కథలాపూర్: ధాన్యానికి మద్ధతు ధర కల్పించేందుకే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని పోసానిపేట, భూషణరావుపేటలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ లతతో కలిసి ప్రారంభించారు. సిరికొండలో జైబాపు, జై భీమ్, జైసంవిధాన్ కార్యక్రమంలో విప్ పాల్గొన్నారు. సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, డైరెక్టర్లు అంబటి రవి, వాకిటి రాజారెడ్డి, కారపు గంగాధర్, ఎం.డీ హఫీజ్, గుండారపు గంగాధర్, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, గడ్డం స్వామిరెడ్డి, తీట్ల శంకర్, ముస్కు శ్రీనివాస్ పాల్గొన్నారు.


