
నిరుపేదలకు సన్న బియ్యం ఓ వరం
ధర్మపురి: ఎక్కువ డబ్బులతో సన్నబియ్యం కొనుగోలు చేయని నిరుపేదలకు ఎంతో వరమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురిలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన గ్యారంటీల్లో సన్న బియ్యం పథకం ఒకటని, రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతీఒక్కరికీ ఉచితంగా సన్న బియ్యం అందజేస్తుందన్నారు. రేషన్ డీలర్లకు రూ.5వేల గౌరవ వేతనం, బియ్యం సరఫరాలో హమాలీ ఖర్చులు వంటి సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.