Jagitial District News
-
కాంగ్రెస్ కుటుంబమైతే.. ఇన్నాళ్లు ఎక్కడున్నారు..?
● రాజ్యాంగ పరిరక్షణపై మాట్లాడితే సంజయ్‌కి ఉలుకెందుకు.. ● రాహుల్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా.. ● మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాలటౌన్: రాహుల్‌గాంధీ ఆలోచన విధానమైన జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ నైతిక విలువలపై తాను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు ఉలికి పాటెందుకని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. తనది కాంగ్రెస్ కుటుంబమంటున్న సంజ య్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడున్నాడని, అభివృద్ధి కోసమైతే ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల నియంతృత్వ పాలనకు ఎదురొడ్డి పోరాడిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కాల్సిన గౌరవం పరాయి వాళ్లకు దక్కుతుండడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి రౌడీషీట్లు నమోదు చేయించిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదన్నా రు. పార్టీ మారని కాంగ్రెస్ సర్పంచులను సస్పెండ్ చేయించిన చరిత్ర సంజయ్దన్నారు. బీఆర్ఎస్ నాయకుల వేధింపులతో హబ్సీపూర్ గ్రామానికి చెందిన శివనాగ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. తాను పార్టీ మారినప్పుడు ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని సంజయ్ తెలుసుకోవాలన్నారు. బండ శంకర్, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, గాజంగి నందయ్య, చందా రాధాకిషన్, జగదీశ్వర్, రఘువీర్‌గౌడ్, గుండ మధు, ముకేష్‌ఖన్నా పాల్గొన్నారు. -
ఖాకీ.. కలవరం
● విధి నిర్వహణలో ఆటంకాలు ● ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల ఇష్టారాజ్యం ● అడ్డుకునేందుకు వెళ్తే దాడులు ● ఆపై.. రాజకీయ ఒత్తిళ్లు ● చర్యలు తీసుకోలేకపోతున్న తీరుకోరుట్ల: ● 15 రోజుల క్రితం కోరుట్ల మండలం నాగులపేటలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్న కానిస్టేబుల్‌తో ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. ఇది తోపులాట వరకూ వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ● 10 రోజుల క్రితం మల్లాపూర్ మండలం మొగిలిపేట–నడికుడ గ్రామాల మధ్య భూ సరి హద్దు వివాదంలో సివిల్ డ్రెస్సులో ఉన్న ఓ కానిస్టేబుల్‌పైకి ఓ వ్యక్తి తిరగబడ్డాడు. పోలీసులు సంఘటనపై విచారణ జరిపి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ● మెట్పల్లి మండలం వేంపేట సమీపంలో ఐదు రోజుల క్రితం అక్రమంగా ఇసుక తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ ఏఎస్సై, కానిస్టేబుల్ ఆపారు. ట్రాక్టర్ ఆపినందుకు ఓ వ్యక్తి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగి నానా హంగామా చేశాడు. పోలీస్స్టేషన్లోనూ అదే తీరుతో వ్యహరించాడు. రాజకీయ ఒత్తిళ్లతో తర్జన భర్జన పడిన పోలీసులు చివరికి అతనిపై కేసు నమోదు చేశారు. ఇలా వారం వ్యవధిలో పోలీసులపై తిరగబడిన ఘటనలు చోటు చేసుకోవడంతో విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై కిందిస్థాయి పోలీసు సిబ్బంది కలవరపడుతున్నారు. పోలీసు విధుల నిర్వహణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు అనేక సమస్యల మధ్య చట్టపరిధిలో పనిచేసే పోలీసు సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతీస్తుందన్న ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో తిప్పలే.. క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసు సిబ్బంది ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిక్కచ్చిగా అమలు అవసరమే అయినప్పటికీ.. పోలీసులు కనీసం లాఠీలు లేకుండా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. సామూహికంగా జరిగే గొడవలు, ఉత్సవాలు, ఊరేగింపు వంటి సందర్భాలతోపాటు అక్రమ మార్గాల్లో ఇసుక, మొరం సరాఫరా చేస్తున్న వారు గంజాయి తీసుకుని గలాటాలు సృష్టించే వాళ్లు ఇలా కొంత మంది అసాంఘిక శక్తులు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు సిబ్బంది ఏం చేయరన్న ధీమాతో కొన్నిచోట్ల తమ ఇష్టం ఇచ్చినట్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి..పగలు తేడా లేకుండా పనుల్లో నిమగ్నం కావాల్సిన పోలీసు సిబ్బంది ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మానసిక స్థైర్యం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆయా పోలీసు ఉన్నతాధికారులు నిక్కచ్చిగా వ్యవహరించి పోలీసులపై తిరగబడుతున్న వారి విషయంలో కఠినంగా ఉండాల్సిన అవసరముంది. రాజకీయ ఒత్తిళ్లు తప్పట్లేదు కొంతమంది రాజకీయ నాయకుల అండ ఉందన్న ధీమాతో పోలీసులతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మల్లాపూర్ మండలంలోని సరిహద్దు వివాదంతోపాటు మెట్పల్లి మండలం వేంపేట, నాగులపేట అక్రమ ఇసుక రవాణా సందర్భంలో దురుసుగా వ్యవహరించిన వారి తరఫున కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందిపై తిరగబడిన వ్యక్తులపై చర్యలకు తర్జనభర్జన పడినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పైస్థాయి అధికారుల పోస్టింగ్‌ల కోసం పైరవీలు తప్పనిసరి అన్న విషయం బహిరంగ రహస్యం. ఈ క్రమంలో పోలీసు సిబ్బందికి సమస్యలు ఎదురైనప్పుడు అధికారులు కఠినంగా వ్యవహరించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒత్తిళ్లను పక్కనపెట్టి కింది స్థాయి సిబ్బందిలో మానసిక స్థైర్యం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫలితంగా శాంతిభద్రతల పరిరక్షణలో క్షేత్రస్థాయి సిబ్బంది చక్కగా పనిచేయడంతో ప్రజలకు మేలు జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి. -
నీటికొరత రాకుండా చర్యలు
బుగ్గారం (ధర్మపురి): ధర్మపురి పట్టణంలో తాగునీటికి కొరత రాకుండా చర్యలు చేపడుతున్నట్లు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గురువారం రెండు నీటి ట్యాంకర్లను ప్రారంభించారు. పట్టణానికి నీటి సరఫరాకు సహాయం చేస్తానని తెలిపారు. అనంతరం అక్కపల్లి రాజేశ్వరస్వామి ఆలయ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో పర్యటించారు. అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. అమృత్ పథకంలో భాగంగా చేపడుతున్న పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. నాయకులు సంగనభట్ల దినేష్, వేముల రాజు, వొజ్జల లక్ష్మణ్, ప్రసాద్, జక్కు రవీందర్, సీపతి సత్యనారాయణ, కస్తూరి శ్రీనివాస్, చిలుముల లక్ష్మణ్, సుముఖ్ పాల్గొన్నారు. రోళ్లవాగు ముంపు అటవీప్రాంతం పరిశీలనసారంగాపూర్: బీర్పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణంలో అటవీశాఖ కోల్పోతున్న భూములు, అటవీప్రాంతాన్ని గురువారం అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ సి.సరవనన్ (నిర్మల్) పరిశీలించారు. అటవీశాఖకు జరుగుతున్న నష్టంపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.136.81 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణంలో అటవీశాఖకు చెందిన 816 ఎకరాల భూమి ముంపునకు గురవుతోందని, ఇందులో 53వేల చెట్లకు నష్టం వాటిల్లుతోందని అటవీశాఖ ఇచ్చిన నివేదికను ఆయన పరిశీలించారు. ముంపు భూములకు బదులు ప్రభుత్వం గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో కేటాయించిన భూములను పరిశీలించారు. ఆయన వెంట డీఎఫ్‌వో రవిప్రసాద్, డిఈ చక్రూనాయక్, అధికారులు ఉన్నారు. అరగంటలోపే రిజిస్ట్రేషన్జగిత్యాలటౌన్: స్లాట్ బుక్ చేసుకున్న అరగంటలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ సుజాత అన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా గురువారం జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నూతన విధానంలో టైంస్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారుకు అరగంట లోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్‌ను అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీఐజీ (స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎంజగిత్యాలటౌన్: ప్రయాణికుల సమస్యల పరిష్కారం, మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 99592 25925నంబర్‌కు ఫోన్ చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. మహిళలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలిజగిత్యాలరూరల్: మహిళలు అరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని, సరైన పౌష్టికాహారం తీసుకోవాలని మార్కెటింగ్ డీపీఎం మల్లేషం, ఫైనాన్స్ డీపీఎం విజయభారతి అన్నారు. జగిత్యాలలోని ఐకేపీ కార్యాలయంలో వీఓఏలతో సమావేశమయ్యారు. పోషక పక్షం–పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం పోషకాహారం తీసుకోవాలన్నారు. యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్, సీసీలు మరియా, రవీందర్, శ్రీనివాస్, మండల సమాఖ్య అధ్యక్షురాలు మారు సత్తవ్వ, కోశాధికారి శ్రీలత, మాజీ కార్యదర్శి భారతి పాల్గొన్నారు. -
సన్న బియ్యం బువ్వ బాగుంది
● అప్పుడు విముఖత.. ఇప్పుడు సుముఖత ● రేషన్‌షాపుల ఎదుట కార్డుదారుల బారులు ● వారంలోనే 90 శాతం పూర్తయిన పంపిణీ ● వండుకోవడానికే ఆసక్తిచూపుతున్న పేదలు ● నూకలు వస్తున్నా, గంజి వార్చితే అన్నం బాగుంటుదంటున్న మహిళలు సాక్షి, పెద్దపల్లి: ‘అన్నా.. వేలిముద్ర వేసిపో.. కిలోకు రూ.10 చొప్పున నీ అమౌంట్ ఇస్తా’ అని రేషన్ డీలర్లు గతంలో లబ్ధిదారులతో బేరసారాలకు దిగేవారు. ప్రస్తుతం ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది. దుకాణం తెరిచావా.. బియ్యం తీసుకోవడానికి వస్తున్నామంటూ లబ్ధిదారులే రేషన్ డీలర్లను సంప్రదిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ షాపుల ఎదుట బారులు తీరుతున్నారు. ‘పైసలు వద్దు.. సన్నబి య్యం కావాలి’ అంటున్నారు. ఉగాది నుంచి పంపి ణీ చేస్తున్న సన్నబియ్యానికి మంచి స్పందనే వస్తోంది. గతంలో దొడ్డుబియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపనివారు.. ఇప్పుడు సన్న బియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. నమ్మకం కలిగిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తదితర అధికారులు సన్నబియ్యం తీసుకునే వారి ఇళ్లలో భోజనం చేస్తున్నారు. బియ్యం నాణ్యత, మన్నికపై నమ్మకం కల్పిస్తున్నారు. ఇప్పటికే అన్నిరేషన్ షాపులకు అధికారులు నెలవారీ బియ్యం కోటా సరఫరా చేయగా, దాదాపు అన్నిదుకాణాల్లో బియ్యం పంపిణీ 90శాతానికిపైగా పంపిణీ చేశారు. నూకలు వస్తున్నా... ముద్ద అవుతున్నా సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఒకేరకంగా అనేక రకాలు ఉంటున్నాయని, కొన్నిదొడ్డుగా, మరికొన్ని పొట్టిగా ఉన్నాయని రేషన్‌కార్డుదారులు చెబుతున్నారు. వండితే ముద్ద అవుతుందని కొందరు, గంజి వార్చితే బాగుంటోందని మరికొందరు చెబుతున్నారు. రేషన్ దందాకు అడ్డుకట్ట ప్రతీనెల ఒకటి నుంచి 15 వ తేదీ వరకు రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేసేవారు. లబ్ధిదారుల వేలిముద్రని/ఐరిస్ స్కాన్ ద్వారా కుటుంబసభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కో వ్యక్తి పేరిట 6 కిలోల బియ్యం ఇచ్చేవారు. చాలామంది అనర్హులు ఉండటం, మరోవైపు బీపీఎల్ కుటుంబాలు సైతం రేషన్ బియ్యం తినడానికి ఆసక్తి చూపేవారు కాదు. దీంతో రేషన్ డీలర్లు కిలోకు రూ.10చొప్పున చెల్లించి, దొడ్డుబియ్యాన్ని దారి మళ్లించేవారు. అయినా కొందరు బియ్యం తీసుకునేందుకు వచ్చేవారు కాదు. మిగిలిన బియ్యం నిల్వ చూపించేవారు. తర్వాత నెలలో మిగిలిన బియ్యాన్ని కలిపి దుకాణానికి కేటాయింపులు చేసేవారు. కానీ, ఈనెలలో ఆ పరిస్థితి కనిపించడం లేదని, సన్నబియ్యం తీసుకునేందుకు కార్డుదారులు ఆసక్తి చూపటమే కారణమని డీలర్లు వివరిస్తున్నారు. డీలర్లపై తరుగు భారం కార్డుదారులందరూ సన్నంబియ్యం తీసుకుంటున్నా.. చాలా తరుగు వస్తుందని రేషన్‌డీలర్లు వాపోతున్నారు. బియ్యం బస్తా 50.650 కేజీలకు 49– 48 కేజీల వరకే బరువు ఉంటోందని, తద్వారా ఒక్కోషాపులో తరుగు పేరిట క్వింటాలు నుంచి 2 క్వింటాళ్ల వరకు బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. సన్నంబియ్యం సమాచారం జిల్లా రేషన్‌కార్డులు లబ్ధిదారులు రేషన్‌షాపులు ప్రతీనెల సరఫరా చేసే బియ్యం(మెట్రిక్ టన్నుల్లో) కరీంనగర్ 2,75,320 8,45,761 566 5,074 పెద్దపల్లి 2,19,952 6,21,836 413 4,013 జగిత్యాల 3,07,000 8,91,000 592 5,500 సిరిసిల్ల 1,73,745 4,97,103 345 3,250 -
దారులన్నీ కొండగట్టుకే..
● కాషాయమయమైన అంజన్న సన్నిధి ● నేటి నుంచి చిన్న జయంతి ఉత్సవాలు ● తరలిరానున్న రెండు లక్షల మంది భక్తులు ● ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ ● అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుజగిత్యాల: జై శ్రీరాం.. జై హనుమాన్ అంటూ తమ ఇష్టదైవమైన కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం అంజన్న చిన్న జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో గల శ్రీఆంజనేయస్వామి ఆలయం ముస్తాబైంది. మూడురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం లైటింగ్స్ సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. కల్యాణకట్ట వద్ద నాయీబ్రాహ్మణులను అధిక సంఖ్యలో నియమించారు. జయంతి సందర్భంగా ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీక్షాపరులు మాలవిరమణ చేసి అంజన్నకు ముడుపు కట్టనున్నారు. రెండు లక్షల మంది అంచనా.. అంజన్న సన్నిధైన కొండమీదకు కాలినడకన, వాహనాల్లో అనేక ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం వరకు భక్తులందరూ కొండగట్టుకు చేరుకుని అంజన్న సన్నిధిలో అర్ధరాత్రి వరకు సేదతీరి క్యూలైన్లలో నిలబడి మాల విరమణ చేయనున్నారు. జై హనుమాన్, జై శ్రీరాం అంటూ కొండ ప్రాంగణమంతా మారుమోగనుంది. పార్కింగ్‌కు ఏర్పాట్లు ● జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ● ఇప్పటికే ఎస్పీ అశోక్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ● జేఎన్టీయూ దాటాక, ఘాటో రోడ్ వెంట తాగునీటికి చలివేంద్రాలు, మల విసర్జనకు తాత్కలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ● బొజ్జ పోతన్న సమీపంలో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం.. అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. ● అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఫైరింజిన్, చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ● కొండ దిగువ నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, దారి వెంట భక్తులకు ఆటోల ద్వారా నీరు అందించనున్నారు. ● భక్తులు స్నానం ఆచరించే పరిసరాలల్లో నిత్యం శానిటేషన్ చేపట్టనున్నారు. భక్తుల దర్శనం ఇలా.. ఘాట్‌రోడ్ మీదుగా వాహనాలపై.. మెట్లదారిలో కాలినడకన గుట్టపైకి చేరుకోవాలి. నాచుపల్లి జేఎన్టీయూ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం బొజ్జ పోతన్న సమీపంలో పార్కింగ్ స్థలం సిద్ధం చేశారు. ఇక్కడ వాహనాలను పార్కింగ్ చేసి కాలి నడకన కొండమీదకు చేరుకోవాలి. కొండపైకి చేరుకున్నాక ముందుగా పాత కోనేరు ఎదురుగా ఉన్న మెట్లదారి వెంట వెళ్లి అక్కడి కల్యాణకట్టలో క్యూలైన్ పద్ధతిలో మాల విరమణ చేసుకోవాలి. నూతన కోనేరు పక్కనున్న చలువ పందిళ్ల దిగువ, శ్రీరామ కోటి స్తూపం వెనకాల షెడ్డులో తలనీలాలు సమర్పించాలి. నూతన కోనేరులో పుణ్యస్నానాలచరించాలి. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి. ఆలయం వెనక వైపు నుంచి తిరుగు పయనం కావాలి. -
నూకలు వస్తున్నయి
మా కుటుంబానికి ఈనెల 18 కిలోల సన్నబియ్యం ఇచ్చిండ్రు. అందులో రెండు కిలోల నూకలు వచ్చినయి. మిగతా బియ్యం మంచిగనే ఉన్నయ్. ఇవే మాకు ఆధారం. ప్రతీనెల సన్నబియ్యం ఇస్తే మాకు ఎంతో ఆసరాగా ఉంటుంది. – సత్తమ్మ, యైటింక్లయిన్‌కాలనీ సన్నబియ్యం బాగున్నాయి వారం కిందట రేషన్ బియ్యం తెచ్చుకున్న. కొద్దిగా నూకలు వచ్చినయి. అయినా, మంచిగానే ఉన్నయి. సన్నబియ్యం వండుకుని తిన్నం. మాలాంటి పేదలకు సన్నబియ్యం ఇవ్వడం మంచిదే. పథకాన్ని ఇలాగే కొనసాగించాలి. – బిట్ల వజ్రవ్వ, ముస్తాబాద్, సిరిసిల్ల -
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
బుగ్గారం(ధర్మపురి): ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఓపీ సేవలు, ఐపీ సేవలు, ఫార్మసీ, వివిధ రికార్డులు పరిశీలించారు. రూ.రెండు కోట్లతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. 70 శాతం పనులు పూర్తయ్యాయని, రెండు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆవరణలో పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ఆరోగ్య మహిళా కేంద్రంలో మహిళలకు వైద్యపరీక్షలపై అడిగి తెలుసుకున్నారు. థైరాయిడ్, క్యాన్సర్, ఆస్తమా వంటి పరీక్షలను ఎంతమందికి చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ కృష్ణచైతన్య, డీసీహెచ్ఎస్ రామకృష్ణ, హెల్త్ సూపరింటెండెంట్ రవి ఉన్నారు. -
దళారులకు అమ్మి నష్టపోవద్దు
మెట్‌పల్లిరూరల్: రైతులు తమ పంటలను దళారులకు అమ్మి నష్టపోవద్దని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం రామలచ్చక్కపేట, ఆత్మనగర్, ఆత్మకూర్, మెట్లచిట్టాపూర్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏవో దీపిక, ఏపీఎం విమోచన, మెట్లచిట్టాపూర్ పీఏసీఎస్ చైర్మన్ నవీన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
హోమియోతో మొండి వ్యాధులకు చెక్
కరీంనగర్‌టౌన్: హోమియోపతి ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రధాన వైద్యంగా గుర్తించబడింది. సాంప్రదాయ వైద్యానికి స్పందించని దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఈ వైద్యం ఎంతగానో పనిచేస్తుంది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మెదడువాపును నయం చేయడంలో, చికెన్‌గున్యా, స్వైన్‌ఫ్లూ వంటి ఎన్నో వ్యాధులను నయం చేయడంలో హోమియో వైద్యం పనితనం అందరికి తెలిసింది. పలు మొండి వ్యాధులను నయం చేయగల శక్తి ఉందనే నమ్మకంతో ఈ వైద్య విధానాన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. జర్మనీలో 1755 ఏప్రిల్ 10వ తేదీన జన్మించిన డాక్టర్ శామ్యూల్ హానిమన్ తన రెండు దశాబ్దాల పరిశోధన అనంతరం.. ప్రపంచానికి హోమియో వైద్యాన్ని అందించారు. ఆయన స్మృత్యర్థం ఏటా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జీవనశైలికి అనుగుణంగా మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. సైడ్ ఎఫెక్ట్లు లేని మందులు వాడుతూ రోగాలు నయం చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏళ్ల తరబడి మందులు వాడాల్సి వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకునేందుకు హోమియో సేవలను వినియోగంచుకుంటున్నారు. కీళ్ల, మోకాళ్ల, నడుం నొప్పులు, అర్థరైటిస్, సైనసైటిస్, షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీలో రాల్లు, అస్తమా, మలబద్దకం, అర్షమొలుల, సోరియాసిస్, బొల్లి వంటి చర్మవ్యాధులకు హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉంది. శాశ్వత పరిష్కారం కోసం రోగం నయం చేయడంలో కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా ఫలితం ఉంటుందనే నమ్మకమే హోమియోపతి సేవలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. శాశ్వత పరిష్కారం దొరుకుతుండడం ఒక కారణం. ముఖ్యంగా మొండి వ్యాధులకు మెరుగైన చికిత్స అందుతుండడంతో రోగులు హోమియోపతి వైపు మొగ్గుచూపుతున్నారు. రెండో ప్రధాన వైద్యంగా గుర్తింపు నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం అన్ని వ్యాధులకు చికిత్స హోమియోలో అన్ని వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉంది. సంతానసాఫల్యత, కీళ్లనొప్పులు, మెడనరాల నొప్పి, నడుమునొప్పి, సయాటికా, థైరాయిడ్, హర్మోన్ సంబంధ వ్యాధులు, కిడ్నీ స్టోన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఖచ్చితమైన చికిత్స అందుతుంది. అస్తమా, తరచు జలుబు, జ్వరం, టాన్సిల్స్ పెరుగుదల, జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్రలోమూత్ర విసర్జన వంటి అన్ని వ్యాధులకు హోమియో సమాధానం చెబుతుంది. అందువల్ల హోమియోకు ఆదరణ పెరుగుతోంది. – డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్, మాతృశ్రీ హోమియోక్లినిక్ -
హనుమాన్ చిన్న జయంతికి ఏర్పాట్లు చేయండి
జగిత్యాల: హనుమాన్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. ఈనెల 11 నుంచి జయంతి కార్యక్రమాల నేపథ్యంలో పదో తేదీలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కిందిస్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు రోజులపాటు లైటింగ్, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని, 11న రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం వరకు సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, సుమారు 45వేల మంది భక్తులు మాలవిరమణ చేస్తారని, మూడు రోజులపాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఆలయ ప్రాంగణంలో 64 సీసీకెమెరాలు ఉన్నాయని, అదనంగా 50 సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తామని, ఆరు మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మూడురోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకోసం వేదిక ఏర్పాటు చేసి వందమంది కూర్చునేలా సిట్టింగ్ ఉండాలని సూచించారు. చలువ పందిళ్లు, కోనేరు వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, కల్యాణ కట్ట వద్ద నాయీబ్రాహ్మణులను ఎక్కువగా నియమించుకోవాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో షిఫ్ట్‌ల వారిగా కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, కొండగట్టు ఆలయ ఈవో శ్రీనివాస్‌రావు, మదన్మోహన్, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ -
కోడికోసం వెళ్లి.. బావిలో పడి
కమాన్‌పూర్(మంథని): వరి పంటను కోసేందుకు సిద్ధమైన రైతు నామని రాజేశం(70) ఆచారం ప్రకారం పొలం వద్ద కోడిని బలిచ్చే ప్రయత్నంలో సమీప వ్యవసాయ బావిలోపడి దుర్మరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లెలో బుధవారం ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో తనకున్న వరిపొలం వద్దకు బుధవారం ఉదయం కోడిని పట్టుకుని వెళ్లాడు. వరి పైరు కోసేందుకు ముందుగా కోడిని బలి ఇవ్వాలని నిర్ణయించాడు. తనవెంట తెచ్చుకున్న సంచిలోనుంచి కోడిని తీస్తుండగా అది ఎగిరిపోయి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. రాజేశం ఆ కోడిని పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఆ బావిలో పడి మృతి చెందాడు. చాలాసేపటి వరకు రాజేశం ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అటూఇటూ చూడగా ఎక్కడా కనిపించలేదు. చివరకు వ్యవసాయ బావిలో చూడగా శవమై కనిపించాడు. అప్పటిదాకా తమతో ఉన్న రాజేశం బావిలోపడి విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యుల విలపించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసుకొన్నారు. వ్యవసాయ బావిలో పడి రైతు దుర్మరణం -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
కరీంనగర్‌రూరల్: ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి పసి ప్రాణం బలైంది. సదరు వ్యక్తి ట్రాక్టర్‌కు ఉన్న తాళం చెవిని తీయకపోవడంతో తెలియక స్టార్ట్ చేసిన చిన్నారి ట్రాక్టర్‌తో సహా బావిలో పడి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లెకు చెందిన గడ్డం రమ్య– అజీందర్రెడ్డికి ఇద్దరు కూతుర్లున్నారు. పెద్దకూతురు జశ్విత(3)ను మూడు రోజుల క్రితం తన అక్కబావలు అన్నాడి మంజుల– రాజిరెడ్డి ఊరైన కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేటకు పంపించారు. బుధవారం చింతచెట్టు కొట్టేందుకు కూలీలు రావడంతో చెట్టుకింద ఉన్న ట్రాక్టర్‌ను రాజిరెడ్డి కుమారుడు అభిరామ్‌రెడ్డి చిన్నారి జశ్వితను సీటు పక్కనే కూర్చుండబెట్టుకుని వ్యవసాయబావి ముందు నిలిపి కిందకుదిగి వెళ్లిపోయాడు. ట్రాక్టర్‌పై ఉన్న జశ్విత తాళం చెవిని తిప్పడంతో స్టార్ట్ అయిన ట్రాక్టర్ వేగంగా ముందుకుపోయి బావిలో పడిపోయింది. స్ధానికులు క్రేన్‌సాయంతో ట్రాక్టర్‌ను బావిలో నుంచి బయటకు తీశారు. ట్రాక్టర్ కింద పడిన జశ్విత ఊపిరి ఆడక బావిలోనే మృతిచెందింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి వచ్చి మృతిచెందిన చిన్నారిని గుండెలకు హత్తుకుని రోధించిన తీరు చూసి స్థానికులు కంటతడిపెట్టారు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి జశ్విత తండ్రి అజీందర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. -
స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
పెగడపల్లి: మండలంలోని బతికపల్లి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డికి స్వయాన మామ కాలగిరి ముత్యంరెడ్డి (94) మంగళవారం రాత్రి మృతి చెందాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి కరీంనగర్లో మృతిచెందగా.. స్వగ్రామమైన బతికపల్లిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మేడిపల్లి సత్యం, పలు వురు ప్రముఖు లు ఆయన మృతదేహానికి నివా ళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడు మాజీమంత్రి జీవన్‌రెడ్డికి స్వయాన మామ -
భర్తతోనే కలిసి ఉంటా..
● కరీంపేటలో మహిళ ఆందోళన శంకరపట్నం: భర్తతోనే కలిసి ఉంటానని ఓ మహిళ ఆందోళనకు దిగగా.. పలు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గడ్డం రాజు మొదటి భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన స్వప్నను రెండో వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా స్వప్నను భర్త, అత్తింటివారు వేధిస్తున్నారు. కొంత డబ్బు ఇచ్చి, వదిలించుకోవాలని చూస్తున్నారని, భర్తతోనే కలిసి ఉంటానని స్వప్న ఆరోపించింది. ఆల్ ఇండియా పోలీస్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక కరీంనగర్‌స్పోర్ట్స్: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్ క్లస్టర్ పోటీలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారులు ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు తెలిపారు. రామడుగుకు చెందిన అనుపురం సాయికృష్ణ ప్రస్తుతం మంచిర్యాలలో, కుర్మపల్లికి చెందిన పులి మాధవి ప్రస్తుతం రామగుండం కమిషనరేట్‌లో పనిచేస్తున్నారు. వీరి ఎంపికపై ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కాసర్ల ఆనంద్ కుమార్, రమణారావు, సంయుక్త కార్యదర్శి ప్రభాకర్, కోచ్ మూల వెంకటేశ్, వేల్పుల సురేందర్, కృష్ణహరి, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. -
హార్వెస్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తిమ్మాపూర్: మండలంలోని ఇందిరానగర్ గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు హార్వెస్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని పలువురితోపాటు, హార్వెస్టర్‌పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోవడంతో పోలీసుల రెండు గంటలు శ్రమించి బయటకు తీశారు. ఎల్ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 12:40 గంటల సమయంలో ఇందిరానగర్ గ్రామ సాయిబాబా గుడివద్ద కరీంనగర్ వైపు వెళుతున్న హార్వెస్టర్‌ను హైదరాబాద్ నుంచి కరీంనగర్‌వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో హార్వెస్టర్ రోడ్డు అవతలివైపుదూసుకెళ్లి బోల్తాపడింది. బ్లేడ్లు మాత్రం బస్సులు ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురితోపాటు హార్వెస్టర్‌పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. హార్వెస్టర్ డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే 108, ఎల్ఎండీ పోలీసులు సమాచారం అందించారు. దాదాపు 2 గంటలకు పైగా పోలీసులు, గ్రామస్తులు, హైవే పెట్రోల్ సిబ్బంది, మూడు 108 అంబులెన్స్ సిబ్బంది శ్రమించి బయటకు తీయగా.. మోకాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివేక్ తెలిపారు. -
వాగులో పడి వృద్ధురాలి దుర్మరణం
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీఅక్కపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయం సమీపంలోని వాగులో పడి బుధవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లికి చెందిన ఆకారపు మల్లమ్మ(68) మృతిచెందిందని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.బావిలో పడి వ్యక్తి మృతివెల్గటూర్: బావిలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని జగదేవుపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం జైన గామానికి చెందిన సంగెపు మహేశ్ (40) ఉపాధి నిమిత్తం ముంబయిలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదేళ్లుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం సోమవారం కుటుంబంతో కలిసి వచ్చాడు. బుధవారం బహిర్భూమికని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. మృతుడి భార్య మంగ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.చికిత్స పొందుతూ వ్యక్తి మృతివెల్గటూర్: క్రిమిసంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం గొడిశెలపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లె లచ్చయ్య (58) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదిహేనేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నా ఆరోగ్యం బాగుపడడంలేదు. జీవితంపై విరక్తి చెంది సోమవారం క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.తండ్రికి కూతురు తలకొరివిగొల్లపల్లి: కూతురే కొడుకై కన్నతండ్రికి తలకొరివి పెట్టిన ఘటన మండలంలోని భీంరాజ్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బక్కయ్యకు ఒక్కతే కూతురు. దండేపల్లి మండలం పాతగూడూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొద్దిరోజులుగా కూతురు వద్దనే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. దీంతో ఆయన స్వగ్రామమైన భీంరాజ్‌పల్లికి బుధవారం ఉదయం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బక్కయ్యకు కుమారులు లేకపోవడంతో కూతురు రజిత తండ్రికి తలకొరివి పెట్టింది.అక్రమ కట్టడాలు కూల్చివేతమేడిపల్లి: భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తహసీల్దార్ జి.రవికిరణ్ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహకారంతో కూల్చివేయించారు. మండల కేంద్రంలోని 1308 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు సంఘాల పేరిట నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు ఆలయాలు, ఈద్గాలు నిర్మించారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం లేకపోవడంతో వేరే గ్రామంలో నిర్మిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్తులు భూములకబ్జా విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి వాటిని తొలగించాలని, ఆ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని తీర్మానించారు. రెండురోజుల క్రితం రైతు, కుల సంఘాలు తహసీల్దార్ కార్యాలయం ముందు బైటాయించి ఆందోళనకు దిగారు. స్పందించిన రెవెన్యూ అధికారులు సున్నితప్రాంతాలైన గుడి, ఈద్గాల అంశాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. అలాగే అందులో ఉన్న కొన్ని అక్రమ నిర్మాణలను తొలగించారు. ఆర్ఐ రాజారాం, ప్రవీణ్, మేడిపల్లి ఎస్సై శ్యామ్‌రాజ్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. -
‘రెడీ’మేడ్ ఉపాధి సిద్ధం
సిరిసిల్ల: సిరిసిల్ల ప్రాంతంలోని మహిళలకు శాశ్వత ఉపాధిని అందించేందుకు ఆధునిక వస్త్రాల తయారీ యూనిట్ సిద్ధమైంది. జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దూరు అపెరల్ పార్క్‌లో రెడీమేడ్ వస్త్రాల తయారీసంస్థ టెక్స్‌ఫోర్ట్ కంపెనీ యూనిట్‌ను శుక్రవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, చేనేత, జౌళిశాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, టెక్స్‌ఫోర్ట్ కంపెనీ ప్రతినిధులతో బుధవారం సమీక్షించారు. రెండు వేల మందికి ఉపాధి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రెండు వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో టెక్స్‌ఫోర్ట్ కంపెనీ ముందుకొచ్చింది. రెండు ఎకరాల్లో టెక్స్‌ఫోర్ట్ గార్మెంట్ యూనిట్‌ను నిర్మించారు. అపెరల్ పార్క్‌లో ఇప్పటికే గోకుల్దాస్ ఇమేజెస్ గార్మెంట్ సంస్థ యూనిట్‌ను మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇక్కడ 500 మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. మరో వెయ్యి మందికి ఉపాధి కల్పించే దిశగా ఆ కంపెనీ యూనిట్‌ను విస్తరిస్తోంది. గోకుల్దాస్ సంస్థలో లోదుస్తులను తయారీచేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. సిరిసిల్ల నుంచి నేరుగా అమెరికాకు వస్త్రాలు వెళ్తున్నాయి. ఇప్పుడు టెక్స్‌ఫోర్ట్ అనే మరో అంతర్జాతీయ సంస్థ సిరిసిల్లలో పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు రావడంతో 1600 మంది మహిళలు, మరో 400 మంది స్టాఫ్‌కు ఉపాధి లభించనుంది. శుక్రవారం టెక్స్‌ఫోర్ట్ యూనిట్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధునిక జీన్స్, టీషర్ట్, అండర్‌వేర్స్ కుట్టుపై మహిళలకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు. రేపు అపెరల్ పార్క్‌లో టెక్స్‌ఫోర్ట్ యూనిట్ ప్రారంభం హాజరవుతున్న నలుగురు మంత్రులు ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా -
సర్ధాపూర్లో ఆయుధాగారం ప్రారంభం
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్‌లో కొత్తగా నిర్మించిన ఆయుధగారం (బెల్ ఆఫ్ ఆర్మ్స్)ను వర్చువల్‌గా టీజీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ బుధవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంజయ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ బెటాలియన్ పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ క్రమశిక్షణ గల ఆర్గనైజేషన్ అని వివరించారు. బెటాలియన్ అభివృద్ధిలో అధికారులు, సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు. సర్ధాపూర్ బెటాలియన్‌కు వచ్చిన డీఐజీ సన్నీకి కమాండెంట్ సురేష్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. బెటాలియన్‌లో నూతనంగా నిర్మించిన దోభీ, బార్బర్ రూమ్‌లను డీఐజీ సన్నీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వర్చువల్‌గా ప్రారంభించిన అడిషనల్ డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ -
ఇంగ్లిష్ ఒలింపియాడ్‌లో అల్ఫోర్స్ విద్యార్థికి ర్యాంకు
కొత్తపల్లి(కరీంనగర్): హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పోటీ పరీక్షల సంస్థలైన యునిఫైడ్ కౌన్సిల్ ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్‌లో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థి ఎం.శీవేన్రెడ్డి (7వ తరగతి) అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించడంతో పాటు రూ.10 వేల నగదు బహుమతి గెల్చుకున్నట్లు విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. పాఠశాలలో బుధవారం విద్యార్థిని అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు. శీవేన్రెడ్డిని అభినందిస్తున్న అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
కథలాపూర్: ధాన్యానికి మద్ధతు ధర కల్పించేందుకే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని పోసానిపేట, భూషణరావుపేటలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ లతతో కలిసి ప్రారంభించారు. సిరికొండలో జైబాపు, జై భీమ్, జైసంవిధాన్ కార్యక్రమంలో విప్ పాల్గొన్నారు. సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, డైరెక్టర్లు అంబటి రవి, వాకిటి రాజారెడ్డి, కారపు గంగాధర్, ఎం.డీ హఫీజ్, గుండారపు గంగాధర్, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, గడ్డం స్వామిరెడ్డి, తీట్ల శంకర్, ముస్కు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కొండగట్టులో సౌకర్యాలు కల్పించాలి
జగిత్యాలటౌన్: హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా కొండగట్టుకు వచ్చే దీక్షాస్వాములకు అన్ని వసతులు కల్పించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా స్వామి వారి దర్శనానికి వచ్చే దీక్షాస్వాములతోపాటు సామాన్య భక్తుల స్నానాల కోసం కోనేటిలో శుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలని కోరారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్‌రోడ్ వెంట కాలినడకన వచ్చే భక్తులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఘాట్‌రోడ్డు వెంట వాహనాల రాకపోకలను నిషేధించాలని కోరారు. ఘాట్ వెంట తాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ మెరుగుపరిచి ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గంగాధర్, లింగంపేట రాజన్న, ఆముద రాజు, లింగారెడ్డి, కాశెట్టి తిరుపతి ఉన్నారు. ఆయిల్ పాం తోటలకు కోతుల బెడద ఉండదుజగిత్యాలఅగ్రికల్చర్: ఆయిల్ పాం తోటలకు కోతుల బెడద ఉండదని జిల్లా ఉద్యానశాఖాధికారి శ్యాం ప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో బుధవారం ఆయిల్ పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ పాంకు చీడపీడల బెడద ఉండదని, రైతులకు ఇతర పంటలతో పోల్చితే లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. తోటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాయని, ఇప్పుడు టన్నుకు రూ.21వేలతో మంచి ఆదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి స్వాతి, లోహియా కంపెనీ మేనేజర్ విజయ్ భరత్, ఏఈఓ రవిళి, మానిటరింగ్ అధికారి అన్వేష్, ఫీల్డ్ ఆఫీసర్ ఉదయశ్రీ పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ కార్గవర్గం ప్రమాణస్వీకారంజగిత్యాలజోన్: జగిత్యాల బార్ అసోసియేషన్ కార్యవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఎన్నికల అధికారి నక్కల సంజీవరెడ్డి కార్యవర్గాన్ని ప్రకటించగా.. సీనియర్ న్యాయవాదులు ముదుగంటి జనార్దన్ రెడ్డి, ఎం.మురళీధర్‌రావు సర్టిఫికెట్లు అందించారు. వారితో ప్రమాణం చే యించారు. అధ్యక్షుడిగా రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శిగా అందె మారుతి, ఉపాధ్యక్షుడిగా సిరిపురం మహేంద్రనాథ్, సంయుక్త కార్యదర్శిగా కరబూజ నర్సయ్య, కోశాధికారిగా ఎం.ప్రదీప్‌కుమార్, లైబ్రరీ కార్యదర్శిగా మానా వెంకటరమణ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కంచి సురేష్, మహిళా ప్రతినిధిగా పడాల రాధ, సీనియర్ కార్యవర్గ సభ్యులుగా బండ భాస్కర్‌రెడ్డి, కె.దామోదర్‌రావు, గుంటి జగదీశ్వర్, రాంచంద్రం, ఓం ప్రకాష్, జూనియర్ కార్యవర్గ స భ్యులుగా టి. రమేశ్, టి.సంతోష్‌కుమార్, ఎ. ర మేష్, మహేందర్, వెంకటేశ్, రాజేందర్, నిఖిల్, రాజ్‌కుమార్, అరుణ్, మధు ప్రమాణం చేశారు. కోర్టు బెంచ్‌కు సహకారం అందించాలి న్యాయవాదులు కోర్టు బెంచ్‌కు సహకారం అందించేలా నూతన కార్యవర్గం చొరవ చూపాలని జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ అన్నారు. నూతన కార్యవర్గాన్ని వివిధ కోర్టుల జడ్జిలు అభినందించారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందిస్తే కోర్టులపై నమ్మకం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ, మొదటి, రెండవ అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్లు జితేందర్, వినీల్‌కుమార్, మాజీ అధ్యక్షుడు డబ్బు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి భూమి రమణకుమార్ పాల్గొన్నారు. -
దమ్ముంటే రాజీనామా చేసి గెలువు
● బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి భోగ శ్రావణి జగిత్యాలటౌన్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని, ఆయనను గెలిపించిన కార్యకర్తలు జైలులో ఉంటే వారిని మరిచిపోయి దొడ్డిదారిన వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి భోగ శ్రావణి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జీవన్‌రెడ్డి గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారని, తాను తన చైర్పర్సన్ పదవి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరానని, సంజయ్ మాత్రం కాంట్రాక్టులు, బిల్లుల కోసం పార్టీ మారారని ఆరోపించారు. ఎమ్మెల్యేల ఆదరణలో 108వ స్థానంలో ఉన్న విషయం సంజయ్‌కుమార్ గుర్తుపెట్టుకోవాలన్నారు. నాయకులు సిరికొండ రాజన్న, సాంబారి కళావతి, దూరిశెట్టి మమత, గడ్డల లక్ష్మి, సింగం పద్మ, కాశెట్టి తిరుపతి ఉన్నారు. -
ఇస్రో శిక్షణకు ‘ఆదర్శ’ పాఠశాల విద్యార్థిని
జగిత్యాల: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహిస్తున్న యువిక–2025 యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని అశ్విని ఎంపికై ంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 మంది పరిశోధన కేంద్రాల్లో మే నెలలో 12 రోజుల పాటు అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. అశ్విని హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో జరిగే శిక్షణకు ఎంపికై ంది. తెలంగాణ రాష్ట్రం నుంచి 12 మంది ఎంపిక కాగా అందులో అశ్విని ఒకరు. ఈమె ఎంపిక పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య, ఉపాధ్యాయులు ప్రణీత, పద్మ, తబస్సుమ్, రాజ్యలక్ష్మీ, శరణ్య, శిరీష, విజయ్‌కుమార్, రాజేశం, శ్రీధర్, సత్యనందం అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఇస్రో గురించి ప్రత్యేకంగా తెలుసుకునేందుకు ఎంపికవడం సంతోషంగా ఉంది. పాఠశాల ప్రిన్సిపల్, సైన్స్ ఉపాధ్యాయులు రమణ ఎంతో ప్రోత్సాహం అందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన నేను ఎంపిక కావడం ఆనందంగా ఉంది. – కొలకాని అశ్విని, విద్యార్థిని -
నృసింహుని సన్నిధిలో తాగునీటి కొరత
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలోని శుద్ధజలం ప్లాంట్ నిరుపయోగంగా మారింది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు బోరు నీరే దిక్కవుతోంది. ప్లాంట్‌ను ఉపయోగంలోకి తెస్తే రూ.లక్షల ఖర్చును ఆదా చేసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనరేటర్ చెడిపోయి నెల రోజులవుతున్నా.. పట్టించుకోకపోవడంతో అద్దె ప్రాతిపదికన మరో జనరేటర్ తెప్పించారు. దానిని నిత్యం రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని, ఉన్నవాటిని వినియోగంలోకి తెస్తే ఆలయానికి ఖర్చును ఆదా చేసుకోవచ్చని అంటున్నారు. ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారికి తాగునీరు సౌకర్యం కల్పించేందుకు నీటిశుద్ధి ప్లాంట్‌ను గతంలోనే ఏర్పాటు చేశారు. కొంతకాలానికి ప్లాంటు చెడిపోవడంతో భక్తులకు శుద్ధనీరు కరువైంది. దీంతో దేవస్థానం ముందున్న సంప్‌లోకి ట్రాక్టర్ల ద్వారా నీటిని నింపి పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా నిత్యాన్నదానానికి ఫిల్టర్ నీటిని కొనుగోలు చేసే పరిస్థితులున్నాయి. ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరందించేందుకు రూ.5లక్షలు మంజూరు చేస్తానని స్వయంగా కలెక్టర్ హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన నివేదికను అధికారులు తయారు చేయకపోవడంతో నిధులు అందకుండా పోయాయి. భక్తులకు బోరు నీరే దిక్కు నిరుపయోగంగా శుద్ధజలం ప్లాంటు నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉపయోగంలోకి తెస్తే రూ.లక్షలు ఆదా -
యువత దేశసేవలో ముందుండాలి
● కమాండింగ్ అధికారి జయంత జగిత్యాల: యువత దేశసేవలో ముందుండాలని 9వ బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ అధికారి జయంత అన్నారు. బుధవారం జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు భద్రత బలగాల్లో ఎన్నో అవకాశాలున్నాయని, సాహసం, ధైర్యం గల యువతకు త్రివిధ దళాల్లో, పారామిలిటరీ దళాల్లో ఉపాధి అవకాశాలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. శారీరక సామర్థ్యాన్ని పెంచుకుని అవకాశాలను అందిపుచుకోవాలన్నారు. ప్రిన్సిపల్ అశోక్ మాట్లాడుతూ.. జయంత వద్ద ఎన్సీసీ కెడెట్లు శిక్షణ విజయవంతంగా తీసుకోవాలన్నారు. కళాశాలలో అన్ని వనరులున్నాయని, వాటిని వినియోగించుకోవాలన్నారు. అనంతరం అధ్యాపక బృందం కమాండింగ్ అధికారి జయంతను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి లిఫ్ట్నెంట్ రాజు, సుబేదార్ సూర్యప్రకాశ్, శివానీ, గోవర్దన్, సురేందర్ పాల్గొన్నారు. -
దుర్గంధం ఆగదు
పూడిక తీయరు.. జగిత్యాల: అసలే జిల్లా కేంద్రం.. ప్రధానమైన మున్సిపాలిటీ. సమస్యలు మాత్రం అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాకేంద్రంలో డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకుపోతున్నాయి. నిత్యం తీయకున్నా కనీసం వారానికోసారి తీసినా డ్రైనేజీలు క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండే అవకాశం ఉంది. జిల్లాకేంద్రంలో ఏ డ్రైనేజీ చూసినా ప్లాస్టిక్, ఇతరత్రా వ్యర్థాలతో నిండి ఉంటున్నాయి. ముఖ్యంగా టవర్‌సర్కిల్, తహసీల్ చౌరస్తా, ప్రధానమైన చోట్లలో డ్రైనేజీలపై పూర్తిస్థాయిలో కప్పులు ఉండటం, వ్యాపారాలు కూడా ఇక్కడ అత్యధికంగా ఉండటంతో చెత్తాచెదారం ఎక్కువగా జమ అవుతుంటాయి. తినుబండారాలు, ప్లాస్టిక్ బాటిళ్లు అందులోనే పడేయడంతో అది తీయరాక డ్రైనేజీ అంతా నిండిపోతోంది. వర్షాకాలమైతే ఈ రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. పైకప్పులు పూర్తిస్థాయిలో వేసి ఎక్కడో ఓ చోట చిన్నగా వదిలేస్తున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీలపై పూర్తిస్థాయిలో కప్పు వేయకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, నిత్యం డ్రైనేజీలు తీసేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అలాగే పేరుకుపోతున్న పిచ్చిమొక్కలను తొలగించాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తే ఈగలు, దోమలు రాకుండా ఉంటాయని అంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, బురద కారణంగా పందులు అందులోనే స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా దారుల వెంట వెళ్లాలంటేనే భయంగా ఉందని ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్స్ నుంచి ముప్పారపు చెరువు వైపు వెళ్లే డ్రైనేజీ. పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయింది. చుట్టూ పిచ్చిమొక్కలే. మున్సిపల్ అధికారులు చెత్త తొలగించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని గొల్లపల్లి రోడ్లో శ్మశాన వాటిక సమీపంలో ఉన్న డ్రైనేజీ. సక్రమంగా లేక నీరంతా నిల్వ ఉంటోంది. చెత్తాచెదారం కొట్టుకొచ్చి అందులోనే చేరుతోంది. పూడిక తీస్తేనే తప్ప మురికినీరు ఎటూ వెళ్లదు. చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను తొలగిస్తే కొంత నీరు ప్రవహించే అవకాశం ఉంది. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో గల డ్రైనేజీ. ఇది నిత్యం పూర్తిగా చెత్తాచెదారంతోనే నిండిపోతూ ఉంటుంది. పూడికతీయకపోవడంతో రహదారి వెంట వెళ్తుంటే దుర్గంధం వెదజల్లుతోంది. ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌లోగల గోవిందుపల్లి రోడ్ సమీపంలో ఉండే డ్రైనేజీ. పూర్తిగా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. చెత్తాచెదారం తీయకపోవడంతో కాలనీల్లోకి దుర్గంధం వెదజల్లుతోంది. పాదచారులకు సైతం ఇబ్బందికరంగా మారింది. ఇది శుభమస్తు గార్డెన్స్ సమీపంలో ఉన్న డ్రైనేజీ. దీనిపై హోటళ్లు నిర్మించారు. అందులోంచి వచ్చే వ్యర్థాలన్నీ ఇందులోనే చేరుకోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. అక్కడ వ్యాపారాలు కూడా జరుగుతుంటాయి. కాలువల్లో పేరుకుపోయిన చెత్త తీయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది జిల్లా కేంద్రంలోని ప్రధానమైన టవర్‌సర్కిల్. ఇక్కడ డ్రైనేజీలు ఉన్నా కన్పించవు. ఇరువైపులా వాటిపై కప్పులు వేశారు. దీంతో అక్కడక్కడ మాత్రమే పూడిక తీసేలా ఖాళీ ప్రదేశం ఉంది. నిత్యం వందలాది మంది ఈ ప్రాంతానికి వస్తుంటారు. అధికారులు స్పందించి పైకప్పులను పెద్ద మొత్తంలో తొలగించి డ్రైనేజీని శుభ్రం చేస్తే మురికినీరు వెళ్లే అవకాశం ఉంది. -
ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం
● ఏర్పాటు చేయనున్న 407 కేంద్రాలు ● ఐదు లక్షల టన్నుల ధాన్యం అంచనా జగిత్యాలరూరల్: జిల్లాలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సర్వంసిద్ధం చేసింది. ఇప్పటికే కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో 133 ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో 273, మెప్మా ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రాలు కలిపి మొత్తం 407 కేంద్రాల ద్వారా సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల టన్నులు సేకరించనున్నారు. జిల్లావ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కావడంతో కొనుగోలు కేంద్రాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి న వెంటనే తేమ శాతాన్ని పరిశీలించనున్నారు. తర్వాత కొనుగోలు చేస్తారు. తూకం వేసేందుకు ప్రతి సెంటర్‌కు ఎలక్ట్రానిక్ కాంటా.. తేమ శాతాన్ని పరిశీలించేందుకు మీటర్, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లను సిద్ధంగా ఉంచారు. తప్పతాళ్లు లేకుండా క్లీన్ చేసేలా ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేశారు. 86 మిల్లర్లకు ధాన్యం కేటాయింపు ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు 86 మంది రైస్‌మిల్లులను కేటాయించారు. మిగతా కొన్నింటికి ధాన్యం సేకరణను దృష్టిలో ఉంచుకుని కేటాయింపు చేసే అవకాశాలున్నాయి. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయడంతోపాటు, మిల్లుల్లో కూడా వెంటనే ధాన్యాన్ని అన్లోడ్ చేసేలా మిల్లర్లకు హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తేమశాతం ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చేలా అవగాహన రైతులు పండించిన ధాన్యాన్ని పొలం నుంచి నేరుగా కొనుగోలు కేంద్రానికి కాకుండా ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఇప్పటికే మహిళాసంఘాల ద్వారా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. నేరుగా రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ధాన్యం ఆరబెట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయని రైతులకు తేమశాతం వచ్చిన ధాన్యాన్నే సెంటర్లోకి తీసుకురావాలని అవగాహన కల్పిస్తున్నారు. 407 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోకు 407 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కొనుగోళ్లు పూర్తయ్యే వరకు సెంటర్ల నిర్వహణ కొనసాగుతుంది. – జితేందర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
సన్నబియ్యం పథకంతో పేదలకు ప్రయోజనం
జగిత్యాలరూరల్: నిరుపేదల ఆకలి తీర్చేందుకు సన్నబియ్యం పథకం ఎంతో దోహదపడుతుంద ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి సన్నబియ్యం ల బ్ధిదారుడు కోల సంజీవ్ ఇంట్లో భోజనం చేశా రు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పథకం అమలు చేయడం చరిత్రాత్మకమన్నారు. అలాగే మంజూనాథ మహిళ సమైక్య సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. అ నంతరం మండలంలోని ఒడ్డెరకాలనీలో శ్రీ దు ర్గామాత వి గ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. డీఎస్వో జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రమాదేవి, ఏడీ ఏ తిరుపతినాయక్, నాయకులు పాల్గొన్నారు. పేదలపాలిట వరం జగిత్యాల: ీసఎం సహాయనిధి పేదల పాలిట వరమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 18వ వార్డుకు చెందిన జంగిలి శ్రీజకు సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి రూ.16 వేలు, ఇస్లాంపురకు చెందిన షఫియోద్దీన్కు రూ. 29,500 విలువ గల చెక్కులను అందజేశారు. ప్ర భాత్సింగ్, శరత్‌రావు, రవిశంకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్జగిత్యాల: ప్రజల అభ్యున్నతే లక్ష్యమని, రాజ కీయాలకతీతంగా చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం కొడిమ్యాలలో శివాజీ విగ్రహం నుంచి అంగడిబజార్ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ, కొడిమ్యాల మండలంలో ఎంపీ ల్యాండ్స్, ఉపాధిహామీ నిధులతో రోడ్లను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. అలా గే కిచెన్‌షెడ్స్, కమ్యూనిటీ హాల్స్, పీఏసీఎస్ భవనాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నా రు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా పనిచేస్తున్నామని, కొడిమ్యాల మండలంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించుకో వడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మండలంలో పర్యటించగా మహిళలు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యే బొడిగె శోభ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గోవులను రక్షించాలిరాయికల్(జగిత్యాల): గోవులను పరిరక్షించా లని మంగళవారం హిందు ఆలయాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని శివాజీ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొద్ది రోజులుగా పట్టణంలోని ఆలయాల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు గోవులను ఎత్తుకెళ్తున్నారని, ఇటీవల దొంగలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోవ డం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు ధర్నా నిర్వహించడంతో వాహనా లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఆడనే అంతం!
● ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు ● గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో దందా ● ఆడపిల్ల అని తెలిస్తే ‘కాలగర్భంలో’ కలిపేస్తున్నారు ● దందాలో ఆర్ఎంపీ, పీఎంపీలదే కీలకపాత్ర ● స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల ఇష్టారాజ్యంకరీంనగర్ 142‘ఈ చిత్రంలో వైద్యాధికారులు సీజ్ చేస్తున్న ఆస్పత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోనిది. నిబంధనల ప్రకారం స్కానింగ్ చేసినవారి వివరాలను రెండేళ్ల పాటు భద్రంగా ఉంచటంతో పాటు, ప్రతినెలా తమ ఆస్పత్రిలో జరిగే స్కానింగ్, తదితర వివరాలు జిల్లావైద్యారోగ్యశాఖకు సమర్పించాలి. కానీ, ఈ ఆస్పత్రిని డీఎంహెచ్‌వో తనిఖీ చేయగా స్కానింగ్ యంత్రంలోని హార్డ్‌డిస్క్‌ను మాయం చేయడంతో పాటు, రికార్డులు లేకపోవడంతో సీజ్ చేశారు’. ఉమ్మడి జిల్లాలో స్కానింగ్ కేంద్రాలుపెద్దపల్లి 31జగిత్యాల 78సిరిసిల్ల 35లింగ నిష్పత్తి (2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1,000 మందికి)జిల్లా లింగనిష్పత్తి (0–6 వయసు చిన్నారుల్లో) జగిత్యాల 992 947 పెద్దపల్లి 992 922 కరీంనగర్ 993 931 సిరిసిల్ల 1,014 942‘జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో అనుమతి లేని స్కానింగ్ యంత్రాలు మూడు ఉండగా నాలుగునెలల క్రితం వాటిని వైద్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు గుర్తించి సీజ్ చేశారు’.‘ఇటీవల వైద్యారోగ్యశాఖ అధికారులు కరీంనగర్లో తనిఖీలు చేపట్టగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 19 స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. ఒక సెంటర్లో మొబైల్ స్కానింగ్ మిషన్‌ను సీజ్ చేశారు. అయినా తెరవెనుక దందా దర్జాగా నడుస్తోంది’.సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్‌టౌన్/జగిత్యాల: కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అని తేలితే కడుపులోనే బిడ్డను కరిగించేస్తున్నారు. లింగనిర్ధారణ నేరమని చెప్పాల్సిన వైద్యులే ఆర్ఎంపీలతో కలిసి ముఠాలుగా ఏర్పడి అక్రమ దందాకు పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుట్టుచప్పుడు కాకుండా భ్రూణహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. దీంతో లింగనిష్పత్తిలో అంతరం పెరుగుతోంది. ముఖ్యంగా 0–6 వయస్సు చిన్నారుల్లో పెరుగుతున్న అంతరం ఆందోళన కలిగిస్తుంది. ఆర్ఎంపీ, పీఎంపీలదే కీలకపాత్ర పల్లెలు, పట్టణాల్లోని ఆర్ఎంపీలు, పీఎంపీల సహకారంతో ఉమ్మడి జిల్లాలో లింగనిర్ధారణ దందా సాగుతోంది. కొంత మంది ఆర్ఎంపీ, పీఎంపీలు ధనార్జనే ధ్యేయంగా ముఠాగా ఏర్పడుతున్నారు. స్కానింగ్ సెంటర్లలో మాట్లాడుకుని వ్యవహారం నడిపిస్తున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే ముందస్తుగా ఒప్పందం కుదర్చుకున్న ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లకు మహిళలను పంపించి గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ఇదంతా మూడో కంటికి తెలియకుండా జరిగిపోతోంది. రెండు, మూడో కాన్పుపై దృష్టి సారిస్తే.. మొదటి కాన్పులో ఆడపిల్లలు పుట్టినవారికి రెండు, మూడోసారి గర్భం దాల్చిన మహిళలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. 12 వారాల గర్భం కలిగిన మహిళలు తమ వివరాలను వైద్య పరీక్షల కోసం ఏఎన్ఎం వద్ద నమోదు చేసుకుంటారు. తర్వాత 16 నుంచి 20 వారాల్లో మరోసారి వారు వైద్యపరీక్షలకు వచ్చినప్పుడు రికార్డు చేస్తారు. అలాంటి సమయంలో వారు రాకుంటే నిఘా పెట్టి గర్భంతో ఉన్నారా.. లేక అబార్షన్ చేయించుకున్నారనేది తెలుసుకుని విచారణ చేపడితే ఈ దందాకు చెక్ పెట్టవచ్చు.చట్టం ఏం చెబుతుందంటే.. లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని ప్రభుత్వాలు 1994లో తీసుకొచ్చాయి. కడపులోని పిండం ఎదుగుదలను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ కేంద్రాలను నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే మొదటిసారి మూడేళ్లు జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, రెండోసారి ఐదేళ్ల జైలు, రూ.50వేల జరి మానా చెల్లించాలి. నేరం నిర్ధారణ అయితే వైద్యవృత్తి నిర్వహణ అర్హత కోల్పోతారు.ఆపరేషన్ డెకాయ్ ఎక్కడ? గతంలో ఆస్పత్రుల్లోని స్కానింగ్ కేంద్రాల వద్ద వైద్యాధికారులు డెకాయ్ ఆపరేషన్ల పేరిట తనిఖీలు చేపట్టేవారు. ప్రస్తుతం అవి అమలు కావడం లేదు. డెకాయ్ ఆపరేషన్‌లో మహిళ తహసీల్దార్, మహిళా ఎస్సై, సఖీ సెంటర్ నిర్వాహకులు ఉంటారు. వైద్యాధికారులే ఈ బృందాన్ని స్కానింగ్ సెంటర్లకు గర్భిణుల వలే పంపిస్తారు. లింగనిర్ధారణ చేసేందుకు డబ్బు ఎర వేస్తారు. ఎవరైనా పరీక్షలకు పాల్పడితే వారిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ, ఉమ్మడి జిల్లాలో డెకాయ్ ఆపరేషన్లు ఎక్కడా కన్పించడం లేదు.కోడ్ భాషలోనే.. కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చట్టవిరుద్ధమని పెద్దపెద్ద బోర్డులు ఏర్పాటు చేస్తారు. కానీ తెరవెనుక వేరే ఉంటుంది. లింగనిర్ధారణ చేసి పుట్టబోయేది ఎవరనేది కోడ్‌భాషలో చెబుతారు. కేషీట్లపై కోడ్ భాషలో మైనస్, ప్లస్ గుర్తులు పెడుతున్నట్లు సమాచారం. -
నిబంధనలు పాటించాలి
జగిత్యాల: నిబంధనలకు అనుగుణంగా స్కానింగ్ సెంటర్లు ఉండాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 3 కొత్తగా, 10 రెన్యువల్ కోసం స్కానింగ్ సెంటర్లవారు దరఖాస్తు చేసుకున్నారని, సంబంధిత అధికారి అన్నింటినీ పరిశీలించిన తర్వాతే అనుమతి ఇవ్వాలన్నారు. మాతాశిశు సంక్షేమాధికారి డాక్టర్ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ, స్కానింగ్ సెంటర్ కోసం నిబంధనలు అమలవుతున్నాయని, జిల్లాలో 78 స్కానింగ్ సెంటర్లు అనుమతి పొంది ఉన్నాయన్నారు. సీనియర్ గైనకాలజిస్ట్ కనకదుర్గ మాట్లాడుతూ, మహిళలు గర్భిణిగా నమోదైనప్పటి నుంచి ఆశాకార్యకర్తలు ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ చేయాలని పేర్కొన్నారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, సీనియర్ వైద్యులు విశ్వభారతి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు, స్వచ్ఛంద సభ్యులు తౌటు రాంచంద్రం, హెల్త్ ఎడ్యుకేటర్స్ భూమేశ్వర్, తరాల శంకర్, విస్తీర్ణాధికారి రాజేశం పాల్గొన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయండి రాయికల్(జగిత్యాల): ఆయుష్మాన్ సబ్ సెంటర్ పనులు సకాలంలో పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ సూచించారు. మండలంలోని అయోధ్య గ్రామంలో సబ్‌సెంటర్ నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారి ఆకుల శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సతీశ్, ఎన్హెచ్ఎం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్ ఉన్నారు. -
తల్లిపాలు పిల్లలకు శ్రేష్ఠం
జగిత్యాలరూరల్: తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేష్ఠమని జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్ అన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో పోషణ పక్షం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీల్లో ఈనెల 8 నుంచి 22 వరకు పోషణపక్షం కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. గర్భిణులు, రెండేళ్లలోపు చిన్నారుల ఎత్తు, బరువు తీసి గ్రోతింగ్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. గర్భిణులు, బాలింతలకు మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రతీ చిన్నారికి ఆరునెలలు నిండే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. సీడీపీవో మమత, గ్రామ ప్రత్యేకాధికారి నరేశ్, విండో చైర్మన్ మహిపాల్‌రెడ్డి, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ మధుకుమార్, సూపర్వైజర్ లావణ్య, ఎంఎల్‌హెచ్‌పీ అనూష, ఏఎన్ఎం శిరీష, అంగన్వాడీ టీచర్లు పద్మరాణి, జమున, శైలజ పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం జీతాలు చెల్లిస్తాంజగిత్యాల: మున్సిపల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు వేతనాల్లో వ్యత్యాసం ఉందని ‘సాక్షి’ దినపత్రికలో ‘వేతనం.. వ్యత్యాసం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కమిషనర్ స్పందన స్పందించారు. శానిటరి ఇన్స్పెక్టర్ మహేశ్వర్‌రెడ్డిని సంబంధిత రికార్డులు అందించాలని ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలోని రికార్డులు పరిశీలించగా జీఎంఎస్ నంబరు 14, 60 ప్రకారం డ్రైవర్లందరికీ వేతనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే జనవరి 24న 12 మంది కార్మికులకు పదోన్నతి కల్పించినట్లు దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, అర్హత, ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్హులకు నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇతర డ్రైవర్లతో సమానంగా జీతాలు చెల్లించేలా చూస్తామని పేర్కొన్నారు. పెన్షన్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలిజగిత్యాలటౌన్: పాత పెన్షన్ విధానానికి హాని చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన పెన్షన్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని జగిత్యాల పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. బిల్లును ఉపసంహరించుకోవాలని రాసి ఉన్న కార్డులను ప్రధాని మోదీకి పోస్టు ద్వారా పంపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్‌కుమార్ మాట్లాడుతూ, పెన్షన్ సవరణ బిల్లు చట్ట రూపంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అమలు చేస్తాయన్నారు. దీంతో రాష్ట్రంలోని పెన్షనర్స్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. పెన్షనర్ల కడుపు కొట్టే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్‌కుమార్, నాయకులు సీపీ హన్మంతరెడ్డి, గౌరిశెట్టి విశ్వనాథం ఉన్నారు. బహిరంగ వేలం ద్వారా మామిడి కొనుగోళ్లు చేపట్టాలిజగిత్యాలటౌన్: బహిరంగా వేలం ద్వారా మామిడి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుని రైతులకు సరైన ధర వచ్చేలా చూడాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. జగిత్యాలలోని రాజీవ్‌గాంధీ మ్యాంగో మార్కెట్లో మామిడి కొనుగోళ్లలో నిబంధనలు అమలు జరిగేలా చూడాలని కోరుతూ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌కు మంగళవారం లేఖ రాశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడికాయలపై మచ్చలు ఏర్పడి నాణ్యతతో పాటు దిగుబడి తగ్గి రైతులు ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. దీనికి తోడు 3 రకాల గ్రేడింగ్ పేరుతో రైతులను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మార్కెటింగ్ శాఖ నిబంధనల ప్రకారం 4శాతం ఫీజు వసూలు చేయాల్సి ఉండగా 10శాతం వసూలు చేస్తుండటంతో రైతులపై మరింత భారం పడుతుందన్నారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా మార్కెటింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని లేఖలో కోరారు. -
జై బోలో హనుమాన్‌కీ..
కోరుట్ల: ‘రామ లక్ష్మణ్ జానకీ..జై బోలో హనుమాన్‌కి’ అంటూ కోరుట్ల పట్టణం కాషాయమయమైంది. పట్టణంలో మంగళవారం రాత్రి వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరసామి ఆలయం వద్ద విజయయాత్ర ప్రారంభం కాగా, గాంధీరోడ్, కార్గిల్ చౌక్, జాతీయ రహదారి మీదుగా కొత్త బస్టాండ్, అంబేడ్కర్‌నగర్ మీదుగా తిరిగి వేంకటేశ్వర ఆలయం వద్దకు చేరింది. వందలాది మంది హనుమాన్ దీక్షాపరులు, బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల జై హనుమాన్ నినిదాలతో కోరుట్ల పట్టణం మారుమోగింది. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ కోరుట్ల సెగ్మెంట్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ
స్కానింగ్ సెంటర్లు, మెటర్నిటీహోంలలో తనిఖీలు నిర్వహించేందుకు కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వైద్యాధికారి కన్వీనర్‌గా కమిటీ రూపొందించారు. కమిటీలో గైనకాలజిస్టు, మహిళా తహసీల్దార్, మహిళా పోలీస్ అధికారి, సఖి కన్సల్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను బాధ్యులుగా నియమించారు. వీరంతా జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లలో ఎప్పటికప్పుడు తనిఖీ చేపట్టాలి. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు చేపడతారు. ఈ కమిటీ ఇప్పటికే 19 సెంటర్లకు నోటీసులు జారీ చేసింది. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌వో, కరీంనగర్ -
అర్హులందరికీ రేషన్ కార్డులు
● విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ బుగ్గారం(ధర్మపురి): అర్హులందరికీ త్వరలో కొత్త రేషన్‌కార్డులు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని గంగాపూర్‌లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానికుడు రెంటం మల్లయ్య ఇంట్లో సన్నబియ్యంతో వండిన ఆహా రాన్ని నాయకులు, కార్యకర్తలతో కలిసి భుజించారు. భవిష్యత్‌లో మరిన్ని పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదల సంక్షేమానికి ప్రాధాన్యం వెల్గటూర్(ధర్మపురి): పేదల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రాధాన్యమని విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే 24 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. బుగ్గారం, వెల్గటూ ర్ మండలాల అధ్యక్షులు వేముల సుభాష్, శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ గోపిక, వైస్ చైర్మన్ తిరుపతి, నాయకులు రామ్మోహన్రావు, గోపాల్‌రెడ్డి, మురళీ, సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చినా.. ఇవ్వనట్లే!
కోరుట్ల: అలా ఇచ్చి.. ఇలా లాగేసుకున్నట్లుగా మారింది వ్యవసాయ పనిముట్ల ఆధునీకరణ పథకం తీరు. కేంద్ర ప్రభుత్వం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్(ఎస్ఎంఏఎం) కింద రైతులకు సబ్సిడీ కింద అధునిక పరికరాలు అందించాలన్న లక్ష్యంతో ఈ ఏడాది మార్చి నెలాఖరులో నిధులు మంజూరు చేసింది. బడ్జెట్ వినియోగ కాలపరిమితి మార్చితో ముగియడంతో సదరు పథకం అమలుకు అధికారులు ముందడుగు వేసేలోపు నిధులు లాప్స్ అయ్యాయి. సబ్సిడీ విషయంలోనూ రైతులకు సరైన లబ్ధి లేకపోవడంతో పథకలు అమలులో నీరుగారిపోయింది. అలా ఇచ్చి.. ఇలా లాగేశారు చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ట్రాక్టర్, హార్వేస్టర్, రోటవేటర్‌తో పాటు సుమారు 30రకాల వ్యవసాయ పరికరాలను యాబై శాతం సబ్సిడీతో రైతులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా గతేడాది ఎస్ఎంఏఎం పథకానికి రూపకల్పన చేసింది. మహిళా రైతులకు ప్రాధాన్యం ఇస్తూ రెండు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్నవారిని లబ్ధిదారులుగా గుర్తించింది. ఈ పథకానికి దరఖాస్తు చేసే విధానాన్ని ఆన్లైన్లో ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖ అవసరమైన ప్రచారం, అవగాహన కల్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లాల వ్యవసాయ విస్తీర్ణం ఆధారంగా అవసరమైన నిధులను ఈ ఏడాది మార్చి నెలాఖరులో ఒక్కో జిల్లాకు రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు విడుదల చేసింది. జగిత్యాల జిల్లాకు రూ.67లక్షలు మంజూరయ్యాయి. ఈ పథకంపై వ్యవసాయశాఖ అధికారులు రైతుల్లో అవగాహన కల్పించి ఆన్లైన్లో దరఖాస్తులు కోరడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలోనే మార్చి నెల బడ్జెట్ కాలపరిమితి ముగియడంతో సదరు నిధులు లాప్స్ అయ్యాయి. నిధుల మంజూరుకి బడ్జెట్ కాలపరిమితి ముగియడానికి మధ్య కేవలం పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఎస్ఎంఏఎం పథకం రైతులకు అందని ద్రాక్షగా మారింది. సబ్సిడీ తిరకాసు ఈ పథకంలో సబ్సిడీ విషయంలో కొంత తిరకాసు ఉండటంతో ఆశించిన రీతిలో దరఖాస్తులు రాలేదు. సాధారణంగా ఏదైనా వ్యవసాయ పనిముట్టు మార్కెట్ ధరలో యాభైశాతం సబ్సిడీ ఇస్తే రైతులు ఆసక్తిగా దరఖాస్తు చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం కోట్ చేసిన వ్యవసాయ పరికరాల ధరలు ఎక్కువగా చూపి వాటిలో సబ్సిడీ కింద యాభైశాత కోత పెట్టినట్లుగా రైతులు చెబుతున్నారు. ఉదాహరణకు రోటవేటర్ ధర మార్కెట్లో రూ.85వేల నుంచి రూ.95 వేలు ఉండగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎస్ఎంఏఎం పథకం కింద రోటవేటర్ ధర రూ.1.50 లక్షలుగా నిర్ధారించినట్లు సమాచారం. ఈ ధరతో రోటవేటర్ తీసుకుంటే సబ్సిడీ కింద సగం ధర అంటే రూ.75 వేలకు రోటవేటర్ రైతుకు దక్కుతుంది. మార్కెట్ ధరను లెక్కలోకి తీసుకుంటే సబ్సిడీ కేవలం రూ.10వేలకు మించకపోవడం గమనార్హం. మిగిలిన పరికరాలు నాణ్యత లేని కంపెనీలకు చెందినవి కావడంతో పది రోజుల వ్యవధిలో అధికారులు హడావుడిగా నిధుల వినియోగానికి సన్నాహాలు చేసిన పెద్దగా ఫలితమివ్వలేదు. వ్యవసాయ పనిముట్ల స్కీంకు.. మార్చి నెలాఖరులో నిధులు సమయం లేక అమలు కాని తీరు బడ్జెట్ కాలపరిమితి ముగిసి నిధులు లాప్స్నిధులు లాప్స్ అయ్యాయి కేంద్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులో ఎస్ఎంఏఎం పథకానికి నిధులు మంజూరు చేయడంతో పది రోజుల్లో గత బడ్జెట్ కాలపరిమితి ముగిసి జిల్లాకు వచ్చిన రూ. 67 లక్షల నిధులు లాప్స్ అయ్యాయి. మళ్లీ ఈ బడ్జెట్లో నిధుల మంజూరుకు అనుమతి వస్తే రైతులకు అవగాహన కల్పించి పథకం అమలు చేస్తాం. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల -
నాసిరకం సరుకులతో ప్రసాదం
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు అందించే లడ్డూ, పులిహోరా, అన్నప్రసాదం తయారీలో నాసిరకం సరుకులు విని యోగిస్తున్నారు. హనుమాన్ జయంతికి లక్షలాది మంది భక్తులు రానుండటంతో నాసిరకం సరుకులు వినియోగిస్తే ఆలయ ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉంది. కలెక్టర్ చొరవ తీసుకుని, నాణ్యమైన సరుకులతో ప్రసాదం తయారు చేసేలా చూడాలి. – పోచమ్మల ప్రవీణ్, ఽ దర్మకర్తల మండలి మాజీ సభ్యుడు, కొండగట్టు హద్దులు చూపండి కథలాపూర్ మండలం తుర్తి శివారులోని సర్వే నంబర్ 93/17లో ఖాతా నంబర్ 332 ద్వారా దళితులకు భూ పంపిణీ పథకం కింద నా భార్య పొడేటి మమతకు ప్రభుత్వం మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చింది. సమీపంలోని కొందరు మా భూమిలో మామిడి చెట్లు పెట్టారు. ఇదేమని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు. సదరు భూమికి హద్దులు చూపి, సర్కారు అండగా నిలవాలి. – పొడేటి తిరుపతి, తుర్తి, కథలాపూర్ -
ఆహార ఉత్పత్తులతో ఆర్థికాభివృద్ధి
జగిత్యాలరూరల్: ఆహార ఉత్పత్తుల ద్వారా మహిళ సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని సెర్ప్ జిల్లా అదనపు డైరెక్టర్ చరణ్‌దాస్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థ వ్యవస్థీకరణ పథకంపై సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలవారు ఆర్థికంగా ఎదగడానికి వివిధ ఆదాయాభివృద్ధి మార్గాలున్నాయని అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల వ్యవస్థీకరణ పథకం ద్వారా 35శాతం సబ్సిడీ రుణాలు అందించడం జరుగుతోందన్నారు. పీఎంఎఫ్ఎంఈ ద్వారా రుణాలు తీసుకుని వివిధ యూనిట్లు పెట్టుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం జిల్లా డీఎంపీ వెంకటేశ్ మాట్లాడుతూ నాణ్యతతో కూడిన ఉత్పత్తులతో పాటు వాటికి ప్యాకింగ్, బ్రాండింగ్ అతిముఖ్యమని అన్నారు. జిల్లా రిసోర్స్ పర్సన్లు వంశీకృష్ణ, జిల్లాస్థాయి శిక్షకులు కోల శ్రీనివాస్‌చక్రవర్తి, ఏపీఎం గంగాధర్, సీసీలు గంగారాం, రవీందర్, శ్రీనివాస్, విద్యాసాగర్ పాల్గొన్నారు. -
దళారుల దోపిడీని అరికట్టాలి
బహిరంగ వేలం ద్వారా మామిడికాయలు కొనుగోలు చేసి, దళారుల దోపిడీ నుంచి మామిడి రైతులను కాపాడాలి. నాణ్యమైన మామిడికి చిరునామాగా ఉన్న జగిత్యాల మార్కెట్లో కొనుగోలుదారులు చేతివాటం చూపుతూ దోపిడీకి గురిచేస్తున్నారు. దళారుల నుంచి రైతులను కాపాడండి. – జిల్లా రైతు ఐక్యవేదిక ప్రతినిధులు ఉచిత దహన సంస్కారాలు నిర్వహించాలి నిరుపేదలు మరణించినప్పుడు దహన సంస్కారాల నిర్వహణ భారంగా మారింది. రూ.10వేల నుంచి రూ.15వేలు ఖర్చవుతుండడంతో ఆర్థిక భారం భరించలేక నిరుపేదలు వి లవిల్లాడుతున్నారు. దహన సంస్కారాలు ము న్సిపాలిటీ నుంచి ఉచితంగా నిర్వహించాలి. – భాసుస ప్రతినిధులు, జగిత్యాల -
వినతుల వెల్లువ
● ప్రజావాణికి అర్జీదారుల క్యూ ● ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి ● కలెక్టర్ సత్యప్రసాద్జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణికి వినతులు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో బాధితుల నుంచి అధి కారులు ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన పలువురు వివిధ సమస్యలపై 40 ఫిర్యాదులు అందించారు. వాటిని స త్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు పులి మధుసుదన్‌గౌడ్, జివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పారితోషికం ఇప్పించండి
సమగ్ర కుటుంబ సర్వేలో డేటా ఎంట్రీ సేవలందించిన తమకు పారితోషికం అందలేదు. నాలుగు నెలలు గడుస్తున్నా.. తమకు ఇవ్వాల్సిన పారితోషికం అందలేదు. ఈ విషయమై పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లాం. అక్కడ అడిగినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ చొరవ తీసుకుని పారితోషికం అందేలా చూడాలి. – డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మల్యాల అక్రమ నిర్మాణం తొలగించండి గొల్లపల్లి మండలం రాపల్లి శివారులో అనుమతులు లేకుండా నిర్మించిన పౌల్ట్రీఫాంను తొలగించాలి. ఈ విషయమై ఇప్పటికే ఫిర్యాదు చేయగా.. బహిరంగ విచారణలో సదరు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని గ్రామ పంచాయతీ కార్యదర్శి వివరించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పౌల్ట్రీఫాంను వెంటనే కూల్చివేయాలి. – గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామస్తులు -
ప్రసూతి, అనారోగ్య మరణాలు తగ్గించాలి
జగిత్యాల: ప్రసూతి, అనారోగ్య మరణాలు తగ్గించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఐఎంఏ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రసూతి మరణాలను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుమన్‌రావు మాట్లాడుతూ.. గర్భిణులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. సక్రమంగా మందులు వాడితే ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. గైనకాలజిస్ట్లు అనిత, పిడియాట్రిక్ కార్తీక్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బార్ అసోసియేషన్ ఏకగ్రీవం
జగిత్యాలజోన్: జగిత్యాల బార్ అసోసియేషన్ ఎన్నిక సోమవారం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి నక్కల సంజీవరెడ్డి తెలిపారు. ఒక్క కార్యవర్గం పోస్టు మినహా మిగితా పదవులకు ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో వారి ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవమైంది. 10 కార్యవర్గ పోస్టులకు 11 మంది నామినేషన్ వేయగా.. సోమవారం ఒక్కరు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో కార్యవర్గం ఏకగ్రీవమైంది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాచకొండ శ్రీరా ములు, ఉపాధ్యక్షుడిగా సిరిపురం మహేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా అందె మారుతి, సంయుక్త కార్యదర్శిగా కరభూజ నర్సయ్య, కోశాధికారిగా ఎం.ప్రతీప్‌కుమార్, లైబ్రరీ కా ర్యదర్శిగా మానాల వెంకటరమణ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కంచి సురేశ్, మహిళా ప్రతినిధిగా పడాల రాధ, కార్యవర్గ సభ్యులుగా టి.రమేశ్, టి.సంతోష్‌కుమార్, ఏ.రమేశ్, మ హేందర్, వెంకటేశ్, రాజేందర్, నిఖిల్, రాజ్‌కుమార్, అరుణ్, మధు ఏకగ్రీవం అయ్యారు. 1,200 మందికి ఉచిత వైద్యపరీక్షలు కోరుట్ల: పట్టణంలోని కింగ్స్గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబి రా నికి విశేష స్పందన లభించింది. కోరుట్ల ఐఎంఏ, కేఎంవోజీఎస్, జమాతే ఈ ఇస్లామి హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. 1,200 మందికి వైద్య పరీక్షలు చే శారు. ఇందులో 200 మందికి బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్, 200 మందికి గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్, 100 మందికి బోన్ డెన్సిటీ టెస్టులు, కంటి, దంత, సాధారణ పరీక్షలు నిర్వహించారు. కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, కేఎంవోజీఎస్ అధ్యక్షుడు డాక్టర్ స్వీతి అనూప్, కోరుట్ల ఐఎంఏ అధ్యక్షుడు రేగొండ రాజేశ్, ఐఎంఏ సెంట్రల్ కమిటీ సభ్యుడు అనూప్ రావు పాల్గొన్నారు. మామిడి తోటలను కాపాడుకోండి జగిత్యాలఅగ్రికల్చర్/మల్యాల: మామిడి తోట లకు ఆశిస్తున్న పురుగులను నివారించేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానవన శాస్త్రవేత్తలు సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పర్యటించి, తోటలను పరిశీలించారు. ప్రస్తుతం మామిడికాయ వృద్ధి చెంది, టెంక గట్టిపడే దశలో ఉన్నాయని, పలు తోటల్లో తామర పురుగు ఉధృతిని గమనించినట్లు తెలిపారు. పురుగుల ఉధృతిని బట్టి లీటరు నీటిలో వేపనూనె 3మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలన్నారు. అనంతరం ఫిప్రోనిల్ 80శాతం డబ్ల్యూజీ 0.2 గ్రాములు, లేదా స్పైనోసాడ్ 45శాతం ఎస్సీ 0.3 మిల్లీ లీటర్లు, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, సింథటిక్ పైరిత్రాయిడ్ కీటకనాశినిలను ఉపయోగించవద్దని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం రామగిరిఖిల్లా శాస్త్రవేత్త డాక్టర్ వై.వెంకన్న, ఫామ్ మేనేజర్ బండారి నరేశ్, సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎ.నితీశ్, ఉద్యాన అధికారి మహేశ్ పాల్గొన్నారు. కార్మికులకు సబ్బులు, నూనెలు పంపిణీ జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనెలు ఇవ్వకపోవడంతో ఉత్త చేతులతోనే చెత్త చెదారం సేకరించడం జరిగింది. ఈ విషయంపై ‘సాక్షి’లో ‘సబ్బులు లేవు... నూనె ఇవ్వరు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో ము న్సిపల్ కమిషనర్ స్పందన స్పందించారు. ము న్సిపల్ కార్మికులకు సబ్బులు, నూనెలు, డ్రెస్ లు అందజేశారు. పారిశుధ్య కార్మికుల రక్షణే ముఖ్యమని, జోనల్ వారీగా అందరికీ అందజేయడం జరుగుతుందని తెలిపారు. శానిటరీ ఇ న్స్పెక్టర్ మహేశ్వర్‌రెడ్డి, మారుతి పాల్గొన్నారు. -
వేతనం.. వ్యత్యాసం!
● జగిత్యాల మున్సిపాలిటీలో కార్మికుల జీతాల్లో తేడా ● కొందరు పారిశుధ్య వాహన డ్రైవర్లకు రూ.19,500 ● మరికొందరికి రూ.16,500 ఇస్తున్న అధికారులు ● ఇదెక్కడి అన్యాయం అంటున్న బాధిత కార్మికులు ● ఆందోళనకు దిగుతామని హెచ్చరికజగిత్యాల: జగిత్యాల.. గ్రేడ్–1 మున్సిపాలిటీ. దాదాపు 305 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 262 మంది కాంట్రాక్టు పద్ధతిన కొనసాగుతున్నారు. పారిశుధ్య కార్మికులకు రూ.16,500, ఇతర పనులు చేసేవారికి రూ.19,500 వేతనం అందిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య ఏర్పడింది. పారిశుధ్య వాహ న డ్రైవర్లకు సైతం 19,500 వేతనం ఇవ్వాలని 2020లో కౌన్సిల్లో తీర్మాణం చేశారు. అప్పటి నుంచి 56 మంది డ్రైవర్లకు రూ.19,500 జీతం ఇస్తున్నా రు. మరో 12 మందికి మాత్రం పారిశుధ్య కార్మికుల మాదిరిగానే రూ.16,500 జీతం అందిస్తున్నారు. ఇదేక్కడి అన్యాయం అని ఈ 12 మంది కౌన్సిల్ దృష్టికి సమస్యను తీసుకెళ్తారు. వీరికి సైతం రూ.19,500 ఇవ్వాలని 24.01.2025న తీర్మాణం చేస్తూ కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు సదరు తీర్మాణం అమలు కావడం లేదు. దీంతో మేం ఏం పాపం చేశామని, ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం జీవో ప్రకారం ఉత్తర్వు లేదని, కలెక్టర్ అనుమతి తీసుకుని జీతం పెంచడం జరుగుతుందని సమాధానం ఇస్తున్నారు. మొత్తం 68 మంది డ్రైవర్లు మున్సిపాలిటీలోని పారిశుధ్యవిభాగంలో కార్మికులతో పాటు, డ్రైవర్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. జగిత్యాల బల్దియాలో 48 ఆటోలు, 12 ట్రాక్టర్లు, 2 జేసీబీలు, ఒక డోజర్, ఒక టిప్పర్, రెండు బ్లేడ్ ట్రాక్ట ర్లు, ఒక వైకుంఠ రథం, డంపస్ ఫేసర్ ఉన్నాయి. మొత్తం 68 వాహనాలకు 68 మంది డ్రైవర్లు కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నారు. వీరు నిత్యం ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంపింగ్‌యార్డుకు తరలిస్తుంటారు. వీరు చేసే పని కష్టతరమైందని గుర్తించిన బల్దియా గత పాలకవర్గం 16,500 ఉన్న వేతనాన్ని రూ.19,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో కొందరికి సదరు వేతనం ఇప్పటికీ అందడం లేదు. 68మందిలో 12మంది డ్రైవర్లు ఐదేళ్లుగా 16,500 వేతనానికే పని చేస్తున్నా రు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తున్నారు. మిగితా 56 మంది మాదిరిగానే వేతనం ఇవ్వాలని మూడు నెలల క్రితం పాలకవర్గం తీర్మానం చేసినా.. ఎందరు పెంచడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు సైతం జీతభత్యాలు పెంచి ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు. జవాన్ల ఇబ్బందులు మున్సిపాలిటీలో జవాన్లది సైతం కీలకపాత్రే. వా ర్డుల వారీగా జవాన్లు పర్యవేక్షిస్తుంటారు. ప్రతీ వార్డులో తిరుగుతూ పారిశుధ్యం మెరుగుపర్చడంతో పాటు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. డ్రెయినేజీల్లో చెత్త పేరుకుపోయినా, ఎక్కడైనా ఏ సంఘటన చోటుచేసుకున్నా జవాన్లదే బాధ్యత ఉంటుంది. అయితే వీరికి గతంలో పెట్రోల్ అలవెన్స్ ని మిత్తం నెలకు రూ.3 వేలు ఇచ్చేవా రు. ప్రస్తుతం అవి కూడా రాకపోవడంతో జీతాల నుంచి వెచ్చించి వార్డులు తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పెట్రోల్ ఖర్చులు ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఆందోళనకు సిద్ధం కార్మికుల జీతాల్లో వ్యత్యాసాలతో పాటు, జవాన్లకు సంబంధించిన పెట్రోల్ ఖర్చులు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆందోళనకు దిగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకవేళ కార్మికులు ఆందోళనకు దిగితే పారిశుధ్య నిర్వహణ కష్టంగా మారుతుంది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని బల్దియా కార్మికులు కోరుతున్నారు.దృష్టికి వచ్చిందికొంత మంది డ్రైవర్లకు సంబంధించిన జీతభత్యాల గురించి మా నోటీసుకు వచ్చింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం. గతంలో ఎలా ఇచ్చారన్నది పరిశీలించి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. కార్మికులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. నేరుగా మా దృష్టికి తీసుకువస్తే ఏ సమస్యను అయినా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల -
‘కేవీ’ పిలుస్తోంది
● ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ● ఈనెల 11వ తేదీ వరకు చివరి గడువు ● 2 నుంచి 10వ తరగతి వరకు ఖాళీలు ఉంటేనే అడ్మిషన్లుకరీంనగర్: ఆధునాతన సాంకేతిక విద్యనందించే కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళయింది. ఈనెల 2నుంచి అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల సందడి మొద లైంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2025–26 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు జారీ చేసిన నోటిఫికేషన్ విద్యాలయాలకు చేరింది. ఆన్లైన్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరణ జరుగనుంది. దరఖాస్తుల గడువు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఈనెల 18 నుంచి తేదీ నుంచి అడ్మిషన్లు జరుగుతాయి. విద్యార్థులకు మెరిట్ జాబితా ప్రకారం ప్రవేశాలను కల్పిస్తారు. లిస్టులో ఉన్నవారు మాత్రమే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కేంద్రీయ విద్యాలయంలో సంప్రదించి ప్రవేశాలను పొందాలి. ఒకటో తరగతిలో ప్రవేశానికి 2025 మార్చి 31వ తేదీ నాటికి ఐదేళ్లు వయస్సు నిండి ఏడేళ్ల వయస్సు కలిగి ఉండాలి. రెండో తరగతికి అరేళ్లు, 3వ తరగతికి ఏడేళ్లు, 4వ తరగతికి ఎనిమిదేళ్లు, 5వ తరగతికి తొమ్మిదేళ్లు, ఆరో తరగతికి పదేళ్లు, ఏడో తరగతికి 11 ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13, పదో తరగతికి 14 ఏళ్లు నిండి ఉండాలి. ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో తరగతికి 40 చొప్పున సీట్లు ఉంటాయి. తాజాగా ఒకటో తరగతికి ప్రతి విద్యాలయంలో 40 చొప్పున ప్రవేశాలను నూతనంగా కల్పిస్తారు. ఆపై విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలనుకుంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉన్నతస్థాయి అధికారులు, కేంద్ర మానవ వనరులమంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ప్రాధాన్యం ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసే వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులు(ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్, తదితర) ఒకే సంతానం కలిగిన కుటుంబాల్లోని వారికి ప్రాధాన్యం ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, కేవీఎస్ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో 100 మార్కులకు పరీక్ష రాయాలి. హిందీ, ఆంగ్లం, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాల్లో ఈ పరీక్ష ఉంటుంది. 100 మార్కులకు ఇతరులు కనీసం 33, ఎస్సీ,ఎస్టీ దివ్యాంగులు 25 మార్కులు సాధించాలి. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా చేపడతారు. ఎస్సీలకు 15 శాతం(12 సీట్లు), ఎస్టీలకు 7.5 శాతం(6 సీట్లు), 3 శాతం సీట్లను దివ్యాంగులకు రిజర్వు అవుతాయి. మిగిలిన సీట్లు ఇతరులకు కేటాయిస్తారు. సీటు లభిస్తే దశ తిరిగినట్లే సీబీఎస్ఈ సిలబస్‌లో కేంద్రీయ విద్యాలయాల్లో బోధన ఉంటుంది. పిల్లలపై ఎటువంటి ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తారు. ఒకటో తరగతి నుంచే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం, శాస్త్ర సాంకేతికపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు ఉంటాయి. మిగిలిన పాఠశాలలకు భిన్నంగా దీని పనివేళలు, సెలవులు ఉంటాయి. ఆటపాటలు, స్వేచ్ఛతో కూడిన విద్య అందుతుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నవోదయ స్కూల్స్‌ల్లో 9వ తరగతిలో ప్రవేశానికి ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది.ఫీజు వివరాలు అడ్మిషన్ పొందే విద్యార్థులు రూ.25 ప్రవేశ రుసుం చెల్లించాలి. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థి వరకు నెలకు రూ.500 చెల్లించాలి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్యూటర్ బోధన కోసం అదనంగా నెలకు రూ.100 చెల్లించాలి. 9వ, 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.200 చెల్లించాలి. 11,12వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.400 చెల్లించాలి. -
రూ.10లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. యువకుడి ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లిదండ్రులు రూ.10లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో విషాదం నింపింది. ఎస్సై రమాకాంత్, గ్రామస్తులు తెలిపిన వివరాలు. నారాయణపూర్‌కు చెందిన షేక్ అవేజ్(18) గత నెల 30న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి మృతి చెందాడు. రంజాన్ పండుగకు ముందు రోజు సిరిసిల్లలోని ఓ టైలర్లో కుట్టించిన కొత్త బట్టలు తీసుకురావడానికి తన మిత్రుడు షేక్ అఫ్రోజ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అవేజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఏడు రోజులపాటు చికిత్స అందించారు. ఒక్కగానొక్క కొడుకును కాపాడుకోవడానికి తల్లిదండ్రులు అప్పు చేసి వైద్యం అందించారు. అయినా ప్రాణాలు దక్కకపోవడంతో తండ్రి సమద్, తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడ్డ మరో యువకుడు అఫ్రోజ్ చికిత్స పొందుతున్నాడు. మృతుని కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాటం గాయపడ్డ యువకుడి మృతి నారాయణపూర్‌లో విషాదం -
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి హన్మకొండ: వాతావరణ శాఖ ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి సూచించారు. సోమవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంనుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా మానిటర్ చేస్తూ ఏదైనా అంతరాయం జరిగితే వెంటనే పునరుద్ధరించాలని అదేశించారు. చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడితే, ట్రిపింగ్స్, బ్రేడౌన్లు సంభవిస్తే త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. పంటల కోతలు జరుగుతున్నందున పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ సర్వీస్‌ల మంజూరు వేగవంతం చేయాలన్నారు. అత్యవసర సమయంలో కావాల్సిన మెటీరియల్‌ను సమకూర్చుతామన్నారు. వ్యవసాయానికి అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి సర్కిల్లో ఎల్సీ యాప్‌పై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డైరెక్టర్ టి.సదర్లాల్, జీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనం దహనం
కోరుట్ల రూరల్: మండలంలోని యూసుఫ్‌నగర్ గ్రామంలో ఓ యువకుడు తన తాతకు చెందిన ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే మరిపెల్లి లింబయ్య ఆదివారం తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట నిలిపి, ఇంట్లో నిద్రించాడు. తన మనవడు మరిపెల్లి లింబాద్రి రాత్రి 10గంటల ప్రాంతంలో మధ్యం సేవించి వచ్చి, ద్విచక్ర వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నిద్రిస్తున్న లింబయ్య బయటకు వచ్చే సరికే బైక్ పూర్తిగా కాలిపోయింది. లింబయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం చోరీ జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌లో నిలిపిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన గంగిపెల్లి నాగరాజు ఈనెల 1న కొత్తబస్టాండ్‌లో బైక్ నిలిపి కళాశాలకు వెళ్లి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని దొంగలు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మన్మధరావు తెలిపారు. -
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
ధర్మపురి: ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ వ్యక్తి రాయపట్నం వద్ద గోదా వరిలో దూకి ఆ త్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఉదయ్‌కుమార్ వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన మహ్మద్ అలీ అహ్మద్(45) కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది, ఆదివారం ఇంటి నుంచి బయటికొచ్చాడు. ధర్మపురి మండలం రాయపట్నం చేరుకుని గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు హసామ్ అహ్మద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరేసుకుని ఒకరు.. జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన అనుసూ రి శ్యామ్‌సుందర్(46) సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. శ్యామ్సుందర్కు అతని సోదరునికి మధ్య కొద్దికాలంగా భూ వివాదం కొనసాగుతోంది. భూపత్రాలు ఇవ్వడం లేదనే మనస్తాపంతో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్రీలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. దుబాయ్‌లో అయిలాపూర్ వాసి మృతి కోరుట్ల రూరల్: మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన గాజర్ల శ్రీని వాస్(55) దుబాయ్ లో ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ గత 10ఏళ్లుగా జీవనోపాధి కోసం దుబా య్ వెళ్లి వస్తున్నాడు. రెండేళ్ల క్రితం సెలవుపై వచ్చి వెళ్లాడు. ఆదివారం ఉదయం తను ఉండే గదిలోనే గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీని వాస్కు భార్య జల, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురు లాస్యకు వివాహం కాగా చిన్న కూతురు రమ్య డిగ్రీ పూర్తి చేసింది, కుమారుడు రణధీర్ ఎంసీఏ చది వాడు. ఇంటి పెద్ద మృతి చెందటంతో శ్రీనివాస్ మృతదేహం కోసం ఎదురుచూస్తూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి.. మెట్పల్లి: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 5న స్థానిక పాత నటరాజ్ థియేటర్ సమీపంలో సుమారు 25ఏళ్ల యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమాచారమందుకున్న 108 సిబ్బంది అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించాడు. అప్పటి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో ఉంచగా, అతని సంబంధీకులు ఎవరు రాలేదు. దీంతో మృతదేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం సోమవారం మున్సిపల్ సిబ్బందికి అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. స్తంభంపల్లిలో ఒకరు..వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల రమేశ్(41)గత పదేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఈ నెల 4న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివా రం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య వనిత ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. రైలు నుంచి పడి వివాహిత.. జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి వివాహిత మృతిచెందింది. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. మహా రాష్ట్రలోని రాజురా పట్ట ణానికి చెందిన వివాహిత ప్రతిభ రమేశ్గజ్ (46) వైద్యం కోసం కూతురు, సోదరుడితో కలిసి బల్హార్షా నుంచి సికింద్రాబాద్‌కు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరింది. ఈ క్రమంలో జమ్మికుంట రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భర్త రమేశ్కోండ్గజ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. నిరుద్యోగ మహిళలు, యువతులకు ఈ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని నిరుద్యోగ యువతులు, మహిళలకు ఈ–ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో మధుసూదన్ సోమవారం తెలిపారు. 18 నుంచి 45ఏళ్ల వయస్సున్న వారికి 60 రోజులపాటు ఎల్‌ఎండీకాలనీలోని దుర్గాబాయి మహిళా, శిశువికాస ప్రాంగణంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 50మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన యువతులకు ఎలక్ట్రిక్ ఆటో నడపడంలో శిక్షణ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్సు జారీ చేస్తామన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
తల్లీకొడుకుల మృతితో రుద్రంగిలో ఉద్రిక్తం
రుద్రంగి(వేములవాడ): రుద్రంగికి చెందిన తల్లీకొడుకులు కాదాసు పుష్పలత, నిహాన్ మృతితో మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్తమామలే విషమిచ్చి చంపారంటూ మృతురాలి తల్లిగారి కుటుంబ సభ్యులు పుష్పలత అత్తమామల ఇంటిపై సోమవారం దాడి చేశారు. వారి మృతికి కారకులను శిక్షించాలని కోరుతూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాకు యత్నించారు. బాధితులకు న్యాయం చేస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై అశోక్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చేపట్టారు. పుష్పలత భర్త దుబాయ్ నుంచి మంగళవారం వస్తుండడంతో అంత్యక్రియలు సోమవారం జరుపలేదు. పుష్పలత మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచారు. అనుమానితుల ఇంటిపై మృతురాలి కుటుంబీకుల దాడి సముదాయించిన పోలీసులు -
పరుగెత్తితే పతకమే..
● క్రీడా పోటీల్లో ‘మోడల్’ విద్యార్థుల సత్తా ● రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్న చిన్నారులు వాలీబాల్‌లో సత్తా ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న సింధూ అండర్–19 వాలీబాల్ పోటీల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నిర్వహించిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో సత్తా చాటింది. – బి.సింధూ పట్టుదలతోనే ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శరణ్య రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. అండర్–19లో మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాలో ఈనెల 15 నుంచి 21 వరకు నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది. – బైకని శరణ్య ఆనందంగా ఉంది తొమ్మిదో తరగతి చదువుతున్న మనోజ్ఞ ఎస్జీఎఫ్ అండర్ –17లో ఇటీవల మెదక్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. జమ్ముకాశ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటడం ఆనందంగా ఉంది. – తుమ్మల మనోజ్ఞ ధర్మారం(ధర్మపురి): వాళ్లు పల్లెవాసులు.. క్రీడా నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చారు.. ఎక్క డా తర్ఫీదు కూడా తీసుకోలేదు.. కానీ, చదువుతోపాటు ఆటల్లోనూ రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటుతు న్నారు ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు. పీఈటీ కొమురయ్య, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ప్రోత్సాహంతో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ విద్యాలయం నుంచి ఏటా 40 నుంచి 50 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి, ఐదుగురు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. 2024–25 సంవత్సరంలో జాతీయస్థాయి పోటీలకు ఆరుగురు విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన క్రీడాకారులతో తలపడి ఆద్భుత రికార్డులో నమోదు చేస్తున్నారు. వివిధ పట్టణాలు, నగరాల్లో నిర్వహించే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు సొంత ఖర్చులతోనే వెళ్తూ పతకాలు సాధిస్తున్నారు. పట్టుదలతోనే సాధ్యం పీఈటీ ప్రోత్సాహంతో సాఫ్ట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకున్న. పట్టుదలతో ఆడుతూ రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు చేరుకున్న. మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాణించడం సంతోషంగా ఉంది. – బండి వైష్ణవి జాతీయ స్థాయిలో ప్రతిభ ఎనిమిదో తరగతి చదువుతున్న ఓరం సౌజ్ఞ అథ్లెటిక్స్ అండర్ –14లో జాతీయ స్తాయికి ఎదిగింది. ఆమె పరుగెత్తుతే పతకం ఖాయం. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదిగి గుజరాత్ హమ్మదాబాద్లో జరిగిన పోటీల్లో సత్తాచాటింది. – ఓరం సౌజ్ఞ -
సబ్బులు లేవు.. నూనె ఇవ్వరు
జగిత్యాల: మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికులదే కీలక పాత్ర. ఒక్కరోజు వారు చెత్త తీయకున్నా.. డ్రైనేజీలు శుభ్రం చేయకున్నా పట్టణమంతా దుర్గంధం వెదజల్లుతుంది. జగిత్యాల బల్దియాలో పాలకవర్గం ఉన్న సమయంలో కేవలం 10మంది కార్మికులకు మాత్రమే సబ్బులు, నూనెలు, బట్టలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మళ్లీ ఇప్పటివరకు ఏ ఒక్క కార్మికుడికి బట్టలుగానీ, సబ్బులుగానీ ఇవ్వలేదు. ఫలితంగా వారు చెత్తను ఉత్తచేతులతోనే తొలగిస్తున్నారు. స్నానం చేద్దామంటే సబ్బులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పని ముగించుకున్న అనంతరం నూనె రాసుకుందామన్నా ఇవ్వడం లేదు. పాలకవర్గం ముగిసి ప్రత్యేధికారుల పాలన వచ్చింది. కనీసం ఇప్పుడైనా కార్మికులకు అందాల్సిన సబ్బులు, నూనె, బట్టలు, ఆర్పన్స్ ఇస్తారనుకున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దుస్తుల పంపిణీలో అవకతవకలు ఏటా పారిశుధ్య కార్మికులకు దుస్తులు, సబ్బులు, నూనెలు, చెప్పులు, ఆర్పన్స్ ఇతరత్రా వస్తువులు అందిస్తుంటారు. మున్సిపాలిటీ వారు ఇస్తే బట్టలు వారే కుట్టించుకుంటారు. కుట్టుకూలీ కింద రూ.300 అందిస్తారు. గతంలో ఉన్న పాలకవర్గమో.. అధికారులో తెలియదు కానీ ఓ కాంట్రాక్టర్‌కు బట్టలు కుట్టే బాధ్యత అప్పగించారు. వారు ఒక జతకు కుట్టుకూలీ రూ.800 వేశారు. కార్మికులు అది ఇవ్వకపోవడం అతని వద్దనే ఉండిపోయాయి. అప్పటి నుంచి కార్మికులకు దుస్తులే లేకుండా పోయాయి. ఎప్పుడో ఇచ్చిన బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల మళ్లీ అతనితో బేరమాడి కొన్ని బట్టలు అతడి నుంచి తీసుకుని జిల్లా కేంద్రంలోని అంగడిగద్దె ప్రాంతంలోని ఓ గదిలో నిల్వ ఉంచారు. మరికొద్దిరోజులు అలాగే ఉంటే అవి ఎలుకలపాలో, చెడిపోయే ప్రమాదం ఉంది. కానరాని సబ్బులు, నూనె, చెప్పులు పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనెలు, ఆర్పన్స్ చెప్పులు అతి ముఖ్యమైనవి. వీటిని కార్మికులకు ఇచ్చేందుకు ఏటా టెండర్లు పిలుస్తుంటారు. టెండర్ దక్కించుకున్న వారికి బిల్లులు ఇవ్వకపోవడంతో వారు అందించండం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. కార్మికులు ఉత్త చేతులతోనే పూడిక తీయడంతో పాటు, పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. చెత్తాచెదారం తరలిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా తయారుచేస్తున్న కార్మికులపై కనీసం పట్టించుకోకపోవడంతో విమర్శలకు దారితీస్తోంది. గాడితప్పుతున్న శానిటేషన్ జగిత్యాల బల్దియాలో శానిటేషన్ పూర్తిగా గాడితప్పుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు కావాల్సిన వస్తువులను సరఫరా చేయకపోవడంతో పాటు, వారికి సంబంధించిన వాహనాల మరమ్మతు కోసం అధిక బిల్లులు కేటాయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఆరు వాహనాలు ఇప్పటికే కరీంనగర్‌లోనే మరమ్మతు పేరిట ఉన్నాయి. ఇలా శానిటేషన్ విభాగంలో ఏది చూసుకున్నా అవినీతి ఆరోపణలే అత్యధికంగా కన్పిస్తున్నాయి. గతంలో బ్లీచింగ్ పౌడర్ వాసన లేనిది ఇవ్వడంతో కౌన్సిలర్లు ఈ విషయం లేవనెత్తడంతో వెంటనే వాపస్ పంపించారు. ప్రస్తుతం మళ్లీ ఆప్కో వారికి పారిశుధ్య కార్మికుల దుస్తులు ఇచ్చారని, సబ్బులు, నూనెలు, ఆర్పన్స్, చెప్పులు, పరికరాలకు సంబంధించిన టెండర్లు జరిగాయని, త్వరలోనే వారికి అందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పారిశుధ్య కార్మికుల ఇక్కట్లు ఉత్త చేతులతోనే చెత్త తొలగింపు అనారోగ్యంబారిన బల్దియా కార్మికులుత్వరలో కార్మికులకు అందజేస్తాం కార్మికులకు త్వరలో దుస్తులు అందజేస్తాం. జోనల్ వైజ్‌గా సెట్ చేశాం. త్వరలోనే వారికి బట్టలు, నూనెలు, సబ్బులు ఇలా అన్నీ అందించేలా చర్యలు తీసుకుంటాం. గతంలో కొన్ని సమస్యల వల్ల ఇబ్బందికరంగా ఉంది. వాటన్నింటిని రెడీ చేసి పెట్టాం. త్వరలోనే అందజేస్తాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల -
కమనీయం.. రమణీయం
● కన్నుల పండువగా శ్రీసీతారాముల కల్యాణం ● జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు ● భారీగా తరలివచ్చిన భక్తులు ● స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పణజగిత్యాలటౌన్/రాయికల్/ధర్మపురి:శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాల్లో శ్రీసీతారాముల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. జిల్లాలోని ధరూర్ క్యాంపులోగల శ్రీకోదండరామాలయం, విద్యానగర్ సీతారామచంద్ర ఆలయం, అంగడి బజారులోని మార్కండేయ ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోదండరామాలయంలో స్వామివారికి జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు అడువాల జ్యోతి, భోగ శ్రావణి పాల్గొన్నారు. ధర్మపురి నృసింహస్వామి ఆలయంలోని శేషప్ప కళావేదికపై స్వామివార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మహోత్సవానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరయ్యారు. రాయికల్ పట్టణంతో అయోధ్య, కుమ్మరిపల్లి, అల్లీపూర్, బోర్నపెల్లి, రామాజీపేట, తాట్లవాయి గ్రామాల్లో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. అయోధ్యలో వేద పండితులు అంగడి భువనేశ్వర్ ఆధ్వర్యంలో ఉప్పుమడుగు నుంచి సీతమ్మను, అయోధ్య నుంచి రామున్ని శోభాయాత్రగా తీసుకొచ్చి కల్యాణం జరిపించారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ గంగాధర్, ఈవో విక్రం, ట్రాన్స్‌కో ఏఈ తుమ్మల నవీన్, ఆర్ఐ పద్మయ్య పాల్గొన్నారు. -
మద్దుట్ల ఎత్తిపోతలు ఎప్పుడో..?
● రూ.45కోట్ల హామీకి ఏడాదిన్నర ● ఆరేళ్లుగా తప్పని ఎదురుచూపులు ● చెరువులు నింపాలంటున్న రైతులు ● ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న ఉద్యమంమల్యాల(చొప్పదండి): భారీ వర్షాలు కురిసినా.. వ రద వచ్చే ప్రాంతాలు లేక మల్యాల మండలంలో చె రువులు ఎండిపోతున్నాయి. అలాంటి వాటిని ఎత్తి పోతల ద్వారా నింపాలంటూ ఆరేళ్లుగా ఇక్కడి రైతులు ఉద్యమిస్తున్నారు. యువకులు అన్నదాతల కో సం ముందువరుసలో నిలబడుతున్నారు. రైతులను చైతన్యపరుస్తూ.. ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తున్నారు. తమ గ్రామంలోని చెరువులు నింపాలని కో రుతూ అప్పటి సీఎం కేసీఆర్‌కు పోస్టుకార్డులు రాశా రు. 15రోజులపాటు నిత్యం ఆన్లైన్లో ప్రజావా ణికి ఫిర్యాదు చేశారు. నేరుగా సీఎం కార్యాలయానికి ఫోన్లు చేసి తమ సమస్య పరిష్కరించాలని కో రారు. వీలైనంత త్వరగా పరిశీలించి సమస్య పరి ష్కరిస్తామని సీఎంఓ నుంచి రైతులకు సమాధానం వచ్చింది. ఇందులో భాగంగా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. మండలంలోని మద్దుట్ల గ్రామ రైతులకు సాగునీటికి ఆధారమైన కొత్త చెరువు నింపేందుకు రూ.45కోట్లు కేటాయిస్తామని 2022లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో హామీ ఇచ్చారు. ఈ నిధులతో మద్దుట్లలోని కొత్త చెరువు, గుడికుంట చెరువులను నింపాలని భావించారు. ఈ చెరువులు నిండితే పరిసరాల్లో భూగర్భజలాలు పెరిగి సుమారు 1500 ఎకరాలకు సాగునీరందించాలని భావించారు. మద్దుట్ల శివారులోని వరదకాలువ నుంచి కొత్త చెరువు నింపేందుకు రైతులే స్వయంగా ఖర్చు పెట్టుకుని సర్వే చేయించారు. చెరువులు నింపాలని రైతుల పోరాటం గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అటకెక్కింది. అప్పటి నుంచి చెరువులను ఎత్తిపోతల ద్వారా నింపాలని మద్దుట్ల రైతులు, ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఎత్తిపోతలతో వందలాది ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంది. కొత్త చెరువును నింపితే గ్రావిటీ ద్వారా గుడికుంట చెరువు నిండుతుంది. ఈ చెరువు వద్ద మరో మోటారు ఏర్పాటు చేస్తే గొర్రెగుండం గ్రామంలోని నల్ల మట్టికుంట (తాళ్లయ్యకుంట) గొలుసుకట్టు విధానంలో నూకపల్లిలోని అలుగుకుంట, రేగులకుంట, ఒబులాపూర్‌లోని కోమటికుంట, కుమ్మరికుంట, లక్ష్మణరావుకుంట, రాంపూర్ గ్రామంలోని పాతచెరువు, కొత్త చెరువులను నింపవచ్చు.ఎత్తిపోతలు ప్రారంభించాలి మద్దుట్ల శివారులోని వరదకాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా కొత్త చెరువు, గుడికుంట చెరువు నింపుతామని మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రకటించారు. కానీ.. నిధులు విడుదల కాలేదు. పథకం ప్రారంభానికి నోచుకోలేదు. ఎత్తిపోతల పథకం ప్రారంభించి, చెరువులు నింపాలి. – మ్యాకల మల్లేశం, రైతు, మద్దుట్ల ఆరేళ్లుగా వేడుకుంటున్నాం మద్దుట్లలోని సుమారు 1500 ఎకరాలకు ఆధారమైన కొత్త చెరువు, గుడికుంట చెరువులను నింపాలని ఆరేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. చెరువులు నింపితే భూగర్భజలాలు పెరిగి మా గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లోని రైతులకు కూడా సాగునీరు అందుతుంది. – కట్ట శ్రీనివాస్, రైతు, మద్దుట్ల -
‘అంగన్వాడీ’ చిన్నారులకు కంటి పరీక్షలు
● 0–6 ఏళ్లలోపు పిల్లలను పరీక్షించనున్న వైద్యులు ● జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభంకథలాపూర్(వేములవాడ): ఇన్నాళ్లూ పాఠశాల విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) వైద్యులు కంటి పరీక్షలు చేసి సమస్యలున్న వారికి కళ్లద్దాలు ఉచితంగా అందించారు. ఇదే తరహాలో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు కూడా మానసిక, కంటి పరీక్షలు నిర్వహించాలని ఆర్బీఎస్కే వైద్య బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో సోమవారం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఆర్బీఎస్కే వైద్యుల బృందానికి అంగన్వాడీ కేంద్రాలు, చిన్నారుల వివరాలతో కూడిన జాబితా అందించారు. జిల్లాలో 1,071 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 22మండలాలున్నాయి. వీటి పరిధిలో 1,071 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 64,297 మంది చిన్నారులున్నారు. వారందరికీ కంటి పరీక్షలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 10 ఆర్బీఎస్కే బృందాలకు బాధ్యతలు అప్పగించారు. పోషకాహారలోపం, జన్యుపరమైన కారణాలు, పిల్లలకు ఆహారం తినిపించాలని తల్లిదండ్రులు సెల్ఫోన్లు ఇస్తుండటంతో ఆరేళ్లలోపు చిన్నారులకు దృష్టిలోపం, ఇతర కంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ప్రత్యేకంగా కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సుమారు 3 నెలలపాటు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సమస్యలున్న చిన్నారులను గుర్తించి వారి వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తారు. దృష్టిలోపం ఉన్నట్లయితే వారికి ఉచితంగా కళ్లద్దాలు అందిస్తారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రులకు సిఫార్సు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి ఆరేళ్లలోపు చిన్నారులకు ఈనెల 7 నుంచి ఉచితంగా కంటి పరీక్షలు చేస్తాం. తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు పరీక్షలు చేయించాలి. సమస్యలను ఇప్పుడే గుర్తిస్తే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు. కంటి చూపు మందగిస్తే బోర్డుపై అక్షరాలు కనిపించక చదువులో వెనుకబడతారు. – సురేంద్ర కుమార్, ఆర్బీఎస్కే వైద్యాధికారి -
మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్
జగిత్యాల/ధర్మపురి: సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి బాబు జగ్జీవన్‌రామ్ అని, అతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంచినీళ్ల బావి చౌరస్తా వద్ద, ధర్మపురి పట్టణంలోని అంబేధ్కర్ కూడలి వద్ద శనివారం జగ్జీవన్‌రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా గ్రీన్ రెవల్యూషన్ సమర్థవంతంగా అమలు చేసి దేశాన్ని ఆహార ధాన్యాలపరంగా స్వయం సమృద్ధిగా మార్చిన మహనీయుడు అని కొని యాడారు. అడిషనల్ కలెక్టర్ లత మాట్లాడు తూ.. జగ్జీవన్‌రామ్ జీవితంలో అంటరానిత నం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని వరకు అనే క అంశాలు చూశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన హనీయుడు జగ్జీవన్‌రామ్ అని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా భవన్లో జయంతిని నిర్వహించారు. ఆదర్శనేత: ఎస్పీ అశోక్‌కుమార్ జగిత్యాలక్రైం: జగ్జీవన్‌రామ్ దేశానికి ఆదర్శనేత అని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బాబుజగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ కమిషనర్ విజయలక్ష్మీ, ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘ నాయకులు పేట భాస్కర్, బొల్లి శేఖర్, సతీశ్, బండ శంకర్ పాల్గొన్నారు. ఏఐటీయూసీ బలోపేతానికి కృషి చేయాలిరాయికల్: ఏఐటీయూసీ బలోపేతానికి కృషి చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి తెలిపారు. శనివారం పట్టణంలోని అంగన్వాడీ కార్యకర్తలను యూనియన్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ ముందుంటుందని తెలిపారు. సంఘం పటిష్టత కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణకుమారి, దయావతి, మండల నాయకులు వనిత, లావణ్య, శాంత, మమత, జమున, స్రవంతి, ఉమారాణి, రాధిక, సుమలత పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలిమల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రాము అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ముందస్తు బడిబాట కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో రేగుంట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట కరపత్రాన్ని రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థుల సంఖ్యను పెంచి వారి విద్యాభివృద్ధితోపాటు పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మల్లాపూర్ ఎంఈవో దామెదర్‌రెడ్డి, మాజీ ఎంఈవో గంగాధర్, గెజిటెడ్ ప్రధానోపాద్యాయులు బోగ రమేష్, రేగుంట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయులు డి.శంకర్‌బాబు, ఉపాద్యాయ సంఘాల నాయకులు ఆనందరావు, రాంచందర్, అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్యూరిఫైడ్ దందా..
