Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Kutami Atrocities No confidence motion against Vizag Mayor Live Updates1
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి

విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజాస్వామ్యం మళ్లీ మళ్లీ ఖూనీ అవుతోంది. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి.. కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిను మేయర్‌ పీఠం నుంచి దించేసింది. అధికార వ్యామోహంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. కేవలం పది నెలల కాలం ఉన్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించడం గమనార్హం. ఈ క్రమంలో దిగజారుడు రాజకీయాలు చేసింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్‌ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. కేరళకు వెళ్లి మరీ వైస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి.. బతిమాలి.. డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు.. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటిగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. ఇక అవిశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ ఓటింగ్‌ నిర్వహించాలని, ఓటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయించాలని వైఎస్సార్‌సీపీ చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కూటమి నేతలను అడ్డుకోని పోలీసులుఅవిశ్వాసం వేళ.. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్‌కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీ దర్జాగా కొందరు కూటమి నేతలు వెళ్తున్న దృశ్యాలు మీడియాకు చేరడం గమనార్హం. నీచమైన రాజకీయాలు వద్దని చెప్పాప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటినుంచి నేను వైఎస్సార్‌సీపీలో ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు. డబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పాను. వైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను అని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ శశికళ ఈ ఉదయం ఓ వీడియో విడుదల చేశారు కూడా. ఓటింగ్‌కు ముందు వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్‌సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు.

Italian prison opens its first Love room for inmates check details here2
సుప్రీం కోర్టే చెప్పింది, ఇక ములాఖత్‌లో ఏకాంతంగా..

‘‘ఖైదీలతో జైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. వాళ్ల మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. కుటుంబాలతో వాళ్ల బంధాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే భాగస్వాములతో శారీరకంగా కలిసేందుకు అనుమతి ఇవ్వండి. పైగా అది వాళ్లకు ఉన్న హక్కు కూడా’’ అంటూ ఇటలీ సుప్రీం కోర్టు(Italy Constitution Court) తాజాగా ఇచ్చి తీర్పు ఇది. ఈ తీర్పునకు అనుగుణంగానే.. ఇటలీ జైళ్లలో శుక్రవారం నుంచి శృంగార గదులు(S*X Rooms) అందుబాటులోకి వచ్చాయి. ఉంబ్రియా రీజియన్‌లోని జైలులో ఓ ఖైదీని తన భార్యతో కలిసేందుకు అధికారులు అనుమతించారు. ఇందుకోసం అక్కడే లవ్‌ రూమ్‌(Love Rooms) పేరిట ఓ గదిని ఏర్పాటు చేయించారు. సాధారణంగా ములాఖత్‌ల టైంలో పక్కనే గార్డులు పర్యవేక్షిస్తుంటారు. కానీ, ఈ ఏకాంత ములాఖత్‌లో ఎవరూ పక్కన ఉండడానికి వీల్లేదు. న్యాయ శాఖ ఈ తరహా ఏర్పాట్లకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందించడం గమనార్హం.ఉత్తర ఇటలీలోని అస్టి కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నానని, తనను తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలని ట్యూరిన్‌ కోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే అది తిరస్కరణకు గురైంది. దీంతో అతను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం.. ఇటలీ వ్యాప్తంగా జైళ్లలో 62 వేలమంది ఖైదీలు ఉన్నారు. ఇది జైళ్ల సామర్థ్యం కంటే 21 శాతం ఎక్కువ. అంతేకాదు తరచూ ఖైదీలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు మానసిక ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. అయితే.. ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయని, వాటిని అడ్డుకోవాలని చూడొద్దని జైళ్ల శాఖను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే శృంగారానికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రిజనర్స్‌ రైట్స్ గ్రూప్‌ సంబురాలు చేసుకుంటోంది.అయితే ఈ తరహా ఏర్పాట్లు ఇటలీ(Italy)లోనే మొదటిసారి కాదు. ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌లాంటి యూరప్‌ దేశాల్లో ఈ తరహా ఏర్పాట్లు ఎప్పటి ుంచో ఉన్నాయి.

