెన్నంటే ఉంటానంటూ ప్రజలకు భరోసానిస్తూ, ఒక్కసారి తిరిగి గెలిపించాలని కోరారు. మధ్యలో నిలిచిన అన్ని రకాల పనులను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.
వాహనం..అంతా కాషాయం
సత్తుపల్లిటౌన్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారంలో భాగంగా సత్తుపల్లికి చెందిన భూక్య శ్యాంసుందర్‌నాయక్ తన పల్సర్ ద్విచక్ర వాహనాన్ని ఇలా పూర్తిగా కాషాయ భరితంగా మలుచుకున్నారు. బండిపై కూడా బీజేపీ అని రాయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈసారి బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావును గెలిపించాలని ఓట్లు అభ్యర్థించాడు.
Comments
Please login to add a commentAdd a comment