
అగ్నిప్రమాదాల నివారణ అందరి బాధ్యత
జగిత్యాలరూరల్: అగ్ని ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని జగి త్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో సంజ య్, ఎస్పీ కార్యాలయంలో అశోక్‌కుమార్ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. గృహ నిర్మాణాలు, స్కూళ్లు, వ్యాపార సముదాయాలు అగ్నిప్రమాదా నివారణ చర్యలు చేటప్టిన తర్వాతే అనుమతులు ఇవ్వాలన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జిల్లా అగ్నిమాపక శా ఖ అధికారి కృష్ణకాంత్, ఫైర్ సిబ్బంది రవీందర్, మధు, నాయకులు కోలగాని సత్యం, శరత్‌రావు, ప్రభాత్‌సింగ్, ఠాకూర్, పవన్, మహేశ్, వెంకటేశ్, శ్రీరాం, భిక్షపతి పాల్గొన్నారు.