
ప్రసూతి, అనారోగ్య మరణాలు తగ్గించాలి
జగిత్యాల: ప్రసూతి, అనారోగ్య మరణాలు తగ్గించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఐఎంఏ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రసూతి మరణాలను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుమన్‌రావు మాట్లాడుతూ.. గర్భిణులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. సక్రమంగా మందులు వాడితే ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. గైనకాలజిస్ట్‌లు అనిత, పిడియాట్రిక్ కార్తీక్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.