
పంటలు సమృద్ధిగా..
మంథని: విశ్వావసు నామ సంవత్సరంలో పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంది. పత్తి, వరి, తెల్ల జొన్నలు వంటి పంటలు ఎక్కువగా లాభాలనిస్తాయి. పాలకుల మధ్య విభేదాలతో ప్రజలకు కొంత అసౌక్యం కల్గుతుంది. అయినా ప్రజల్లో స్నేహభావంతో మేలు జరుగుతుంది. భయాందోళనకర వాతావరణం ఉన్నా భగవతారాధన వల్ల అందరూ సుభిక్షింగా ఉంటారు. బంగారం, లోహ సంబంధిత వస్తువుల ధరలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
– వొజ్జల గణేశ్ అవధాని, వేద పండితుడు, మంథని
35 వసంతాలుగా..
గోదావరిఖనిటౌన్(రామగుండం): ఉగాది అనగా యుగానికి ఆది అని అర్థం. 35 ఏళ్లుగా గోదావరిఖని పవర్‌హౌస్‌కాలనీలోని శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయంలో పంచాంగ శ్రవణం వినిపిస్తున్న. ఈ ఉగాది విశ్వావసు సంవత్సరం అనగా 11 మంది గంధర్వులలో విశ్వవాసుడు ఒకరు. విశ్వ వాసుడు ప్రేమకు ప్రతీథి. ప్రజల మధ్య ప్రేమానురాగాలను కలిగిస్తాడు. ఇది శుభ సంవత్సరం. ఉగాది రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలి. అనగా ఒంటికి నూనె రాసుకొని తెల్లవారక ముందే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఽఈ రోజు ధ్వజారోహణము చేసి, ఇంటిపై ధ్వజమును ఎగురవేయాలి.
– వొజ్జల వెంకటేశ్వరశర్మ, గోదావరిఖని

పంటలు సమృద్ధిగా..