దమ్ముంటే రాజీనామా చేసి గెలువు
● బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి
జగిత్యాలటౌన్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని, ఆయనను గెలిపించిన కార్యకర్తలు జైలులో ఉంటే వారిని మరిచిపోయి దొడ్డిదారిన వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జీవన్‌రెడ్డి గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారని, తాను తన చైర్‌పర్సన్ పదవి, బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరానని, సంజయ్ మాత్రం కాంట్రాక్టులు, బిల్లుల కోసం పార్టీ మారారని ఆరోపించారు. ఎమ్మెల్యేల ఆదరణలో 108వ స్థానంలో ఉన్న విషయం సంజయ్‌కుమార్ గుర్తుపెట్టుకోవాలన్నారు. నాయకులు సిరికొండ రాజన్న, సాంబారి కళావతి, దూరిశెట్టి మమత, గడ్డల లక్ష్మి, సింగం పద్మ, కాశెట్టి తిరుపతి ఉన్నారు.


