ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం

Apr 10 2025 12:21 AM | Updated on Apr 10 2025 12:21 AM

ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం

ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం

● ఏర్పాటు చేయనున్న 407 కేంద్రాలు ● ఐదు లక్షల టన్నుల ధాన్యం అంచనా

జగిత్యాలరూరల్‌: జిల్లాలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సర్వంసిద్ధం చేసింది. ఇప్పటికే కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో 133 ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో 273, మెప్మా ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రాలు కలిపి మొత్తం 407 కేంద్రాల ద్వారా సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల టన్నులు సేకరించనున్నారు. జిల్లావ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కావడంతో కొనుగోలు కేంద్రాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు.

కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు

రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి న వెంటనే తేమ శాతాన్ని పరిశీలించనున్నారు. తర్వాత కొనుగోలు చేస్తారు. తూకం వేసేందుకు ప్రతి సెంటర్‌కు ఎలక్ట్రానిక్‌ కాంటా.. తేమ శాతాన్ని పరిశీలించేందుకు మీటర్‌, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లను సిద్ధంగా ఉంచారు. తప్పతాళ్లు లేకుండా క్లీన్‌ చేసేలా ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేశారు.

86 మిల్లర్లకు ధాన్యం కేటాయింపు

ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు 86 మంది రైస్‌మిల్లులను కేటాయించారు. మిగతా కొన్నింటికి ధాన్యం సేకరణను దృష్టిలో ఉంచుకుని కేటాయింపు చేసే అవకాశాలున్నాయి. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయడంతోపాటు, మిల్లుల్లో కూడా వెంటనే ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేసేలా మిల్లర్లకు హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

తేమశాతం ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చేలా అవగాహన

రైతులు పండించిన ధాన్యాన్ని పొలం నుంచి నేరుగా కొనుగోలు కేంద్రానికి కాకుండా ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఇప్పటికే మహిళాసంఘాల ద్వారా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. నేరుగా రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ధాన్యం ఆరబెట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయని రైతులకు తేమశాతం వచ్చిన ధాన్యాన్నే సెంటర్‌లోకి తీసుకురావాలని అవగాహన కల్పిస్తున్నారు.

407 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు

జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోకు 407 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కొనుగోళ్లు పూర్తయ్యే వరకు సెంటర్ల నిర్వహణ కొనసాగుతుంది. – జితేందర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement