
టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా రాజకీయాల నేపథ్యంలోనే సినిమాలు తీస్తోన్న వర్మ ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి గారి జీవితం ఆధారంగా ఈ సినిమాలు రూపొందిస్తున్నట్లు గతంలో ఆయన తెలిపారు.
అయితే ముందుగా ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్‌ను ఆయన రివీల్ చేశారు. జూన్ 24న ఉదయం 11 గంటలకు టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీటర్ ద్వారా ఆయన ప్రకటించారు.
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2023
Comments
Please login to add a commentAdd a comment