
విశ్వశాంతికి పునాది
శిశిర ఋతువుకు వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతున్న వేళ ఆరంభం అవుతున్న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విశ్వానికి సంబంధించినది. ఈ సంవత్సరం శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. కుటుంబ జీవితాలలోను సంతోషంగా ఉంటుంది. దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. విశ్వావసు అంటే ప్రపంచానికి మేలు చేసేవాడు.. అంటే ప్రజలు సహాయక స్వభావం కలిగి ఉంటారు.
– నమిలకొండ రమణాచార్యులు, కరీంనగర్
ఏటా కవి సమ్మేళనాలు
కోరుట్ల: స్వేచ్చ సాహితీ సమితి.. కోరుట్లలో బ హుజన కవిత్వానికి పెట్టింది పేరు. ఏటా స్వేచ్ఛ సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనా లు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. కవి రాస భూమయ్య అధ్యక్షతన ఏర్పాటైన సాహితీ స మితి కేవలం ఉగాది కవి సమ్మేళనాలకు పరి మితం కాకుండా అభద్రతతో ఉన్న వృద్ధులు, మహిళలు, పిల్లలకు చేయూతగా నిలుస్తుంది.

విశ్వశాంతికి పునాది