
తూకంలో తక్కువగా వస్తుంది
మాంసం కిలో కొంటే 900 గ్రాములు మాత్రమే వస్తోంది. దీంతోపాటు మున్సిపల్ అధికారులు సైతం చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్నారు. ము న్సిపల్ ముద్ర కూడా ఉండటం లేదు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
– ఎర్ర రాజేందర్, జగిత్యాల
చర్యలు తీసుకుంటాం
జిల్లా కేంద్రంలో మాంసం క్రయవిక్రయాలపై స్లాటర్‌హౌస్‌లోనే కొసేలా చర్యలు తీసుకుంటున్నాం. జవాన్లు అందరికీ ఆదేశాలు జారీ చేశాం. ఏమైనా తూకాల్లో తేడాలు వచ్చినా.. అనారోగ్యానికి గురైన, మేకలు, గొర్రెలు కోసినా చర్యలు తీసుకుంటాం.
– స్పందన, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల
స్లాటర్‌హౌస్‌లు ఏర్పాటు చేయాలి
మున్సిపాలిటీలో స్లాటర్‌హౌస్ ఏర్పాటు చేయాలి. అవి లేకపోవడంతో జనవాసాల మధ్యనే మాంసం విక్రయిస్తున్నారు. అవి మంచివో కావో తెలియని పరిస్థితి. అధికారులు స్పందించి స్లాటర్‌హౌస్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.
– నవీన్, మెట్‌పల్లి

తూకంలో తక్కువగా వస్తుంది