YSRCP Ambati Rambabu serious On CI Ponnuru Bhaskar3
కృష్ణవేణిని అరెస్ట్‌ చేసి.. దాచేపల్లి సీఐ వేధింపులు: అంబటి

సాక్షి, గుంటూరు: ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్ట్‌ చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి? అని ప్రశ్నించారు.సోషల్ మీడియా కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాకత్ ద్వారా పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతి రెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. అనంతరం, మాజీ అంబటి మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్‌.. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులో కృష్ణవేణిని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్‌లోనే ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదు.కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్‌ అసభ్యంగా మాట్లాడాడు. తాము చెప్పినట్టు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించాడని ఆమె చెబుతోంది. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించాడట. కృష్ణవేణి బంధువులు పోలీస్ స్టేషన్‌కు రాకుండా సీఐ స్టేషన్ గేట్లకు బేడీలు వేశాడు. తనను సీఐ భాస్కర్ వేధించారని కృష్ణవేణి మేజిస్ట్రేట్‌కి వాంగ్మూలం ఇచ్చింది. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలి.సీమ రాజా, కిరాక్ ఆర్పీ.. మంత్రి నారా లోకేష్ పెంచుతున్న రోబోలు. మాపైన అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు సీమ రాజా, కిరాక్ ఆర్పీపై మేము పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసులు కట్టరు. వాళ్లని లోకేష్‌ పోషిస్తున్నాడు కనుక వాళ్లపై కేసులు కట్టడం లేదు. గతంలో పెద్దిరెడ్డి సుధారాణిని 50 రోజులకు పైగా జైలుకు పంపారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని సీఐ తనను హింసించాడని కృష్ణవేణి చెప్తోంది. మహిళల జోలికి వస్తే ఒప్పుకోనని చెప్పే చంద్రబాబు ఇప్పుడేం చేస్తాడో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

Big Lesson For Us Could Have Done Better: Patidar After RCB Lost To PBKS4
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్‌

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మూడో ఓటమిని నమోదు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాటిదార్‌ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌కు అంతరాయం కలుగగా.. పద్నాలుగు ఓవర్లకు కుదించారు.ఈ క్రమంలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 14 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, మార్కో యాన్సెన్‌, యజువేంద్ర చహల్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్‌ బార్ట్‌లెట్‌ ఒక వికెట్‌ సాధించాడు.ఇక పంజాబ్‌ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి.. 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో జోష్‌ హాజిల్‌వుడ్‌ మూడు వికెట్లు దక్కించుకోగా.. భువనేశ్వర్‌ కుమార్‌ రెండు వికెట్లు కూల్చాడు.అతిపెద్ద గుణపాఠంఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar).. బ్యాటింగ్‌ వైఫల్యం వల్లే తాము ఓడిపోయామని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మా బ్యాటింగ్‌ విభాగం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.ఇలాంటి మ్యాచ్‌లలో భాగస్వామ్యాలు నమోదు చేయడం అత్యంత ముఖ్యం. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ మ్యాచ్‌లో మాకు ఇదే అతిపెద్ద గుణపాఠం.పరిస్థితులకు తగ్గట్లుగా మేము మా బ్యాటింగ్‌ శైలిని మార్చుకోవాల్సి ఉంది. అందుకే ఈరోజు పడిక్కల్‌ను ఆడించలేదు. ఇక వికెట్‌ కూడా అంత చెత్తగా ఏమీ లేదు. చాలా కాలంగా కవర్లు కప్పి ఉంచిన కారణంగా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు మేలు చేకూరింది.క్రెడిట్‌ వారికే.. మా బౌలర్లు కూడా సూపర్‌ఈ విజయంలో క్రెడిట్‌ పంజాబ్‌ బౌలర్లకే దక్కుతుంది. వికెట్‌ ఎలా ఉన్నా.. మేము మెరుగ్గా బ్యాటింగ్‌ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. మా బౌలింగ్‌ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. అదే మాకు అతిపెద్ద సానుకూలాంశం. బ్యాటర్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఆడారు. కానీ కొన్నిసార్లు నిరాశ తప్పదు. బ్యాటింగ్‌ విభాగంలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాం’’ అని రజత్‌ పాటిదార్‌ చెప్పుకొచ్చాడు.కాగా సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది 46వ ఓటమి. ఐపీఎల్‌ చరిత్రలో హోం గ్రౌండ్‌లో అత్యధిక మ్యాచ్‌లలో పరాజయం పాలైన జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.ఐపీఎల్‌-2025: ఆర్సీబీ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌👉టాస్‌: పంజాబ్‌ కింగ్స్‌.. మొదట బౌలింగ్‌👉ఆర్సీబీ స్కోరు: 95/9 (14)👉పంజాబ్‌ కింగ్స్‌ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఆర్సీబీపై ఐదు వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: టిమ్‌ డేవిడ్‌ (ఆర్సీబీ- 26 బంతుల్లో 50 నాటౌట్‌). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్‌.. ఐపీఎల్‌ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా

