● మున్సిపాలిటీల్లో అటకెక్కిన సిటిజన్ చార్ట్ ● ఆన్‌లైన్ ఫిర్యాదులపై స్పందన కరువు ● అవగాహన లేక.. పరిష్కారం కాక ఆసక్తి చూపని పట్టణవాసులు
జగిత్యాల: మున్సిపాలిటీల్లో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిటిజన్ చార్టర్ ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. జిల్లాలో సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు వస్తున్నా పెద్దగా పరిష్కరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చిన దరఖాస్తులు పరిష్కరించినట్లు అధికారులు పేర్కొంటున్నా.. క్షేత్రస్థాయిలో పటి?్టంచుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో ఆన్‌లైన్ ద్వారా వారం రోజుల్లో 112 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో 31 మాత్రమే పరిష్కరించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ చాలా వరకు పరిష్కారం కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై చాలామందికి అవగాహన లేక.. సమస్యలు పరి ష్కారం కాక ఫిర్యాదు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మున్సిపాలిటీల్లో పౌరసేవలపై పట్టించుకునే వారు లేకపోవడంతో సిటిజన్ చార్టర్ అటకెక్కింది.
సేవలివే..
సిటిజన్ చార్టర్ ద్వారా మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలైన రోడ్లు, స్తంభాలు, టౌన్‌ప్లానింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, పారిశుధ్యం, డ్రెయినేజీలు వంటి ఏ సమస్య అయినా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందులో ఫిర్యాదు చేసిన రెండు నుంచి మూడు రోజుల్లోనే సమస్య పరిష్కరించాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసిన వారికి సమస్యను పరిష్కరించి సెల్‌ఫోన్ ద్వారా సమాచారం కూడా అందించాల్సి ఉంటుంది.
ప్రజల్లో అవగాహన లేక..
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పౌరసేవలపై సరైన అవగాహన లేక ఎవరూ ఫిర్యాదులు చేయడం లేదు. శ్రీసిటిజన్ బడ్డీ యాప్‌శ్రీ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్నా దీనిపై మున్సిపల్ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. ప్రజల్లో అవగాహన కల్పిస్తే చాలా సమస్యలు పరిష్కరించే దిశగా ఉంటాయి.
ప్రతీ సమస్యకూ సమయం
సిటిజన్ చార్టర్ ద్వారా ప్రతీ సమస్యకూ కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలోనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు ఆ మేరకు పట్టించుకోవడం లేదు. అలాగే మున్సిపాలిటీ ద్వారా ఏదైనా దరఖాస్తు చేసుకుంటే సకాలంలో ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాపార లైసెన్స్‌లు, హ క్కుల మార్పిడి, జనన ధ్రువీకరణ పత్రాల్లో శిశువు పేర్లు చేర్చడం, మరణ ధ్రువీకరణ పత్రం, విద్యాసంస్థలకు పారిశుధ్య ధ్రువీకరణ పత్రం.. ఇలా 22 రకాల పౌర సేవలను కచ్చితంగా సమయంలోపు అందించాల్సి ఉంటుంది. కానీ అవగాహన లోపంతో ఏ మున్సిపాలిటీలోనూ అందడం లేదు.
2023–24 నుంచి 2024–25 ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు
మున్సిపాలిటీ వచ్చిన పరిష్కరించినవి ఫిర్యాదులు
జగిత్యాల 4,200 3,500
కోరుట్ల 3,176 3,174
మెట్‌పల్లి 2,413 2,125
రాయికల్ 41 41
ధర్మపురి 690 650
ఎవరికీ పట్టని పౌరసేవలు