జగిత్యాల: అసలే వేసవికాలం.. ఆపై తాగునీటి కొరత. దీనిని ఆసరా చేసుకుంటున్న కొందరు వాటర్ప్లాంట్లు ఏర్పాటు అడ్డగోలుగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ.. ఎలాపడితే అలా నీటిని అమ్ముతున్నారు. నాణ్యత ప్రమాణాలు ఉన్నాయో లేవో తెలియదు.. అయినప్పటికీ ప్రజలు వాటినే కొనుగోలు చేసుకుని తాగుతున్నారు. పట్టణాల్లో గల్లీకో వాటర్‌ప్లాంట్ నెలకొల్పుతున్నారు. గ్రామాల్లోనూ విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. ప్యూరిఫైడ్ పేరిట దందా కొనసాగిస్తూ ప్రజల నుంచి అందినంతా దోచుకుంటున్నారు. జిల్లాలో సుమారు రెండు వేలకుపైగానే వాటర్ ప్లాంట్లు ఉన్నట్లు అంచనా. ఒక్క జిల్లా కేంద్రంలోనే 300 నుంచి 350 వరకు ఉన్నాయి. ఇన్ని ఉన్నా.. ఒక్క వాటర్ ప్లాంట్‌కు కూడా అనుమతి లేకపోవడం శోచనీయం. నిబంధనల ప్రకారం అనుమతితోనే వాటర్ప్లాంట్లు నెలకొల్పాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ఒక్కో వాటర్ క్యాన్‌కు రూ.20 ఉండగా.. కూల్వాటర్ను రూ.40 విక్రయిస్తున్నారు. వివాహాది శుభకార్యాలు, ఇతరత్రా కార్యక్రమాలకు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించిన వ్యాపారులు నాణ్యత లేని నీటిని అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. లవణాలు మాయం ప్రస్తుతం శుద్ధి చేస్తున్న నీటిలో లవణాలు ఉండటం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. అందులో ఉపయోగపడే ఖనిజాల శాతం, వాటి ప్రభావంపై ఇటీవల చేసిన అధ్యయంతో మంచివి కావని తేలింది. భూగర్బంలో ఫ్లోరైడ్ శాతం అత్యధికంగా ఉంటే కోంత ఉపయోగం ఉంటుంది. సాధారణ నీటిని సూక్ష్మంగా వడపోయడంతో వ్యర్థాలు, విషతుల్యాలతోపాటు శరీరానికి అవసరమైన ఖనిజాలు మాయమవుతున్నాయి. కీళ్లనొప్పులు, ఎములు బలహీన పడతాయి. నాణ్యత కరువే.. వాటర్ప్లాంట్లలో నీటి నాణ్యత సక్రమంగా ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం వారానికోసారి వాటర్ క్యాన్లు మార్చాల్సి ఉండగా నెలల తరబడి అవే క్యాన్లు వినియోగిస్తున్నారు. క్యాన్లు కడగకుండానే నీటిని నింపుతున్నారనే ఆరోపణలున్నాయి. క్యాన్లు నాచు పట్టి దుమ్ముతో నిండిపోయి ఉంటున్నాయి. నీటిని నింపుతూ సీల్ వేస్తూ ప్రజలకు అందజేస్తున్నారు. లోపల మినరల్ వాటర్ అన్నట్లు చూపుతున్నారు. అధికారులు మాత్రం వాటర్ ప్లాంట్లపై పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేవు.. జిల్లాలో వాటర్ప్లాంట్లు నెలకొల్పాలంటే నిబంధనల ప్రకారం ఫుడ్‌సేఫ్టీ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వాటర్ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ప్యూరిఫైడ్ పేరిట నెలకొల్పుతున్నారు. నిబంధనల ప్రకారం ఫుడ్‌సేప్టీ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో నామమాత్రంగా సర్పంచులు, తహసీల్దార్లు, మున్సిపాలిటీల ద్వారా అనుమతి తీసుకుంటూ నామమాత్రంగా నడిపిస్తున్నారు. పర్యవేక్షణ కరువే.. జిల్లాలో ఇష్టానుసారంగా వాటర్ప్లాంట్లు నెలకొల్పుతున్నా అధికారుల పర్యవేక్షణ మాత్రం కరువైంది. ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించిన వ్యాపారులు ప్యూరిఫైడ్ పేరిట ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఐఎస్ఐ మార్క్‌తో ఉన్న నీటినే విక్రయించాల్సి ఉంటుంది. అధికారులు మాత్రం తనిఖీలు చేసిన దాఖలాలే లేవు. నిబంధనలివే.. మినరల్ వాటర్ ప్లాంట్ ఇండియన్ స్టాండర్స్ ఇనిస్టిట్యూషన్ (ఐఎస్ఐ), బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఎస్ఐ) ప్రమాణాలు ఉండాలి. నిత్యం నీటిని ప్యూరిఫైడ్ చేసేందుకు మైక్రోఫిల్టర్స్ కార్బన్ ఇసుక ఫిల్టర్‌ను వాడాలి. ప్రతి ఏటా ఐఎస్ఐ మార్క్‌ను వేయాలి. మూడునెలలకోసారి క్యాన్లు మార్చాలి పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వాటర్ప్లాంట్లు నాణ్యత లేని అమ్మకాలు చోద్యంచూస్తున్న అధికారులు -
విద్యుత్ ప్రమాదాల నివారణకు ‘లైన్‌క్లియర్’
సారంగాపూర్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు ప్రమాదాల నివారణకు కొత్త యాప్‌కు రూపకల్పన చేసినట్లు ఎన్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ సాలియా నాయక్ తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ లైన్లో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఎల్సీ (లైన్ క్లియర్) తీసుకోవడంలో కొన్నిసార్లు మానవ తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ లైన్ ఫీడర్‌కు ఇచ్చే ఎల్సీకి బదులు మరో లైన్ ఫీడర్‌కు ఇచ్చినప్పుడు సమాచార లోపంతో ప్రమాదాలు జరుగున్నాయి. విద్యుత్ సిబ్బంది గాయపడడం, కొన్నిసార్లు మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి వాటిని నివారించడానికి లైన్‌క్లియర్ యాప్‌ను రూపొందించినట్లు ఎస్ఈ తెలిపారు. ఈ యాప్ లైన్మెన్ ఓపెన్ చేసి ఏఈకి ఏ లైన్ ఫీడర్‌కు ఎల్సి కావాలో మెసేజ్ చేస్తారు. ఏఈ ఎల్సీ లైన్ పరిస్థితిని సమీక్షించి ఎల్సీ ఇవ్వవచ్చా..? లేదా..? అని సబ్‌స్టేషన్‌లోని ఆపరేటర్‌తో కాంటాక్ట్‌కు వెళ్తుంది. లైన్ పరిస్థితి, ఏ ఫీడర్ తదితర అంశాలను హెచ్చరిస్తూ ఆపరేటర్ ఏఈకి సమాచారం ఇస్తే అక్కడి నుంచి లైన్‌మన్‌కు సమాచారం వస్తుంది. ఇది పూర్తి ఆధునిక సాంకేతికతో రూపొందించామని తెలిపారు. ఆయన వెంట ఏడీఈ సింధూశర్మ, సారంగాపూర్, బీర్పూర్ ఏఈలు ప్రవీణ్, శ్రీనివాస్ ఉన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
● జిల్లాలో 43 బ్లాక్స్పాట్లు.. ● గుర్తించిన పోలీసు అధికారులు ● ‘సురక్ష ప్రయాణం’ పేరిట అవగాహనజగిత్యాలక్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ నేషనల్ హైవే అథారిటీ, రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లను గుర్తిస్తోంది. అక్కడ ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అలాగే ఎస్పీ అశోక్‌కుమార్ చేపట్టిన ‘సురక్షిత ప్రయాణం’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 43 బ్లాక్స్పాట్లు జిల్లాలో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల స్థలాలను వివిధ శాఖల ఆధ్వర్యంలో పోలీసు శాఖ ప్రత్యేకంగా పరిశీలన చేసి అక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇలా 43 బ్లాక్స్పాట్లను గుర్తించారు. పోలీసు శాఖ కళాబృందాల ద్వారా జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్ చేసేలా పెట్రోల్‌బంక్‌లో.. దాబాల్లో పనిచేసే వారికి, యూత్ విలేజ్‌కు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు. ద్విచక్ర వాహనం నడిపేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. ప్రమాదసూచిక బోర్డులు ఏర్పాటు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అతిగా వేగంతో నడిపే వాహనదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నారు. వాహనదారులకు జరిమానా విధించడంతోపాటు, డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేయాలని భావిస్తున్నారు. రోడ్డుపై లారీలు, ఇతర వాహనాలు నిలపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రివేళల్లో వాహనాలు కనిపించేలా స్ట్రీట్‌లైట్స్ మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదాలు నివారిస్తాం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివా రణకు పోలీసు శాఖ, నేషనల్ హైవే, ఆర్అండ్బీ అధికారులు 43 ప్రమాద స్థలాలను గుర్తించాం. అక్కడ ప్రమాదాలను నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. – అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
యంగ్ ఇండియా ‘గ్రీన్’ గురుకులాలు
● మంథని, హుస్నాబాద్‌లో నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ● సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేలా చర్యలు ● తొలుత ఒక్కో స్కూల్‌కు రూ.145 కోట్లు వెచ్చించనున్న సర్కారు ● త్వరలో పెద్దపల్లి, రామగుండంలోనూ అందుబాటులోకి ● మంథని మండలం సోమనపల్లిలో 25 ఎకరాలు కేటాయింపు ● డిజిటల్ బోధన, క్రీడా, ఇతర ఆధునిక సదుపాయాలు ● వచ్చే ఏడాది దసరాకు విద్యార్థులకు అందుబాటులోకిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (సమీకృత గురుకులాలు) నిర్మాణానికి అడుగులు వేస్తోంది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.1,100 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. అందులో తొలిదశలో ఒక్కో పాఠశాలకు రూ.145 కోట్లు చొప్పున వెచ్చించి అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం శనివారం తొలిఅడుగు వేసింది. తొలిదశలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గరుకులాలను నిర్మించేందుకు టెండర్లు పిలిచింది. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి నిర్మాణం వేగవంతం చేయనున్నారు. ఈ విద్యాలయాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేలా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను సైతం ఏర్పాటు చేయబోతుండటం విశేషం. సోలార్పలకల ద్వారా విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు చేపడతారు. వచ్చే ఏడాది దసరాకు ప్రారంభం ఈ రెండు స్కూళ్లను రూ.145 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు పూర్తి కాగానే మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలవనుంది. ఇప్పటికే మంథని నియోజకవర్గంలోని సోమనపల్లి వద్ద ప్రభుత్వం 25 ఎకరాల చొప్పున కేటాయించగా.. మంత్రి శ్రీధర్‌బాబు ఈ సమీకృత గురుకులాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. త్వరలో నిర్మాణాలు ప్రారంభించి.. వచ్చే ఏడాది దసరాకు భవనాల నిర్మాణం పూర్తి చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి శ్రీధర్‌బాబు సంకల్పంతో ఉన్నారు. ప్రతీ స్కూల్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లకుపైగా నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించనుండటం గమనార్హం. ప్రత్యేకతలు ఇవే! యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలను 25 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మిస్తారు. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ క్రీడల కోసం మైదానం, సౌకర్యాలు ప్రతీ స్కూల్లో 2500 పైగా విద్యార్థులు, వీరికి 120 మంది టీచర్లతో బోధన సొంత సోలార్ విద్యుత్తుతో లిప్టులు, వీధిదీపాలు, క్లాస్రూమ్ ఉపకరాణల నిర్వహణ -
నైపుణ్యాలు పెంచేందుకే
నేటి పోటీ యుగానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచాలన్న ఉద్దేశంతో సమీకృత గురుకులాలు ప్రారంభిస్తున్నాం. మార్కెట్లో నిలదొక్కుకునేలా నిపుణులైన మానవ వనరులను విద్యార్థి దశ నుంచే తీర్చిదిద్దుతాం. అందుకే, అత్యాధునిక సదుపాయాలతో 4 తరగతి నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. త్వరలో రామగుండం, పెద్దపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు కూడా మొదలవుతాయి. – మంత్రి శ్రీధర్‌బాబు -
రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి
● కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మల్లాపూర్: రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సేంద్రియ రైతు సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్రామీణ అవార్డులు ప్రదానం చేశారు. మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన మెండె శ్రీనివాస్ రూపొందించిన నీరటి రోబో ప్రదర్శనకు కేంద్రమంత్రి చేతులమీదుగా గ్రామీణ అవార్డు అందుకున్నారు. రసాయనాలు వాడితే మట్టిలోని సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుందని, ఇది భవిష్యత్ తరాలకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలుశంకరపట్నం: మండలంలోని తాడికల్ శివారులో శనివారం రెండు మోటర్‌సైకిళ్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌చారి కరీంనగర్ నుంచి స్వగ్రామం మోటర్‌సైకిల్‌పై వస్తుండగా డీబీఎల్ కంపెనీలో పని చేస్తున్న ఒడిశాకు చెందిన కృష్ణ మోటర్‌సైకిల్‌తో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. పంచాయతీ కార్యదర్శికి గాయాలు శంకరపట్నం: గుర్తు తెలియని వాహనం ఢీకొని మండలంలోని కన్నాపూర్ పంచాయతీ కార్యదర్శి రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. కన్నాపూర్ గ్రామపంచాయతీలో శనివారం విధులకు హాజరై తిరిగి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా ఆముదాలపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108వాహనంలో హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గంజాయి విక్రేత అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్, టీఆర్‌నగర్ శివారులో గంజాయి విక్రయిస్తున్న షేక్ నజీర్‌ను పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. టీఆర్‌నగర్‌కు చెందిన షేక్ నజీర్ ధరూర్, టీఆర్‌నగర్ శివారులో గంజాయి విక్రయిస్తుండగా పోలీ సులు తనిఖీ చేయగా 131 గ్రాముల గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
రాజన్నా నీవే దిక్కు
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో భద్రత కరువైంది. దేశవ్యాప్తంగా ఏ ఆలయంలోకి వెళ్లినా సెల్ఫోన్ల వినియోగం నిషేధమనే బోర్డు కనిపించడమే కాకుండా భద్రత సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారు. అయితే రాజన్న ఆలయంలోనే ఇలాంటి తనిఖీలు కనిపించవు. సెల్ఫోన్లు వినియోగంచరాదనే బోర్డులు మాత్రమే కనిపిస్తాయి. ఈ బోర్డుల సాక్షిగానే భక్తులు తమ సెల్ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ సోషల్‌మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇదంతా అధికారుల కళ్లముందే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఆలయంలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది సైతం సెల్ఫోన్లు వినియోగిస్తూ కనిపించడం గమనార్హం. ● వేములవాడ ఆలయంలో భద్రత అంతంతే.. ● ఆలయంలో సెల్ఫోన్ల వినియోగం ● అడ్డుకోని ఆలయ అధికారులు ● పనిచేయని సీసీ కెమెరాలు ● అటకెక్కిన డోర్ మెటల్ డిటెక్టర్లుబోర్డులపైనే నిబంధనలు భక్తుల రద్దీ మధ్య నిషేధ బోర్డులు గోడలకే పరిమితమవుతున్నాయి. ఆలయంలోకి వచ్చే ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడంతో ఆలయంలోకి సెల్ఫోన్లు యథేచ్ఛగా వస్తున్నాయి. రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో ‘ఫోటోలు తీయరాదు’, ‘వీడియోలు నిషేధం’ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అధికారుల తనిఖీలు లేకపోవడంతో భక్తులు యథేచ్ఛగా ఆలయ ప్రాంగణంలోనే సెల్ఫీలు దిగుతూ కనిపిస్తుంటారు. ఈ దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యం. ఏడు దారుల్లో భద్రత ఏదీ ? రాజన్నను దర్శించుకునేందుకు ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు దారులు ఉన్నాయి. తూర్పు దిశలో మూడు ద్వారాలు, దక్షిణభాగంలో రెండు, ఉత్తర–దక్షణి భాగాల్లో ఒక్కో దారి ఉంది. ఈ ఏడు దారుల్లోనూ ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవడం లేదు. పేరుకు కొంత మంది ఎస్పీఎఫ్ సిబ్బంది, హోంగార్డులు విధులు నిర్వహిస్తూ సెల్ఫోన్లలో తలమునకలవుతున్నారు. కనిపించని మెటల్ డిటెక్టర్లు రాజన్న ఆలయ భద్రత కోసం ఏర్పాటు చేసిన డోర్ మెటల్ డిటెక్టర్లు కనిపించకుండా పోయాయి. కోడెలతో డోర్ మెటల్ డిటెక్టర్లు పాడవుతున్నాయనే సాకుతో వీటిని మూలనపడేశారు. కేవలం హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు నామమాత్రంగా పట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా లేనట్టే.. రాజన్న ఆలయంలో 12కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఏం ఫలితం లేకుండా పోతోంది. సీసీ కెమెరాల పనితీరును ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సీసీ కెమెరాలున్నాయన్న ధ్యాస కూడా లేకుండా పోతోంది. ఇటీవల ఓ భక్తుడు తన డబ్బులు పోగొట్టుకుని సీసీ కెమెరాల్లో పరిశీలిస్తే ఏమాత్రం కనిపించలేదు. భద్రత చర్యలు తీసుకుంటాం రాజన్న ఆలయ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ఎస్పీ, లోకల్ పోలీసులతో చర్చలు జరిపి ఆలయ భద్రత మరింత పెంచేందుకు కృషి చేస్తాం. గతంలో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లను పునరుద్ధరిస్తాం. ఆలయ భద్రతపై రాజీపడేది లేదు. భక్తుల రక్షణే మా కర్తవ్యం. ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బందిని సైతం అప్రమత్తం చేస్తాం. సెల్ఫోన్ల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తాం. – కొప్పుల వినోద్‌రెడ్డి, రాజన్న ఆలయ ఈవో -
ఎస్సారెస్పీ భూముల ఆక్రమణ
పెగడపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో విలువైన మంచరాయి, పరంపోగు భూములతోపాటు ఎస్సారెస్పీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో 6,748.01 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అలాగే 1200 ఎకరాల అటవిభూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములను ఆనుకుని ఉన్న పంటపొలాల రైతులు వాటిని ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు. కొందరు ఏకంగా మామిడి తోటలు పెంచుతున్నారు. అయినా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని నంచర్ల శివారులో గొరిగల బోరు సర్వే నంబర్లో 352 ఎకరాలు, దులాల బోరు సర్వే నంబర్ 379లో 272, వెంకటేశ్వర బోరు సర్వే నంబర్ 440లో 68 ఎకరాలు, దోమలకుంటలో టేకుల బోరులో 150 ఎకరాలు, చింతలలొద్దిలో 70 ఎకరాలు, పెగడపల్లి ఆడ్డగుట్ట, ఎల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో కొంతభాగాన్ని వాటిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల రైతులు ఆక్రమించుకున్నారు. కొందరు మామిడి తోటలు పెంచుతుండగా.. మరికొందరు ఇతర పంటలను సాగు చేసుకుంటున్నారు. భూముల ఆక్రమణలను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సారెస్పీ భూముల పరిస్థితి కూడా ఇదే విధంగా తయారైంది. కొందరు రైతులు కాల్వ గట్టు అంచు వరకు సాగు చేస్తుండంతో వాటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. మండలంలోని 26 గ్రామాలకు 24 గ్రామాలు ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతం పరిధిలో ఉన్నాయి. వందలాది కిలోమీటర్ల పొడవు ఉన్న కాలువల పక్కన ప్రాజెక్టు భూమి ఉంది. కాలువల నిర్మాణ సమయంలో ఇరువైపులా వాహనాలు వెళ్లేందుకు వీలుగా భూమిని వదిలారు. ఎస్సారెస్పీ మేజర్, మైనర్ కాలువలు కొందరు రైతులు ఆక్రమణకు చేసి కాల్వ గట్ల అంచువరకూ సాగు చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం కాలువ లైనింగ్ పనులు చేసిన సమయంలో ఎస్సారెస్పీ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అధికారులు ప్రతి 50 మీటర్ల చొప్పున కాలువకు ఇరువైపులా హద్దురాళ్లను కూడా నాటారు. ఇక్కడ భూములకు లక్షల విలువ ఉండటంతో పాటు ఆ ప్రాంతంలో విరివిగా పంటలు పండుతుండటంతో కొందరు రైతులు హద్దురాళ్లను తొలగించి సాగు చేసుకుంటున్నారు. డి–65 నుంచి డీ–83ఏ వరకు 10 వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. వీటి కింద 65, 67, 68, 69, 70, 71, 74, 75, 79, 81 డిస్ట్రీబ్యూటరీ కాల్వలున్నాయి. వీటి కింద 1ఎల్, 2ఆర్, 3ఎల్, 4ఎల్, 5ఎల్, 6ఎల్, డి–83 ఏ కింద 1ఎల్, 2ఎల్, 3ఎల్, 4ఆర్ మైనర్ కాల్వలున్నాయి. మేజర్ కాలువతోపాటు మరికొందరు రైతులు మైనర్ కాల్వ గట్లను కూడా వదలకుండా ఆక్రమించి పంటలు పండిస్తున్నారు. కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అధికారులు వారిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో భూ భూఆక్రమణలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీంతో కాల్వల ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నా సంబంధిత అధికారులు చోద్యంచూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వల పరిస్థితి ఇలా ఉంటే ప్రాజెక్టు ఆధీనంలో ఉన్నా మొరం గడ్డలు తరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం మొరం అవసరమున్న వ్యక్తులు ముందుగానే ఎస్సారెస్పీ పేర కొంత రుసుం చెల్లించి మైనింగ్ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ప్రధాన కాల్వ ఇరువైపులా ఉన్న మొరంగడ్డలను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండటంతో ఎస్సారెస్పీ వేలాది రూపాయల ఆధాయం కోల్పోతోంది. సంబంధిత అధికారులు స్పందించి మొరం గడ్డల మట్టి తరలింపును అడ్డుకోవాలని, ఆక్రమణకు గురైనా ఎస్సారెస్పీ, ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని మండల రైతులు, ప్రజలు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు అధికారుల నిర్లక్ష్యంతోనే అధికారుల నిర్లక్ష్యంతోనే మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెల్తున్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయినట్లు సంబంధిత అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. సర్వే చేయించి ఆక్రమదారుల చేతిలో ఉన్న ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. – పల్లె మోహన్‌రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు నిరుపేదలకు పంచాలి భూమిలేని నిరుపేదలను గుర్తించి ప్రభు త్వ భూములను పంచాలి. ప్రభుత్వం భూపంపిణీ పథకం అమలు చేసి ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని దళితులకు పంచాలి. – బొమ్మెన స్వామి, పెగడపల్లి నోటీసులు జారీ చేస్తాం స్థలం ఆక్రమణకు చేసిన రైతులకు నోటీసులు జారీ చేస్తాం. కాల్వ భూములు ఆక్రమణకు గురయిన మాట వాస్తవమే. ఆక్రమణ చేసిన రైతుల వివరాలను ఉన్నతాధికారలకు నివేదిస్తాం. – స్వామి, ఎస్సారెస్పీ ఏఈ చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూముల ఆక్రమించడం నేరం. మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నాం. గ్రామాల వారిగా వాటి వివరాలు ఆ యా గ్రామాల పంచాయతీల వద్ద ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తాం. – రవీందర్, తహసీల్దార్ -
విదేశీ బంగారం వ్యవహారంలో ఇద్దరి అరెస్ట్
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీవేములవాడ: రాజన్నను ఆదివారం 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీరామ నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో హోమాలు, పూజలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన మదుకంటి సృజన్–స్వాతి దంపతులు గోశాల, అన్నదానం ట్రస్టులకు కలిపి రూ.3,13,683 చెక్కును ఈవో వినోద్‌రెడ్డికి అందజేశారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్‌ఠాణాకు చెందిన నిమిశకవి శ్రీకాంత్–స్రవంతి దంపతులు అన్నదాన ట్రస్టుకు రూ.1,41,116 ఏఈవో జయకుమారికి అందజేశారు. ఏఈవోలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, జి.అశోక్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, శ్రీకాంతాచార్యులు, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్ ఉన్నారు.వేములవాడ: సౌదీ అరేబియా నుంచి బంగారం తీసుకొచ్చి సినీఫక్కీలో కాజేసిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన రుద్ర రాంప్రసాద్ సౌదీ అరేబియాలోని తన సమీప బంధువు రవీందర్ ద్వారా 400 గ్రాముల బంగారం తెప్పించుకునేందుకు అతనికి రూ.35లక్షలు పంపించాడు. ఈక్రమంలో రవీందర్ తన స్నేహితుడు సౌదీలో ఉంటున్న వేములవాడకు చెందిన కాల్వ వెంకటేశ్‌కు పరిచయస్తులైన చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన తొంటి భీరయ్య, గడ్డం అనిల్‌తో పంపించాడు. ఈ మొత్తం బంగారంను కాజేయాలని కాల్వ వెంకటేశ్, భీరయ్య, అనిల్ పథకం పన్నారు. ఈ విషయాన్ని వీరు తమ సమీప బంధువు ఇండియాలో ఉన్న ఏనుగుల నాగరాజుకు తెలిపారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే నాగరాజుకు బంగారం బిస్కెట్లు ఇవ్వడంతో అతను మొబైల్‌ఫోన్ స్విచాఫ్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తనకు సంబంధించిన వ్యక్తులకు బంగారం ఇవ్వలేదని మల్లాపూర్‌కు చెందిన రాంప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో ఏ1 కాల్వ వెంకటేశ్, ఏ4 నాగరాజు పరారీలో ఉన్నారని, వీరిని పట్టుకునేందుకు ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బీరయ్య, అనిల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సౌదీఅరేబియాలో ఉన్న కాల్వ వెంకటేశ్, పరారీలో ఉన్న ఏనుగుల నాగరాజులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి పెద్ద మొత్తంలో బంగారం తీసుకురావడంలో ఇంకా ఏదైనా ముఠా హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం బంగారం రికవరీ చేయడమే కాకుండా త్వరలోనే మిగిలిన నిందితులను కూడా పట్టుకుంటామని తెలిపారు. వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్, కానిస్టేబుళ్లు ఉన్నారు. పరారీలో మరో ఇద్దరు సినీఫక్కీలో చేతులు మారిన బంగారం వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి -
ఇల్లందకుంట రాములోరికి నృసింహుని నుంచి పట్టువస్త్రాలు
ధర్మపురి: కరీంనగర్ జిల్లాలో అపర భద్రాదిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంటలో గల శ్రీసీతా రాముల వారి కల్యాణానికి ధర్మపురి శ్రీలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం పక్షాన శనివారం పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇల్లందకుంటలో ఆదివారం నిర్వహించనున్న స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ నుంచి మేళతాళాలతో తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తదితరులున్నారు. -
పేదవారి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యం
మేడిపల్లి: పేదవారి కళ్లలో ఆనందం చూడడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మేడిపల్లి మండలం పొరుమల్లలో సన్న బియ్యం పంపిణీని ప్రారంభించి అనంతరం పోరుమల్ల, గుండ్లపల్లి, తొంబ్రావుపేట గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పేదల ప్రజలకు అందించే దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం అందించాలని ఓ దృఢ సంకల్పంతో మేనిఫెస్టోలో చెప్పకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని అన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీ, రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఏకగ్రీవం కానున్న బార్ అసోసియేషన్ ఎన్నిక జగిత్యాలజోన్: జగిత్యాల బార్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగియడంతో జూనియ ర్ కార్యవర్గ పోస్టులు మినహా మిగతా పోస్టులకు ఒకే నామినేషన్ దాఖలయ్యాయి. అధ్యక్ష స్థానానికి నామినేషన్ వేసిన రాచకొండ శ్రీరా ములు, ఉపాధ్యక్షుడిగా మహేంద్రనాథ్, ప్రధా న కార్యదర్శిగా ఎ.మారుతి, సంయుక్త కార్యదర్శిగా తర్బుజ నర్సయ్య, కోశాధికారిగా ఎం.ప్రతీప్‌కుమార్, లైబ్రరీ కార్యదర్శిగా మానాల వెంకటరమణ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కంచి సురేశ్, మహిళ కార్యదర్శిగా పడాల రాధలు ఒకే నామినేషన్ దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అలాగే 10 జూ నియర్ కార్యవర్గ సభ్యుల పదవులకు 11 మంది పోటీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ వరకు ఒకరు విత్‌డ్రా చేసుకుంటే మొత్తం కార్యవర్గం ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. బ్రిడ్జి పనులు పరిశీలనరాయికల్: రాయికల్ మండలం మైతాపూర్–జోగినిపల్లి మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మాజీ మంత్రి జీవన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తానని అన్నారు.ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, నాయకులు మహేందర్‌గౌడ్, తలారి రాజేశ్ ఉన్నారు. అభ్యాసన కార్యక్రమాలు అమలు చేయాలిజగిత్యాల: పాఠశాలల్లో అభ్యాసన, అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా అమలు చేయాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం టీచర్స్ భవన్లో ఉపాధ్యాయులకు సబ్జెక్ట్‌ల వారీగా నిర్వహించిన శిక్షణలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సబ్జెక్ట్‌ల వారీగా రాబట్టాలని, ఇందుకు శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆశించిన ఫలితాలు సాధించి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ మహేశ్, రాజేశ్, ఆర్పీలు పాల్గొన్నారు. వేంకటేశ్వరునికి క్షీరాభిషేకం ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం రంగురంగుల పూలతో అలకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు మంత్రోచ్ఛరలతో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవనం నిర్వహించారు. -
తాగునీరు సురక్షితమేనా..?
చర్యలు తీసుకుంటున్నాం ప్రతీ 15 రోజులకోసారి ఖచ్చితంగా వాటర్‌ట్యాంక్‌లను శుభ్రం చేయాలి. ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటు ప్రతీ ట్యాంక్ వద్ద బోర్డులను ఏర్పాటు చేసి, లీకేజీలను అరికట్టేలా చూడాలని అధికారులను ఆదేశించాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల ● పరిశుభ్రతకు నోచుకోని వాటర్ ట్యాంకులు ● కలుషితమవుతున్న నీరు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులుజగిత్యాల: వేసవి కాలం అయినప్పటికీ చిన్నపాటి వర్షాలు కురియడంతో పారిశుధ్యం అంతా అస్తవ్యస్తంగా మారుతోంది. కలుషిత నీటితోనే వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ట్యాంక్‌లు శుభ్రం చేయాల్సిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అలాగే జిల్లా కేంద్రంలో అనేక లీకేజీలు ఉన్నాయి. పైపులు సైతం పాకురుతో నిండిపోయాయి. కొన్ని అయితే చెట్ల పొదల మధ్యలోనే ఉన్నాయి. నిబంధనల ప్రకారం 15 రోజులకోసారి శుభ్రం చేయాల్సిన వాటర్ ట్యాంక్‌లను నెలలు గడుస్తున్నా శుభ్రం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయడంతో పాటు లీకేజీలను అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కలుషిత నీటితో వ్యాధులు ప్రతీరోజు మానవునికి నీరు ఎంతో అవసరం. ప్రతీ మున్సిపాలిటీలో ఫిల్టర్‌బెడ్ నుంచి ప్రధానంగా పట్టణాల్లో కొన్ని ఏరియాలకు ఒక ట్యాంక్ చొప్పున నిర్మించారు. అక్కడి నుంచి వివిధ కాలనీలకు మంచినీటి సరఫరా జరుగుతుంది. కానీ శుభ్రత విషయంలో మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీల్లో ఉదయం లేవగానే నీరు పట్టుకుంటారు. జిల్లా కేంద్రంలో కొన్ని కాలనీల్లో అయితే రంగుమారిన నీరే వస్తున్నాయి. పూర్తి బురదమయంగా, పసుపు రంగులో రావడంతో వాటిని తాగేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లీకేజీలతో పాటు, ట్యాంకులు శుభ్రం చేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోని జగిత్యాలతో పాటు, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటిల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. శుభ్రత ఎక్కడ? ప్రతీ వాటర్ ట్యాంక్‌ను ఖచ్చితంగా 15 రోజులకోసారి పూర్తిగా శుభ్రం చేసి ప్రజలకు నీరందించాల్సి ఉంటుంది. దీంతో పాటు అక్కడ ఏరోజు శుభ్రం చేశాం, మళ్లీ ఏ రోజు చేయాలి అన్న తేదీల బోర్డు సైతం వాటర్ ట్యాంక్‌ల వద్ద ఏర్పాటు చేయాలి. కొన్ని చోట్ల నెల రోజుల క్రితం కడిగిన తేదీలే ఉన్నాయి. జగిత్యాల కొత్తబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులో లోలెవల్, హైలెవల్ కడిగిన తేదీ 27.02.2025 ఉండగా, మళ్లీ కడగాల్సిన తేదీ 27.03.2025 అని ఉంది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయికల్ ఐదు మున్సిపాలిటీలు ఉండగా, ఎక్కడ కూడా నిబంధనలు పాటించడం లేదు. దీంతో ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతుంది. ఈ విషయంపై కొందరు మున్సిపల్ అధికారులను ట్యాంక్‌లను ఎందుకు శుభ్రం చేయడం లేదని అడుగగా ట్యాంక్‌లను ఇటీవలే శుభ్రం చేయడం జరిగిందని, అక్కడ తేదీలు వేయడం మరిచిపోయామని చెప్పడం కొసమెరుపు. లీకేజీలే అధికమే.. ఒకవైపు ట్యాంక్‌లు శుభ్రంగా లేకపోవడంతో పాటు ఇటీవల మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో భాగంగా అనేక చోట్ల మంచినీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో నీరంతా కలుషితమవుతుంది. అధికారులు ట్యాంక్‌లు శుభ్రం చేయకపోవడం, అటు పైప్‌లైన్ లీకేజీలను అరికట్టకపోవడంతో ఫలితంగా ప్రజలకు అపరిశుభ్రమైన నీరే సరఫరా అవుతోంది. ఇది కొత్తబస్టాండ్‌లోని వాటర్‌ట్యాంక్. ట్యాంక్ అంతా అపరిశుభ్రతతో నిండిపోయింది. పైప్‌లన్నీ పాకురు పట్టాయి. శుభ్రం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలకు కలుషిత నీరే సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రతీ ఒక్క వాటర్ ట్యాంక్ పరిస్థితి ఇదే. ఇక్కడ సైతం గతనెల తేదీ రాసినప్పటికీ అక్కడున్న ట్యాంక్ నిర్వాహకులు తేదీలు రాయలేదని, గతనెలలో రాసిందే ఉందన్నారు. అసలు శుభ్రం చేస్తున్నారా? లేదా? అన్న అనుమానం వ్యక్తమవుతున్నాయి.ఇది జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో పురాతనకాలంలో కట్టిన వాటర్ ట్యాంక్. నిబంధనల ప్రకారం 15రోజులకోసారి ట్యాంక్‌ను శుభ్రం చేయాల్సి ఉండగా శుభ్రతను అధికారులు విస్మరిస్తున్నారు. దీంతో కలుషిత నీరే ప్రజలకు సరఫరా అవుతోంది. ఈ ట్యాంక్ వద్ద ఎలాంటి సూచికలు, బోర్డులు, శుభ్రపర్చిన తేదీలు లేవు. -
ఎల్ఆర్ఎస్ అంతంతే..!
మున్సిపాలిటీల్లో కొరవడిన స్పందన ● ఫీజు కట్టడానికి ముందుకు రాని దరఖాస్తుదారులు ● రాయితీ ప్రకటించినా నామమాత్రంగానే.. ● ఈనెల 30 వరకు మరోమారు గడువు పొడిగించిన ప్రభుత్వం మెట్పల్లి: అక్రమ ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ పథకానికి జిల్లాలోని మున్సిపాలిటీల్లో స్పందన కొరవడింది. గత నెల 31లోపు దరఖాస్తుదారులు ఫీజు చెల్లిస్తే 25శాతం రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ అశించిన స్థాయిలో దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. క్రమబద్ధీకరణ కోసం ఐదేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకోగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని పరిష్కరించడంలో జాప్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై దృష్టి సారించి దరఖాస్తులు పరిష్కరించాలని నిర్ణయించింది. పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో ఫీజు చెల్లించే వారికి రాయితీని కూడా కల్పించింది. కానీ దరఖాస్తుదారుల నుంచి స్పందన నామమాత్రంగా ఉండడంతో గడువును మరోమారు పొడిగించింది. వేల సంఖ్యలో దరఖాస్తులు ● జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ● వీటిల్లో లేఅవుట్ నిబంధనలు పాటించకుండానే ప్లాట్ల విక్రయాలు సాగాయి. ● అయితే వీటిని ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించడం కోసం 2020లో అప్పటి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ● ఆ సమయంలో ఒక్కొక్కరి నుంచి దరఖాస్తు ఫీజు కింద రూ.వెయ్యి వసూలు చేశారు. ● ఆ తర్వాత ఐదేళ్లుగా వీటిని పరిష్కరించకుండా పెండింగ్‌లోనే పెట్టారు. ● ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత నెలలో క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. నామమాత్రంగానే పరిష్కారం ప్రభుత్వం దరఖాస్తుదారులను ఆకట్టుకోవడానికి 25శాతం రాయితీ అవకాశాన్ని కల్పించినా అశించిన స్థాయిలో దరఖాస్తుదారుల నుంచి స్పందన రాలేదు. ప్రధాన మున్సిపాలిటీలైనా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిల్లో 24,568 దరఖాస్తులుంటే.. వీటిలో ఇప్పటి వరకు ఫీజులు చెల్లించిన వారు మూడు వేలకు మించకపోవడం గమనార్హం. ప్రతీ మున్సిపాలిటీలో అధికారులు ఎల్ఆర్ఎస్పై క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల అవగాహన లేక దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు పట్టణాల్లో ప్లాట్ల క్రయ విక్రయాల వ్యాపారం మందగించింది. దీంతో ఫీజులు కట్టడం భారంగా మారడం కూడా కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. -
నిరుపేదలకు సన్న బియ్యం ఓ వరం
ధర్మపురి: ఎక్కువ డబ్బులతో సన్నబియ్యం కొనుగోలు చేయని నిరుపేదలకు ఎంతో వరమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురిలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన గ్యారంటీల్లో సన్న బియ్యం పథకం ఒకటని, రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతీఒక్కరికీ ఉచితంగా సన్న బియ్యం అందజేస్తుందన్నారు. రేషన్ డీలర్లకు రూ.5వేల గౌరవ వేతనం, బియ్యం సరఫరాలో హమాలీ ఖర్చులు వంటి సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. -
అయోధ్య రామయ్య.. ఉప్పుమడుగు సీతమ్మ
● రెండు గ్రామాల ఐకమత్యం ● నేటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు రాయికల్: అయోధ్య అనగానే శ్రీరాముని జన్మస్థలమే మనకు గుర్తుకొస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యనే కాదు రాయికల్ మండలంలోనూ అయోధ్య గ్రామం ఉంది. ఈ గ్రామం ఏర్పడినప్పటి నుంచి 38 ఏళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీరాముడు వనవాస సమయంలో గ్రామానికి వచ్చాడని అందుకే కోదండ రామాలయం నిర్మించామని ప్రజ లు తెలుపుతున్నారు. అయితే అయోధ్య, ఉప్పుమడుగు (జంట)గ్రామాలు కలిసి ఉంటాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు కలిసికట్టుగా ఏటా శ్రీరా మనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఐక్యత చాటుతున్నారు. అయితే అయోద్యలోని రామయ్యకు ఉప్పుమడుగు నుంచి సీతమ్మను తీసుకొని వివాహం జరిపిస్తారు. ఏటా జరిగే శ్రీరాముని కల్యాణానికి ప్రభుత్వం తరఫున తహసీల్దార్ దంపతులు ముత్యాల తలంబ్రాలు తీసుకొని కల్యాణ తంతును వైభవంగా నిర్వహిస్తారు. కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు శనివారం నుంచి నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించనున్న కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా నుంచి వేలాది మంది భక్తులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించనున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. -
ఆరోగ్య మందిర్ సేవలు భేష్
సారంగాపూర్: బీర్పూర్ మండలంలోని బీర్పూర్, నర్సింహులపల్లె ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖానా)ల్లో అందుతున్న సేవలపై శుక్రవారం జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం ఆన్లైన్లో పరిశీలన చేసింది. ఆన్లైన్ తనిఖీలో పాల్గొన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్‌తో జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం సభ్యులు డాక్టర్ అజయ్‌కుమార్, డాక్టర్ నిరుపజాలు ఆరోగ్య మందిర్ల సేవలపై పలు ప్రశ్నలు అడిగారు. ఈరెండు ఆరోగ్య మందిర్లలో 15మంది సిబ్బంది పనిచేస్తున్నారని, 10 రోజులకోసారి జిల్లాస్థాయి వైద్యాధికారులు ఆస్పత్రిలో అందుతున్న సేవలపై పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. 154 రకాల మందులు అందుబాటులో ఉంచామని తెలపడంతో బృందం సభ్యులు అభినందించారు. రోజూ వస్తున్న రోగుల సంఖ్య, ఆస్పత్రిలో రికార్డుల నిర్వహణ తీరును వివరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ద్వారా జాతీయస్థాయిలో ప్రతీచోట నాణ్యమైన వైద్యసేవలు, మందులు అందించి ప్రజల ఆరో గ్య ప్రమాణాలను మెరుగుపర్చే కార్యక్రమం అని తెలిపారు. ఆరోగ్యమందిర్‌లో పనితీరు ఇలాగే కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌తో పాటు మండల వైద్యాధికారిణి రాధ, డాక్టర్ నరేష్, డీపీవో రవీందర్, సీహెచ్‌వో కుద్ధూస్, సూపర్వైజర్లు కిశోర్, తార, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి కృషి
జగిత్యాల: ఎస్సీ, ఎస్టీవర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం జగిత్యాల కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి పథకాలపై సభ్యులతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పకుండా పాటించాలని, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అధికారులు సైతం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారికి సంబంధించిన భూములపై కేసులుంటే తక్షణమే పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతినెల చివరి రోజున ఖచ్చితంగా పౌరహక్కుల దినోత్సవం జరిగేలా చూడాలన్నారు. హెడ్‌కానిస్టేబుల్, ఆర్ఐల ద్వారా సమావేశం నిర్వహిస్తున్నారని, అలా కాకుండా తహసీల్దార్, ఎస్సైలు పాల్గొనాలన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ, ధర్మపురిలోని గాదెపల్లిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, వాటిని కాపాడే దిశగా చూడాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు విద్యనందించాలనే ఉద్దేశంతో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న విద్యాహక్కు చట్టం అమలయ్యేలా చూడాలని అన్నారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్లు బీసీలకు 25, మైనార్టీలకు 4, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10 సీట్లు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని తెలిపారు. కమిషన్ సభ్యులు లీలాదేవి, శంకర్, రాంబాబునాయక్, లక్ష్మీనారాయణ, ఎస్పీ అశోక్‌కుమార్, అదనపు కలెక్టర్ లత, సంక్షేమాధికారి రాజ్‌కుమార్ పాల్గొన్నారు. కమిషన్ దృష్టికి పలు సమస్యలు ● జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌కు చెందిన వీఆర్ఏ ఎన్నికల విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నా ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సైతం ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించిందన్నారు. కానీ ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థ రద్దు అయిందని, అన్ని అర్హతలు ఉండి కూడా దళితునికి ఉద్యోగం రాకపోవడం బాధాకరమన్నారు. ● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యాభ్యాసం కొనసాగించిన రాయికల్ మండలం అల్లీపూర్‌కు చెందిన దళిత యువతి ఐఈఆర్సీ రాత పరీక్ష రాసి ఉత్తమ ర్యాంక్ సాధించినప్పటికీ ప్రస్తుతం జగిత్యాల జిల్లాగా మారడంతో నాన్ లోకల్ అంటూ ఉద్యోగం ఇవ్వడం లేదన్నారు. హైకోర్టు సైతం ఉద్యోగం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అది అమలు కావ డం లేదన్నారు. కమిషన్ చైర్మన్ స్పందించి ఈ రెండు సమస్యలను పరిష్కరించేలా చూస్తామని, అలాగే విద్యాహక్కు చట్టంపై సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మల్లాపూర్: మండలంలోని వేంపల్లి శివారులో గురువారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం మ ల్లాపూర్కి చెందిన సుర దివాకర్ (42) రాయికల్ మండలం కొత్తపేటలో బంధువుల ఇంటికి వెళ్లాడు. ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా.. రాయికల మండలం మూటపెల్లిలో మేసీ్త్ర పనులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కూలీలు ద్విచక్రవాహనంపై వేంపల్లిలో కూరగాయలు తీసుకుని మూటపెల్లికి వస్తున్నారు. గ్రామ శివారులో అతివేగంగా వచ్చి దివాకర్ బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో దివాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రాజు విచారణ చేపట్టారు. -
నిరుపేదను కబళించిన అప్పులు
● సిరిసిల్లలో కూరగాయల వ్యాపారి ఆత్మహత్య సిరిసిల్లటౌన్: కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు ఓ నిరుపేదను కబళించాయి. అప్పులు కట్టలేని దుస్థితిలో కూరగాయలు అమ్ముకునే ఓ చిరు వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన ఎర్రం కొండయ్య(58) మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు రజిత, అనిత, కొడుకు రాకేశ్‌ల వివాహాలు చేశాడు. ఇంటి అవసరాల నిమిత్తం చేసిన అప్పులు లక్షల్లో పేరుకుపోగా.. వాటిని తీర్చలేనేమోనన్న బెంగతో బుధవారం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి సాయినగర్ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కొండయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మృతుడికి భార్య పుష్పలత ఉంది. రైలు కింద పడి చిరువ్యాపారి మృతి ● మృతుడి స్వస్థలం ఉత్తరప్రదేశ్ రామగుండం: రామగుండం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై రైళ్లలో విక్రయించే వెండర్ ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతిచెందాడు. జీఆర్పీ ఔట్ పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. రామగుండం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై వాటర్ బాటిళ్లు విక్రయించే చిరు వ్యాపారి వరుణ్కుమార్సింగ్ గురువారం భద్రాచలం వైపు వెళ్తున్న సింగరేణి ప్యాసింజర్ రైలులో ఎక్కి విక్రయిస్తున్న క్రమంలో రైలు కదిలింది. అప్పటికే బోగిలో పలువురికి వాటర్ బాటిళ్లు విక్రయించి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కిందికి వెళ్లాడు. రైలు అతడిపై నుంచి వెళ్లడంతో దేహం రెండు ముక్కలైంది. అప్పటివరకు అందరితో కలిసి ముచ్చటించిన వరుణ్‌కుమార్ కొద్దిసేపట్లోనే రైలు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో తోటి వ్యాపారులు రోదించారు. మృతుడు వారం క్రితమే రామగుండంకు చేరుకున్నట్లు తెలిసింది. మృతుడి స్వగ్రామం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియా జిల్లా అఖాన్పూర గ్రామం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం బంధువులకు అప్పగించనున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తిరుపతి పేర్కొన్నారు. -
చిక్కుల్లో బంగారం ముఠా
● సౌదీ అరేబియా నుంచి రవాణా ● హైదరాబాద్ ఎయిర్‌పోర్టు దాటించాలని ఒప్పందం ● ఎయిర్‌పోర్టు దాటడంతోనే గేమ్‌చేంజ్ ● ఎత్తుకెళ్లిన మూడో వ్యక్తి ● వేములవాడలో కేసు నమోదుచందుర్తి(వేములవాడ): సౌదీ అరేబియా నుంచి పెద్ద ఎత్తున బంగారం తరలిస్తున్న ముఠా చిక్కుల్లో పడింది. బంగారం తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తులను కాదని వారి బంధువే దాన్ని ఎత్తుకెళ్లడంతో వీరిద్దరు ఇరకాటంలో పడ్డారు. సౌదీ అరేబియా నుంచి ఇండియాకు బంగారం పంపిన వ్యక్తి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో వేములవాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు జీవనోపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లారు. ఐదు రోజుల క్రితం సౌదీ అరేబియా నుంచి స్వగ్రామం జోగాపూర్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే బంగారం స్మగ్లర్లు వీరితో డీల్ కుదుర్చుకున్నారు. తీసుకొచ్చిన బంగారాన్ని హైదరాబాద్‌లో అప్పగించి.. తెచ్చినందుకు కమీషన్ తీసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. డామిట్ కథ అడ్డం తిరిగింది జోగాపూర్‌కు చెందిన వ్యక్తి అదే మండలంలోని ఎన్గల్‌కు చెందిన తన బావమరిదిని హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు కారు తీసుకురావాలని సూచించాడు. ఎయిర్‌పోర్టు దాటిన తర్వాత తన బావమరిదికి సౌదీ అరేబియా నుంచి పెద్ద ఎత్తున బంగారం తీసుకొచ్చిన విషయాన్ని తెలిపారు. ఇదే అదనుగా భావించిన ఎన్గల్‌కు చెందిన వ్యక్తి బంగారం అప్పగించకుండానే వారి వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి హైదరాబాద్‌లోనే తలదాచుకున్నారు. సౌదీ అరేబియాలో బంగారం అప్పగించిన వ్యక్తి తాను మోసపోయానని గ్రహించి రెండు రోజుల క్రితమే వేములవాడ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు జోగాపూర్‌కు చెందిన ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు. ఎక్కడున్న లొంగిపోవాలని, లేకుంటే అందరిని అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. భయాందోళన చెందిన సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరు చందుర్తి మాజీ జెడ్పీటీసీ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున వేములవాడ పోలీసుల ఎదుట సరెండర్ అయినట్లు తెలిసింది. కాగా బంగారం ఎత్తుకెళ్లిన ఎన్గల్‌కు చెందిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. కాగా బంగారం తీసుకొచ్చిన వ్యక్తులు మాత్రం అది ఎంత బరువు ఉందో తెలియదని పోలీసులకు తెలిపినట్లు ప్రచారం. ఇదే విషయమై వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్‌ను వివరణ కోరితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనన్నారు. కానీ వివరాలు విచారణ ముగిసే వరకు బయటకు చెప్పబోమని తెలిపారు. -
వ్యవసాయంపై వాతావరణ ప్రభావం
● ఏడాదిలో వివిధ పంటల్లో అనేక సమస్యలు ● సతమతమవుతున్న అన్నదాతలు ● అభిప్రాయపడిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ● పొలాసలో ఉత్తర తెలంగాణ జోన్ శాస్త్రవేత్తల సమావేశంజగిత్యాలఅగ్రికల్చర్: అత్యధిక వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, చలి తీవ్రత వంటి వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, రైతులు సాగు చేసిన పంటల్లో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని ఉత్తర తెలంగాణ జోనల్ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు అభిప్రాయపడింది. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండు రోజులపాటు జరుగనున్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తల, అభ్యుదయ రైతుల సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఎన్. బలరాం అధ్యక్షత వహించారు. వ్యవసాయ వర్సిటీ ఉన్నతాధికారులతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సాగులో సమస్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉత్తర తెలంగాణలోని పది జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా 64 శాతం అధికంగా నమోదు కావడంతో వరి, సోయాబీన్, పత్తి, కంది వంటి పంటలకు విఘాతంగా మారింది. ముఖ్యంగా వరిలో పురుగుల, తెగుళ్ల ఉధృతి పెరిగి పంటలపై ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు, ఆకుచుట్టు పురుగు, తాటాకు తెగులు ఆశించాయి. మొక్కజొన్న నీట మునగడంతో ఎదుగుదల లోపించి దిగుబడి తగ్గింది. పత్తి తొలి దశలో అధిక వర్షాలతో మొక్క పెరుగుదల లోపించి దిగుబడిపై ప్రభావం చూపింది. యాసంగి వరిలో పొడి వాతావరణం, రాత్రి తక్కువ ఉష్ణోగ్రతలతో కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఆశించింది. జనవరిలో రాత్రి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై, చలి పెరగడంతో వరి నారుమడులతోపాటు నువ్వులు, వేరుశనగ, మినుము, నేరుగా విత్తిన వరిపై ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని రకాల విత్తనాలు ఆటుపోట్లను తట్టుకుని మంచి దిగుబడి ఇచ్చాయని పేర్కొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే కోతలు పూర్తి కావాలి యాసంగి సీజన్లో రైతులు ముందుగా వరి నారుమడులు పోసుకోవాలని, ఏప్రిల్ మొదటివారంలోపు వరి కోతలు పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. ఆలస్యంగా కోయడం ద్వారా అధిక ఉష్ణోగ్రతలకు వరి గింజ పగిలి నూక శాతం ఎక్కువ అవుతుందని, ఇందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. నూక శాతం పెరగడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి కష్టంగా మారుతుందన్నారు. వ్యవసాయ వర్సిటీ డీన్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ బలరాం మాట్లాడుతూ.. పరిశోధన ప్రగతిని ఎప్పటికప్పుడు రైతులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంచేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత తాము చేస్తున్న పరిశోధనల గురించి వివరించారు. పరిశోధన విస్తరణకు సంబంధించిన విషయాలపై శాస్త్రవేత్తలు రాంప్రసాద్, శివకృష్ణ వివరించారు. రైతులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను శాస్త్రవేత్తల దృష్టికి తీసుకొచ్చారు. -
రంగస్థలంపై మరో వసంతం
● నేడు చైతన్య కళాభారతి 40వ వార్షికోత్సవం ● కరీంనగర్ కళాభారతిలో వేడుకలు ● ‘స్వప్నం రాల్చిన అమృతం’ నాటిక 40వ ప్రదర్శన విద్యానగర్(కరీంనగర్): నాటకం సమాజంలో బాధ్యత కలిగిన ఒక హామీ. గుణాత్మకమైన బలాన్ని ఇస్తుంది. సామాజిక రుగ్మతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నాటకల ప్రదర్శనల ద్వారా సమాజ చైతన్యానికి చైతన్య కళాభారతి కృషి చేస్తోంది. నాటక రంగంపై మక్కువ ఉన్న కరీంనగర్‌కు చెందిన నాటక రచయిత స్వర్గీయ శ్రీరాముల సత్యనారాయణ 1985లో చైతన్య కళాభారతి సంస్థను ప్రారంభించారు. నాటి నుంచి నాటక రంగంలో 40మంది కళాకారులతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. 40 వసంతాలు పూర్తి చేసుకుని, శుక్రవారం కరీంనగర్ కళాభారతిలో వేడుకలు జరుపుకుంటోంది. 40 ఏళ్ల ప్రస్థానం వ్యవసాయశాఖలో పనిచేసే స్వర్గీయ శ్రీరాముల సత్యనారాయణ నాటకరంగంపై ఉన్న మక్కువతో స్వర్గీయ వొడ్నాల కిషన్, కునమల్ల రమేశ్, తిప్పర్తి ప్రభాకర్, బండారి శ్రీరాములు, బండారి రవీందర్, సింహాచలం, యతిందర్తో కలిసి 1 మే 1985లో చైతన్య కళాభారతి నాటకసంస్థను స్థాపించారు. 1985 జూన్‌లో ఈతరం మారాలి అనే నాటకాన్ని ఎస్సారార్ కళాశాల వేదికగా తొలిసారిగా ప్రదర్శించారు. శ్రీరాముల సత్యనారాయణ రచించిన పామరులు, ఈ తరం మారాలి, ఆకలి వేట, ఆడది, మనిషి, నిరసన, కాల చక్రం, ప్రేమ పిచ్చోళ్లు, చదవరా, ఆశాపాశం, అగ్ని పరీక్ష నాటకాలు ప్రశంసలు పొందగా, చైతన్య కళాభారతి కళాకారులు 700లకు పైగా ప్రదర్శనలిచ్చారు. వొడ్నాల కిషన్ రచనల్లో విధాత, సారాయి, కాపురం, నాకు ఇల్లొచ్చింది నాటికలు 100కు పైగా ప్రదర్శనలు జరిగాయి. పరమాత్ముని శివరాం రచన, మంచాల రమేశ్ దర్శకత్వంలో దొంగలు నాటిక 148 ప్రదర్శనలు, ఈ లెక్క ఇంతే నాటిక 37 ప్రదర్శనలు, ఖరీదైన జైళ్లు నాటిక 24 ప్రదర్శనలు, చీకటిపువ్వు 66 ప్రదర్శనలు, స్వప్నం రాల్చిన అమృతం నాటిక 40ఏళ్ల వేడుకల్లో 40వ ప్రదర్శన అవుతుంది. చెల్లని పైసలు, దొంగలు, చీకటిపువ్వు నాటికల ద్వారా ఆరు నంది అవార్డులు చైతన్య కళాభారతి అందుకుంది. 4న వేడుకలు చైతన్య కళాభారతి 40వ వార్షికోత్సవం 4వ తేదీ శుక్రవారం కళాభారతిలో సాయంత్రం 6.30కు జరుగుతాయని ఆ సంస్థ అధ్యక్షుడు తిప్పర్తి ప్రభాకర్ తెలిపారు. ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విశిష్ట అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, గౌరవ అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి, ప్రత్యేక అతిథిగా ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రమేశ్‌బాబు పాల్గొంటారని తెలిపారు. స్వప్నం రాల్చిన అమృతం నాటక ప్రదర్శనతో పాటు కళారంగంలో రాణిస్తున్న వారికి స్మారక పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర కో– ఆర్డినేటర్ ప్రోద్బలంతో.. 1985లో అప్పటి కరీంనగర్ నెహ్రు యువ కేంద్ర కో–ఆర్డినేటర్ రామారావు ప్రోద్బలంతో చైతన్య కళాభారతి నాటక సంస్థను ప్రారంభించాం. నెల్లూరులో జరిగిన నాటిక పోటీల్లో సినీనటి సుమలత చేతుల మీదుగా బెస్ట్ విలన్ అవార్డు అందుకున్నా. రవీంద్రభారతిలో విధాత నాటికకు అవార్డును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అందుకున్నా. – తిప్పర్తి ప్రభాకర్, చైతన్య కళాభారతి అధ్యక్షుడు ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దాం కళాకారుడిగా నాటక రంగంపై ఉన్న మక్కువతో చైతన్య కళాభారతి సంస్థను ప్రారంభించాం. మా సంస్థ ద్వారా ఎన్నో నాటకాలు ఉమ్మడి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రదర్శించి, అవార్డులు, బహుమతులు అందుకున్నాం. చైతన్య కళాభారతి సంస్థ ఎప్పటికీ కొనసాగాలన్నదే మా ధ్యేయం. అందుకే కొత్త కళాకారులకు అవకాశం కల్పిస్తున్నాం. – కునమల్ల రమేశ్‌బాబు, చైతన్య కళాభారతి వ్యవస్థాపక సభ్యుడు నాటక రంగంలో ప్రత్యేక అధ్యాయం వ్యవసాయశాఖలో ఉద్యోగం చేస్తున్న నేను నాటక రంగం అంటే ఇష్టంతో శ్రీరాముల సత్యనారాయణ ప్రోత్సాహంతో చైతన్య కళాభారతి ద్వారా మనిషి నాటికలో నటించాను. చైతన్య కళాభారతి ద్వారా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, కావలి నుండి కర్నూలు వరకు ఉన్న నాటక వేదికలపై వందలాది ప్రదర్శనలిచ్చి ఎన్నో బహుమతులు, అవార్డులు, రివార్డులు అందుకున్నాను. – గద్దె ఉదయ్ కుమార్, చైతన్య కళాభారతి కోశాధికారి ఉత్తమ అవార్డు అందుకున్న పరమాత్ముని శివరాం రచన, మంచాల రమేశ్ దర్శకత్వంలో ఖరీదైన జైళ్లు నాటిక 24 ప్రదర్శనలు ఇవ్వగా అందులో ఉత్తమ సహాయ నటి, ఉత్తమ నటి అవార్డులు అందుకోవడం జరిగింది. ఈ సంస్థ ఉమ్మడి రాష్ట్రాల్లో ఇచ్చిన అనేక నాటిక ప్రదర్శనల్లో నేను వివిధ పాత్రల్లో నటించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా అనేక ప్రాంతాల్లో జరిగిన ప్రదర్శనల్లో అవార్డులు అందుకున్నా. – శోభ, రంగస్థల నటి, సభ్యురాలు -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి
గోదావరిఖని: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సింగరేణిపై అవలంబిస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్హాల్లో కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్లు ఎన్నికల సందర్భంగా హామీలు నెరవేర్చాలన్నారు. తప్పుడు హామీలతో కార్మికులను మోసం చేసిన యూనియన్లు కార్మికులకు సమాధానం చెప్పాలన్నారు. భూగర్భగనుల్లో కూడా ప్రైవేటీకరణ పెరిగిపోయిందని ఓసీపీల్లో బొగ్గు తీసేపని కూడా కాంట్రాక్టర్లకు అప్పగించారని వాపోయారు. గతంలో బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ అడ్డుకున్నాయన్నారు. గతంలో వేలంపాట నిర్వహించిన సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు పొందిన సంస్థలకు కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సమావేశంలో 11డివిజన్లకు చెందిన 85 మంది కేంద్ర ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులు, బొగ్గుగనుల్లో పనిచేస్తూ మృతిచెందిన కార్మికులకు నివాళులర్పించారు. సమావేశంలో యూనియన్ చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి కె.సురేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రాంమ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపెల్లి రవి, కేంద్ర నాయకులు చెరుకు ప్రభాకర్‌రెడ్డి, బడికల సంపత్, ధరావత్ మంగీలాల్, సదానందం, జె రవీందర్, కూశన వీరభద్రం, ఎల్.వెంకటేశ్, ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ వైర్లు తగిలి రైతు దుర్మరణం
జగిత్యాలక్రైం: నువ్వు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు కిందపడిన విద్యుత్ వైర్లు కాలుకు తగిలి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవి చంద్రయ్య (55) గురువారం ఉదయం తన నువ్వు పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. ఉదయం వీచిన ఈదురుగాలులకు స్తంభానికి ఉన్న విద్యుత్ వైర్లు కింద పడ్డాయి. గమనించని చంద్రయ్య చేనులోకి వెళ్తుండగా వైర్లు కాలుకు తగలడంతో విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామంలో కరెంట్ లేదంటూ స్థానికుల ఫిర్యాదు మేరకు విద్యుత్ అధికారులు సమస్య ఎక్కడుందో తెలుసుకునేందుకు స్తంభాల వెంట వెదుకుతుండగా చంద్రయ్య శవమై కనిపించాడు. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చంద్రయ్య కుమారుడు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఆయన వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
రెస్టారెంట్లో అగ్నిప్రమాదం
● రూ.30 లక్షల మేర ఆస్తినష్టంజ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్‌లోని ఖుషి రెస్టారెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న ఖుషి రెస్టారెంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఎన్టీపీసీ పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి ఎన్టీపీసీ ఎస్సై టి.ఉదయ్‌కిరణ్‌తో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేసేందుకు చర్యలు చేపట్టారు. మొదటి అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది పూర్థిస్థాయిలో మంటలను ఆర్పివేశారు. కింది అంతస్తులో బ్యాంకు ఉండగా ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసి చర్యలు చేపట్టడంతో ప్రమాదం తప్పింది. ఖుషి రెస్టారెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ఆస్తినష్టం జరిగిందని యజమాని గుర్రం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలే రెస్టారెంట్ ప్రారంభించామని, ఇంతలోనే అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ.30 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని వాపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం
● రూ.3లక్షల వరకు ఆస్తి నష్టం బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన టేకు పద్మ–శంకరయ్య దంపతుల పూరి గుడిసె గురువారం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. బాధితులు తెలిపిన వివరాలు. గురువారం ఉదయం పద్మ ఇంట్లో బట్టలు ఉతుకుతుండగా మీటర్ నుంచి పొగలు వచ్చి గుడిసె అంటుకుంది. మంటల్లో బీరువా, ఫ్రిజ్ కాలిపోయాయి. బీరువాలో నగదు, బంగారు, వెండి నగలు కాలిపోవడంతో దాదాపు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లింది. శంకరయ్య మేకలు కొనేందుకు తెచ్చిన రూ.50వేలు సైతం కాలిపోయాయి. సన్నబియ్యం పంపిణీకి వచ్చిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ విషయం తెలుసుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. తక్షణ సాయంగా రూ.50వేలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూ.5వేలు నగదు సాయం అందించారు. -
రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
పెగడపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని కేంద్రం కుట్రలను తిప్పకొట్టాలని సూచించారు. జైబాపు, జైబీమ్, జైసంవిధాన్ పాదయాత్రలో భాగంగా గురువారం మండలంలోని నంచర్ల నుంచి ల్యాగలమర్రి వరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ప్రారంభించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్రప్రభుత్వం బాబాసాహెబ్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని విమర్శించారు. మైనార్టీ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభారాణి, మండల అధ్యక్షుడు రాములుగౌడ్, మాజీ జెడ్పీటీసీలు రాజేందర్రావు, మోహన్‌రెడ్డి, విండో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, విండో మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. -
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం
జగిత్యాలటౌన్: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్ లత అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటవీరుడు దొడ్డి కొమురయ్య 98వ జయంతిని కలెక్టరేట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని కొనియాడారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ విమోచన పోరాటంతోనే స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి బీజం పడిందన్నారు. జీవన్‌రెడ్డి వెంట చెట్టె గంగాధర్, చెట్టె భార్గవ్, మహేందర్‌రెడ్డి, గంగమల్లు, మహేశ్, అజయ్, భీరం రాజేష్, ముఖేష్ ఖన్నా ఉన్నారు. కొంరయ్య విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు నివాళి అర్పించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బండపెల్లి మల్లేశ్వరి, దయాల మల్లారెడ్డి పాల్గొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జైలుకే..కోరుట్ల: స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం చట్టరీత్యా నేరమని, అలా చేస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష తప్పదని జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు. కోరుట్లలోని స్కానింగ్ సెంటర్లను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కానింగ్ మిషన్స్, డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. స్కానింగ్ సెంటర్లలో ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు అనే ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే రిజిస్ట్రేన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్, ఆరోగ్య విస్తరణ అధికారి రాజేశం, తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగుల నిరసనజగిత్యాలటౌన్: కేంద్రప్రభుత్వ పెన్షన్ విధానాలను వ్యతిరేకిస్తూ పెన్షనర్ల జేఏసీ పిలుపు మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట సంస్థ రిటైర్డ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. కేంద్రప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్లో పెన్షన్ సవరణ బిల్లు పెన్షనర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ప్రమాదకరంగా ఉందని, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చిలుముల గంగారాం, ఎలగందుల సుధాకర్, పురుషోత్తం, సాగర్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలిజగిత్యాలక్రైం: జిల్లాలో పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని, పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ఠపర్చాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. తన కార్యాలయంలో గురువారం పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. కాలనీలు, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. రాత్రిపూట గస్తీ, పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. డీఎస్పీలు రఘుచందర్, రాములు, రంగారెడ్డి, సీఐలు శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, రఫీక్‌ఖాన్, వేణుగోపాల్, రాంనర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, ఎస్సైలు, డీసీఆర్బీ, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
అకాలవర్షం.. రైతుకు కష్టం
కథలాపూర్/జగిత్యాలరూరల్: కథలాపూర్ మండలంలో గురువారం వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. రైతులు టార్పాలిన్ కవ ర్లు కప్పడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదని రైతులు తెలిపారు. టార్పాలిన్ కవర్లపై నిలిచిన నీటిని పారబోసి తిరిగి ఆరబెట్టారు. కేంద్రాలను త్వరగా ప్రారంభించాలని రైతులు కోరారు. అలాగే జ గిత్యాల రూరల్ మండలం అంతర్గాం, నర్సింగా పూర్, తాటిపల్లి, చల్గల్, అర్బన్ మండలం ధ రూర్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురి సింది. వరి, మామిడితోటలకు నష్టం వాటిల్లింది. -
నిరుపేదలందరికీ సన్నబియ్యం
రాయికల్: నిరుపేదలకు సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ అని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్‌లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఎన్నికల హామీ మేరకు సన్నరకం ధాన్యం పండించే రైతులకు క్వింటాలుకు రూ.500బోనస్ అందిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో హామీ ఇచ్చినా సన్నబియ్యం పథకాన్ని అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రాయికల్ ప్రజలు తనను ఆదరించారని, వారి సహకారంతోనే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి బోర్నపల్లికి బ్రిడ్జి మంజూరు చేయించానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పట్టణంలో ఫిల్టర్ బెడ్ మరమ్మతుకు రూ.14 కోట్లు మంజూరు చేయించానన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమత, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, జిల్లా నాయకులు షాకీర్, రాకేష్, దివాకర్‌రెడ్డి, మసూద్, మోబీన్, బోంగిని భూమాగౌడ్ పాల్గొన్నారు. -
వాళ్లు అనర్హులే!
● కోర్టు సబార్డినేట్ పోస్టుల్లో ఓవర్ క్వాలిఫై అభ్యర్థులు ● మొత్తం 25 మంది అనర్హులుగా గుర్తింపు ● వెలువరించిన కోర్టు.. స్వాగతిస్తున్న నిరుద్యోగులు ● ఫలించిన ‘సాక్షి’ వరుస కథనాల పోరాటంసాక్షిప్రతినిధి,కరీంనగర్: గతంలో జరిగిన కోర్టు సబార్డినేట్ పోస్టుల విషయంలో ‘సాక్షి’ వరుస కథనాలు నిజమయ్యాయి. అటెండర్ స్థాయి పోస్టులకు అధిక విద్యార్హత (ఓవర్‌క్వాలిఫైడ్) ఉన్న వ్యక్తులు అక్రమంగా పరీక్షలు రాసి ఎంపికయ్యారంటూ రెండేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన మాట విదితమే. తమకు అన్యాయం జరిగిందని, అనర్హులు ఉద్యోగాలకు ఎంపికవడాన్ని సవాలు చేస్తూ పలువురు ఈ కథనాల ఆధారంగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. పోలీసు యంత్రాంగం విచారణ జరిపింది. పలువురు తాము అధిక విద్యార్హతలు కలిగి ఉన్నామని అంగీకరించి, స్వచ్ఛందంగా తప్పుకుని, ఉద్యోగానికి రాబోమని రాసి ఇచ్చారు. మరికొందరు తమకు ఏమవుతుందిలే అన్న ధీమాతో కొలువుల్లో చేరారన్న ఆరోపణలు ఉన్నాయి. తరువాత కాలంలోనూ అవి వెలుగుచూడటంతో వారిని కూడా తొలగించారు. సంచలనం రేపిన ‘సాక్షి’ కథనాలు.. 2019లో నిర్వహించిన కోర్టు సబార్డినేట్ పరీక్షకు అర్హత పదో తరగతి ఫెయిల్ ఉండాలని నిబంధన ఉంచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 96 పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు. తొలుత 1:3 రేషియోలో మొత్తం 318 మందిని పిలిచిన అధికారులు.. 93 మందితో తుదిజాబితా ప్రకటించారు. ఈ అభ్యర్థుల్లో పలువురు ఓవర్ క్వాలిఫైడ్ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చాలామంది తమ అర్హతలను తగ్గించి చూపించారు. తాము 10వ తరగతి ఫెయిల్ అని కొందరు, అసలు తాము 9వ తరగతితోనే చదువు ఆపేశామని చెప్పుకుని మరికొందరు పరీక్ష రాశారు. అధికారులను నమ్మించేందుకు అప్పటికే మూతబడి ఉన్న చాలా స్కూళ్ల నుంచి బోనఫైడ్ సర్టిపికెట్లను దొడ్డిదారిలో తెచ్చుకుని మరీ సమర్పించారు. దీంతో అవే స్కూళ్లలో చదివి.. ఉద్యోగం రాని వారు.. తమతోపాటు వారు చదవలేదని ఆందోళనలకు దిగారు. ఈ విషయాన్ని పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాల ద్వారా ఎత్తిచూపింది. అనంతర కాలంలో ఓ మహిళా ఉద్యోగి గ్రాడ్యుయేట్ అన్న విషయాన్ని గుర్తించిన అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుని, ఉద్యోగం నుంచి తప్పించడం గమనార్హం. రెండేళ్ల తరువాత విడుదలైన జాబితా.. వీరందరి రిక్రూట్మెంట్ ప్రక్రియ 2022లో మొదలైన దరిమిలా.. ఈ దుమారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అనర్హులు (ఓవర్ క్వాలీఫైడ్) తమ పొట్ట కొడుతున్నారని ఉద్యోగాలు రాని, పది ఫెయిలై పరీక్ష రాసిన వారంతా ఆందోళనలకు దిగారు. తాము ఆందోళనలు చేసిన ఇన్నేళ్ల తరువాత 25 మందితో కరీంనగర్ కోర్టు నుంచి అనర్హుల జాబితా విడుదల కావడంపై 2019లో పరీక్ష రాసిన అభ్యర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 25 మందిలోనూ ముగ్గురు రిక్రూట్మెంట్కు గైర్హాజరయ్యారని, ఒకరు ఫామ్నింపలేదని, ఒకరు ఉద్యోగంలో చేరి రాజీనామా చేశారని, మరో ముగ్గురు పోస్టులో చేరడానికి ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. మి గిలిన 17 మంది మాత్రం అధిక విద్యార్హతలు కలి గి ఉన్నారని విడుదల చేసిన జాబితాలో స్పష్టంచేశారు. దీంతో ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందని న్యాయాధికారుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ జాబితాకు సంబంధించిన కాపీ ప్రస్తుతం కరీంనగర్ కోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మాకు అవకాశం కల్పించాలి కరీంనగర్ కోర్టు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మేం తొలి నుంచి చెప్తున్న విషయం రెండేళ్ల తరువాత నిజమవడం సంతోషం. ఉద్యోగాల్లో చేరని, ఓవర్ క్వాలిఫైడ్ అభ్యర్థుల స్థానంలో తరువాత మెరిట్లో నిలిచిన నిజమైన అభ్యర్థులకు స్థానం కల్పించాలని కోరుతున్నాం. – రమేశ్, నిరుద్యోగి, హుజూరాబాద్ -
‘రోళ్లవాగు’ నిధులతో అడవుల అభివృద్ధి
సారంగాపూర్: బీర్పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం 90 శాతం పూర్తయ్యింది. అయితే ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న అటవీప్రాంతంపై మాత్రం అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో గేట్లను అమర్చలేదు. ఫలితంగా ప్రాజెక్టులోకి వర్షాకాలంలో గుట్టల నుంచి, వాగుల ద్వారా వచ్చే నీటితోపాటు, ఎస్సారెస్పీ నుంచి డి–53, 12ఎల్ కాలువ ద్వారా చేరే నీరు దిగువకు వెళ్లిపోతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తయినా రైతులకు సాగునీరందడం సమస్యగా మారింది. ప్రాజెక్టు నిర్మాణం ఇలా.. బీర్పూర్ శివారులో రూ.136.81 కోట్ల వ్యయంతో 2015–16లో అప్పటి ప్రభుత్వం పనులు చేపట్టింది. బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని 15వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణం 90శాతం వరకు పూర్తయింది. ఇంకా సాగునీరు అందించేందుకు మూడు గేట్లు మాత్రమే బిగించాల్సి ఉంది. ప్రాజెక్టు ముంపులో అటవీశాఖ భూములు ఉండడంతో ఆ శాఖ అనుమతి ఇస్తేగానీ గేట్లు బిగించడం కుదరదు. ప్రాజెక్టులో సుమారు 816 ఎకరాల అటవీశాఖ భూములు ముంపునకు గురవుతుండడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొల్లపల్లి మండలం చందోళి, దట్నూర్, వెల్గటూర్ మండలంలోని జగదేవ్‌పేట గ్రామాల్లో విస్తరించిన గుట్టలు, అలాగే పెగడపల్లి మండలం దివికొండ, ల్యాగలమర్రి, నంచర్లలో విస్తరించిన మరో గుట్టను అటవీశాఖకు అప్పగించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులతోపాటు డీఎఫ్ఓ సర్వే చేసి ప్రాజెక్టు నిర్మాణంలో సుమారు 53వేల చెట్లు మునిగిపోతున్నాయని తేల్చారు. ఎత్తు ప్రాంతాల్లో ఉన్న సుమారు 15వేల చెట్లకు నీరు తగ్గుతున్న కొద్ది నష్టం ఉండకపోవచ్చని అంచనా వేశారు. నల్లగొడిశ, నెమళినార, పాలగొడిశ, బిల్లుడు, ఇప్ప, తెలమద్ది, టేకు, మోదుగు, నల్లమద్ధి, కానుగ, చొప్పరి, సోమి, మెడిసినల్ ప్లాంట్స్ మారేడు, తవిసి, మర్రి, రావి, జువ్వి, వేప, తునికి పళ్ల చెట్లు ఉన్నాయని నిర్ధారించారు. ట్రాన్స్‌లోకేషన్, ట్రాన్స్‌ప్లాంటేషన్ అరుదైన చెట్లయిన మారేడు, తవిసి, మర్రి, రావి, జువ్వి, వేప, తునికి చెట్లను ప్రాజెక్టు శివారు నుంచి యంత్రాల ద్వారా కూకటివేళ్లతో తీసుకెళ్లి పోతారం, తుంగూర్, బీర్పూర్ అటవీప్రాంతంలో నాటడానికి (ట్రాన్స్‌ప్లాంటేషన్) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక చెట్టును 48 గంటల్లోనే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు నిధులతో అటవీ భూముల్లో అభివృద్ధి రోళ్లవాగు నిర్మాణంలో అటవీశాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు కేటాయించే నిధులతోనే ఆ శాఖకు సంబంధించిన భూములు అభివృద్ధి చేయనున్నారు. అడవుల అభివృద్ధికి దాదాపు రూ.25కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది. ఈ నిధులతో అటవీశాఖకు కేటాయించిన 816 ఎకరాల గుట్టల ప్రాంతంలో అడవులను పెంచనున్నారు. సుమారు మూడు వేల చెట్లను ట్రాన్స్‌లోకేషన్, ట్రాన్స్‌ప్లాంటేషన్ కింద తిరిగి నాటడానికి నిధులు ఖర్చు చేస్తారు. భూగర్భజలాల పెంపు కోసం జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలోని అటవీప్రాంతాల్లో భూగర్భజలాల పెంపుకోసం చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల, రాయికల్ రేంజ్‌లు, ధర్మపురి నియోజవర్గ పరిధిలోని ధర్మపురి రేంజ్లో నీటి వనరుల పెంపు లక్ష్యంగా అడవుల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.లక్షలు వెచ్చించనున్నారు. పర్యావరణ అనుమతుల వస్తే పనులు అటవీశాఖ, ఇంజి శాఖ అధికారులు రెండు నెలలపాటు అనువణువునా చెట్లను లెక్కించారు. వారిచ్చిన వివరాలను ఇటీవల అటవీశాఖ పరిధిలోని పర్యావరణ పరిరక్షణ బృందం సభ్యులు, సీనియర్ అటవీ అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేశారు. ఈ నివేదికలను పర్యావరణ అనుమతుల కోసం ఢిల్లీలోని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌కు పంపినట్లు ఇరు శాఖల అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ముంపులో అటవీశాఖ భూములు ధర్మపురి సెగ్మెంట్ పరిధిలో 816 ఎకరాలు కేటాయింపు అడవుల పెంపకానికి రూ.30 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం మూడు వేల చెట్ల వరకు ట్రాన్స్‌లోకేషన్, ట్రాన్స్‌ప్లాంటింగ్ జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాల్లో ఖర్చు చేయనున్న నిధులు మినీ పర్క్యూలేషన్ ట్యాంకులుస్టాగర్డ్రేంజ్పర్క్యూలేషన్ ట్యాంకులు ట్రెంచెస్ -
ఆస్తి పన్ను వసూలులో కోరుట్లకు ఆరో స్థానం
కోరుట్ల/మెట్పల్లి/రాయికల్: ఆస్తి పన్ను వసూలులో కోరుట్ల మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచింది. మార్చి 31 వరకు 89.82 శాతం వసూలు చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో సీడీఎంఏ చేతులమీదుగా మున్సిపల్ కమిషనర్ ఏ.మారుతీప్రసాద్ అవార్డు, ప్రశంస పత్రం అందుకున్నారు. అలాగే పన్ను వసూలులో ప్రతిభ కనబర్చిన మెట్పల్లి మున్సిపాలిటీ అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.3.94కోట్లు లక్ష్యంకాగా రూ.3.50 కోట్లు వసూలు చేశారు. కమిషనర్ మోహన్‌కు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి ప్రశంసపత్రం అందించి అభినందించారు. రెండేళ్లుగా 86శాతానికి పైగా వసూలు సాధించినందుకు రాయికల్ మున్సిపాలిటీకి అవార్డు లభించింది. సీడీఎంఏ శ్రీదేవి చేతుల మీదుగా కమిషనర్ మనోహర్ గౌడ్ అవార్డు అందుకున్నారు. -
తూము ఏర్పాటు చేయాలి
అడ్డరోడ్డుకు వెళ్లేదారిలో వరదకాలువకు తూము ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చలేదు. మల్యాల గ్రామం చుట్టూ నీరున్నా.. చెరువుల్లోకి మాత్రం నీరు చేరడం లేదు. చెరువులు నింపాలని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం. తూము ఏర్పాటు చేసి చెరువులు నింపాలి. – గడ్డం రాజేశ్వర్ రెడ్డి, రైతు, మల్యాల చెరువులు నింపాలి సూరప్ప చెరువు, రావి చెరువులతోపాటు శివారులోని అన్ని చెరువులను నింపాలి. వేసవిలో చెరువులన్నీ ఎండిపోతున్నాయి. ఏటా వర్షం నీరు మినహా వరద వచ్చే అవకాశం లేక వేసవిలో భూగర్భజలాలు తగ్గిపోయి, బావుల్లో ఊట మళ్లిపోతున్నాయి. మల్యాలలోని చెరువులు అన్ని నింపేందుకు చర్యలు చేపట్టాలి. నేరెళ్ల భూమారెడ్డి, రైతు నాయకులు -
సుందరీకరణ.. కళావిహీనం
జగిత్యాల: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా జగిత్యాల మున్సిపాలిటీ తీరు తయారైంది. జి ల్లాకేంద్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తోంది. అయినా అభివృద్ధి మాత్రం నత్తనడకన సాగుతోంది. గ తంలో సుందరీకరణ పేరుతో డివైడర్ల మధ్య మొక్కలు నాటడంతోపాటు, జంక్షన్ల వద్ద వివిధ రకాల అ త్యంత ఖరీదైన బొమ్మలు, లాన్లు, మంచి మొక్కలు నాటారు. అవి కొద్దిరోజులు మాత్రమే పనిచేశా యి. గత పాలకవర్గంగానీ, అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో జంక్షన్లు కళాహీనంగా మారుతున్నాయి. బొమ్మలు దుమ్ముపట్టిపోవడం, లాన్ ఎండిపోవడం, మొక్కలు పిచ్చిమొక్కలుగా తయారవుతున్నాయి. సుందరీకరణ కాస్తా కళావిహీనంగా మారింది. ప్రజల సొమ్ము దుర్వినియోగం జిల్లా కేంద్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. వేలాది మంది ప్రజలు నిత్యం రాకపోకలు సాగి స్తుంటారు. రోడ్లు, జంక్షన్లు గ్రీనరీతో ఉండాలన్న ఉద్దేశంతో సుందరీకరణ పేరుతో ఈ జంక్షన్లకు గ తంలో రూ.35 లక్షలు ఖర్చు చేశారు. అందులో నె మలి, కొంగలు, మనిషి ఆకారం పోలే బొమ్మలు ఏ ర్పాటు చేయడంతోపాటు ఫౌంటేన్, లాన్ ఏర్పాటు చేసి కొన్ని మొక్కలు నాటారు. ఇంత చేసీ.. కనీసం రెండునెలలైనా ఫౌంటేన్ల నిర్వహణ కొనసాగలేదు. అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకోకపోవడంతో జంక్షన్లు కాస్త కళావిహీనంగా మా రుతున్నాయి. రూ.35 లక్షల నిధులు వృథా అవుతున్నాయి. జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటేన్లు పని చేయాలంటే మోటార్లు ఉండాలి. అవి కాస్త చెడిపోవడంతో బాగు చేయించడాన్ని అధికారులు ప ట్టించుకోవడం లేదు. దీంతో ఏదో మొక్కుబడిగా అ ప్పుడప్పుడు ట్యాంకర్ల ద్వారా పచ్చదనం ఎండిపోకుండా నీరు పడుతున్నారే తప్ప మోటార్లు బాగుచే సి ఫౌంటేన్ పనిచేసేలా చర్యలు మాత్రం తీసుకో వ డం లేదు. గతంలో ఫౌంటేన్తోపాటు వివిధ రంగుల్లో నీరు పోసేలా లైట్లను ఏర్పాటు చేశారు. ఆ లైట్లు కూ డా పనిచేయడం లేదు. అధికారులు స్పందించి జంక్షన్ల వద్ద అభివృద్ధి చేపట్టాలని ప్రజలు కో రుతున్నా రు. జగిత్యాలలో జంక్షన్లు రెండు ఉన్నా.. కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురిలో జంక్షన్ల ఊసే ఎత్త డం లేదు. అన్ని బల్దియాల్లో జంక్షన్లు ఏర్పాటు చేసే లా చూడాలని ఆయా పట్టణ ప్రజలు కోరుతున్నారు. పనిచేయని ఫౌంటేన్లు ప్రజలకు అందని ఆహ్లాదం రూ.35లక్షల ప్రజాధనం వృథా జిల్లాకేంద్రంలోని జంక్షన్ల దుస్థితి ఇది జిల్లాకేంద్రంలో అత్యధికంగా రద్దీ ఉండే కొత్తబస్టాండ్ చౌరస్తా. ఎలాంటి సమావేశమైనా ఇక్కడే చేపడతారు. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, భారతదేశ చిత్రపటం ఏర్పాటు చేసి దాని చుట్టూ లాన్ ఏర్పాటు చేశారు. మంచిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఫౌంటేన్ కూడా పెట్టారు. నిర్వహణ గాలికొదిలేయడంతో ఫౌంటేన్ పనిచేయడం లేదు. ఎండకాలం కావడంతో లాన్ పూర్తిగా ఎండిపోతోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని పాతస్టాండ్ చౌరస్తా. ఇక్కడ జంక్షన్ ఏర్పాటు చేసి సుందరీకరణ పేరిట అందమైన బొమ్మలు, లాన్ ఏర్పాటు చేశారు. నిత్యం ఫౌంటేన్ ద్వారా నీరు పోస్తూ ఆహ్లాదం అందించేలా చూస్తామని ప్రకటించారు. కానీ.. అవి ఇప్పటివరకు పనిచేయడం లేదు. సుందరీకరణ చేపడతామన్న అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని గాలికొదిలేశారు. అందులో ఉన్న లాన్ పూర్తిగా ఎండిపోయింది. బొమ్మలు శిథిలావస్థకు చేరుతున్నాయి. -
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు
జగిత్యాల: అనధికారిక లేఔట్లు క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీ గడువును ఈనెల చివరి వరకు పొడిగించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అర్హులందరూ ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలన్నారు. రుసుం ఎంతో సెల్ఫోన్లో తెలుసుకోవచ్చన్నారు. అనధికారిక లేఔట్ చేసి, పది శాతం ప్లాట్లు విక్రయించుకున్న వారు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చన్నారు. ఆయిల్ పాం సాగుపై దృష్టి సారించాలిబుగ్గారం: వరికి ప్రత్యమ్నాయంగా ఆయిల్ పాం సాగు చేయాలని ఉద్యానవన శాఖ అధికారి స్వాతి సూచించారు. మండలంలోని చిన్నాపూర్, యశ్వంతరావుపేట గ్రామాల్లో బుధవారం వ్యవసాయశాఖ, ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఆయిల్ పాం పంటల సాగుపై అవగాహన కల్పించారు. మండలం ఇప్పటివరకు 300 ఎకరాల్లో ఆయిల్ పాం సాగవుతోందని, 90 శాతం సబ్సిడీ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎంఎవో అక్షిత, ఏఈవో శ్రీనివాస్, నవీన్, కార్యదర్శి సతీష్, రాజు తదితరులున్నారు. ఈఎంటీ సేవలు అభినందనీయంజగిత్యాల: జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల (ఈఎంటీ) సేవలు అభినందనీయమని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. బుధవారం జాతీయ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. 108లో సిబ్బంది చేస్తున్న సేవలు గొప్పవని, క్షతగాత్రులు, గర్భిణులు, ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదాల్లో బాధితులను వెంటనే ఆస్పత్రులకు తీసుకువచ్చి వారి ప్రాణాలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, 108 కో–ఆర్డినేటర్ రాము, కుమారస్వామి, భూమేష్ తదితరులు ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన జిల్లా పశువైద్యాధికారిజగిత్యాల: జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారిగా వేణుగోపాల్‌రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను తెలంగాణ నాన్‌గెజిటెడ్ వెటర్నరీయన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి పూర్ణచందర్, గరిగంటి రవి, గణేష్, రవీందర్, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. డీఈవోకు సన్మానంజగిత్యాల: పదో తరగతి పరీక్షలను విజయవంతంగా నిర్వహించినందుకు డీఈవో రామును పీఆర్టీయూ నాయకులు బుధవారం ఘనంగా సత్కరించారు. పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించడం అభినందనీయమన్నా రు. పీఆర్టీయూ అధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి అమరనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫౌంటేన్లతో అందం
జిల్లా కేంద్రంలోని ఫౌంటేన్లను బాగుచేయాలి. అందులో అన్ని పరికరాలు ఉన్నా.. ఆహ్లాదం మాత్రం పంచడం లేదు. పరికరాలను బాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జంక్షన్లు, డివైడర్ల మధ్యలో నీరు పోస్తుంటే చల్లదనంగా ఉంటుంది. – కల్యాణ్, జగిత్యాల నిత్యం పనిచేయాలి ఫౌంటేన్లు నిత్యం పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్, పాతబస్టాండ్‌లలో అత్యధిక జనం సంచరిస్తుంటారు. నిత్యం వందలాది వాహనాలు వెళ్తూ వస్తుంటాయి. ప్రజలకు ఆహ్లాదం పంచేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. – బైరం హరికిరణ్, జగిత్యాల ● -
చెరువులకు నీటి గండం
మల్యాల: మండలకేంద్రానికి చుట్టూ నీరున్నా.. చెరువుల్లో మాత్రం చుక్క ఉండడం లేదు. చెరువులు నింపాలని ఏళ్ల తరబడి రైతుల విన్నపాలు అరణ్యరోదనే అవుతున్నాయి. మండలకేంద్రంలోని రైతులు, ప్రజలకు సాగు, తాగునీటికి ము ఖ్య ఆధారం సూరప్ప, రావి చెరువులు. ఈ రెండు చెరువులు నింపాలని రైతులు ఏళ్లతరబడిగా వేడుకుంటున్నారు. ఏటా వేసవిలో భూగర్భజలా లు ఎండిపోతుండడంతో వ్యవసాయ బావుల్లో ఊట తగ్గి పొలాలకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. ఈ పరిసర ప్రాంతాలకు ఇటు ఎస్సారెస్పీ నీరుగాని, అటు వరదకాలువ నీరుగాని అందించడం లేదు. 30ఏళ్ల క్రితం సూరప్ప చెరు వు నింపేందుకు కొంపల్లె సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ నుంచి పైపులైన్ వేసినా ఆశించిన ఫలితం కనిపించలేదు. మల్యాలకు పశ్చిమాన వరదకాలువ, ఈశాన్యం, తూర్పున ఎస్సారెస్పీ కాలువ నీటితో పరిసర గ్రామాల్లో ధాన్యరాశులు కళకళలాడుతుంటే మండలకేంద్రంలోని చెరువులు నింపేందుకు ఇటు అధికారులుగాని, అటు రాజకీయ నాయకులుగాని చొరవ చూపడం లే దు. వరదకాలువతో మండలంలోని రాంపూర్, ఒబులాపూర్, మద్దుట్ల, గొల్లపల్లి, రామన్నపేట, పోతారం, నూకపల్లి, ముత్యంపేట, సర్వాపూర్, తాటిపల్లి గ్రామాలకు సాగునీరు అందుతోంది. ఎస్సారెస్పీ కాలువ ద్వారా మానాల, మ్యాడంపల్లి, తక్కళ్లపల్లి, లంబాడిపల్లి గ్రామాలకు సాగునీరందుతోంది. అయితే రావి చెరువు, సూరప్ప చెరువులకు మాత్రం ఇటు ఎస్సారెస్పీ నుంచిగానీ.. వరదకాలువ ద్వారాగానీ నీరు నింపిన దాఖలాలు లేవు. ఎనిమిదేళ్ల క్రితం తూము ఏర్పాటు ముత్యంపేట శివారులో వరదకాలువకు ఎనిమి దేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే బొడిగె శోభ వరదకాలువకు తూము నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. వరదకాలువ లోతు ప్రాంతంలో తూము ఏ ర్పాటు చేయడంతో ఆరు మీటర్ల నీరు ఉన్నప్పటి కీ నీరు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఏనాడూ సూరప్ప చెరువును నింపిన పాపాన పోలేదు. ముత్యంపేట శివారులోనే వరదకాలువకు మరో తూము ఏర్పాటు చేస్తామని గతంలో నాయకులు హామీలు ఇచ్చినా బుట్ట దాఖలే అయింది. వరదకాలువకు తూము ఏర్పా టు చేసి.. మారేడు కుంట, భీమన్న చెరువు, మ త్తడి చెరువు, రావి చెరువు, సూరప్ప చెరువు నింపాలని ప్రతిపాదనలు చేసినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. వర్షాకాలంలో వర్షపు నీరు మినహా మరోచోటి నుంచి వరదవచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఏటా ఎండిపోతున్న రావి, సూరప్ప చెరువులు మండలకేంద్రానికి నీటి ఇబ్బందులు తీరెదెన్నడో..? -
అక్రమాలకు పాల్పడితే చర్యలు
మెట్పల్లి: అమ్మకాల్లో వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో బుధవారం తనిఖీలు చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్‌బుక్‌లను పరిశీలించి వ్యాపారులకు పలు సూచనలు చేశారు. ధరలు, నిల్వలకు సంబంధించిన వివరాలను బోర్డుపై ప్రతిరోజు ప్రదర్శించాలన్నారు. తప్పనిసరిగా ఈ–పాస్ విధానంలోనే అమ్మకాలు జరపాలన్నారు. ఎరువులు, విత్తనాల విషయంలో రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేయవద్దన్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఏఓ దీపిక ఉన్నారు. -
వ్యక్తి అంత్యక్రియల్లో శునకం
కోరుట్లరూరల్: ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా.. ఎక్కడి నుంచో వచ్చిన శునకం అతడి శవయాత్రలో నడిచి వచ్చి చితిపక్కన పడుకొని ఏడ్చింది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత బంధువులతో కలిసి ఇంటికి చేరుకుని అక్కడ కూడా ఏడ్వడం ఆ గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. కోరుట్ల మున్సిపల్ పరిధిలోని యెఖీన్పూర్కు చెందిన గాంధారి కిశోర్ (42) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. అప్పటివరకూ గ్రామంలో కనిపించని ఓ శునకం అకస్మాత్తుగా కిశోర్ శవయాత్రలో దారిపొడువునా నడిచింది. అతడి చితిపక్కన పడుకొని కొద్దిసేపు ఏడ్చింది. అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటి వరకు వెళ్లి కిశోర్ మృతదేహాన్ని ఉంచిన స్థలం వద్ద పడుకొని ఏడ్వటం ఆశ్చర్యానికి గురి చేసింది. కిశోర్ 14ఏళ్ల వయసులో అతడి తండ్రి మృతి చెందాడు. ఇప్పుడు కిశోర్ కుమారుడికి కూడా 14 ఏళ్లే. కిశోర్ తండ్రి హన్మాండ్లు ఆత్మ శునకం రూపంలో వచ్చి ఉంటుందని గ్రామస్తులు చర్చించుకున్నారు. -
హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి
కథలాపూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి విరమించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కథలాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీల భూములను అమ్ముకోవడానికే విద్యాశాఖను సీఎం తన వద్ద ఉంచుకున్నారని ఆరోపించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ఖండించారు. విద్యార్థులు గళమెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేయడం దారుణమన్నారు. ప్రశ్నించేగొంతులను అణగదొక్కడమే ప్రభుత్వ విధానామా..? అని ప్రశ్నించారు. విద్యాసంస్థల భూములను అమ్మితే చరిత్రహీనులుగా మారడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కొండ ఆంజనేయులు, బద్దం మహేందర్, గడ్డం శేఖర్‌రెడ్డి, వినోద్‌రావు, తీట్ల శంకర్, ముస్కు భాస్కర్, ప్రిన్స్‌రెడ్డి, ముస్కు శ్రీనివాస్, కృష్ణారెడ్డి, రాజారెడ్డి పాల్గొన్నారు. -
‘ఉపాధి’ కూలీలకు వేసవి భత్యం ఇవ్వాలి
జగిత్యాలటౌన్: ఉపాధి కూలీలకు వేసవి భత్యం అందించాలని, రూ.400 కూలి చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఎస్సారెస్పీ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో నీటి సంఘాలను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని, ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు బండ శంకర్, చందా రాధాకిషన్, బొల్లి శేఖర్, గుంటి జగదీశ్వర్, మహ్మద్ భారీ, గుండ మధు, ముకేష్‌ఖన్నా పాల్గొన్నారు. సర్వాయి పాపన్నకు నివాళిజగిత్యాలటౌన్: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న అని అదనపు కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్లో బుధవారం పాపన్నగౌడ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం లత మట్లాడారు. సాధారణ గీత కార్మిక కుటుంబంలో పుట్టి బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోటను ఏలిన రాజు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన స్పూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, బీసీ వెల్ఫేర్ అధికారి రాజ్‌కుమార్, మెప్మా ఏఓ దుర్గపు శ్రీనివాస్‌గౌడ్, బండ శంకర్, హరి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పోలీస్‌యాక్ట్ అమలుజగిత్యాలక్రైం: శాంతిభద్రతల నేపథ్యంలో ఈనెల 30 వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎప్పుడో..?
రాయికల్: జిల్లాలోనే అతిపెద్ద మండలమైన రాయికల్‌లో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇందుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం 2018 మే 19న రాయికల్‌లో పైలెట్ ప్రాజెక్ట్‌గా రాయికల్‌లో అప్పటి కలెక్టర్ శరత్ సేవలను ప్రారంభించారు. రెండేళ్ల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ సేవలు పట్టణ, మండల ప్రజలకు అందాయి. ఈ సేవల ద్వారా కేవలం రెండేళ్లలో ప్రభుత్వ ఖజానాకు రూ.4 కోట్ల ఆదాయం వచ్చింది. వ్యవసాయేతర సేవలకు ఇబ్బందులు రిజిస్ట్రేషన్ల కోసం జగిత్యాలకు వెళ్లాల్సిందే నాడు పైలెట్ ప్రాజెక్ట్‌గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంజగిత్యాలకు వెళ్తున్నాం రాయికల్ తహసీల్ కార్యాలయంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ సేవలు లేకపోవడంతో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాలకు వెళ్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దూరభారంతోపాటు సమయం కూడా వృథా అవుతోంది. రాయికల్‌లోనే ఏర్పాటు చేస్తే మేలు. – ఎలిగేటి రామకృష్ణ రాయికల్ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు జగిత్యాలకు వెళ్లాల్సిందే.. రాయికల్ మున్సిపాలిటీతోపాటు, మండలంలోని 32 గ్రామాలకు చెందిన ప్రజలు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దూరభారంతోపాటు, సమయం కూడా వృథా అవుతోంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద రాయికల్‌ను ఎంపిక చేయగా వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ సేవలతో రూ.4 కోట్ల ఆదాయం వచ్చినా జగిత్యాలకు తరలించడంతో పట్టణ, మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రాయికల్తోపాటు ధర్మపురిలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మపురిలో మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ధర్మపురితో పోల్చితే రాయికల్‌లోనే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతాయి. ఈ క్రమంలో రాయికల్‌లో రిజిస్ట్రేషన్ లేదా తహసీల్ కార్యాలయంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. -
పల్లె దవాఖానాలతో నిరుపేదలకు వైద్యసేవలు
రాయికల్: గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలతో నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం రాయికల్ మండలం మైతాపూర్లో ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా, సన్నబియ్యం పథకం, ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. మైతాపూర్లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద నిర్మించే సీసీరోడ్డుకు భూమిపూజ చేశారు. ఏడుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణలో అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేయించామని గుర్తుచేశారు. సివిల్ సప్లై అధికారి జితేందర్‌ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, ఆర్ఎంవో విజయ్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ సతీశ్, ఎంపీవో సుష్మ, ఏఈ ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, ఏఎంసీ మాజీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తా జగిత్యాల: జగిత్యాల అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. మోతెలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాలలో 300 ఎకరాలతో కాడా, 4,520 డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేయించామన్నారు. నూకపల్లి, నర్సింగాపూర్‌లో 188 ఎకరాలు కలిపేందుకు గవర్నర్ ఆమోదమే మిగిలిందన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని 4వ వార్డులో రూ.57 లక్షలతో చేపడుతున్న రోడ్లకు భూమిపూజ చేశారు. సన్నబియ్యం నిరుపేదల పాలిట వరం జగిత్యాల: సన్న బియ్యం పంపిణీ నిరుపేదల పాలిట వరమని ఎమ్మెల్యే అన్నారు. బుడిగజంగాల కాలనీలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. 30వేల కుటుంబాలకు లబ్ధి జరుగుతుందన్నారు. ఆర్డీవో మధుసూదన్, సివిల్ సప్లై డీఎం జితేంద్రప్రసాద్, బల్దియా కమిషనర్ స్పందన తదితరులు ఉన్నారు. ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ -
జనావాసాల్లో స్లాటర్ హౌస్‌లు
జగిత్యాల: పురపాలక చట్టం ప్రకారం మేకలు, గొర్రెలను కచ్చితంగా స్లాటర్హౌస్లోనే వధించాలి. కానీ.. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో ఎక్కడ పడితే అక్కడే మాంసం విక్రయాలు చేపడుతున్నా ప్రజారోగ్యాన్ని మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగస్వాములు కావాలంటే మున్సిపల్లో తక్షణంగా ప్రతిచోట కబేళాలు ఏర్పాటు చేసుకోవాలని షరతు ఉంది. అయితే జిల్లాలోని మున్సిపాలిటీల్లో మాత్రం జనవాసాల్లో.. రోడ్లపైనే జంతువధ కొనసాగుతోంది. మాంసం విక్రయాలు అధికం సెలవురోజులతో పాటు, ఆదివారాల్లో అయితే దాదాపు 90 శాతం మంది మేక, గొర్రె మాంసం కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న విక్రయదారులు నాణ్యత లేని మాంసాన్ని అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. తూకంలోనూ 100 నుంచి 150 గ్రాములు తక్కువ విక్రయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మాంసం విక్రయదారులు ఇదే అదునుగా భావించి ఇష్టానుసారంగా ప్రజలకు అంటగడుతుంటారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి నిబంధనల ప్రకారం స్లాటర్ హౌస్‌లోనే జంతువులను వధించి పశువైద్యాధికారితో ముద్రించబడిన మున్సిపాలిటీ మేక, గొర్రెలపై ముద్ర ఉన్న వాటినే మాంసం కొనుగోలు చేసుకోవాలి. కొందరు ఈ ముద్రను ఉంచి ఇతర మాంసం కూడా అమ్ముతుంటారు. ప్రజలు జాగ్రత్తగా గమనించి మున్సిపాలిటీ ముద్రించిన మాంసాన్ని కొనుగోలు చేసుకోవాలి. లోపిస్తున్న పారదర్శకత మాంసం విక్రయాల్లో పారదర్శకత లోపిస్తోంది. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మాంసం విక్రయదారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం పశుసంవర్థక శాఖ వైద్యాధికారి పర్యవేక్షణలో స్లాటర్ హౌస్‌ల వద్ద మేకలు, గొర్రెలు కోయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ కోసి విక్రయాలు కొనసాగిస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో చనిపోయినవి, రోగాల బారిన పడినవి కోస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ స్లాటర్‌హౌస్‌లో కోసిన మాంసం మార్కెట్లలోనే విక్రయించాల్సి ఉంటుంది. కానీ ఆవాస ప్రాంతాల్లో అనుమతి లేకుండానే అమ్ముతున్నారు. వీటన్నింటిని తరలించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. నిబంధనల ప్రకారం వధించే గొర్రెలు, మేకలను ఒకరోజు ముందే మార్కెట్‌కు తీసుకొస్తే వాటికి పరీక్షలు చేసిన అనంతరం అనుమతించాల్సి ఉంటుంది. ఇవన్నీ పాటించకుండా మాంసం విక్రయదారులు ఇష్టారాజ్యంగా మేకలు, గొర్రెలు వఽ దిస్తూ జేబులు నింపుకుంటున్నారు. నియంత్రించా ల్సిన స్థానిక సంస్థల అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజారోగ్యానికి విఘాతం కలుగుతోంది. నిబంధనలు హుష్‌కాకి మున్సిపాలిటీల్లోనే మాంసం మార్కెట్లు ఉండాలనే నిబంధనలున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీలో మార్కెట్లు ఉన్నప్పటికీ ఎక్కువగా వీధుల్లోనే విక్రయిస్తున్నారు. ప్రతి ఆదివారం జిల్లాలోని మున్సిపాలిటీలో వెయ్యికి పైగా గొర్రెలు, మేకలను కోస్తుంటారు. పండగ సీజన్లలో మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు అమ్ముడు పోని మాంసాన్ని రెండుమూడు రోజులు నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం. కనిపించని పశువైద్యాధికారులు నిబంధనల ప్రకారం స్లాటర్ హౌస్‌లో జంతువుల ను కోసే ముందు పశువైద్యాధికారి ధ్రువీకరణ ప త్రం ఇవ్వాల్సి ఉంటుంది. గొర్రెలు, మేకలు నాణ్యౖ మెనవేనా..? రోగాల బారిన పడినవా..? లేదా..? పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా ఒక పశువైద్యాధికారిని ని యమించుకోవాల్సి ఉంటుంది. కానీ.. బల్దియాల్లో పశువైద్యాధికారులు కనిపించడం లేదు. స్లాటర్ హౌస్‌ల వద్ద శానిటరీ ఇన్స్పెక్టర్లే పర్యవేక్షిస్తున్నారు. నాణ్యతలేని మాంసం విక్రయాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులు ప్రజారోగ్యం పట్టని అధికారులుస్లాటర్హౌస్లు అందుబాటులోకి వస్తే.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో కేవలం జగిత్యాలలో మాత్రమే స్లాటర్‌హౌస్ ఉంది. కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురిలో లేవు. ఈ బల్దియాలో ఎక్కువ శాతం జనావాసాల మధ్యే కోస్తున్నారు. స్లాటర్‌హౌస్‌ల్లో జీవాలను అక్కడ వధిస్తే వ్యాపారులకు కోల్డ్ స్టోరేజీ కూడా ఉంటుంది. అవసరమైతే మాంసం నిల్వ చేసుకోవచ్చు. జీవాలను వధించిన తర్వాత వాటి చర్మం, రక్తం, ఇతర వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాలతో పాటు వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండి మాంసం నాణ్యతను పరిశీలిస్తారు. జిల్లా కేంద్రంలోని స్లాటర్ హౌస్‌కు ఎలాంటి టెండర్ వేయకపోవడంతో మాంసం విక్రయదారులు స్లాటర్‌హౌస్‌లో ఊరికనే కోసుకుంటున్నారు. మేకకు రూ.10 నుంచి రూ.20 చొప్పు నిర్ణయిస్తే అటు మున్సిపాలిటీకి ఆదాయం లభిస్తుంది. కొందరు ఫంక్షన్లకు సంబంధించిన మేకలు, గొర్రెలను ఇందులోనే కట్ చేస్తున్నారు. -
● అమల్లోకి వచ్చిన వేతనాలు ● వేసవిలో కూలీలకు లబ్ధి ● జిల్లాలోని 382 గ్రామాల్లో 1,67,497 జాబ్‌కార్డులు
రాయికల్: ఉపాధిహామీ కూలీల వేతనాన్ని రూ.307కు పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 382 గ్రామాల్లోగల 1,67,497 మంది జాబ్కార్డుదారులుకు లబ్ధి చేకూరనుంది. 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఆ సమయంలో దినసరి కూలీ రూ.87.50 చెల్లించింది. పదేళ్ల క్రితం వరకు రూ.190 మాత్రమే చెల్లించేవారు. అప్పటి నుంచి ఏటా 10 నుంచి 25 శాతం వరకు కేంద్రం కూలి పెంచుతోంది. ఈ ఏడాది అది రూ.307కు పెరిగింది. మొన్నటివరకు రూ.300వరకు వేతనం అందుకున్న కూలీలు.. ఈ ఏడాది కేవలం రూ.7 మాత్రమే పెంచడంతో కొంతవరకు అసంతృప్తి వ్యక్తమవుతోంది. వ్యవసాయేతర పనులకే ఎక్కువ జిల్లాలో జాబ్‌కార్డు కలిగిన ఉపాధి కూలీలు ఉపాధి పనులకంటే వ్యవసాయేతర పనులపైవే మొగ్గుచూపుతున్నారు. ఒక్కో కూలీ ప్రతిరోజు వ్యవసాయేతర పనులు చేయడం ద్వారా రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదించుకుంటున్నారు. దీంతో చాలామంది వ్యవసాయేతర పనుల వైపు మొగ్గుచూపుతున్నారు. కేవలం వేసవికాలంలోని మూడు నాలుగు నెలలు మాత్రమే ఉపాధి పనులకు హాజరవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దినసరి వేతనం మరింత పెంచాలని కూలీలు కోరుతున్నారు.ఉపాధిహామీ పనుల్లో కూలీలు పెంచిన కూలి అమలు చేస్తాం దినసరి కూలి రూ.307 అమలు చేస్తాం. జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఉపాధిహామీ కూలీ ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేయాలి. అంతేకాకుండా గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్యను పెంచేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. – రఘువరణ్, డీఆర్డీవో పీడీ -
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
సారంగాపూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని, జిల్లా మాతా శిశు సంరక్షణాధికారి డాక్టర్ జయపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసిబ్బందితో సమావేశమయ్యారు. బీర్పూర్ మండలకేంద్రంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణ ప్రసవం చేయించుకునేలా ఏఎన్ఎం, ఆశాలు వారి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. బీర్పూర్ పల్లెదవాఖానాను త్వరలో కేంద్ర జాతీయ ప్రమాణాల బృందం పరిశీలించనుందని, ఇందుకు అనుగుణంగా రికార్డులు, సేవలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆయన వెంట వైద్యాధికారి డాక్టర్ రాధారెడ్డి, సీహెచ్‌వో కుద్దుస్, సూపర్వైజర్లు కిశోర్, తార, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్ఎం, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. -
వాహనాల పార్కింగ్ వేలం రద్దు
● మొదటిసారి ఎక్కువ.. రెండోసారి తక్కువ ● ధర్మపురి బల్దియాలో రసవత్తరంగా వేలం ప్రక్రియధర్మపురి: ధర్మపురి మున్సిపాలిటీలో అధికారులు చేపట్టిన వాహనాల పార్కింగ్ వేలం రెండోసారి వాయిదా పడింది. మొదటిసారి వేలం నిర్వహించగా కాంట్రాక్టర్లు పోటాపోటీగా పాడారు. అనంతరం వెనక్కి తగ్గారు. కొద్దిరోజుల క్రితం రెండోసారి వేలం వేయగా తక్కువకు పాడడంతో అధికారులు రద్దు చేశారు. దీంతో మూడోసారి నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో 2025–2026కు గానూ వాహనాల పార్కింగ్ కోసం కమిషనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో మార్చి 27న వేలం నిర్వహించారు. వారసంత, పశువుల సంత వేలం గుట్టుచప్పుడు లేకుండా ప్రశాంతంగా సాగించారు. పార్కింగ్ వేలానికి వచ్చే సరికి పోటీ భారీగా పెరిగింది. వేలంలో పాల్గొనే వారు మున్సిపల్ నిబంధనల ప్రకారం ముందుగా రూ.మూడు లక్షల విలువైన డీడీ తీయాల్సి ఉంటుంది. ఆరుగురు వ్యక్తులు రూ.18 లక్షల డీడీలతో వేలంలో పాల్గొన్నారు. ముగ్గురి మధ్య పోటీ రసవత్తంగా సాగింది. ఇందులో ధర్మపురికి చెందిన అప్పం తిరుపతి అత్యధికంగా రూ.60.75 లక్షలకు వేలం పాడారు. రెండో పోటాదారు కాశెట్టి రాజేశ్ రూ.60.70 లక్షలకు పాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం భారీగా పెరిగింది. మార్చి 31న వేలం సగం చెల్లించి ఈనెల ఒకటి నుంచి వాహనాలకు రుసుం వసూలు చేసుకోవాల్సి ఉండేది. అయితే అప్పం తిరుపతి తనకు కాంట్రాక్టు వద్దని అధికారులకు సరెండర్ అయ్యాడు. రెండోపాట దారు కాశెట్టి రాజేశ్ కూడా చేతులెత్తేశాడు. డీడీల రద్దుపై సందిగ్ధం ఇద్దరు వ్యక్తులు అత్యధికంగా పాట పాడి రద్దు చేసుకోవడంతో డీడీల రూపంలో వారు తీసిన రూ.ఆరు లక్షలు మున్సిపల్ అధికారులు జప్తు చేసుకుంటారా..? లేక వారికి మరో అవకాశం ఇవ్వనుందా అనే సందిగ్ధం నెలకొంది. ఒకవేళ జప్తు చేసుకుంటే మొదటి పాటాదారుడిది చేస్తారా..? లేక ఇద్దరిదీ చేస్తారా..? అనేది అధికారుల నిర్ణయంపై ఆధాపడి ఉంటుంది. మరోవైపు మార్చి 30న రెండోసారి వేలం నిర్వహించగా.. అతి తక్కువ రూ.41.20లక్షలకు ఓ వ్యక్తి కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఆదాయం తక్కువగా రావడంతో మున్సిపల్ అధికారులు దానిని రద్దు చేసి మూడోసారి వేలం వేసేందుకు అధికారులు నిర్ణయించారు. -
తూకంలో తక్కువగా వస్తుంది
మాంసం కిలో కొంటే 900 గ్రాములు మాత్రమే వస్తోంది. దీంతోపాటు మున్సిపల్ అధికారులు సైతం చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్నారు. ము న్సిపల్ ముద్ర కూడా ఉండటం లేదు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – ఎర్ర రాజేందర్, జగిత్యాల చర్యలు తీసుకుంటాం జిల్లా కేంద్రంలో మాంసం క్రయవిక్రయాలపై స్లాటర్హౌస్లోనే కొసేలా చర్యలు తీసుకుంటున్నాం. జవాన్లు అందరికీ ఆదేశాలు జారీ చేశాం. ఏమైనా తూకాల్లో తేడాలు వచ్చినా.. అనారోగ్యానికి గురైన, మేకలు, గొర్రెలు కోసినా చర్యలు తీసుకుంటాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్, జగిత్యాలస్లాటర్హౌస్లు ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీలో స్లాటర్‌హౌస్ ఏర్పాటు చేయాలి. అవి లేకపోవడంతో జనవాసాల మధ్యనే మాంసం విక్రయిస్తున్నారు. అవి మంచివో కావో తెలియని పరిస్థితి. అధికారులు స్పందించి స్లాటర్‌హౌస్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. – నవీన్, మెట్పల్లి -
పేదలందరికీ సన్నబియ్యం
● మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాల: పేదలందరికీ సన్నబియ్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆహారభద్రత చట్టాన్ని రూపొందించారని గుర్తు చేశారు. ప్రతి పౌరుడికి 6 కిలోల బియ్యం ఇవ్వడం హర్షణీయమన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీ, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, సుభాష్, రమేశ్, స్వామిరెడ్డి, రఘువీర్ పాల్గొన్నారు. 11న జగిత్యాల, కోరుట్ల బార్ అసోసియేషన్ ఎన్నికలు జగిత్యాలజోన్/కోరుట్ల: ఈనెల 11న జగిత్యాల, కోరుట్ల బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జగిత్యాల, కోరుట్ల ఎన్నికల అధికారులు నక్కల సంజీవరెడ్డి, ఎండీ.ముబీన్పాషా తెలిపారు. జగిత్యాలలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, లైబ్రరీ సెక్రటరీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, మహిళా ప్రతినిధి, 10 మంది కార్యవర్గ సభ్యుల పదవులకు ఎన్నికలు ఉండనున్నాయి. ఈనెల 3, 4తేదీల్లో నామినేషన్ల దాఖలు, 5న పరిశీలన, 7న ఉపసంహరణ, 11న ఎన్నికలు నిర్వహించి, ఫలితాల ప్రకటన ఉంటుంది. అధ్యక్ష స్థానానికి పోటీ చేసే వారు న్యాయవాదిగా 20 ఏళ్ల సీనియార్టీ, రూ.8వేల నామినేషన్ ఫీజు, ఉపాధ్యక్ష స్థానానికి పోటి చేసే వారు న్యాయవాదిగా 15 ఏళ్ల సీనియార్టీ, రూ.6 వేల నామినేషన్ ఫీజు, ప్రధాన కార్యదర్శిగా న్యాయవాదిగా 12 ఏళ్ల సీనియార్టీ, రూ.6వేల నామినేష న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని సంజీవరెడ్డి తెలి పారు. కోరుట్లలో ఈనెల 2, 3 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 7న ఉప సంహరణ, 11న ఎన్నికలు ఉంటాయని ముబీన్ పాషా పేర్కొన్నారు. -
యమ ధర్మరాజుకు ప్రత్యేక పూజలు
ధర్మపురి: భరణి నక్షత్రం సందర్భంగా శ్రీయమధర్మరాజు దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నృసింహాస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆయుష్షు హోమం హారతి, మంత్రపుష్పం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, సూపరింటెండెంట్ కిరణ్ తదితరులున్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా నవీన్కథలాపూర్: నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అ ధ్యక్షుడిగా మండలంలోని భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్ పీడీ వాసం నవీన్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకులు మంగంపెల్లి హుస్సేన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నవీన్‌కుమార్ పాఠశాలల్లో పీడీగా విధులు నిర్వర్తిస్తూనే తీరిక వేళల్లో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా నియమించామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవీన్‌కుమార్ నియామకం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షసూచనజగిత్యాలఅగ్రికల్చర్: ఈ నెల రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత తెలిపారు. రాబోయే ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36నుంచి 38 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపుజగిత్యాల: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించిందని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యలు వస్తే ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. 4న జిల్లాకు ఎస్సీ, ఎస్టీ చైర్మన్ రాకజగిత్యాల: ఎస్సీ, ఎస్టీ కమిటీ చైర్మన్, సభ్యులు జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం వేములవాడ రాజన్నను దర్శించుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు కలెక్టరేట్లో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. హెచ్‌సీయూ భూములు అమ్మొద్దుజగిత్యాల: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాలను వెంటనే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. కొత్తబస్టాండ్ వద్ద మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకుని అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో తిరుపతినాయక్, వినోద్‌నాయక్ పాల్గొన్నారు. -
రైస్‌మిల్లులో గంజాయి మొక్కలు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): కాట్నపల్లి గ్రామ శివారులోని ఓ రైస్‌మిల్లులో గంజాయి మొక్కల పెంపకం సోమవారం బయటపడింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్ రైస్‌మిల్లుకు చేరుకుని గంజాయి మొక్కలు పరిశీలించారు. ఆ సమయంలో యాజమాన్యం, కార్మికులు ఎవరూ అందుబాటులో లేరు. యాజమాన్యానికి సమా చారం ఇచ్చినా స్పందించలేదు. రాత్రివరకూ విచారణ చేపట్టి.. చవరకు కాట్నపల్లి గ్రామానికి చెందిన మేకల పవన్‌కల్యాన్, బిహార్‌కు చెందిన లాల్ అరోబిహార్తోపాటు కాట్నపల్లికి చెందిన రైస్‌మిల్లు యజమాని మట్ట శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం
● గ్రామాల్లో 407 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక ● ఈనెల రెండోవారంలోపు అన్నిచోట్ల ప్రారంభంజగిత్యాల అగ్రికల్చర్: యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సీజన్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ప్రస్తుతం యాసంగిలో ఏర్పాటుచేసేలా జిల్లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలన్నింటినీ ఈనెల రెండో వారంలోపు ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారు. యాసంగిలో ఎక్కడైనా సన్న ధాన్యం సాగు చేస్తే కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 407 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 407 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సింగిల్ విండోల ఆధ్వర్యంలో 273, ఐకేపీ 133, మెప్మా ఆధ్వర్యంలో ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,320, కామన్ రకానికి రూ.2,300 చొప్పున కొనుగోలు చేయనున్నారు. 2.96 లక్షల ఎకరాల్లో వరి సాగు ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 2.96 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈసారి తెగుళ్లు, పురుగులు లేక అనువైన వాతావరణం ఉండటంతో ఎకరాకు సగటున 23 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి దొడ్డు ధాన్యం 68.08 లక్షల క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. సమస్యలు పునరావృత్తం కాకుండా.. ధాన్యం కొనుగోళ్లలో గతంలో మాదిరిగా సమస్యలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే వివిధ దఫాలుగా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సివిల్ సప్లై, డీఆర్డీఏ, సింగిల్ విండో, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే కొనుగోలు నిర్వాహకులకు శిక్షణ ఇచ్చారు. గన్నీ సంచులకు కొరత లేకుండా ఎప్పటికప్పుడు తెప్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించేలా లారీ ట్రాన్స్పోర్ట్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రెండు ప్యాడీక్లీనర్ మిషన్లు అందుబాటులో ఉంచాలని, వేసవికాలం అయినందున కొనుగోలు కేంద్రంలో మంచినీటి వసతి, నీడ వసతి కల్పించాలని సూచించారు. టోకెన్ పద్ధతిని అమలు చేయాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అధికారులతో మానిటరింగ్ బృందాలు కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా అధికారులతో మానిటరింగ్ బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారులు ఆ సమస్యను పరిష్కరించేలా కలెక్టరేట్లో కంట్రోల్‌రూంను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ ఏఈఓ, గ్రామ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శిలతో సమన్వయం చేస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాల వద్ద ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నారు. కోతలు ఆపండి జిల్లాలో వరి కోతలు ప్రారంభం అవుతున్నందున త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. గతంలో క్వింటాల్‌కు నాలుగైదు కిలోలను రైస్‌మిల్లర్లు కోత విధించి రైతుల శ్రమను దోచుకున్నారు. ఈ సారి అలా జరుగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. – రాజిరెడ్డి, శ్రీరాములపల్లె, గొల్లపల్లి మండలంఇబ్బందులు రానీయం రైతులకు ఇబ్బంది రాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. కలెక్టర్, అదనపు కలెక్టర్ నేతృత్వంలో మార్కెట్, రెవెన్యూ, వ్యవసాయ, సింగిల్ విండో, సివిల్సప్లై అధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించాం. పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేస్తూ ముందుకు సాగుతాం. – ప్రకాశ్, జిల్లా మార్కెటింగ్ అధికారి -
ప్రమాద బాధితుడి వైద్యానికి రూ.1.27లక్షల సాయం
ధర్మపురి: రోడ్డు ప్రమాదానికి గురై.. కాలు విరిగి.. వెన్నెముకకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమైన ఓ నిరుపేద యువకుడికి వైద్యం కోసం ఫేస్బుక్ మిత్రులు రూ.1.27 లక్షలు విరాళాలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా చిత్తూరు జిల్లా కేంద్రానికి చెందిన కొన నిరంజన్‌బాబు ఉపాధికోసం నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయారు. ఒంటరిగానే ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురై కాలు విరగడంతోపాటు వెన్నెముకకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమయ్యాడు. తన స్నేహితుల సహకారంతో వైద్యం చేయించుకున్నాడు. మరో రెండు నెలలు వైద్యం చేయించాల్సి ఉంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరంజన్‌బాబు వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నాడు. బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ నిరంజన్‌బాబు వైద్యానికి సాయం చేయాలని ఫేస్బుక్లో పోస్టు చేశాడు. స్పందించిన ఎన్నారైలు, ఇతర దాతలు బాధితుడి బ్యాంకు ఖాతాకు రూ.1.27 లక్షలు విరాళాలుగా పంపించారు. దాతలు అందించిన విరాళాలతో నిరంజన్‌బాబుకు వైద్య సేవలు కొనసాగిస్తున్నట్లు రమేశ్ తెలిపాడు. ● ఎల్లలు దాటిన ఔదార్యం -
పరువు హత్యకాదు.. కుట్రపూరిత హత్య
ఎలిగేడు(పెద్దపల్లి): ముప్పిరితోటకు చెందిన పూరె ల్ల సాయికుమార్‌ది పరువు హత్య కాదని, కుట్రపూరితంగా చేసిన హత్యేనని పౌరహక్కులు, విప్లవ రచయితలు, తెలంగాణ ప్రజాఫ్రంట్, దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు ఆరోపించారు. ముప్పిరితోటలో హత్య జరిగిన ప్రదేశాన్ని సోమవారం వారు సందర్శించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, దళిత లిబరేషన్ ఫ్రంట్ ప్రధానకార్యదర్శి మార్వాడి సుదర్శన్, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా కన్వీనర్ గుమ్మి కొమురయ్య మాట్లాడారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన పూరెల్ల పరుశరాములు–జ్యోత్స్న కుమారుడు సాయికుమార్ పదో తరగతి పూర్తిచేసి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అదే గ్రామంలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ముత్యం సమత–సదయ్యల కూతురు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తమ నిజనిర్ధారణలో తేలిందన్నారు. ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాలు, గ్రామస్తులకు తెలుసని అన్నారు. యువతి చదువు పూర్తయ్యాక పె ళ్లి చేసుకునేందుకు నిర్ణయించగా. ఇష్టం లేని యువ తి తల్లిదండ్రులతోపాటు మేనమామ సిద్ధ సారయ్య అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరి ప్రోద్బలంతో సాయికుమార్ హత్యకు కుట్ర చేశారని అన్నారు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సాయికుమార్‌ను గొడ్డలితో నరికి చంపారని తమ విచారణలో తేలిందని చెప్పారు. గతంలో రెండుసార్లు సాయికుమార్‌పై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదని తెలిపారు. అధికార, ప్రతిపక్షపార్టీలు ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ఈ హత్యను తాము ఖండిస్తున్నామని అన్నారు. ప్రేమ, కులం, మతం పేరిట జరిగే హత్యల నివారణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్కోర్టును ఏర్పాటు చేయాలని, సాయికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని వారు కోరారు. పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, విప్లవ రచయితల సంఘం కన్వీనర్ బాలసాని రాజయ్య, నాయకులు బొంకూరి లక్ష్మణ్, ఎన్.సత్యనారాయణ, పుట్ట రాజన్న, రెడ్డిరాజుల సంపత్ పాల్గొన్నారు. సాయికుమార్ హంతకులను కఠినంగా శిక్షించాలి పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
వెల్గటూర్: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన వంగపల్లి గౌతమి జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై ంది. ఈనెల 9న హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జాతీయస్థాయికి ఎంపికై నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. ఈనెల ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు యూపీలోని హత్రాస్‌లో జరిగే 53వ జాతీయస్థాయి సీనియర్ ఉమెన్ హ్యాండ్‌బాల్ పోటీలలో పాల్గొననుంది. గౌతమిని మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, సాన యాదిరెడ్డి, ఎంఈవో రాంచంద్రం, మాజీ సైనికులు వెంకటరమణారెడ్డి, సీనియర్ క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు. సైన్‌బోర్డులు ఏర్పాటు.. కూల్చివేతజగిత్యాల: జిల్లాకేంద్రంలో కొత్తబస్టాండ్ నుంచి కరీంనగర్రోడ్.. కొత్తబస్టాండ్ నుంచి నిజామాబాద్ వెళ్లే రోడ్లో సెంట్రల్ డివైడర్లు ఉన్నాయి. వీటి మధ్య సైన్‌బోర్డులు ఏర్పాటు చేసుకునేందుకు గతంలో కరీంనగర్‌కు చెందిన రెండు ఏజెన్సీలు మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నాయి. నిబంధనల ప్రకారమైతే అందులో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయరాదు. అయినా అప్పట్లో టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేసిన కీలక అధికారి, కమిషనర్ ఓ ఏజెన్సీకి ప్రొసీడింగ్ ఇచ్చారు. అప్పుడే అది వివాదాస్పదంగా మారింది. అయినా సదరు ఏజెన్సీ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నట్లు తెలిసింది. ఏడాది గడుస్తున్న నేపథ్యంలో రెన్యువల్ చేసుకోకుండా.. టౌన్‌ప్లానింగ్ అనుమతి తీసుకోకుండా మూడు రోజుల క్రితం కొత్తబస్టాండ్ నుంచి కరీంనగర్ రోడ్‌లోని డివైడర్లలో తాజాగా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు సోమవారం వాటిని కూల్చివేశారు. డివైడర్లలో సైన్‌బోర్డుల ఏర్పాటుకే అనుమతి లేదంటే ఇష్టారాజ్యంగా వెలుస్తుండడం మున్సిపాలిటీ అవినీతికి అద్దం పడుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఇలా ఏర్పాటు చేస్తున్నారాన్న ఆరోపణలూ వస్తున్నాయి. సైన్‌బోర్డులు, అడ్వర్టయిజ్మెంట్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటితో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. కూల్చివేస్తున్న మున్సిపల్ సిబ్బంది -
ఈద్ ముబారక్
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025జగిత్యాల/కోరుట్ల/ధర్మపురి: రంజాన్ వేడుకలను ముస్లింలు జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. జగిత్యాలలోని ఈద్గా, ఖిలా, జమా మసీదుల్లో ప్రార్థనలు చేశారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సంజయ్‌కుమార్, కల్వకుంట్ల సంజయ్, జీవన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అడువాల జ్యోతి, మాజీ కౌన్సిలర్లు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముఫ్తిమౌలానా, నౌషద్ అలీఅవేస్, ఖిలాలో హఫీజ్ అబ్రార్ షరీఫ్ ప్రార్థనలు నిర్వహించారు. సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు ఎంఏ.బారి, ఈద్గా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ జమీల్ అహ్మద్, నిహాల్ సిరాజోద్దీన్ మన్సూర్, లియాకత్ అలీ మోసిన్, అబ్దుల్ ముజాహిద్ ఖాదర్, ఎంఏ.ఇఫ్రాన్ సత్తర్ పాల్గొన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాలతో డీఎస్పీ రఘుచందర్ బందోబస్తు చేపట్టారు. ధర్మపురిలోని వక్ఫ్‌బోర్డు ప్రాంతంలోని ఈద్గాల వద్ద విప్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కోరుట్లలో ఎమ్మెల్యే సంజయ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. న్యూస్‌రీల్ -
రూ.350 కోట్ల అంచనాలతో యూజీడీ
● ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాల: జిల్లాకేంద్రంలో రూ.350 కోట్ల అంచనాలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ)కి ప్రక్రియ పూర్తయిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. ఈనెల 4న ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశముందని, స్వయంగా తానే హాజరవుతానని పేర్కొన్నారు. జగిత్యాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. సీఎం సహకారంతో ప్రత్యేక నిధులు కేటాయించేలా చూస్తున్నామని వివరించారు. త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జ్యోతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మరమ్మతు చేపట్టాలి
పైప్‌లైన్ వేసినప్పుడు సీసీరోడ్లు తవ్వి వదిలేశారు. వాటికి మరమ్మతు చేపట్టకపోవడంతో ఏ కాలనీకి వెళ్లినా రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. మున్సిపల్ పాలకవర్గాలు మారుతున్నా రోడ్లకు మాత్రం మరమ్మతు చేపట్టడం లేదు. ప్రజాప్రతినిధులు స్పందించాలి. – అల్లె నారాయణ,కోరుట్ల రోడ్లపై వెళ్తే నరకమే రాయికల్ మున్సిపాలిటీలో ఏ రోడ్డుకు వెళ్లినా ఇబ్బందిగా మారింది. ఇటీవల బల్దియాలో కొన్ని వార్డులకే రోడ్లు మంజూరయ్యాయి. అవి కూడా పూర్తి చేయలేదు. అధికారులు స్పందించి సీసీరోడ్లు ప్రతి కాలనీలో చేపట్టాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. – గోపాల్, రాయికల్ రోడ్ల పరిస్థితి అధ్వానం గత పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసిన రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతున్నాయి. నడవాలంటే ఇబ్బందిగా మారింది. పుణ్యక్షేత్రం కావడంతో నిత్యం భక్తులు వస్తుంటారు. రోడ్లు బాగుచేసేలా చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాస్, ధర్మపురి నిత్యం ప్రమాదాలే జిల్లాకేంద్రంలో ప్రధాన రహదారులపై అక్కడకక్కడ గుంతలున్నాయి. వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రతి గుంతలున్న చోట్లలో పూడ్చేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందికరంగా మారింది. చిన్నపిల్లలు సైతం పడిపోతున్నారు. – శ్రీనివాస్, జగిత్యాల -
రెండు దుకాణాల్లో చోరీ
హుజూరాబాద్: పట్టణంలో సోమవారం వేకువజామున రెండు దుకాణాల్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. హుజూరాబాద్ పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ చౌరస్తాలో పోరండ్ల సమ్మయ్యకు చెందిన రాఘవేంద్ర కిరాణం, జనరల్ స్టోర్ షట్టర్ తాళాలు పగలగొట్టి కౌంటర్లోని రూ.25 వేల నగదును, సామగ్రి ఎత్తుకెళ్లారు. అలాగే వరంగల్ రోడ్డులోని పరమేశ్వర ఎలక్ట్రికల్, వైండింగ్ దుకాణం షట్టర్ తాళాలు తీసి కౌంటర్లోని రూ.25 వేల నగదు, ఐదు తులాల వెండి దొంగిలించారు. కాగా దొంగలు వేకువజామున 2.30 గంటలకు రాఘవేంద్ర కిరాణం, 3.30 గంటలకు ఎలక్ట్రికల్ షాప్ తాళాలు తెరిచే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తిరుమల్‌గౌడ్ తెలిపారు. -
వస్త్రోత్పత్తికి సబ్సిడీ పవర్
సిరిసిల్ల: నష్టాల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2001 నుంచి 50 శాతం సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. 24 ఏళ్లుగా ఈ సబ్సిడీని కొనసాగిస్తోంది. వస్త్రోత్పత్తి సాంచాలను కుటీరపరిశ్రమగా గుర్తిస్తూ కేటగిరీ–4లో విద్యుత్‌ను రూ.4కు యూనిట్‌ను సరఫరా చేశారు. ఇందులో ప్రభుత్వం ప్రతీ యూనిట్‌కు రూ.2 భరిస్తుండగా.. సాంచాల యజమానులు మిగతా రూ.2 ‘సెస్’కు చెల్లించేవారు. ఇలా 24 ఏళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యుత్ సబ్సిడీ కొనసాగుతోంది. కానీ 2001లో ఇచ్చిన జీవో ప్రకారం 20 సాంచాలు(అంటే 10 హెచ్‌పీల) వరకే ఈ విద్యుత్ సబ్సిడీని అందించాలని స్పష్టం చేశారు. కానీ సిరిసిల్లలో నెలకొన్న ఆకలిచావులు, ఆత్మహత్యల నేపథ్యంలో 10 హెచ్‌పీల నిబంధనను ఎవరూ అమలు చేయలేదు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లి 10 హెచ్‌పీల నిబంధన అమలు చేయాలని ఆర్డర్ తేవడంతో సబ్సిడీ సమస్య తెరపైకి వచ్చింది. మరోవైపు చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ ఎల్ఆర్.ఆర్సీ నంబరు 895/2014–పి.తేదీ: 20.05.2024 ద్వారా సిరిసిల్లలోని వస్త్రోత్పత్తి సాంచాలకు సంబంధించిన పరిశ్రమల టారిఫ్ అమలు చేయాలని 10 హెచ్‌పీల నిబంధనల అమలులోకి తేవాలని కోరారు. బ్యాక్ బిల్లింగ్‌తో సమస్యలు కోర్టు ఆదేశాలు.. చేనేత జౌళిశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో సిరిసిల్లలో 119 కార్ఖానాలకు విద్యుత్ సబ్సిడీని రద్దు చేసిన సిరిసిల్ల ‘సెస్’ అధికారులు వంద శాతం బిల్లింగ్ చేశారు. 20 సాంచాల కంటే ఎక్కువ సాంచాలు ఉన్న కార్ఖానాలకు విద్యుత్ సబ్సిడీ లేకుండా వినియోగించిన ప్రతీ యూనిట్‌కు రూ.7.80 చొప్పున బిల్లులు ఇచ్చారు. దీంతో గతంలో ప్రతీ యూనిట్‌కు రూ.2 చెల్లించిన వస్త్రోత్పత్తిదారులు ఇప్పుడు రూ.7.80 చెల్లించలేక కార్ఖానాలను మూసివేశారు. 2017 నుంచి వినియోగించిన విద్యుత్‌కు బ్యాక్ బిల్లింగ్ పేరిట ఒక్కో కార్ఖానాకు రూ.10లక్షల నుంచి రూ.1.20కోట్ల వరకు విద్యుత్ బిల్లులు విధించారు. బ్యాక్ బిల్లింగ్ చెల్లించలేక కొందరు కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందగా.. అదీ తాత్కాలికమే కావడంతో బ్యాక్‌బిల్లింగ్ సమస్య పెండింగ్‌లో ఉంది. ఇటీవల తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ డాక్టర్ డి.నాగార్జున్ సిరిసిల్లలో బహిరంగ విచారణ చేపట్టారు. బ్యాక్ బిల్లింగ్‌ను రద్దు చేయాలని, 10 హెచ్‌పీల వరకు పవర్‌లూమ్స్‌కు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని, 10 నుంచి 25 హెచ్‌పీల వరకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని వస్త్రోత్పత్తిదారులు కోరారు. దీనిపై విద్యుత్ నియంత్రణ మండలి ఏ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా గతంలో ప్రకటించిన 25 హెచ్‌పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి, నిధులు కేటాయించడం విశేషం. బ్యాక్బిల్లింగ్తో మూతపడిన కార్ఖానాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. సిరిసిల్లలోని వంద కార్ఖానాల్లో మళ్లీ సాంచాలపై వస్త్రోత్పత్తి సాగనుంది. 25 హెచ్పీలకు 50 శాతం విద్యుత్ రాయితీ 50 సాంచాల ఆసాములకు సబ్సిడీ వర్తింపు రూ.49.04 కోట్లతో అమలు సిరిసిల్లలో బ్యాక్ బిల్లింగ్ అసలు సమస్య ఇది సిరిసిల్లలోని 50 సాంచాలు(25 జోడీల) కార్ఖాన. ఇక్కడ ఎనిమిది మంది నేతకార్మికులు పనిచేస్తారు. నిత్యం రూ.250 నుంచి రూ.350 వరకు ఒక్కో కార్మికుడు ఉపాధి పొందుతుంటారు. ఇలాంటి 50 సాంచాల వస్త్రోత్పత్తి కార్ఖానాలకు యాభై శాతం విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గతేడాది నవంబర్లోనే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) సిపార్సు చేసింది. గతంలో 10 హెచ్‌పీల సామర్థ్యం గల సాంచాల కార్ఖానాలకు 50 శాతం విద్యుత్ రాయితీ వర్తించేది. కానీ దాన్ని 25 హెచ్పీలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.49.04కోట్లతో 25 హెచ్‌పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల పట్టణంతోపాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, తంగళ్లపల్లి, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లోని వస్త్రోత్పత్తిదారులకు ప్రయోజనం కలుగనుంది. 50 సాంచాల ఆసామికి 50శాతం విద్యుత్ సబ్సిడీ వస్తే సిరిసిల్ల ప్రాంతంలోని 90 శాతం వస్త్రోత్పత్తిదారులకు మేలు కలుగుతుంది. కేవలం వందలాది సాంచాలున్న పెద్దసేట్లకు మాత్రం 50 శాతం విద్యుత్ సబ్సిడీ వర్తించదు. అంటే.. చిన్న, మధ్యతరగతి ఆసాములు, వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (27) సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శృతి ఎంకాం పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతూ.. ఇటీవలే గ్రూప్–1, 2 పరీక్ష రాసినా మంచి ర్యాంక్ రాలేదు. వీటికితోడు శృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. మరోవైపు శృతి ఏడాదికాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స చేయించుకుందామంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనస్తాపానికి గురైన శృతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శృతి తల్లి రోజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. పండుగ కోసం వచ్చి.. ప్రాణాలు వదిలి.. ● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి సుల్తానాబాద్‌రూరల్ (పెద్దపల్లి): ఐతరాజుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పంగ నిఖిల్(26) మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. పంగ భాస్కర్–పద్మ దంపతుల కుమారుడు నిఖిల్ హైదారాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోసమని ఈనెల 29న స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఐతరాజుపల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈక్రమంలో ప్రమాదవాశాస్తు ద్విచక్ర వాహనంపై నుంచిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. ఈత చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన గీత కార్మి కుడు దాసరి లచ్చయ్య (54) సోమవారం ప్రమాదవశాత్తు ఈత చెట్టుపై నుంచి పడి మృతిచెందాడు. లచ్చయ్య కల్లు గీసేందుకు ఈతచెట్టు ఎక్కగా ప్రమాదశాత్తు కాలజారి కిందపడటంతో బలమైన గాయాలయ్యా యి. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య దాసరి మల్లమ్మ ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. పాముకాటుతో రైతు మృతితిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని గొల్లపల్లికి చెందిన రైతు కొమ్మెర నరసింహారెడ్డి(57) పాముకాటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. నరసింహారెడ్డి సోమవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. వరి పంటకు నీరు పెట్టి తిరిగి వస్తున్న క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. గమనించిన పక్క రైతు బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బూడిద ట్యాంకర్ బోల్తా గోదావరిఖని: స్థానిక బీగెస్ట్హౌస్ సమీపంలోని రాజీవ్ రహదారి మూలమలుపు వద్ద సోమవారం బూడిద ట్యాంకర్ బోల్తాపడింది. మంచిర్యాల నుంచి గోదావరిఖని వైపు వస్తున్న 22టైర్ల ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడిపోయింది. అతివేగంగా వస్తున్న డ్రైవర్‌కు మూలమలుపు కల్పించక పోవడంతో ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు చిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని గునుకులపల్లెకు చెందిన శ్రీనివాస్‌పై పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన హరికృష్ణ కత్తితో దాడిచేసినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. గాయపడిన శ్రీనివాస్‌ను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హరికృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గుండె.. ఆగిపోతోంది
వీణవంక(హుజూరాబాద్): జిల్లా ప్రజలకు గుండె దడ పట్టుకుంది. అప్పటిదాక బాగానే ఉంటున్నారు.. అంతలోనే గుండెపోటుతో అనంతలోకాలకు వెళ్తున్నారు. ఒకప్పుడు పట్టణవాసులకు ఎక్కువగా వస్తుందనేది ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుండెదడ పట్టుకుంది. పొద్దంత పనులు చేసుకొని వచ్చి ఇంటి వద్ద సేద తీరేలోపు గుండెపోటుతో మృతిచెందుతున్నారు. అయితే పౌష్టికాహార లోపం, శారీరక శ్రమ లేకపోవడం, నీళ్లు సరిగా తాగకపోవడం వల్లే గుండెపోటు వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. 40 నుంచి 55లోపు వారే ఎక్కువ... గుండెపోటు 40 నుంచి 55ఏళ్ల లోపు వారికే ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆరు నెలల వ్యవధిలో వివిధ వృత్తుల్లో ఉన్న దాదాపు 34 మంది గుండెపోటుతో మృతిచెందారు. కాగా గుండెపోటు ఉపాధి హామీ కూలీలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఎండలో పని చేయడం, సరైన నీరు తీసుకోకపోవడం గుండెపోటుకు ఒక కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. కొంత మంది వ్యాయామం చేసినా గుండెపోటుకు గురవడం కలకలం రేపుతుంది. వణుకు పుట్టిస్తున్న గుండెపోటు ఉమ్మడి కరీంనగర్లో ఆరు నెలల వ్యవధిలో 34 మంది మృతి ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలపై ఎక్కువ ప్రభావం పాటించాల్సిన నియమాలు ముఖ్యంగా ఉపాధి హామీ, వ్యవసాయం చేసే కూలీలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం ఎండలో పని చేయరాదు. శ్రమకు తగ్గ నీరు లేదా నిమ్మరసం తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కవగా పెరగకుండ చెట్లకింద సేద తీరాలి. క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవాలి. పట్టణాలలో ఉండేవారు మానసిక ఒత్తిడికి లోనుకావద్దు. రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్, వ్యాయామం, యోగా చేయాలి. పొగతాగడం మానేయాలి. ఆయిల్ పుడ్ సాధ్యమైనంత వరకు తగ్గించాలి. గుండెపోటు లక్షణాలు గుండెపోటు రావడానికి కారణం గుండెకు సంబంధించి కండరాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీన్నే గుండేపోటు అంటారని వైద్యులు చెబుతున్నారు. ఎడమ చేతి వైపు లాగినట్లు అనిపిచ్చి, ఛాతిలో నొప్పి వస్తుంది. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. వ్యవసాయ కూలీలకు ఎక్కవగా ఎందుకు వస్తుందంటే వారు శ్రమకు తగ్గ నీరు తీసుకోకపోవడమే ప్రధాన కారణం. ఎండలో ఎక్కవగా పని చేయడం వల్ల చెమట ద్వారా లవణాలు కరిగిపోతాయి. లవణాలు తగ్గి గుండె ఎక్కవగా కొట్టుకోవడం కాని, గుండె ఆగిపోవడం జరుగుతుంది. అయితే కూలీలు పని మీద ఉండి నీళ్లు ఎక్కువగా తీసుకోకపోవడం ఒక కారణం. వంశపార్యంగా గుండెపోటు వస్తుందని కూడా ఒక కారణంగా వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. ఎండలో ఎక్కువ సమయం పని చేయడం వల్ల గుండె ఆగిపోవడం జరుగుతుంది. 7 గంటలు ఎండలో పని చేస్తే కనీసం రెండుగంటలు విశ్రాంతి తీసుకోవాలి. శారీరక శ్రమ అవసరం పతి మనిషికి శారీరక శ్రమ అవసరం. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఊబకాయం, బీపీ, షుగర్ పొగతాగడం అలవాటు ఉన్నవారికి గుండెపోటు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఎండలో పని చేసినప్పుడు సరైన నీరు తీసుకోవాలి. ఎడమచేతి వైపు నొప్పి వచ్చినట్లైతే డాక్టర్లను సంప్రదించాలి. – డాక్టర్ గొట్టె శ్రావణ్, పీహెచ్సీ వైద్యుడు, శంకరపట్నం మండలం -
చందాలతో ఏడు చెక్‌డ్యాంలకు నీరు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో కొడిమ్యాల నాన్ ఆయకట్టు మండలం. సాగునీటి కోసం రైతులు ఎప్పుడూ పెద్ద యుద్ధమే చేస్తుంటారు. యాసంగిలో సాగు చేసిన వరి పంట తమ కళ్ల ఎదుటే ఎండుతుంటే చూడలేక రైతులు తలా కొంత చందాలు వేసుకుని పంటలకు నీరు అందించుకుంటున్నారు. కొడిమ్యాల మండలం పూడూరు వాగు సమీపంలో ఏడు చెక్ డ్యాంలు ఉన్నాయి. అందులో ఉన్న నీటిని వాగుకు ఇరువైపులా మోటార్లు పెట్టుకుని పంటలు సాగు చేస్తుంటారు. ఇటీవల వాగు పూర్తిగా ఎండిపోయింది. దీంతో వాగుకు ఇరువైపులా ఉన్న ఆరెపల్లి, అప్పారావుపేట, పూడూరు రైతులు తలా కొంత చందాలు వేసుకుని రూ.లక్ష జమ చేసుకున్నారు. వాటితో 40 పైపులు కొనుగోలు చేసి కొండాపూర్ మైసమ్మ చెరువు మత్తడి నుంచి నీటిని తరలించారు. ఆ నీటితో కొడిమ్యాల పెద్దవాగు, పూడూరు వాగుపై నిర్మించిన ఏడు చెక్ డ్యాంలు నిండి జలకళతో పొంగి పోర్లుతుండటంతో రైతులు సంతోషిస్తున్నారు. దీనివల్ల 500 ఎకరాలకు సాగునీరందుతోంది. 500 ఎకరాల వరి పంటను కాపాడుకున్న రైతులు -
అవగాహన కల్పించాలి
సిటిజన్ చార్టర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి. అప్పుడే ఫిర్యాదులు ఎక్కువగా వస్తాయి. మున్సిపాలిటీల్లో డ్రెయినేజీ, పారిశుధ్యం, రెవెన్యూ విభాగాల్లో అధిక సమస్యలుంటాయి. ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలి. – హరీశ్, జగిత్యాలపరిష్కారం కావడం లేదు సిటిజన్ బడ్డీ ద్వారా ఫిర్యాదు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిష్కారం కావడం లేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ఇది మంచి అవకాశం. ఇంట్లోనే ఉండి సమస్య పరిష్కరించుకోవచ్చు. – శివమణి, జగిత్యాలసమస్యలు పరిష్కరిస్తున్నాం సిటిజన్ చార్టర్ ద్వారా వచ్చిన సమస్యలపై సకాలంలో స్పందిస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు వీటి గురించి తెలుసుకోవాలి. ఆస్తిపన్ను టార్గెట్ కోసం సిబ్బంది ప్రయత్నిస్తున్నాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల -
భక్తుల కొంగుబంగారం శ్రీరామలింగేశ్వరస్వామి
● నేడు, రేపు జాతర ఉత్సవాలు ● ముస్తాబైన ఆలయం గొల్లపల్లి: మండలంలోని చిల్వ కోడూర్ గ్రామంలోగల శ్రీరామలింగేశ్వరస్వామి భక్తులకు కోర్కెలు తీర్చే స్వామిగా నిత్యపూజలు అందుకుంటున్నారు. ఏటా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజులపాటు ఇక్కడ అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతాయి. జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఉత్సవాలకు తరలివస్తారు. జగిత్యాల నుంచి పెద్దపల్లి వెళ్లే రహదారిపై ఉన్న చిల్వకోడూర్లో జంపన్నవాగు ఒడ్డున స్వామివారు కొలువుదీరారు. పంచాంగ శ్రవణం, స్వామివారి కల్యాణం, రథో త్సవం, ఎడ్లబండ్ల ఉత్సవాలు ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తాయి. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి రథోత్సవం, ఏకాంతసేవ, ఏప్రిల్ ఒకటిన ఎడ్లబండ్ల ఉత్సవాలు, అన్నదానం ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. ఎడ్లబండ్ల పోటీలో మొదటి బహుమతిగా పావుతులం బంగారం, ద్వితీయ బహుమతిగా 100 గ్రాముల వెండి, తృతీయ బహుమతిగా 50 గ్రాముల వెండి ప్రదానం చేస్తామని ఆలయ కమిటీ చైర్మన్ దాసరి తిరుపతి తెలిపారు. -
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవం
ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండలో శ్రీవేంకటేశ్వరస్వామి జాతర ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన మామిడి చిన్నయ్య పటేల్ వారసులు రూ. 3.50 లక్షలు వెచ్చించి స్వామివారి రథోత్సవాన్ని తయారు చేయించారు. రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో దేవాలయం చుట్టూ తిరిగారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొంతుల శ్యామల, తుక్కారాం, మాజీ ఎంపీటీసీ పొనకంటి వెంకటి పాల్గొన్నారు. బీర్పూర్లో ఎడ్లబండ్ల పోటీలుసారంగాపూర్: బీర్పూర్లో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రారంభించారు. ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీలక్ష్మీనృసింహస్వామి జాతర స్థలంలో ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. చిన్నతనంలో ఉగాది, వినాయకచవితి, శ్రీరామనవమి, సంక్రాంతి వంటి పండగలకు గ్రామాల్లో ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించేదని, యాంత్రీకరణ పెరిగాక పోటీలు తక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోటీలను 15ఏళ్లుగా నిర్వహిస్తున్న గోనే రమణారావు (వెంకటేశ్వర్రావు)ను అభినందించారు. ధర్మపురి, బీర్పూర్ మండలాల నుంచి 22 మంది రైతులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్సై కుమారస్వామి, కేడీసీసీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, ఆలయ మాజీ చైర్మన్ నేరెల్ల సుమన్‌గౌడ్, హరీశ్, సుధాకర్, కృష్ణారావు, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, రాజేశం, మహేందర్ పాల్గొన్నారు. మైతాపూర్లో మల్లన్న బోనాలురాయికల్: మండలంలోని మైతాపూర్లో ఆదివారం మల్లన్న స్వామికి యాదవ సంఘం మహిళలు బోనాలు చేశారు. నెత్తిన బోనాలతో మహిళలు పురవీధుల గుండా వెళ్లి మల్లన్న స్వామికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బల్దియా కార్మికులకు స్వీట్లు పంపిణీజగిత్యాలటౌన్: విశ్వావసు నామ ఉగాదిని పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు ఆదివారం బల్దియా కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆదేశాల మేరకు బల్దియా కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు సతీశ్, ఒల్లెం మల్లేశం, దయాల మల్లారెడ్డి, గంగాధర్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటా కాషాయ జెండాలు పంపిణీధర్మపురి: నూతన సంవత్సర విశ్వావసు ఉగాది పర్వదినం సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిద వార్డుల్లో ఇంటింటికీ కాషాయ జెండాలు పంపిణీ చేశారు. ప్రజలు హిందుత్వాన్ని చాటి చె ప్పాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లవన్‌కుమార్, గుండ రాజేశ్వర్, దివిటి శ్రీధర్, రాజేష్ పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే దొడ్డుబియ్యం
● మూలుగుతున్న 10వేల క్వింటాళ్లు ● రేషన్ కింద సన్నబియ్యం పంపిణీ షురూ కోరుట్ల: రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో రైస్‌మిల్లుల్లో ఇప్పటికే నిల్వ ఉన్న దొడ్డు బియ్యం ఎవరికి అప్పగించాలన్న సమస్య తెరపైకి వచ్చింది. జిల్లాలోని బాయిల్డ్ రైస్ మిల్లుల్లో ఇప్పటివరకు సుమారు 10వేలు క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సివిల్ సప్లై ఆఽధీనంలో ఉన్న సన్న బియ్యం మరో మూడు నెలల వరకు రేషన్ కింద సరఫరా చేసే వీలుందని తెలిసింది. మూడు నెలల తరువాత రేషన్ కింద సన్నబియ్యం పంపిణీకి సివిల్ సప్లై శాఖ మళ్లీ సన్నబియ్యం మాత్రమే సేకరణ చేసే అవకాశాలు ఉండగా.. మిల్లుల్లో ఉన్న దొడ్డు బియ్యం మొత్తం ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రైస్ మిల్లర్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 10 వేల క్వింటాళ్ల దొడ్డు బియ్యం జిల్లాలో సుమారు 74 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మిల్లుల్లో 2022–23 నుంచి 2024–25 వరకు నాలుగు సీజన్ల ధాన్యం మిల్లింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు ఈ ధాన్యం మిల్లింగ్ ఎంత వరకు జరిగిందో..? రైస్ మిల్లుల్లో ఇంకా ఎంత ధాన్యం నిల్వలు ఉన్నాయో..? లెక్క తేల్చలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కొత్తగా మరో నెల రోజుల్లో మళ్లీ రైస్ మిల్లులకు ధాన్యం అలాట్మెంట్ చేయనున్నారు. ఇదివరకే ధాన్యం మిల్లింగ్ చేయగా వచ్చిన దొడ్డు బియ్యం నిల్వలు అలాగే ఉండగా..మళ్లీ కొత్తగా వచ్చే ధాన్యం మిల్లింగ్ చేసి ఎక్కడ నిల్వ చేయాలన్న సమస్య తలెత్తింది. రైస్‌మిల్లుల నుంచి దొడ్డు బియ్యం తీసుకెళ్లడంలో సివిల్ సప్లై, ఎఫ్‌సీఐ అధికారులు జాప్యం చేస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే జిల్లాలోని అన్ని రైస్‌మిల్లులు కలుపుకొని సుమారు 10 వేల క్వింటాళ్లకు మించి దొడ్డు బియ్యం నిల్వలు మూలుగుతున్నట్లు సమాచారం. పదిహేను రోజుల క్రితం జిల్లాలోని సుమారు పదిహేను రైస్‌మిల్లుల నుంచి లారీల్లో దొడ్డు బియ్యం సివిల్ సప్లై గోదాం తీసుకెళ్లిన అనంతరం వాటిని అఽధికారులు తిప్పిపంపడం గమనార్హం. రేషన్ కింద సన్నబియ్యం సరాఫరా జూన్‌లో ఉంటుందని భావించినా ప్రభుత్వం ఉగాది నుంచి ప్రారంభించడంతోనే గోదాముల వరకు వెళ్లిన దొడ్డు బియ్యం వాపస్ వచ్చాయి. దొడ్డు బియ్యంతో చిక్కులు.. ప్రతీ సీజన్లో రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేసిన దొడ్డు బియ్యాన్ని సివిల్ సప్లైతో పాటు ఎఫ్‌సీఐ అధికారులు సేకరిస్తారు. ఈ సారి మాత్రం సివిల్ సప్లై శాఖ రైస్ మిల్లుల నుంచి కేవలం సన్న బియ్యం సేకరించే అవకాశాలున్నాయి. మిల్లింగ్ చేసే మొత్తం దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌సీఐ డిపార్ట్మెంట్ వారు తీసుకోవాల్సి ఉంటుంది. సివిల్ సప్లై అధికారులు దొడ్డు బియ్యం సేకరణ సందర్భంగా నాణ్యత విషయంలో ఇదివరకు కొంత వెసులుబాటు ఇచ్చేవారు. ఎఫ్‌సీఐ అధికారులు నల్లచుక్కలు (పిన్ పాయింట్ డామేజ్)ఉన్నా.. నూక శాతం 25కు మించి ఉన్నా.. కలర్ టెస్ట్‌లో ఆవకాడో గ్రీన్ రాకున్నా బియ్యం రిజెక్ట్ చేస్తారు. ఎఫ్‌సీఐ అధికారుల నిబంధనల ఫలితంగా రైస్ మిల్లర్లకు లెక్కలేని చిక్కులు రానున్నాయి. ఇతర జిల్లాలో కొన్ని రైస్ మిల్లుల నుంచి దొడ్డు బియ్యాన్ని పిలిప్పిన్స్ దేశం పంపేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగా.. ఇక్కడ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలూ రాలేవు. ఫలితంగా మిల్లుల్లో ఉన్న దొడ్డు బియ్యం అలాగే ఉండిపోనుంది. -
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు కొనసాగుతాయి
మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి మామిడి కొనుగోలు సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ క్రమంలో చల్గల్లోని మామిడి మార్కెట్లో మామిడి కొనుగోళ్లు ఎలా చేపట్టాలనే అంశంపై అనిశ్చితి నెలకొంది.గోదావరిలో భక్తుల స్నానాలుధర్మపురి: ఉగాది సందర్భంగా ధర్మపురి గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయాల్లో స్వామి వార్లను దర్శించుకున్నారు. – 8లోu సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025ధర్మపురి:జిల్లాలో ఉగాది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగాన్ని తెలుసుకున్నారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ శేషప్ప కళావేదికపై ఉత్సవమూర్తులను ఆశీనులు చేసి ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణకర్త బుగ్గారపు రాజేంద్రప్రసాద్ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపించారు. వర్షాలు, పాడిపంటలను వివరించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ, పాలెపు ప్రవీణ్‌శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరెల్ల శ్రీనివాసాచార్యులు తదితరులున్నారు. ఆలయాల్లో పూజలు.. పంచాంగ శ్రవణాలున్యూస్రీల్ -
‘ప్రత్యేక పాలన’లో పంచాయతీలు అస్తవ్యస్తం
● 13 నెలలుగా విడుదల కాని నిధులు ● పేరుకుపోతున్న చెత్తాచెదారం ● అత్యవసర పనులకూ ఇబ్బందులే..జగిత్యాలరూరల్: ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజలకు అత్యవసరమైన పనులు చేపట్టేందుకూ నిధులు లేక గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 385 గ్రామపంచాయతీలు ఉన్నాయి. సర్పంచులు పదవిలో ఉన్నప్పుడు జిల్లాకు ఏటా రూ.80 కోట్ల కేంద్ర నిధులు.. దాదాపు రూ.40 కోట్ల రాష్ట్ర నిధులు అభివృద్ధి పనులకు మంజూరయ్యాయి. ప్రత్యేక పాలన ప్రారంభం నుంచి కేంద్రం నిధులు, ఇటు రాష్ట్రప్రభుత్వ నిధులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామపంచాయతీల్లో అత్యవసర పనులు చేసేందుకు కూడా నిధులు లేక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది. 13 నెలలుగా నిధులు కరువు సర్పంచుల పదవీకాలం ముగిసిన నుంచి ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర నిధులు రాక పంచాయతీలు అభివృద్ధి పనులకు నోచుకోవడం లేదు. ప్రజలకు అత్యవసరమైన మురికికాలువల శుభ్రత, వీధిదీపాలు, తాగునీటి సరఫరా వంటి అత్యవసర పనులకు కూడా నిధులు లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైన తాగునీటి సరఫరాలోని మరమ్మతుకు కూడా డబ్బులు లేక పనులు చేపట్టడం లేదు. గ్రామాలకు రాని ప్రత్యేకాధికారులు గ్రామపంచాయతీల్లో పేరుకే ప్రత్యేకాధికారులు. ఏ ఒక్క రోజు కూడా పంచాయతీలకు వచ్చి పాలనపై దృష్టి పెట్టడం లేదు. ఏదైనా అత్యవసర పని ఉంటే పంచాయతీ కార్యదర్శులే తమ జేబుల్లోంచి డబ్బు ఖర్చు పెట్టి మరమ్మతు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ మరమ్మతు డబ్బులకు కూడా ప్రత్యేకాధికారులు బిల్లులు చెల్లిస్తున్నప్పుడు కార్యదర్శులను ఇబ్బందికి గురిచేస్తుండడం గమనార్హం. పంచాయతీ కార్యదర్శులకు అప్పుల గండం గ్రామపంచాయతీ పాలన కార్యదర్శులకు నిత్యం గండంగా మారింది. గ్రామాల భారమంతా కార్యదర్శులపైనే పడుతోంది. పంచాయతీల్లో పారిశుధ్య పనులు, నీటి సరఫరా, ఏ చిన్న సమస్య తలెత్తినా కార్యదర్శి సొంతంగా డబ్బులు పెట్టి పనులు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా వారు అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం నుంచి రెండు నెలలుగా స్వచ్ఛదనం, పచ్చదనం కార్మికుల వేతనాలకు నిధులు మంజూరయ్యాయి. ఆ బిల్లులను పంచాయతీ కార్యదర్శులు సమర్పించినా ఇప్పటివరకు విడుదల కాలేదు. మరోవైపు కార్మికులు తమకు వేతనాలు ఇస్తేనే పనులకు వస్తామని, లేకుంటే మానేస్తామని చెబుతున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు అప్పు చేసి కార్మికుల వేతనాలు కొంతమేర చెల్లిస్తున్నారు. శానిటేషన్, బ్లీచింగ్, విద్యుత్ బల్బుల ఏర్పాటు, మోటార్ల రిపేర్, పైప్‌లైన్ లీకేజీ వంటి పనులకు పంచాయతీ కార్యదర్శులే అప్పు తెచ్చి పెడుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతోపాటు, మంజూరైన నిధులకు కూడా బిల్లులు పాస్ కాకపోవడంతో కార్యదర్శులంతా ఆందోళన చెందుతున్నారు. నిధులు రావడం లేదు ప్రత్యేకాధికారుల పాలన నుంచి జిల్లాలో గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు నెలనెలా నిధులు రావడం లేదు. గ్రామాల్లో అత్యవసర పనులు చేసేందుకు పంచాయతీల నిధులే వెచ్చించడం జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నెలనెలా నిధులు రావాల్సి ఉంది. – మదన్మోహన్, జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి -
ఎవరికీ పట్టని పౌరసేవలు
● మున్సిపాలిటీల్లో అటకెక్కిన సిటిజన్ చార్ట్ ● ఆన్లైన్ ఫిర్యాదులపై స్పందన కరువు ● అవగాహన లేక.. పరిష్కారం కాక ఆసక్తి చూపని పట్టణవాసులుజగిత్యాల: మున్సిపాలిటీల్లో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిటిజన్ చార్టర్ ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. జిల్లాలో సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు వస్తున్నా పెద్దగా పరిష్కరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చిన దరఖాస్తులు పరిష్కరించినట్లు అధికారులు పేర్కొంటున్నా.. క్షేత్రస్థాయిలో పటి?్టంచుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో ఆన్లైన్ ద్వారా వారం రోజుల్లో 112 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో 31 మాత్రమే పరిష్కరించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ చాలా వరకు పరిష్కారం కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై చాలామందికి అవగాహన లేక.. సమస్యలు పరి ష్కారం కాక ఫిర్యాదు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మున్సిపాలిటీల్లో పౌరసేవలపై పట్టించుకునే వారు లేకపోవడంతో సిటిజన్ చార్టర్ అటకెక్కింది. సేవలివే.. సిటిజన్ చార్టర్ ద్వారా మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలైన రోడ్లు, స్తంభాలు, టౌన్‌ప్లానింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, పారిశుధ్యం, డ్రెయినేజీలు వంటి ఏ సమస్య అయినా ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందులో ఫిర్యాదు చేసిన రెండు నుంచి మూడు రోజుల్లోనే సమస్య పరిష్కరించాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసిన వారికి సమస్యను పరిష్కరించి సెల్‌ఫోన్ ద్వారా సమాచారం కూడా అందించాల్సి ఉంటుంది. ప్రజల్లో అవగాహన లేక.. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పౌరసేవలపై సరైన అవగాహన లేక ఎవరూ ఫిర్యాదులు చేయడం లేదు. శ్రీసిటిజన్ బడ్డీ యాప్శ్రీ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్నా దీనిపై మున్సిపల్ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. ప్రజల్లో అవగాహన కల్పిస్తే చాలా సమస్యలు పరిష్కరించే దిశగా ఉంటాయి. ప్రతీ సమస్యకూ సమయం సిటిజన్ చార్టర్ ద్వారా ప్రతీ సమస్యకూ కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలోనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు ఆ మేరకు పట్టించుకోవడం లేదు. అలాగే మున్సిపాలిటీ ద్వారా ఏదైనా దరఖాస్తు చేసుకుంటే సకాలంలో ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాపార లైసెన్స్‌లు, హ క్కుల మార్పిడి, జనన ధ్రువీకరణ పత్రాల్లో శిశువు పేర్లు చేర్చడం, మరణ ధ్రువీకరణ పత్రం, విద్యాసంస్థలకు పారిశుధ్య ధ్రువీకరణ పత్రం.. ఇలా 22 రకాల పౌర సేవలను కచ్చితంగా సమయంలోపు అందించాల్సి ఉంటుంది. కానీ అవగాహన లోపంతో ఏ మున్సిపాలిటీలోనూ అందడం లేదు.2023–24 నుంచి 2024–25 ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు మున్సిపాలిటీ వచ్చిన పరిష్కరించినవి ఫిర్యాదులు జగిత్యాల 4,200 3,500కోరుట్ల 3,176 3,174మెట్పల్లి 2,413 2,125రాయికల్ 41 41ధర్మపురి 690 650 -
మా తాతల కాలం నుంచి..
బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 25 ఏళ్లుగా ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. మా వంశంలో తాతలు, తండ్రుల కాలం నుంచి పంచాంగ శ్రవణం చేస్తున్నం. ప్రస్తుత విశ్వావసు నామ సంవత్సరంలో రవి రాజుగా వస్తున్నారు. పంచాంగ శ్రవణంలో రాశిఫలాలు, ఆదాయ వ్యయాలు, ధాన్యాధిపతి గూర్చి, ఎన్ని తూముల వర్షాలు కురుస్తాయి, పంటలు ఎన్ని పుట్లు పండుతాయి, రాజ్యాధికారం ఎలా ఉంటుంది, సీ్త్ర, పురుష జనన ఉత్పత్తి తదితర వివరాలు చెబుతాం. ఉగాది రోజు ప్రజలు పంచాంగ శ్రవణం వినడానికి వచ్చి తమ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. – శ్రీనివాసాచార్యులు, బోయినపల్లి -
సాయం చేయబోతే ప్రాణమే పోయింది
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం కృషి ● రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల కథలాపూర్: స్వాతంత్య్ర స్వేచ్ఛ ఫలాలు అందరికీ అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల అన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దేశం అభివృద్ధి చెందిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నియంతృత్వ పోకడలతో పరిపాలన చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ దేశంలోని వివక్షను రూపుమాపేందుకు కృషి చేస్తున్నారన్నారు. దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసిందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ఎండీ.ఆవేజ్, పీసీసీ కార్యవర్గసభ్యుడు తొట్ల అంజయ్య, ఏఎంసీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, వాకిటి రాజారెడ్డి, వంగ మహేశ్, జవ్వాజి చౌదరి, గడ్డం చిన్నారెడ్డి, కల్లెడ గంగాధర్, వేముల కృష్ణ, కూన అశోక్ పాల్గొన్నారు. మల్యాల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయం చేయబోయిన యువకుడు బైక్ ఢీకొని మృతి చెందాడు. మండలంలోని గొర్రెగుండ గ్రామానికి చెందిన వంశీ ధర్‌రావు జగిత్యాలలో కొరియర్‌గా పనిచేస్తున్నాడు. తన మిత్రులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తుండగా శుక్రవారం రాత్రి జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై మధుర నరేశ్ అనే ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కిందపడి, గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వంశీధర్ తన బైక్‌ను రోడ్డు పక్కన నిలిపి, లేవలేని స్థితిలో రోడ్డుపై పడిన నరేశ్‌కు సాయం చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో పల్లెపు రాజేశ్ బైక్‌పై అతివేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వంశీధర్‌ను జగిత్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గొర్రెగుండెంలో దహన సంస్కారాలు నిర్వహించారు. వంశీధర్‌కు భార్య జ్యోతి, నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కూతురు ఉన్నారు. వంశీధర్ తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందారు. సోదరుడు అనిల్ 15 ఏళ్ల క్రితం నూకపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నాలుగేళ్ల కుమారుడు తండ్రి చితికి నిప్పటించడం స్థానికులను కంటతడి పెట్టించింది. -
ఊహ తెలిసినప్పటి నుంచి..
ఇల్లంతకుంట(మానకొండూర్): మాది ఇల్లంతకుంట మండల కేంద్రం. విద్యాభ్యాసం ముగిసిన నాటి నుంచి 50 ఏళ్లుగా సంప్రదాయ దోవతి కమీ జు ధరిస్తున్న. హైదరాబాదులోని నిజాం కాలేజీలో 1969లో విద్యాభ్యాసం ముగిసింది. ప్ర భుత్వ కార్యాలయాలు, వేడుకలు, ఎక్కడికి వె ళ్లినా దోవతి, కమీజు వేసుకుంటా. 1981 నుంచి 1993 వరకు ఇల్లంతకుంట సర్పంచ్‌గా చేసిన. – చిట్టి కృష్ణారెడ్డి, ఇల్లంతకుంట ఊరంతా తిరిగి ఆడుకునేవాళ్లం మా చిన్నతనంలో ఉగాది పండగ వచ్చిందంటే ఊరంతా తిరిగి ఆడుకునేవాళ్లం. కుడుకల పేర్లు, బచ్చీల పేర్లు మెడలో వేసుకుని సంబురంగా తిరిగేటోళ్లం. గుడికాడికి వెళ్లి పంచాంగం వినేటోళ్లం. ఇలా ఊరంతా అక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా పండుగ జరుపుకునేది. ఇప్పుడు ఆ ఉత్సాహం లేదు.. ఉల్లాసం లేదు. ఏమైనా సెల్ ఫోన్ చూస్తూ.. మనుషులు పరాయివాళ్లలాగే ఉంటున్నారు. మా రోజుల్లో ఉగాది పండగ అంటే ఏడాదికో దినం. పిల్లల అంతా కలిసి సంబురంగా ఆటలు ఆడేది. –భానోత్ గన్యానాయక్, చిన్నబోనాల, సిరిసిల్ల ఆ ఉత్సాహమే లేదు ఉగాది రోజున స్నానాలు చేసి పొద్దుగాలనే పొలంకాడికి పోయేవాళ్లం. వేపపువ్వు, మామిడికాయలు, మామిడి ఆకు, కొత్త చింతపండు తీసుకుని వచ్చి కొత్త కుండలో ఉగాది పచ్చడి చేసేవాళ్లు. కొబ్బరికాయ కొట్టి పచ్చడి పెట్టేదాకా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోయేది. బక్ష్యాలు తిని వెళ్లి పంచాంగం వినేవాళ్లం. వచ్చే ఏడాదంతా ఎలా ఉంటుంది. ఏ రాశి వారికి రాబడి ఎంత.. ఖర్చు ఎంత..? తెలుసుకుని మురిసిపోయే వాళ్లం. ఈ రోజుల్లో ఆ ఉత్సాహమే లేదు. – భైరి ప్రభాకర్, వెంకంపేట, సిరిసిల్ల -
చేపల వేటకు వెళ్లి విద్యుత్‌షాక్‌తో మృతి
జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన చింతకుంట్ల రాజనర్సయ్య (58) అనే వ్యక్తి శనివారం చేపల వేటకు వెళ్లి విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. రాజనర్సయ్య శనివారం ఉదయం గ్రామ శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లాడు. వాగులో కరెంట్ షాక్ పెట్టి చేపలు పడుతున్న సమయంలో తీగలు తీయకుండానే వాగులోకి వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. గుండెపోటుతో ఉపాధి కూలి మృతికోరుట్ల రూరల్: మండలంలోని నాగులపేట గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి కుంట లక్ష్మీనర్సు (55)గుండెపోటుతో మృతిచెందారు. లక్ష్మీనర్సు ఎప్పటిలాగే కూలికి వెళ్లింది. తోటికూలీలతో కలిసి కాలువ పూడికతీత పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. అక్కడే కుప్పకూలింది. కూలీలు 108లో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్మీనర్సు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మీనర్సుకు కుమారుడు, కూతురు ఉన్నారు. -
పంటలు సమృద్ధిగా..
మంథని: విశ్వావసు నామ సంవత్సరంలో పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంది. పత్తి, వరి, తెల్ల జొన్నలు వంటి పంటలు ఎక్కువగా లాభాలనిస్తాయి. పాలకుల మధ్య విభేదాలతో ప్రజలకు కొంత అసౌక్యం కల్గుతుంది. అయినా ప్రజల్లో స్నేహభావంతో మేలు జరుగుతుంది. భయాందోళనకర వాతావరణం ఉన్నా భగవతారాధన వల్ల అందరూ సుభిక్షింగా ఉంటారు. బంగారం, లోహ సంబంధిత వస్తువుల ధరలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. – వొజ్జల గణేశ్ అవధాని, వేద పండితుడు, మంథని 35 వసంతాలుగా.. గోదావరిఖనిటౌన్(రామగుండం): ఉగాది అనగా యుగానికి ఆది అని అర్థం. 35 ఏళ్లుగా గోదావరిఖని పవర్‌హౌస్‌కాలనీలోని శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయంలో పంచాంగ శ్రవణం వినిపిస్తున్న. ఈ ఉగాది విశ్వావసు సంవత్సరం అనగా 11 మంది గంధర్వులలో విశ్వవాసుడు ఒకరు. విశ్వ వాసుడు ప్రేమకు ప్రతీథి. ప్రజల మధ్య ప్రేమానురాగాలను కలిగిస్తాడు. ఇది శుభ సంవత్సరం. ఉగాది రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలి. అనగా ఒంటికి నూనె రాసుకొని తెల్లవారక ముందే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఽఈ రోజు ధ్వజారోహణము చేసి, ఇంటిపై ధ్వజమును ఎగురవేయాలి. – వొజ్జల వెంకటేశ్వరశర్మ, గోదావరిఖని -
విశ్వశాంతికి పునాది
శిశిర ఋతువుకు వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతున్న వేళ ఆరంభం అవుతున్న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విశ్వానికి సంబంధించినది. ఈ సంవత్సరం శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. కుటుంబ జీవితాలలోను సంతోషంగా ఉంటుంది. దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. విశ్వావసు అంటే ప్రపంచానికి మేలు చేసేవాడు.. అంటే ప్రజలు సహాయక స్వభావం కలిగి ఉంటారు. – నమిలకొండ రమణాచార్యులు, కరీంనగర్ ఏటా కవి సమ్మేళనాలుకోరుట్ల: స్వేచ్చ సాహితీ సమితి.. కోరుట్లలో బ హుజన కవిత్వానికి పెట్టింది పేరు. ఏటా స్వేచ్ఛ సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనా లు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. కవి రాస భూమయ్య అధ్యక్షతన ఏర్పాటైన సాహితీ స మితి కేవలం ఉగాది కవి సమ్మేళనాలకు పరి మితం కాకుండా అభద్రతతో ఉన్న వృద్ధులు, మహిళలు, పిల్లలకు చేయూతగా నిలుస్తుంది. -
ఫిల్టర్‌బెడ్ ద్వారా గ్రామాలకు రక్షిత నీరు
● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాల/జగిత్యాలరూరల్/జగిత్యాలటౌన్/రాయికల్ ఫిల్టర్బెడ్ల ద్వారా త్వరలో గ్రామాలకు రక్షిత మంచినీరు అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొలాస శివారులోని ఫిల్టర్‌బెడ్ మరమ్మతు పనులను పరిశీలించారు. పొలాస నుంచి కల్లెడ వరకు నీటి సరఫరా ఉంటుందన్నారు. అంతకుముందు ఆయన పొలాస శివారులోని పౌలస్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంవిధాన రక్షణకు కృషి చేయాలి భారత్ సంవిధాన పరిరక్షణకు కృషిచేయాలని విప్ అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జిల్లా పరిశీలకులు రియాజ్ అన్నారు. జైబా పు, జైభీం, జైసంవిధాన్ సన్నాహక సమావేశం శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. సంవిధాన్ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. వివిధ గ్రామాలకు చెందిన 312మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మిషన్‌భగీరథ నీరు అందించాలి మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ అందించేలా చర్యలు తీసుకోవాలని విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. తాగునీటి ఇబ్బందులు రానీయొద్దన్నారు. కార్యక్రమాల్లో అధికా రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మతసామరస్యానికిప్రతీక రంజాన్ మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో మున్ను ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో పాల్గొన్నారు. తహసీల్దార్ ఖయ్యూం, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరి షాకీర్, నబీ, శంషేర్, మొబి న్, మసూద్, ఖలీల్ పాల్గొన్నారు. -
నవ విశ్వాసం
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025● నేడు విశ్వావసునామ ఉగాది పర్వదినం ● ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలకు ఆలయాలు సిద్ధంమ్యాథమేటిక్ క్యాలిక్యులేషన్ జగిత్యాలటౌన్: విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలుగుతాయి. నలభై ఏళ్లుగా జగిత్యాల పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఏటా పంచాంగ పఠనం వినిపిస్తున్న. పంచాంగం ఒక మ్యాథమేటిక్ క్యాలిక్యులేషన్. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం సూర్యునికి రాజు పదవి, చంద్రునికి మంత్రి పదవి రావడంతో పాటు నవగ్రహాలలో 3 శుభగ్రహాలకు చక్కని ఆదిపత్యం దక్కినందున పాలనలో మరింత ఆధిపత్యం పెరిగి ప్రజలకు సత్ఫలితాలు లభిస్తాయి. – శ్రీమాన్ నంబివేణుగోపాలాచార్య, జగిత్యాల -
పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు
మల్లాపూర్: కాంగ్రెస్ పాలన వైఫల్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని, 15 నెలల పాలనలో తెలంగాణ ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కొట్లాడుతానన్నారు. పథకాలు మంజూరు చేయిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, అలాంటివారి చెంప చెల్లుమనిపించాలని సూ చించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, నాయకులు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలి మెట్పల్లి: ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సంజయ్ సిబ్బందికి సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడారు. కొత్త భవన నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, నిధులు త్వరలోనే వస్తాయని తెలిపారు. మందుల కొరత ఉందని సిబ్బంది చెప్పగా.. సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడి తెప్పించాలని సూచించారు. -
కొత్త రేషన్ దుకాణాలకు మోక్షమెప్పుడో..?
● నూతనంగా 65 గ్రామపంచాయతీలు ఏర్పాటు ● ఇప్పటికీ పాత రేషన్ దుకాణాలే దిక్కు ● నూతన గ్రామపంచాయతీలకు భారమవుతున్న రేషన్ సరుకులురాయికల్: జిల్లా ఆవిర్భవించి 11 ఏళ్లు గడుస్తున్నా.. జిల్లాలో 65 కొత్త పంచాయతీలు పెరిగినా.. గ్రామాల్లో రేషన్ దుకాణాల సంఖ్య పెరగకపోవడంతో ప్రజలు పాత రేషన్ దుకాణాల నుంచే సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో 20 మండలాలతోపాటు, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 592 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో గతంలో 320 పంచాయతీలు ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు 65 కొత్తగా ఏర్పడి మొత్తం 385కు చేరాయి. కానీ రేషన్ దుకాణాలు మాత్రం 592 దుకాణాలే ఉన్నాయి. పెరుగుతున్న దూరభారం జిల్లాలో నూతనంగా 65 గ్రామపంచాయతీలు ఏర్పడగా.. గతంలో ఉన్న రేషన్ దుకాణాల నుంచే ఆయా గ్రామస్తులు రేషన్ సరుకులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పలు మండలాల్లో మారుమూల ప్రాంతాల్లో రేషన్ దుకాణాల వద్దకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం కాలిబాటన వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త దుకాణాల్లో సాంకేతిక సమస్య కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో రేషన్ దుకాణాల ఏర్పాటులో సాంకేతిక సమస్య ఏర్పడుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుంచి 450 రేషన్ కార్డులు ఉంటేనే దుకాణాలు ఏర్పాటు చేయాలి. కానీ నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో 200 నుంచి 500 వరకే ఉండటంతో ప్రభుత్వపరంగా సాంకేతిక సమస్య ఏర్పడుతుది. కొత్త దుకాణాలు ఏర్పడితే పాత షాపులో కార్డులు తగ్గుతాయని, అక్కడ, ఇక్కడ వచ్చే ఆదాయం తగ్గుతుందని, దీంతో నూతన రేషన్ దుకాణాలు మంజూరు కావడం లేదనే విమర్శలు సైతం విన్పిస్తున్నాయి. కానీ నూతన గ్రామపంచాయతీల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించి వెంటనే రేషన్ దుకాణాలను మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామపంచాయతీలు 385 నూతన గ్రామపంంచాయతీ 65 ప్రస్తుతం ఉన్న రేషన్ షాపులు 592 రేషన్‌కార్డుల సంఖ్య 3,07,555 -
ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలి
● అదనపు కలెక్టర్ లతజగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, సంఘాల సీఈఓలతో గురువారం శిక్షణ ఇచ్చారు. రైతులంతా ఒకేసారి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురాకుండా చూడాలని, ధాన్యానికి సీరియల్ నంబర్లు ఇచ్చి, ఆ మేరకు కొనుగోలు చేయాలని తెలిపారు. కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఐకేపీ సంఘాలకు పోటీగా సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తాయన్నారు. ధాన్యం కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మేనేజర్ జితేందర్ ప్రసాద్, అధికారి జితేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, రవాణా, మెట్రాలజీ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
జిల్లాలో రేషన్ దుకాణాల వివరాలను రెవెన్యూ అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లాం. ప్రభుత్వ అనుమతులు రాగానే నియమ నిబంధనల ప్రకారం నూతన రేషన్ దుకాణాల ఎంపికపై కసరత్తు చేస్తాం. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా రేషన్‌దుకాణాలను ప్రారంభిస్తాం. – చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా సివిల్‌సప్లయ్ అధికారిమూడు గ్రామాలకు ఒకటే దుకాణం మాది ఆల్యనాయక్‌తండా. ఇటీవల గ్రామ పంచాయతీగా ఏర్పడింది. తండా గతంలో తాట్లవాయి పరిధిలో ఉండగా.. అదే గ్రామంలో కై రిగూడెం నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింది. మా గ్రామాలకు నేటి వరకూ రేషన్‌దుకాణాలు రాలేదు. పాత దుకాణాలకు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నాం. – నందునాయక్, మాజీ సర్పంచ్, ఆల్యనాయక్తండాసమస్యను మండలిలో లేవనెత్తా.. నూతన గ్రామపంచాయతీల్లో రేషన్ దుకాణాలుమంజూరు చేయాలని శాసనమండలిలో సమస్యను లేవనెత్తాను. గ్రామపంచాయతీలుగా ఏర్పడి సుమారు ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా పాత రేషన్ దుకాణాలకు వెళ్లే రేషన్ సరుకులు తెచ్చుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది. – ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి -
మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్
కోరుట్ల రూరల్: మండలంలోని బీఆర్ఎస్ మాజీ సర్పంచ్‌లను పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమ పదవీకాలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనే డిమాండ్‌తో అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మండలంలోని మాజీ సర్పంచులను వారివారి గ్రామాల్లో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి.. వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. అరెస్టయిన వారిలో మాజీ సర్పంచులు దారిశెట్టి రాజేశ్, వనతడుపుల అంజయ్య, దుంపాల నర్సూ, చెప్యాల నర్సయ్య, భాస్కర్ రెడ్డి ఉన్నారు. అక్రమ అరెస్ట్‌లు సరికాదు జగిత్యాలక్రైం: మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసులతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలీసులు రాజ్యాంగం, చట్టానికి లోబడి పనిచేయాలని, అలా కాకుండా ఒకే పార్టీకి లోబడి పనిచేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదేలేదని, ప్రజా సమస్యలపై పోరాడుతూ మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ఎండగడుతామన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాంమోహన్‌రావు, సింగిల్ విండో చైర్మన్లు సాగర్‌రావు, మహిపాల్‌రెడ్డి, మధుసూదన్, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు ఆనందరావు, గంగాధర్, తిరుపతి, ప్రవీణ్, తిరుపతి, రాజనర్సు, కరుణాకర్ పాల్గొన్నారు. -
కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం
కోరుట్ల: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు గురువారం సందర్శించారు. ఆసుపత్రిలోని డాక్టర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆసుపత్రిలో నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాల అమలు, సిబ్బంది నియామకం, నిధుల వినియోగంపై చర్చించారు. జాతీయ స్థాయిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఎలా కొనసాగుతున్నాయో పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిసి ఆరోగ్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకున్నారు. వసతులు, ల్యాబ్ సేవలు, గర్భిణులు, ప్రసవానంతరం తల్లులకు అందించే సేవలు, పిల్లల వ్యాధి నివారణ టీకాలు తదితర అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సుపరింటెండెంట్ సునీతారాణి, డాక్టర్లు వినోద్ కుమార్, లక్ష్మీ, రమేశ్, జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ తులసి రవీందర్, టీబి ఇంచార్జి మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. మత్స్య కార్మికులు పథకాలను వినియోగించుకోవాలి ● జిల్లా అధికారి మనోజ్‌కుమార్ మెట్పల్లి: మత్స్య కార్మికులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని మత్స్య శాఖ జిల్లా అధికారి మనోజ్‌కుమార్ సూచించారు. పట్టణంలోని గంగపుత్ర సంఘం భవనంలో గురువారం మత్స్య కార్మికుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70ఏళ్ల లోపు ఉన్న ప్రతి కార్మికుడు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్మికుల ఉపాధిని మెరుగుపర్చడానికి ఏటా చేప పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. సమావేశంలో పర్రె శంకర్, కుడుముల సాయన్న, మగ్గిడి సురేష్, ఆర్మూర్ గంగన్న, పారిపెల్లి కిషన్, ఆర్మూర్ రంజిత్ తదితరులున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లుజగిత్యాలక్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సురక్షిత ప్రయాణం అనే కార్యక్రమం ద్వారా గురువారం మల్యాల మండలం కొండగట్టు ఘాట్‌రోడ్ నుంచి కిందకు వచ్చి నేషనల్ హైవే 63ని కలిపే రహదారి వద్ద తరుచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుండటంతో మల్యాల సీఐ రవి, ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో రెండు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. అధిక వేగంతో వస్తున్న వాహనాలు నియంత్రణలోకి వచ్చి ప్రమాదాల నివారణకు దోహదపడుతుందన్నారు. ఉపాధ్యాయుడికి పురస్కారంజగిత్యాల: విద్యారంగంలో విశేష కృషి చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అడ్డగట్ల గంగాధర్‌కు వరల్డ్ స్కూల్ సమ్మిట్ అనే సంస్థ పురస్కారాన్ని ప్రకటించింది. జగిత్యాలలోని టీఆర్‌నగర్ ఎంపీపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గంగాధర్.. చేతివేళ్ల ద్వారా లెక్కలు చేసి అబాకస్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అత్యున్నతస్థాయి ప్రతిభవంతులుగా తీర్చిదిద్దారు. 721 సెకన్లలో విద్యార్థులు 1 నుంచి 100 ఎక్కాలు చదివించడంతోపాటు ఉచితంగా ఎందరికో అబాకస్ శిక్షణ అందించారు. వీటన్నింటిని పరిగణనలోకి వరల్డ్ స్కూల్ సమ్మిట్ ఆయనకు పురస్కారం ప్రకటించింది. ఏప్రిల్ 12న దుబాయ్‌లో జరిగే విశ్వపాఠశాలల శిఖర సమావేశంలో పురస్కారం అందించనున్నట్లు వరల్డ్ స్కూల్ సమ్మిట్ ఆర్గనైజర్ అక్షయ అహుజ తెలిపారు. -
ఇక సన్నబియ్యమే
ఉమ్మడి జిల్లాలో రేషన్కార్డులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సన్నబియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల్లో ఇప్పటికే రేషన్‌షాపులకు సన్నబియ్యం వచ్చేశాయి. వీటిని ఉగాది రోజు నుంచే పంపిణీ చేయనున్నారు. కార్డులో ఉన్న ప్రతీవ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ జరగనుంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దాదాపు 80 శాతం జనాభాకు తెల్లరేషన్‌కార్డులు (ఫుడ్ సెక్యూరిటీ కార్డులు) ఉన్నాయి. వీరందరికీ సన్నబియ్యం అందనున్నాయి. గతంలోనూ ఇవే కార్డుల మీద ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేసింది. కానీ... వాటిని లబ్భిదారులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. బియ్యం దొడ్డుగా ఉన్న కారణంతో వాటిని హోటళ్లు, వ్యాపారులకు విక్రయించేవారు. ఇవే బియ్యాన్ని సదరు వ్యాపారులు పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చి అమ్ముకునేవారు. ఇకపై బియ్యాన్ని లబ్ధిదారులే వినియోగించుకునేలా.. పకడ్బందీగా సన్నబియ్యం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమక్కుమార్ రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉండటంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డులందని, డీలీట్ అయిన వారి కష్టాలు.. కొందరు లబ్ధిదారులకు ఇంకా రేషన్‌కార్డులు అందలేదు. వీరంతా గతేడాది ప్రజాపాలన, మీసేవా, ప్రజావాణి, ఇటీవల మరోసారి ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. కొత్తగా పెళ్లైన జంట లు తమ పేర్లను కుటుంబాల నుంచి డిలీట్ చేసుకుని, కొత్త వాటికి దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా అర్హులైనా.. ఇంతవరకు రేషన్‌కార్డులు అందలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఏప్రిల్‌లో అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, జనవరి 26 సందర్భంగా నిర్వహించిన ఆరుగ్యారెంటీల అమలు కోసం పైలెట్ ప్రాజెక్టు కింద కొందరు లబ్ధిదారులను అధికారులు రేషన్ జాబి తాలో ఎంపిక చేశారు. వీరికి నెలానెలా సరుకులు వస్తాయనుకున్నా.. నేటికీ ఎలాంటి సరుకులు అందడం లేదు. ఉగాది నుంచైనా కార్డులు పనిచేస్తాయా? లేదా? అన్న సందిగ్ధంలో లబ్ధిదారులు ఉన్నారు. బియ్యం దందా బంద్అయ్యేనా? ఇంతకాలం రేషన్ బియ్యాన్ని కొని మహారాష్ట్రతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో విక్రయించే వారికి జిల్లాలో విస్తృత నెట్‌వర్క్‌ఉంది. ఉమ్మడి జిల్లాలోని ప్రతీ గ్రామం, పట్టణాలలో ఇంటింటికీ మోపడ్ బండ్లపై తిరుగుతూ రేషన్‌బియ్యం సేకరించే వారికి ఇకపై మునపటి స్థాయిలో దందా నడవకపోవచ్చు. గోదావరిఖని, మంథని మీదుగా గోదావరి దాటి మహారాష్ట్రలోకి బియ్యం పంపే వీరు అక్కడ వాటిని ప్రాసెస్, పాలిష్ చేసి కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తారు. రెండేళ్ల క్రితం కరీంనగర్ నుంచే రైల్వే వ్యాగన్లలో రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారంటే వీరి దందా ఏస్థాయిలో నడిచేదో అర్థం చేసుకోవచ్చు. సన్నబియ్యం సరఫరా నేపథ్యంలో వీరి దందా బంద్ అయ్యేనా? లేక రూట్ మారుస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఉగాది నుంచి పంపిణీకి అధికారుల ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో 80 శాతం మంది ప్రజలకు ఉపయుక్తం దొడ్డుబియ్యం దందాకు శాశ్వత పరిష్కారం పేర్లు డిలిట్ అయిన వారికి ఇంకా అందని కార్డులు ప్రజాపాలన రేషన్జాబితాలో పేర్లు వచ్చినా అందని సరుకులు -
ఆహ్లాదం..అందనంతదూరం
జగిత్యాల: జిల్లాకేంద్రం.. గ్రేడ్–1 మున్సిపాలిటీ అయినప్పటికీ జగిత్యాలలో కనీసం సేద తీరుదామంటే ఉద్యానవనాలు లేవు. అమరవీరుల స్తూపం వద్ద పార్క్ ఉన్నప్పటికీ అందులో ఎలాంటి ఫౌంటెన్లు, పిల్లలు ఆడుకునే పరికరాలు ఏర్పాటు చేయలేదు. కేవలం గ్రీనరి మాత్రమే ఏర్పాటు చేశారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ పార్క్‌లో వసతులు లేక కళావిహీనంగా కనిపిస్తోంది. 1.34 లక్షల జనాభా ఉన్న ఈ పట్టణంలో ఒకేఒక్క పార్క్ ఉంది. అందులోనూ పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడంతో ఉన్న దాంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ఉద్యనవనానికి మరమ్మతుగానీ, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చేపడుదామన్న ఆలోచన చేయడం లేదు. గతంలో ఎన్నడో నిర్మించిన పరికరాలు, ఫౌంటేన్లకు వాటికి ౖపైపె పూతలు పూశారు. పచ్చదనం కోసం లాన్ ఏర్పాటు చేయలేదు. నడిబొడ్డున ఉండటంతో చాలామంది ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. పట్టణంలో సుమారు 50ఏళ్ల క్రితం యావర్‌రోడ్డు నడిబొడ్డున.. కొత్తబస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఇది ఎకరం స్థలంలో విస్తరించి ఉంది. గతంలో పిల్లలు ఆడుకోవడానికి ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. శిథిలావస్థకు చేరడంతో గతంలో రూ.10 లక్షలు పార్క్ కోసం బల్దియా కేటాయించినప్పటికీ ౖపైపె మరమ్మతు చేపట్టి మమ అనిపించారు. ఈ పార్క్‌లో మ్యూజికల్ ఫౌంటేన్, మరో ఫౌంటేన్ ఏర్పాటుకు, ఆట వస్తువుల ఏర్పాటుకు నిధులు మంజూరైనా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. పిల్లలు ఆడుకునే పరికరాలకు రంగులు పూసి వదిలేశారు. ప్రస్తుతం అవే వస్తువులతో ఆటలాడుకుంటున్నారు. మౌళిక వసతులు కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. వసతులు లేక.. పట్టణానికి నిత్యం వేలాది మంది వస్తూపోతుంటా రు. చదువుకునేందుకు విద్యార్థులు ఇక్కడకు ఉంటారు. సాయంత్రం పూట కాస్త సేద తీరుదామంటే పార్క్‌లో స్థలం కరువైంది. పట్టణవాసులకు ఆహ్లా దం అందడం లేదు. ఉన్న పార్క్‌లో సరైన వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి పట్టణంలో నివసించే వారి వద్దకు బంధువులూ వస్తుంటారు. కరీంనగర్ జిల్లా తర్వాత ప్రధాన పట్టణంగా గుర్తిపు పొందినప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. అధికారులు స్పందించి పార్క్‌లో అన్ని సౌకర్యాలు కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జగిత్యాలలో ఏకై క పార్క్ పట్టణవాసుల ఆశలు ఆవిరి పరికరాలు లేక చిన్నారుల తిప్పలు సౌకర్యాలు లేక వచ్చేందుకు వెనుకంజరెనోవేషన్ చేపడతాం పార్క్‌లో రెనోవేషన్ చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల కొన్ని మోటార్లు చెడిపోవడంతో ఫౌంటేన్లు నడవడం లేదు. త్వరలోనే వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటాం. – అనిల్, మున్సిపల్ ఏఈ -
చెట్టంత కొడుకు పోయాడు
7 కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన భూస కార్తీక్ అనే యువకుడు రెండు నెలల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన భూస శంకరయ్య–స్వరూప దంపతులకు కార్తీక్ ఒక్కగానొక కొడుకు. పెరిగిపెద్దయి అండగా ఉంటా నుకున్న కొడుకు రూ. 6 లక్షలు బెట్టింగ్‌లో పోగొట్టాడు. మనోవేదనతో జమ్మికుంట రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌కు బానిసైన కొడుకు చనిపోయాడని.. చదువుకొని ఉద్యోగం చేస్తాడని ఆశపడితే కడుపుకోతే మిగిలిందని తల్లిండ్రులు బోరుమన్నారు. -
ఎవరూ వాటి జోలికి పోవద్దు
ఎవరూ కూడా ఆన్లైన్ బెట్టింగ్ జోలికి పోవద్దు. అవన్నీ మోసపూరితమైనవే. ఆన్లైన్ ఊబిలోకి కూరుకుపోయిన వారు ఎవరూ బాగుపడలేదు. నా భర్త తెలియక డబ్బులు పెట్టి నిండా మునిగాడు. చివరికి ప్రాణాలు సైతం తీసుకున్నాడు. మేము ఒంటరివారమయ్యాం. ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాలాంటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. – బండి స్వప్న, సింగారం తల్లిదండ్రులు నిఘా పెట్టాలి ఐపీఎల్ బెట్టింగ్‌పై నిఘా ఉంచాం. అన్ని పోలీస్స్టేషన్లలో అప్రమత్తం చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలపై నిఘా పెట్టాలి. బెట్టింగ్‌లతో జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి. కేసులు నమోదైతే భవిష్యత్‌లో ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరూ వాటి జోలికి వెళ్లకూడదు. – కరుణాకర్, డీసీపీ పెద్దపల్లి మానసిక ఒత్తిడితోనే ఈజీగా డబ్బు సంపాదించాలే ఆశతో యువత బెట్టింగ్ ప్రారంభిస్తారు. మొదట డబ్బులు వస్తుంటే ఆశతో ముందుకెళ్తారు. ఆ తర్వాత నష్టపోతుంటే అప్పులు భారంగా మారి అసాధారణమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక నష్టాలు వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూ పుతాయి. ఈ ఒత్తిళ్లు వారికి అదనపు భయం, ఒంటరితనంతో ఆత్మహత్య ఆలోచనలు కలుగుతాయి. ఇలాంటి వారిని గుర్తించి వారు ఒత్తిడిని జయించాలంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు సమర్థవంతమైన మద్దతు ఇవ్వాలి. మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. – ప్రీతి, సైకియాట్రిస్టు -
వందశాతం పన్నులు వసూలు చేయాలి
కోరుట్ల: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ బీఎస్ లత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు. ఎల్ఆర్ఎస్, ఇంటి పన్ను వసూళ్లు మార్చి చివరి వరకు వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలోని అల్లమయ్య గుట్ట ఈద్గా వద్ద పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ పరిశీలించారు. చెత్తా చెదారం పూర్తి స్థాయిలో తొలగించాలని ఆదేశించారు. మెరుగైన విద్యుత్ అందిస్తాం మేడిపల్లి: అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో భాగంగా మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి ఉప విద్యుత్ కేంద్రంలో సుమారు రూ.10లక్షల విలువైన బ్రేకర్‌ను బుధవారం విద్యుత్ అధికారులు బిగించారు. ఈ బ్రేకర్‌ను టీజీఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్, జగిత్యాల జిల్లా నోడల్ అధికారి వెంకటరమణ ప్రారంభించారు. ఈ బ్రేకర్ ఏర్పాటుతో వల్లంపల్లి రూరల్ ఫీడర్ పరిధిలోని వినియోగదారులు, రైతులు నాణ్యమైన విద్యుత్ పొందుతారని తెలిపారు. రైతులు విద్యుత్ భద్రతా సూచనలు పాటించాలని, విద్యుత్ సమస్యలు పరిష్కారం కోసం స్థానిక సిబ్బందిని సంప్రదించాలని కోరారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలన్నా రు. జిల్లా విద్యుత్ అధికారి సాలియా నాయక్, డీఈలు గంగారాం, రవీందర్, ఏడీఈలు రఘుపతి, రాజు, ఆంజనేయులు, మనోహర్, ఏఈ అర్జున్, అశోక్ పాల్గొన్నారు. మహిళల హక్కులపై అవగాహన ఉండాలి జగిత్యాల: మహిళల హక్కులపై అవగాహన ఉండాలని డీడబ్ల్యూవో నరేశ్ అన్నారు. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో మ హిళల హక్కులు, లింగ సమానత్వంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ, మహిళల కోసం అనేక చట్టాలు వచ్చాయని, వారికి సేవలందించేందుకు సఖీ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయవచ్చని, ప్రతీ ఒక్కరు వాటి గురించి తెలుసుకోవాలన్నా రు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో మమత, మధు, లక్ష్మణ్, అశ్విని, స్వప్న, గౌతమి పాల్గొన్నారు. నేడు జిల్లాలో బీసీ కమిషన్ చైర్మన్ పర్యటన జగిత్యాల: జిల్లాలో గురువారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పర్యటిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. వంశరాజ్ దొమ్మరి వీరభద్రయ కులాల స్థితిగతులను అధ్యయనం చేయనున్నారని, అనంతరం ధర్మపురిలో సైతం పర్యటించనున్నట్లు తెలిపారు. ఉదయం 8.30 నుంచి 12.30 వరకు గాంధీనగర్, టీఆర్‌నగర్‌లో సందర్శిస్తారని తెలిపారు. ధర్మపురికి 3.30కు వెళ్లనున్నట్లు తెలిపారు. ఉపాధి అవకాశాల కోసం డీఈఈటీ జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డిజిటల్ ఎంప్లాయీమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఇటీవల ప్రారంభించిందని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరంతర ఉద్యోగాల కల్పన కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ (ఏఐ)తో కూడిన డీఈఈటీ అంతర్జాతీయ వేదికలను ఇటీవల పెద్దపల్లిలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారని, ఈ వేదికలో ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు. విద్యార్హతలు, నైపుణ్యాలతో దరఖాస్తు పూర్తి చేసుకున్న తర్వాత సమాచారాన్ని వారే పంపించడం జరుగుతుందని వివరించారు. -
డెత్‌లైన్ బెట్టింగ్!
ఒంటరి గువ్వలుఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బండి స్వామి(28) ఆటో నడపడంతోపాటు ఎల్లారెడ్డిపేటలో పాల డెయిరీ పెట్టుకున్నాడు. ఈక్రమంలో ఏర్పడ్డ పరిచయాలతో ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.18లక్షలు పోగొట్టుకున్నాడు. నిండా మునగడంతో పాలడెయిరీ, ఆటోలను సైతం అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై 2024 నవంబర్ 11న పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. స్వామి మృతితో భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు సాద్విన్, వర్షిత ఒంటరివారయ్యారు. స్వప్న ప్రస్తుతం బీడీలు చుడుతుండగా.. వారికి ఆసరాగా స్వామి తండ్రి లక్ష్మీనారాయణ మిర్చీ బండి పెట్టుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.బలైన విద్యార్థితిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన సిరికొండ నిఖిల్‌రావు(22)హైదరాబాదులో అగ్రికల్చర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడి భారీ ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది 10 రోజుల క్రితం గ్రామంలోని ఓ వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాగా చదువుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటాడునుకున్న కొడుకు ఆన్లైన్ బెట్టింగ్‌కు బలికావడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ●బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెడితే నిమిషాల్లోనే ఐదింతలు..పదింతలు అవుతాయనే ప్రకటనలు.. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే క్షణాల్లోనే మీ జీవితాలు మారుతాయనే యాడ్స్.. యువతను ఆకర్షిస్తున్నాయి. చదువుకునే విద్యార్థులు.. అప్పుడప్పుడే జీవితాల్లో స్థిరపడుతున్న యువత.. పిల్లాపాపలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న మధ్యవయసు వారు.. అందరూ బాధితులే. కష్టపడి సంపాదించిన సొమ్మును బెట్టింగ్ యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్‌లు, ఐపీఎల్ బెట్టింగ్‌లలో పెడుతూ నిండా మునుగుతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి బయటకు రాలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో దాదాపు 10 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు.. ఇన్ఫ్లుయన్సర్లు.. బుల్లితెర..వెండితెర నటీనటులపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బెట్టింగ్‌యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్ బాధిత కుటుంబాల పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్ టౌన్/ఎల్లారెడ్డిపేట/తిమ్మాపూర్/శంకరపట్నంఈజీమనీ వల.. జీవితాలు విలవిల●● అప్పుల ఊబిలోకి లాగుతున్న అత్యాశ ● మనీ సంపాదించవచ్చనే ప్రకటనలకు ఆకర్షణ ● బెట్టింగ్‌యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్‌లలో పెట్టుబడులు ● నిండా మునిగాక బయటకు రాలేకపోతున్న యువత ● ప్రాణాలు తీసుకుంటున్న వైనం ● రోడ్డున పడుతున్న కుటుంబాలుసిటీలకే పరిమితమైన బుకీలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ బెట్టింగ్ దందా సాగిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో స్థానికంగా ఉండే వారిని ఏజెంట్లగా నియమించుకుంటున్నారు. వీరు బెట్టింగ్‌లకు పాల్పడే వారిని గుర్తించి ఫోన్ నంబర్లతో టెలిగ్రామ్ గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేసినందుకు ఏజెంట్లకు కమీషన్ల రూపంలో భారీగానే ముట్టజెప్పుతున్నారు. బెట్టింగ్‌లకు పాల్పడేవారు ఇతరులకు అర్థంకాకుండా కోడ్ భాషలు ఉపయోగిస్తున్నారు. కోడ్ల ప్రకారం బెట్టింగ్‌లు పెడుతున్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్ పూర్తయ్యాక వచ్చిన డబ్బులతో గోదావరిఖనికి చెందిన బెట్టింగ్ నిర్వాహకులు పోలీసులకు చిక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసులు నమోదైతే చిక్కులు తప్పవు గతంలో బెట్టింగ్‌లో పట్టుబడితే వారిపై పెట్టి కేసులు నమోదు చేసేవారు. ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. పోలీసుల రికార్డులో పేరు, చిరునామా, ఎలాంటి నేరానికి పాల్పడ్డారు అనే వివరాలు ఉంటున్నాయి. ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. ప్రైవేటు కంపెనీలు సైతం ఉద్యోగావకాశాలు ఇవ్వవు. ఇలా గుర్తించండి బెట్టింగ్‌యాప్ బాధితులు ఎక్కువగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఎక్కువ సమయం ఫోన్లో లీనం కావడం, తెలిసిన వారు, స్నేహితుల వద్ద అప్పులు చేయడం, ఇంట్లో వారికి తెలియకుండానే డబ్బులు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. ఇలా ఫిర్యాదు చేయండి తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం. బెట్టింగ్‌కు పాల్పడిన, ప్రోత్సహించినా, సహకరించినా చట్టరీత్యా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బెట్టింగ్‌పై ఆన్లైన్లో www. cybercrime. gov. in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా టోల్‌ఫ్రీ నంబర్ 1930లోనూ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. పెద్దపల్లి జిల్లాలో కొన్ని సంఘటనలు ● 2025 మార్చి 21న మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సాయితేజ ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడటంతో రూ.6లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఇంట్లో విషయం తెలియడంతో మళ్లీ బెట్టింగ్‌ల జోలికి వెళ్లనని హామీ ఇవ్వగా నమ్మిన కుటుంబసభ్యులు అప్పులు తీర్చారు. తిరిగి సాయితేజ బెట్టింగ్‌లకు పాల్పడి రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ● 2024 జూలై 4న సుల్తానాబాద్‌లో రాత్రి వేళ వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రూ.33.10 లక్షల నగదుతో బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పట్టుబడ్డారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఐదు ఫోన్లు సీజ్ చేశారు. ● సుల్తానాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి సుమారు రూ.5లక్షల వరకు నష్టపోయాడు. అవి తీర్చేందుకు లోన్‌యాప్స్‌లో అప్పులు చేశాడు. తల్లిదండ్రులకు తెలిసి మందలించడంతో మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఐపీఎల్ పేరుతో ప్రతీ ఇంటిలోకి తొంగిచూస్తున్న బెట్టింగ్ భూతం బారినపడకుండా కుటుంబసభ్యులే రక్షించాల్సిన అవసరం ఉంది. -
ప్రయాణికుల భద్రతకే ‘మై ఆటో ఈజ్ సేఫ్’
మెట్‌పల్లిరూరల్: ప్రజలకు సురక్షితమైన ప్రయాణం అందించేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తోందని, అందులో భాగంగానే ‘మై ఆటో ఈజ్ సేఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎస్పీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. మెట్పల్లి మండలం వెల్లుల శివారులోని ఓ గార్డెన్లో ‘మె ఆటో ఈజ్ సేఫ్’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో యాజమానులు, డ్రైవర్లకు పలు విషయాలపై అవగాహన కల్పించి, స్కానర్‌తో కూడిన స్టిక్కర్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో 4వేలకు పైగా ఆటోలు ఉన్నాయని, ఇప్పటి వరకు 2,500కు పైగా ఆటోలను క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేశామన్నారు. మెట్పల్లి సర్కిల్ పరిధిలో మొత్తం 346 ఆటోలకు స్టిక్కర్లు వేశామన్న ఆయన, ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు ‘మె ఆటో ఈజ్ సేఫ్’ అనే స్టిక్కర్ ఉందా లేదా గమనించాలన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే డ్రైవర్ సీట్ వెనకాల గల క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సంబంధిత ఆటో డ్రైవర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని, వాటితో పాటు ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్ వస్తుందని వివరించారు. ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒక దాని ఆధారంగా తమకు ఫిర్యాదు వస్తే ఆ సమాచారంతో వెంటనే స్పందిస్తామన్నారు. మెట్పల్లి డీఎస్పీ రాములు, ఆర్టీవో శ్రీనివాస్, సీఐ అనిల్‌కుమార్, ఎస్సైలు కిరణ్‌కుమార్, రాజు, మున్సిపల్ కమిషనర్ మోహన్ పాల్గొన్నారు.● ఎస్పీ అశోక్‌కుమార్ -
ఇదే చివరి తడి..!
● 18 టీఎంసీలకు పడిపోయిన ఎస్సారెస్పీ నీటిమట్టం ● ఏప్రిల్ 2 వరకే చివరి నీటి తడంటూ అధికారుల ప్రకటన ● ‘యాసంగి’పై ఉమ్మడి జిల్లా రైతుల ఆందోళనజగిత్యాల అగ్రికల్చర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగునీటికి వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోంది. బుధవారం నాటికి 18.833 టీఎంసీలకు పడిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు జోన్–2 ఆయకట్టు(ఎల్ఎండీ ఎగువ భాగం)కు డీ–54 నుంచి డీ–94 వరకు ఏప్రిల్ 2 వరకు, జోన్–1 ఆయకట్టు(డీ–5 నుంచి డీ–53 వరకు)కు ఏప్రిల్ 9వరకు మాత్రమే చివరి సాగు నీటితడి అందిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో యాసంగి పంట సాగుపై ఉమ్మడి జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ కింద దాదాపు ఏడు లక్షల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో వరి ఎక్కువగా సాగు చేశారు. పంట పొట్టదశలో ఉంది. ఇప్పుడు సాగునీరు అందకపోతే కష్టం. ఎస్సారెస్పీ నుంచి మరో 8 టీఎంసీలు మాత్రమే విడుదల చేసే అవకాశముంది. దీంతో రైతులు వ్యవసాయ బావులపైనే ఆధారపడి ఉన్న పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి.ఎందుకీ సమస్య? ఈ ఏడాది ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. ఓ ప్రణాళిక అంటూ లేకుండా ఇష్టారీతిన నీటిని వాడటంతో చి‘వరి’కి సాగునీటి గండం ఏర్పడుతోంది. ప్రజా ప్రతినిధులు చెప్పారని వానా కాలం, ఎండాకాలం తేడా లేకుండా ఎస్సారెస్పీ అధికారులు నీటి విడుదల చేశారు. ఎస్సారెస్పీ కాలువలకు ఇష్టారీతిన తూములు ఏర్పాటు చేసి, సాగునీటిని చెరువులకు మళ్లిస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీటి విడుదల సరిగ్గా కాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. -
ప్రభుత్వ భూములు ఖాళీ చేయాలి
● కలెక్టర్ సత్యప్రసాద్జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. నర్సింగాపూర్ గ్రామశివారులోని ఆక్రమణకు గురైన 90ఎకరాల స్థలాన్ని బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సింగాపూర్ శివారులోని సర్వేనంబరు 251, 437లో 90ఎకరాల్లో ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్‌ను సర్వే చేపట్టడం జరిగిందన్నారు. సర్వే తర్వాత ఎవరైతే పట్టా అయిన భూములున్నాయో అవన్నీ పీవోటీ యాక్ట్ కింద రద్దు చేయడం జరిగిందన్నారు. అందులో సేల్ అయిన, రిజిస్ట్రేషన్ అయిన భూములను కూడా రద్దు చేయడం జరుగుతుందన్నారు. 90 ఎకరాల ప్రభుత్వస్థలంలో సర్వే నంబరు 437, 251లో ఆన్ రికార్డ్ ప్రకారం గవర్నమెంట్ రికవరీ చేసుకుందని, ప్రభుత్వపరంగా గవర్నమెంట్ ల్యాండ్ జాబితాలో ఉందన్నారు. ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదన్నారు. గ్రౌండ్ లెవల్లో ఇప్పటికే పరిశీలన పూర్తయిందని తెలిపారు. సదరు భూమిలో ఇటుక బట్టీల వ్యా పారం చేస్తున్నవారు 48గంటల్లోపు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను బేఖా తరు చేస్తే ప్రభుత్వ పీవోటీ యాక్ట్ ప్రకారం క్రిమి నల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న వాటిని సీజ్ చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. ఆయన వెంట ఇన్చార్జి ఆర్డీవో శ్రీనివాస్, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, ల్యాండ్ సర్వేయర్లు విఠల్ పాల్గొన్నారు.