ఫిల్టర్‌బెడ్ ద్వారా గ్రామాలకు రక్షిత నీరు
● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాల/జగిత్యాలరూరల్/జగిత్యాలటౌన్/రాయికల్ ఫిల్టర్‌బెడ్ల ద్వారా త్వరలో గ్రామాలకు రక్షిత మంచినీరు అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొలాస శివారులోని ఫిల్టర్‌బెడ్ మరమ్మతు పనులను పరిశీలించారు. పొలాస నుంచి కల్లెడ వరకు నీటి సరఫరా ఉంటుందన్నారు. అంతకుముందు ఆయన పొలాస శివారులోని పౌలస్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
సంవిధాన రక్షణకు కృషి చేయాలి
భారత్ సంవిధాన పరిరక్షణకు కృషిచేయాలని విప్ అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జిల్లా పరిశీలకులు రియాజ్ అన్నారు. జైబా పు, జైభీం, జైసంవిధాన్ సన్నాహక సమావేశం శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. సంవిధాన్ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. వివిధ గ్రామాలకు చెందిన 312మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
మిషన్‌భగీరథ నీరు అందించాలి
మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ అందించేలా చర్యలు తీసుకోవాలని విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. తాగునీటి ఇబ్బందులు రానీయొద్దన్నారు. కార్యక్రమాల్లో అధికా రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మతసామరస్యానికిప్రతీక రంజాన్
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో మున్ను ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో పాల్గొన్నారు. తహసీల్దార్ ఖయ్యూం, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరి షాకీర్, నబీ, శంషేర్, మొబి న్, మసూద్, ఖలీల్ పాల్గొన్నారు.


