
హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి
కథలాపూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి విరమించుకోవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కథలాపూర్‌లో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీల భూములను అమ్ముకోవడానికే విద్యాశాఖను సీఎం తన వద్ద ఉంచుకున్నారని ఆరోపించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ఖండించారు. విద్యార్థులు గళమెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేయడం దారుణమన్నారు. ప్రశ్నించేగొంతులను అణగదొక్కడమే ప్రభుత్వ విధానామా..? అని ప్రశ్నించారు. విద్యాసంస్థల భూములను అమ్మితే చరిత్రహీనులుగా మారడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు కొండ ఆంజనేయులు, బద్దం మహేందర్, గడ్డం శేఖర్‌రెడ్డి, వినోద్‌రావు, తీట్ల శంకర్, ముస్కు భాస్కర్, ప్రిన్స్‌రెడ్డి, ముస్కు శ్రీనివాస్, కృష్ణారెడ్డి, రాజారెడ్డి పాల్గొన్నారు.