కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల మున్సిపల్ పరిదిలోని యెఖీన్‌పూర్ గ్రామ శివారులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి పోస పోవద్దని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, సింగిల్ విండో చైర్మన్లు సింగిరెడ్డి నర్సారెడ్డి, ఆదిరెడ్డి, నాయకులు పేర్ల సత్యం, సీఈవో బాబా, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రైతులు మద్దతు ధర పొందాలి
మల్లాపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డ్‌లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత, వైస్ చైర్మన్ ఇట్టెడి నారాయణరెడ్డి, కార్యదర్శి శ్రీధర్, ఫ్యాక్స్ చైర్మన్ వేంపేట నర్సారెడ్డి, సీఈవో భూమేష్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.


