
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం
జగిత్యాలటౌన్: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్ లత అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటవీరుడు దొడ్డి కొమురయ్య 98వ జయంతిని కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని కొనియాడారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ విమోచన పోరాటంతోనే స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి బీజం పడిందన్నారు. జీవన్‌రెడ్డి వెంట చెట్టె గంగాధర్, చెట్టె భార్గవ్, మహేందర్‌రెడ్డి, గంగమల్లు, మహేశ్, అజయ్, భీరం రాజేష్, ముఖేష్ ఖన్నా ఉన్నారు. కొంరయ్య విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు నివాళి అర్పించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బండపెల్లి మల్లేశ్వరి, దయాల మల్లారెడ్డి పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జైలుకే..
కోరుట్ల: స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం చట్టరీత్యా నేరమని, అలా చేస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష తప్పదని జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు. కోరుట్లలోని స్కానింగ్ సెంటర్లను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కానింగ్ మిషన్స్, డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. స్కానింగ్ సెంటర్లలో ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు అనే ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే రిజిస్ట్రేన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్, ఆరోగ్య విస్తరణ అధికారి రాజేశం, తదితరులు పాల్గొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగుల నిరసన
జగిత్యాలటౌన్: కేంద్రప్రభుత్వ పెన్షన్ విధానాలను వ్యతిరేకిస్తూ పెన్షనర్ల జేఏసీ పిలుపు మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట సంస్థ రిటైర్డ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. కేంద్రప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్‌లో పెన్షన్ సవరణ బిల్లు పెన్షనర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ప్రమాదకరంగా ఉందని, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చిలుముల గంగారాం, ఎలగందుల సుధాకర్, పురుషోత్తం, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
జగిత్యాలక్రైం: జిల్లాలో పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని, పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ఠపర్చాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. తన కార్యాలయంలో గురువారం పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. కాలనీలు, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. రాత్రిపూట గస్తీ, పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. డీఎస్పీలు రఘుచందర్, రాములు, రంగారెడ్డి, సీఐలు శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, రఫీక్‌ఖాన్, వేణుగోపాల్, రాంనర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, ఎస్సైలు, డీసీఆర్బీ, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం