మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్‌ | - | Sakshi
Sakshi News home page

మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్‌

Apr 6 2025 2:02 AM | Updated on Apr 6 2025 2:02 AM

మహోన్

మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్‌

జగిత్యాల/ధర్మపురి: సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి బాబు జగ్జీవన్‌రామ్‌ అని, అతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంచినీళ్ల బావి చౌరస్తా వద్ద, ధర్మపురి పట్టణంలోని అంబేధ్కర్‌ కూడలి వద్ద శనివారం జగ్జీవన్‌రామ్‌ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా గ్రీన్‌ రెవల్యూషన్‌ సమర్థవంతంగా అమలు చేసి దేశాన్ని ఆహార ధాన్యాలపరంగా స్వయం సమృద్ధిగా మార్చిన మహనీయుడు అని కొని యాడారు. అడిషనల్‌ కలెక్టర్‌ లత మాట్లాడు తూ.. జగ్జీవన్‌రామ్‌ జీవితంలో అంటరానిత నం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని వరకు అనే క అంశాలు చూశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన హనీయుడు జగ్జీవన్‌రామ్‌ అని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా భవన్‌లో జయంతిని నిర్వహించారు.

ఆదర్శనేత: ఎస్పీ అశోక్‌కుమార్‌

జగిత్యాలక్రైం: జగ్జీవన్‌రామ్‌ దేశానికి ఆదర్శనేత అని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బాబుజగ్జీవన్‌రామ్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ మాజీ కమిషనర్‌ విజయలక్ష్మీ, ఆర్డీవో మధుసూదన్‌, డీఎస్పీ రఘుచందర్‌, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘ నాయకులు పేట భాస్కర్‌, బొల్లి శేఖర్‌, సతీశ్‌, బండ శంకర్‌ పాల్గొన్నారు.

ఏఐటీయూసీ బలోపేతానికి కృషి చేయాలి

రాయికల్‌: ఏఐటీయూసీ బలోపేతానికి కృషి చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి తెలిపారు. శనివారం పట్టణంలోని అంగన్‌వాడీ కార్యకర్తలను యూనియన్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ ముందుంటుందని తెలిపారు. సంఘం పటిష్టత కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణకుమారి, దయావతి, మండల నాయకులు వనిత, లావణ్య, శాంత, మమత, జమున, స్రవంతి, ఉమారాణి, రాధిక, సుమలత పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

మల్లాపూర్‌: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రాము అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ముందస్తు బడిబాట కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో రేగుంట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట కరపత్రాన్ని రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థుల సంఖ్యను పెంచి వారి విద్యాభివృద్ధితోపాటు పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మల్లాపూర్‌ ఎంఈవో దామెదర్‌రెడ్డి, మాజీ ఎంఈవో గంగాధర్‌, గెజిటెడ్‌ ప్రధానోపాద్యాయులు బోగ రమేష్‌, రేగుంట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయులు డి.శంకర్‌బాబు, ఉపాద్యాయ సంఘాల నాయకులు ఆనందరావు, రాంచందర్‌, అమర్నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్‌1
1/3

మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్‌

మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్‌2
2/3

మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్‌

మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్‌3
3/3

మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement