● అమల్లోకి వచ్చిన వేతనాలు ● వేసవిలో కూలీలకు లబ్ధి ● జిల
రాయికల్: ఉపాధిహామీ కూలీల వేతనాన్ని రూ.307కు పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 382 గ్రామాల్లోగల 1,67,497 మంది జాబ్‌కార్డుదారులుకు లబ్ధి చేకూరనుంది. 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఆ సమయంలో దినసరి కూలీ రూ.87.50 చెల్లించింది. పదేళ్ల క్రితం వరకు రూ.190 మాత్రమే చెల్లించేవారు. అప్పటి నుంచి ఏటా 10 నుంచి 25 శాతం వరకు కేంద్రం కూలి పెంచుతోంది. ఈ ఏడాది అది రూ.307కు పెరిగింది. మొన్నటివరకు రూ.300వరకు వేతనం అందుకున్న కూలీలు.. ఈ ఏడాది కేవలం రూ.7 మాత్రమే పెంచడంతో కొంతవరకు అసంతృప్తి వ్యక్తమవుతోంది.
వ్యవసాయేతర పనులకే ఎక్కువ
జిల్లాలో జాబ్‌కార్డు కలిగిన ఉపాధి కూలీలు ఉపాధి పనులకంటే వ్యవసాయేతర పనులపైవే మొగ్గుచూపుతున్నారు. ఒక్కో కూలీ ప్రతిరోజు వ్యవసాయేతర పనులు చేయడం ద్వారా రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదించుకుంటున్నారు. దీంతో చాలామంది వ్యవసాయేతర పనుల వైపు మొగ్గుచూపుతున్నారు. కేవలం వేసవికాలంలోని మూడు నాలుగు నెలలు మాత్రమే ఉపాధి పనులకు హాజరవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దినసరి వేతనం మరింత పెంచాలని కూలీలు కోరుతున్నారు.
ఉపాధిహామీ పనుల్లో కూలీలు
పెంచిన కూలి అమలు చేస్తాం
దినసరి కూలి రూ.307 అమలు చేస్తాం. జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఉపాధిహామీ కూలీ ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేయాలి. అంతేకాకుండా గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్యను పెంచేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం.
– రఘువరణ్, డీఆర్డీవో పీడీ
● అమల్లోకి వచ్చిన వేతనాలు ● వేసవిలో కూలీలకు లబ్ధి ● జిల


