
పల్లె దవాఖానాలతో నిరుపేదలకు వైద్యసేవలు
రాయికల్: గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలతో నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం రాయికల్ మండలం మైతాపూర్‌లో ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా, సన్నబియ్యం పథకం, ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. మైతాపూర్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద నిర్మించే సీసీరోడ్డుకు భూమిపూజ చేశారు. ఏడుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణలో అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేయించామని గుర్తుచేశారు. సివిల్ సప్లై అధికారి జితేందర్‌ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, ఆర్‌ఎంవో విజయ్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ సతీశ్, ఎంపీవో సుష్మ, ఏఈ ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, ఏఎంసీ మాజీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తా
జగిత్యాల: జగిత్యాల అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. మోతెలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాలలో 300 ఎకరాలతో కాడా, 4,520 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయించామన్నారు. నూకపల్లి, నర్సింగాపూర్‌లో 188 ఎకరాలు కలిపేందుకు గవర్నర్ ఆమోదమే మిగిలిందన్నారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని 4వ వార్డులో రూ.57 లక్షలతో చేపడుతున్న రోడ్లకు భూమిపూజ చేశారు.
సన్నబియ్యం నిరుపేదల పాలిట వరం
జగిత్యాల: సన్న బియ్యం పంపిణీ నిరుపేదల పాలిట వరమని ఎమ్మెల్యే అన్నారు. బుడిగజంగాల కాలనీలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. 30వేల కుటుంబాలకు లబ్ధి జరుగుతుందన్నారు. ఆర్డీవో మధుసూదన్, సివిల్ సప్లై డీఎం జితేంద్రప్రసాద్, బల్దియా కమిషనర్ స్పందన తదితరులు ఉన్నారు.
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్