
భక్తుల కొంగుబంగారం శ్రీరామలింగేశ్వరస్వామి
● నేడు, రేపు జాతర ఉత్సవాలు ● ముస్తాబైన ఆలయం
గొల్లపల్లి: మండలంలోని చిల్వ కోడూర్ గ్రామంలోగల శ్రీరామలింగేశ్వరస్వామి భక్తులకు కోర్కెలు తీర్చే స్వామిగా నిత్యపూజలు అందుకుంటున్నారు. ఏటా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజులపాటు ఇక్కడ అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతాయి. జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఉత్సవాలకు తరలివస్తారు. జగిత్యాల నుంచి పెద్దపల్లి వెళ్లే రహదారిపై ఉన్న చిల్వకోడూర్‌లో జంపన్నవాగు ఒడ్డున స్వామివారు కొలువుదీరారు. పంచాంగ శ్రవణం, స్వామివారి కల్యాణం, రథో త్సవం, ఎడ్లబండ్ల ఉత్సవాలు ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తాయి. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి రథోత్సవం, ఏకాంతసేవ, ఏప్రిల్ ఒకటిన ఎడ్లబండ్ల ఉత్సవాలు, అన్నదానం ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. ఎడ్లబండ్ల పోటీలో మొదటి బహుమతిగా పావుతులం బంగారం, ద్వితీయ బహుమతిగా 100 గ్రాముల వెండి, తృతీయ బహుమతిగా 50 గ్రాముల వెండి ప్రదానం చేస్తామని ఆలయ కమిటీ చైర్మన్ దాసరి తిరుపతి తెలిపారు.

భక్తుల కొంగుబంగారం శ్రీరామలింగేశ్వరస్వామి