రైతు పొలంలో జిల్లా జడ్జి నీలిమ | - | Sakshi
Sakshi News home page

రైతు పొలంలో జిల్లా జడ్జి నీలిమ

Apr 14 2025 12:27 AM | Updated on Apr 14 2025 12:27 AM

రైతు

రైతు పొలంలో జిల్లా జడ్జి నీలిమ

సారంగాపూర్‌: మండలంలోని పెంబట్లకు చెందిన బండారి వెంకటేష్‌ సాగు చేస్తున్న పుచ్చకాయల తోటను ఆదివారం జిల్లా జడ్జి నీలిమ కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. వెంకటేష్‌ ఏటా భిన్నమైన పంటలను సాగు చేసి విక్రయిస్తుంటాడు. గతేడాదిగా లోపలి భాగం ఎరుపు, పసుపురంగులో ఉన్న కర్బూజలను పండించి జిల్లాకేంద్రంలోని శ్రీరామ చౌరస్తాలో అమ్ముతున్నాడు. ఆ పంట వివరాలు తెలుసుకునేందుకు జడ్జి పెంబట్లకు చేరుకున్నారు. తోటలో కలియతిరిగి పంట పండించే విధానాన్ని తెలుసుకున్నారు. రైతు దంపతులైన వెంకటేష్‌, విజయను జడ్జి అభినందించారు.

అంబేడ్కర్‌ జయంతిని విజయవంతం చేయాలి

జగిత్యాల:అంబేడ్కర్‌ జయంతిని విజయవంతం చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14న జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం, అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిర్వహించే వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొనాలని సూచించారు.

లండన్‌లో ‘చలో వరంగల్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ

రాయికల్‌: ఈనెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు సంబంధించిన శ్రీచలో వరంగల్‌శ్రీ పోస్టర్‌ను ఆదివారం ఏన్నారై బీఆర్‌ఎస్‌ యూకే ఆధ్వర్యంలో లండన్‌ టవర్‌ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించారు. బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు నవీన్‌ రెడ్డి మట్లాడుతూ రజతోత్సవ సభకు ప్రజలంతా భారీ సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలంతా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని, రానున్న రోజు ల్లో లండన్‌లో కూడా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల, కార్యదర్శి రవి ప్రదీప్‌ పులుసు, అడ్వైజరీ వైస్‌ చైర్మన్‌ గణేష్‌ కుప్పాల, సభ్యులు పవన్‌ కళ్యాణ్‌, అజయ్‌ రావు గండ్ర పాల్గొన్నారు.

పీసీసీ చీఫ్‌ను కలిసిన ఎమ్మెల్యే

జగిత్యాల: పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ఆదివారం హైదరాబాద్‌లో కలిశారు. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మధ్య వివాదం ముదురుతున్న విషయం తెల్సిందే. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్‌.. కాంగ్రెస్‌లో చేరగా అప్పటినుంచి కాంగ్రెస్‌ నాయకులు విబేధిస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రెస్‌మీట్లలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పీసీసీ అధ్యక్షుడితో స్థానిక నేతలతో కలవడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి నిధుల కోసమా..? లేక ఇద్దరి మధ్య వివాదా నికి తెరపడేలా చర్చించారా..? తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే వెంట జగిత్యాల బల్దియా మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, నాయకులు వెళ్లారు. అయితే వీరిలో కొందరు మొన్నటివరకు జీవన్‌రెడ్డి వెంట ఉన్నవారు వెళ్లడం చర్చకు దారితీస్తోంది.

అకాలం.. తడిసిన ధాన్యం

రాయికల్‌: మండలంలోని ఆలూరు, వీరాపూర్‌, రాజనగర్‌ గ్రామంలో ఆదివారం అకాల వర్షంతో కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు మెక్కొండ రాంరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నవీన్‌రెడ్డి

రైతు పొలంలో   జిల్లా జడ్జి నీలిమ1
1/1

రైతు పొలంలో జిల్లా జడ్జి నీలిమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement