
ప్రశాంతంగా ముగిసిన చిన్న జయంతి
సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● అంజన్న స్వాములతో కిక్కిరిసిన కొండ ● మార్మోగిన జైశ్రీరామ్.. జై హనుమాన్ నామస్మరణ
సుమారు 2 లక్షల మంది రాక
హనుమాన్ జయంతి వేడుకలు కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఘనంగా జరిగాయి. దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు, దీక్షాపరులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. మూడు రోజుల పాటు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి తరలివచ్చిన దీక్షాపరులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షించారు.
జగిత్యాల: రామ నామస్మరణతో కొండగట్టు అంజన్న క్షేత్రం మార్మోగింది. మూడురోజుల నుంచి నిర్వహిస్తున్న హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ అర్ధరాత్రులు అక్కడే ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. దీక్షాపరులు స్వామివారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించి మాల విరమణ చేశారు.
న్యూస్‌రీల్

ప్రశాంతంగా ముగిసిన చిన్న జయంతి

ప్రశాంతంగా ముగిసిన చిన్న జయంతి

ప్రశాంతంగా ముగిసిన చిన్న జయంతి

ప్రశాంతంగా ముగిసిన చిన్న జయంతి

ప్రశాంతంగా ముగిసిన చిన్న జయంతి

ప్రశాంతంగా ముగిసిన చిన్న జయంతి