
ప్రయాణికుల భద్రతకే ‘మై ఆటో ఈజ్ సేఫ్’
మెట్‌పల్లిరూరల్: ప్రజలకు సురక్షితమైన ప్రయాణం అందించేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తోందని, అందులో భాగంగానే ‘మై ఆటో ఈజ్ సేఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎస్పీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. మెట్‌పల్లి మండలం వెల్లుల శివారులోని ఓ గార్డెన్‌లో ‘మె ఆటో ఈజ్ సేఫ్’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో యాజమానులు, డ్రైవర్లకు పలు విషయాలపై అవగాహన కల్పించి, స్కానర్‌తో కూడిన స్టిక్కర్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో 4వేలకు పైగా ఆటోలు ఉన్నాయని, ఇప్పటి వరకు 2,500కు పైగా ఆటోలను క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేశామన్నారు. మెట్‌పల్లి సర్కిల్ పరిధిలో మొత్తం 346 ఆటోలకు స్టిక్కర్లు వేశామన్న ఆయన, ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు ‘మె ఆటో ఈజ్ సేఫ్’ అనే స్టిక్కర్ ఉందా లేదా గమనించాలన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే డ్రైవర్ సీట్ వెనకాల గల క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సంబంధిత ఆటో డ్రైవర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని, వాటితో పాటు ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్ వస్తుందని వివరించారు. ఈ రెండు ఆప్షన్‌లలో ఏదో ఒక దాని ఆధారంగా తమకు ఫిర్యాదు వస్తే ఆ సమాచారంతో వెంటనే స్పందిస్తామన్నారు. మెట్‌పల్లి డీఎస్పీ రాములు, ఆర్టీవో శ్రీనివాస్, సీఐ అనిల్‌కుమార్, ఎస్సైలు కిరణ్‌కుమార్, రాజు, మున్సిపల్ కమిషనర్ మోహన్ పాల్గొన్నారు.
● ఎస్పీ అశోక్‌కుమార్