Google plans job cuts from Hyderabad and Bengaluru offices5
బెంగళూరు, హైదరాబాద్‌లోని ఉద్యోగులు ఔట్‌..?

గూగుల్ భారత్‌లో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోందని వార్తలొస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది. ప్రకటనలు, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్ బృందాల్లోని వారికి లేఆఫ్స్‌ ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో ఉద్యోగుల తొలగింపును గూగుల్ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ లేఆఫ్స్‌ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభం కానుందని బిజినెస్ స్టాండర్డ్ అంచనా వేసింది.గూగుల్ ప్లాట్‌ఫామ్స్‌ అండ్ డివైజెస్ విభాగంలో ఇటీవల జరిగిన పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించారు. తాజాగా మళ్లీ ఇలా లేఆఫ్స్‌ వార్తలు వస్తుండడం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతుంది. ఈ విభాగం ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్ వంటి కీలక ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండటానికి సంస్థ ప్రయత్నిస్తున్నందున నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: కోత కోసి.. పూత పూసి..అయితే భారత్‌లో మాత్రం ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి గూగుల్ కాస్త మెరుగ్గా వ్యవహరిస్తుందని కూడా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌ల్లో టెక్నికల్ పొజిషన్లలో ఉన్న ఉద్యోగులను నేరుగా తొలగించడానికి బదులుగా ఆదాయం సమకూరే ఇతర ప్రాజెక్టుల్లో కేటాయించే అవకాశం ఉందని తెలిపింది. కంపెనీ ఇటీవల అంతర్గత నిర్మాణంలో విస్తృత మార్పులు చేసింది. గత సంవత్సరం తన ప్లాట్‌ఫామ్స్‌, డివైజెస్ బృందాలను విలీనం చేసింది. దాంతో భవిష్యత్తులో శ్రామిక శక్తి తగ్గింపు కోసం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాలను ప్రవేశపెట్టింది. విలీనం తర్వాత ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా కొన్ని తొలగింపులు జరిగాయని ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ ప్రతినిధి ఒకరు అంగీకరించారు. కంపెనీ నుంచి స్వచ్ఛందంగా నిష్క్రమించడానికి జనవరిలో తమ ఉద్యోగులకు కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లు గూగుల్ ధ్రువీకరించింది.

YSRCP Corporator Serious Comments ON CBN Govt6
కూటమి నేతలు కేరళకు వచ్చి బెదిరించారు: కార్పొరేటర్‌ శశికళ

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసి.. బెదిరింపులకు దిగుతోంది. జీవీఎంపీ మేయర్‌ వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంలో భాగంగా కార్పొరేటర్లతో అనుచితంగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలో రాజకీయమంటే వ్యాపారం కాదని వైఎ‍స్సార్‌సీపీ కార్పొరేటర్‌ శశికళ.. చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.జీవీఎంసీ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ శశికళ తాజాగా మాట్లాడుతూ..‘ప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటి నుంచి నేను వైఎస్సార్‌సీపీలోనే ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు.. డబ్బుల కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చేయవద్దని చెప్పాను. వైఎస్‌ జగన్ వల్లే నేను కార్పొరేటర్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion) మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్‌ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్‌ జగన్‌(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం.జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుని మేయర్‌ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.

