
మెడికల్ హబ్‌గా జగిత్యాల
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: జగిత్యాలను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుకోవడం జరిగిందని, రాష్ట్రంలోనే అత్యధికంగా నియోజకవర్గానికి పల్లె దవాఖానాలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని లింగంపేటలో రూ.13 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖానా, రూ.10 లక్షలతో పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్లను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకోవడంతో పాటు, నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్లు అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల జాప్యానికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాగా కాంట్రాక్టర్లు చేతులెత్తేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. జగిత్యాల పట్టణంలో 18 వేల కుటుంబాలకు ఉచిత కరెంట్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, నూతన ఉద్యోగాలు, రుణమాఫీ, ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
టీఆర్‌నగర్‌లో రూ.3 కోట్లతో బాలసదన్
టీఆర్‌నగర్‌లో రూ.3 కోట్లతో బాలసదన్ నిర్మాణం జరగగా అదనంగా రూ.75 లక్షల నిధులు కేటా యించనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలి పారు. మున్సిపల్ అధికారులు వెటర్నరీ, హెల్త్ వివిధశాఖలతో సమీక్ష నిర్వహించారు. సీఆర్‌ఆర్ నిధులు రూ.30 కోట్ల టెండర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్‌యార్డు నిర్వహణ, తడిపొడి చెత్త నిర్వహణపై ప్రజలను చైతన్య పర్చాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్, కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్, భారతి, చుక్క నవీన్ పాల్గొన్నారు.