రూ.350 కోట్ల అంచనాలతో యూజీడీ
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: జిల్లాకేంద్రంలో రూ.350 కోట్ల అంచనాలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ)కి ప్రక్రియ పూర్తయిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. ఈనెల 4న ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశముందని, స్వయంగా తానే హాజరవుతానని పేర్కొన్నారు. జగిత్యాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. సీఎం సహకారంతో ప్రత్యేక నిధులు కేటాయించేలా చూస్తున్నామని వివరించారు. త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జ్యోతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.


