
బార్ అసోసియేషన్ ఏకగ్రీవం
జగిత్యాలజోన్: జగిత్యాల బార్ అసోసియేషన్ ఎన్నిక సోమవారం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి నక్కల సంజీవరెడ్డి తెలిపారు. ఒక్క కార్యవర్గం పోస్టు మినహా మిగితా పదవులకు ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో వారి ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవమైంది. 10 కార్యవర్గ పోస్టులకు 11 మంది నామినేషన్ వేయగా.. సోమవారం ఒక్కరు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో కార్యవర్గం ఏకగ్రీవమైంది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాచకొండ శ్రీరా ములు, ఉపాధ్యక్షుడిగా సిరిపురం మహేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా అందె మారుతి, సంయుక్త కార్యదర్శిగా కరభూజ నర్సయ్య, కోశాధికారిగా ఎం.ప్రతీప్‌కుమార్, లైబ్రరీ కా ర్యదర్శిగా మానాల వెంకటరమణ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కంచి సురేశ్, మహిళా ప్రతినిధిగా పడాల రాధ, కార్యవర్గ సభ్యులుగా టి.రమేశ్, టి.సంతోష్‌కుమార్, ఏ.రమేశ్, మ హేందర్, వెంకటేశ్, రాజేందర్, నిఖిల్, రాజ్‌కుమార్, అరుణ్, మధు ఏకగ్రీవం అయ్యారు.
1,200 మందికి ఉచిత వైద్యపరీక్షలు
కోరుట్ల: పట్టణంలోని కింగ్స్‌గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబి రా నికి విశేష స్పందన లభించింది. కోరుట్ల ఐఎంఏ, కేఎంవోజీఎస్, జమాతే ఈ ఇస్లామి హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. 1,200 మందికి వైద్య పరీక్షలు చే శారు. ఇందులో 200 మందికి బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్, 200 మందికి గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్, 100 మందికి బోన్ డెన్సిటీ టెస్టులు, కంటి, దంత, సాధారణ పరీక్షలు నిర్వహించారు. కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, కేఎంవోజీఎస్ అధ్యక్షుడు డాక్టర్ స్వీతి అనూప్, కోరుట్ల ఐఎంఏ అధ్యక్షుడు రేగొండ రాజేశ్, ఐఎంఏ సెంట్రల్ కమిటీ సభ్యుడు అనూప్ రావు పాల్గొన్నారు.
మామిడి తోటలను కాపాడుకోండి
జగిత్యాలఅగ్రికల్చర్/మల్యాల: మామిడి తోట లకు ఆశిస్తున్న పురుగులను నివారించేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానవన శాస్త్రవేత్తలు సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పర్యటించి, తోటలను పరిశీలించారు. ప్రస్తుతం మామిడికాయ వృద్ధి చెంది, టెంక గట్టిపడే దశలో ఉన్నాయని, పలు తోటల్లో తామర పురుగు ఉధృతిని గమనించినట్లు తెలిపారు. పురుగుల ఉధృతిని బట్టి లీటరు నీటిలో వేపనూనె 3మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలన్నారు. అనంతరం ఫిప్రోనిల్ 80శాతం డబ్ల్యూజీ 0.2 గ్రాములు, లేదా స్పైనోసాడ్ 45శాతం ఎస్‌సీ 0.3 మిల్లీ లీటర్లు, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, సింథటిక్ పైరిత్రాయిడ్ కీటకనాశినిలను ఉపయోగించవద్దని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం రామగిరిఖిల్లా శాస్త్రవేత్త డాక్టర్ వై.వెంకన్న, ఫామ్ మేనేజర్ బండారి నరేశ్, సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎ.నితీశ్, ఉద్యాన అధికారి మహేశ్ పాల్గొన్నారు.
కార్మికులకు సబ్బులు, నూనెలు పంపిణీ
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనెలు ఇవ్వకపోవడంతో ఉత్త చేతులతోనే చెత్త చెదారం సేకరించడం జరిగింది. ఈ విషయంపై ‘సాక్షి’లో ‘సబ్బులు లేవు... నూనె ఇవ్వరు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో ము న్సిపల్ కమిషనర్ స్పందన స్పందించారు. ము న్సిపల్ కార్మికులకు సబ్బులు, నూనెలు, డ్రెస్ లు అందజేశారు. పారిశుధ్య కార్మికుల రక్షణే ముఖ్యమని, జోనల్ వారీగా అందరికీ అందజేయడం జరుగుతుందని తెలిపారు. శానిటరీ ఇ న్‌స్పెక్టర్ మహేశ్వర్‌రెడ్డి, మారుతి పాల్గొన్నారు.

బార్ అసోసియేషన్ ఏకగ్రీవం

బార్ అసోసియేషన్ ఏకగ్రీవం

బార్ అసోసియేషన్ ఏకగ్రీవం