Dear Uma Movie Review And Rating Telugu7
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం

తెలుగు చిత్రసీమలో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరోయిన్‌గా మెరిసేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాంటిది సుమయ రెడ్డి అయితే తన తొలి ప్రయత్నంలోనే హీరోయిన్‌గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది. 'డియర్ ఉమ' అంటూ ఏప్రిల్ 18న వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు. పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌య రెడ్డి( Sumaya Reddy) హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మరి ఈ సుమయ రెడ్డి తొలి ప్రయత్నం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) వైద్య విద్యను పూర్తి చేసి సొంతంగా ఓ హాస్పిట‌ల్ నిర్మించి తండ్రి క‌ల‌ను నెర‌వేర్చాల‌ని అనుకుంటుంది. మరోవైపు దేవ్‌కు(పృథ్వీ అంబ‌ర్‌) మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో రాక్‌స్టార్ కావాల‌ని ఎన్నో క‌ల‌లు కంటాడు. కానీ, చదువులో చాలా వెనుకపడిపోతాడు. తన కాలేజీ సమయంలో దేవ్‌ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే, మ్యూజిక్ కార‌ణంగానే దేవ్‌కు ఆ అమ్మాయి బ్రేక‌ప్ చెప్పి వెళ్లిపోతుంది. ప్రేమలో విఫలమైన దేవ్ రాక్ స్టార్ అవ్వాలనే ప్రయత్నంలో అంతగా సక్సెస్ కాలేకపోతాడు. చిన్నా చితకా అవకాశల కోసం గడపగడపకూ తిరుగుతుంటాడు. అలాంటి దేవ్‌కి ఓ సారి ఉమ డైరీ దొరుకుతుంది. తనకు గాయమై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తన జీవితం మారిందని.. అప్పటి నుంచే ఉమ జీవితం ఆగిపోయిందని తెలుసుకుంటాడు. అసలు ఉమకి ఏం జరిగింది..? ఉమ నేపథ్యం ఏంటి? ఉమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తుండేది? అనే ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు దేవ్. ఇక ఉమ కోసం దేవ్ చేసిన పోరాటం ఏంటి? ఉమతో దేవ్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈ కథలో దేవ్ అన్న సూర్య (కమల్ కామరాజ్) పాత్ర ఏంటి..? అన్నది కథ.వైద్యం పేరుతో కార్పొరేట్ హాస్పిట‌ల్స్ చేసే మోసాల‌కు ల‌వ్‌స్టోరీని జోడించి డియ‌ర్ ఉమ క‌థ‌ను సుమ‌య రెడ్డి రాసుకుంది. ఈ కథను సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ తెరకెక్కించాడు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ, సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కథను నడిపించారు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.ఎలా ఉందంటే..?రధన్ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది, అయితే, కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉండాల్సింది. రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన షాట్స్ మిస్ అయినట్టు అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే సినిమాకు ఒక బలంగా నిలిచింది, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అయితే, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు కొందరికి అతిగా అనిపించవచ్చు. పతాక సన్నివేశంలోని పాట సినిమా సందేశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, కథలో మరింత సహజంగా కలిసిపోయి ఉంటే బాగుండేది. మొత్తానికి, "డియర్ ఉమర్" ఒక మంచి ప్రయత్నం, కానీ కొన్ని అంశాలలో మరింత శ్రద్ధ పెడితే ఇది ఒక గొప్ప చిత్రంగా నిలిచేది. తొలి చిత్రమే అయినా సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత సుమయ రెడ్డి గొప్ప కథను అందించడంలో సక్సెస్ అయ్యారు.డియర్ ఉమ చిత్రానికి సుమయ రెడ్డి ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి కథను ఇవ్వడమే కాకుండా.. ఈ కథను అనుకున్నట్టుగా తీయడంలో ఖర్చు పెట్టిన నిర్మాతగానూ సుమయ రెడ్డి సక్సెస్ అయింది. సుమయ రెడ్డిలోని రచయిత, నిర్మాతకు వంద మార్కులు వేసుకోవచ్చు. ఇక నటిగా ఇంకాస్త మెరుగు పర్చుకోవాల్సి ఉంటుందేమో. తెరపై సుమయ రెడ్డి అందంగా కనిపించారు. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ పాత్ర సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. అజయ్ ఘోష్ పాత్ర రొటీన్ అనిపిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు అక్కడక్కడా నవ్విస్తాయి. పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోకుండా డియర్‌ ఉమను చూస్తే తప్పకుండా మెప్పిస్తుంది.

Kejriwal Tuns into Pushpa Raj Mode Dance With Wife At Daughter Wedding Event8
పుష్ప పాటకు సతీమణితో కేజ్రీవాల్‌ స్టెప్పులు

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట శుభకార్యం జరిగింది. కేజ్రీవాల్‌ కూతురు హర్షిత తన ఐఐటీయన్‌ స్నేహితుడిని వివాహమాడారు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది రాజకీయ సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకలో కేజ్రీవాల్‌ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీలోని షాంగ్రీ లా ఎరోస్‌ హోటల్‌లో గురువారం కేజ్రీవాల్‌ కూతురి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియాలు హాజరయ్యారు. ఈ వేడుకలో పుష్ప 2 చిత్రంలోని ‘అంగారో కా అంబర్‌ సె’ పాటకు సతీమణి సునీతతో కలిసి కేజ్రీవాల్‌ హుషారుగా స్టెప్పులేశారు. #arvindkejriwal #dancevideo #delhiaap pic.twitter.com/1hObFExoGU— Khushbu Goyal (@kgoyal466) April 18, 2025జనాల గోల మధ్య కేజ్రీవాల్‌ వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యాయి. సుకుమార్‌ డైరెక్షన్‌లో పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌ దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ దక్కించుకున్నారో తెలియంది కాదు. ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు, ఆఖరికి పుష్ప మేనరిజం కూడా జనాలకు బాగా ఎక్కేసింది. మరోవైపు.. వివాహ కార్యక్రమానికి హాజరైన పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కూడా పంజాబీ స్టైల్లో చిందులేసి ఆకట్టుకున్నారు. Punjab CM Bhagwant Mann performing at the engagement ceremony of Kejriwal's daughter in Delhi.#Bhagwantmann #ArvindKejriwal pic.twitter.com/Vy9PqA4Teu— Raajeev Chopra (@Raajeev_Chopra) April 18, 2025పీటీఐ కథనం ప్రకారం.. అరవింద్‌ కేజ్రీవాల్‌ కూతురు హర్షిత ఢిల్లీ ఐఐటీలో చదివారు. కాలేజీ రోజుల్లో స్నేహితుడైన సంభవ్‌ జైన్‌ ఇష్టపడి వివాహమాడారు. ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి బసిల్‌ హెల్త్‌ అనే స్టార్టప్‌ను కూడా నడిపిస్తున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో కపుర్తలా హౌజ్‌లో వీళ్ల వివాహం జరిగింది. ఈ వేడుకకు కొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఏప్రిల్‌ 20వ తేదీన రిసెప్షన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Special Story: 50 Years of Aryabhata Satellite9
50 years of Aryabhata ఆర్యభట్ట స్ఫూర్తితో...

విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సతీష్‌ ధావన్‌ నాయకత్వంలో 1975 ఏప్రిల్‌ 19న రష్యాలో కపుస్టిన్‌ యార్‌ కేంద్రం నుండి సోవియట్‌ కాస్మోస్‌–3 రాకెట్‌ ద్వారా ప్రసిద్ధ భారతీయ ఖగోళ – గణిత శాస్త్రవేత్త పేరుతో తయారుచేసిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట‘ (aryabhata satellite) ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది మన అంతరిక్ష సంస్థ ఇస్రో. ‘ఇండియా ఎంటర్స్‌ స్పేస్‌ ఏజ్‌’ అంటూ ప్రపంచ మీడియా మన ప్రయత్నాన్ని పెద్ద అక్షరాలతో కీర్తించింది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యి 50 వసంతాలైన సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఆర్యభట్ట గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు ఇస్రో, ఇండియా స్పేస్‌ ల్యాబ్‌ వంటి కొన్ని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.360 కిలోగ్రాముల బరువు వుండి సౌర ఫలకాల ఆధారంగా పనిచేసే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 96.46 నిమిషాల ప్రదక్షిణ కాలం పట్టే కక్ష్యలో, 611 కిలోమీటర్ల అపోజీ, 568 కిలోమీటర్ల పెరిజీ ఎత్తులో, 50.6 డిగ్రీల ఏటవాలులో ఉండే కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఎక్స్‌–రే ఖగోళ శాస్త్రం, వ్యవసాయశాస్త్రం, సోలార్‌ ఫిజిక్స్‌లో ప్రయో గాలు చేయడానికి, సూర్యుడి నుంచి వచ్చే న్యూట్రాన్లు, గామా కిరణాలను కొలవడానికి, భూమి ఐనోస్పియర్‌లోని పరిస్థితులను అన్వేషించడం తదితర లక్ష్యాలతో ఈ ప్రయోగాన్నిఇస్రో సోవియట్‌ యూనియన్‌ సహకారంతో చేపట్టింది. 50 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సమస్యలను సవాళ్లను అధిగమించాం. కొన్ని ఎగతాళి శబ్దాల మధ్య మౌనంగానే శత కోటి గుండెల సాక్షిగా చంద్రుని దక్షిణ ధ్రువపు ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ సాయంతో గర్వంగా మన జాతీయ జెండాను నిలిపాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంగారకుడిపై పరిశోధనల కోసం అన్వేషణ ఆరంభించి నవ చరిత్ర సృష్టించాం. సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్‌1 మిషన్‌ను ప్రయోగించాం. On this day in 1975, India launched its first satellite, Aryabhata, laying the foundation of India’s satellite programme.Today, India stands among the world’s leading spacefaring nations.#Aryabhata #IndianSpaceProgramme #ISRO@IndiaDST @isro @DrJitendraSingh @AshwiniVaishnaw… pic.twitter.com/YZMRazZfpD— Ministry of Information and Broadcasting (@MIB_India) April 19, 2025 నేడు ఆసియా – పసిఫిక్‌ప్రాంతంలోనే అతిపెద్ద ఉపగ్రహ సమాచార వ్యవస్థను కలిగి ఉన్నాం. డాకింగ్, అన్‌డాకింగ్‌ వంటి శాస్త్రీయ సామర్థ్యాలు కలిగిన నాలుగో దేశంగా అద్భుతాలు సాధించాం. గగన్‌యాన్‌ వంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలతో పాటు 2030 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. కేవలం ఐదు దశాబ్దాల కాలంలో ఒకే ప్రయోగంలో 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగే స్థాయికి ఎదిగాం. ముందు ముందు మరిన్ని అద్భుత విజయాలు మన పరం అవుతాయనడంలో సందేహం లేదు.– పి. అరుణ్‌ కుమార్, ఫిజిక్స్‌ రీసెర్చ్‌ స్కాలర్, పాలమూరు యూనివర్సిటీ(నేడు ఆర్యభట్ట ఉపగ్రహానికి గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు)

TDP Supporters Protest Against Bandaru Sravani10
టీడీపీలో పొలిటికల్‌ వార్‌.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!

సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి ప్రవర్తన కారణంగా.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ సైతం రాజీనామా చేశారు.వివరాల ప్రకారం.. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే శ్రావణి కార్యకర్తల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పచ్చ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం వచ్చిన మంత్రి టీజీ భరత్‌కు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను ఈడ్చి పడేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రావణి వైఖరికి నిరసనగా వెస్ట్ నరసాపురం టీడీపీ ఎంపీటీసీ అంజినమ్మ రాజీనామా చేశారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నేతలు వాసాపురం బాబు, కనంపల్లి ప్రసాద్ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి కు సొంత కార్యకర్త నుంచి నిరసన సెగ. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కానీ గుర్తింపు ఇవ్వడం లేదు.- టిడిపి కార్యకర్త pic.twitter.com/ZibwkRqIZv— రాజా రెడ్డి YSRCP (@rajareddzysrcp) April 18, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement