కమనీయం.. రమణీయం
● కన్నుల పండువగా శ్రీసీతారాముల కల్యాణం ● జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు ● భారీగా తరలివచ్చిన భక్తులు ● స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పణ
జగిత్యాలటౌన్/రాయికల్/ధర్మపురి:శ్రీరామనవమి సందర్భంగా
జిల్లాలోని పలు ఆలయాల్లో శ్రీసీతారాముల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. జిల్లాలోని ధరూర్ క్యాంపులోగల శ్రీకోదండరామాలయం, విద్యానగర్ సీతారామచంద్ర ఆలయం, అంగడి బజారులోని మార్కండేయ ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోదండరామాలయంలో స్వామివారికి జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్లు అడువాల జ్యోతి, భోగ శ్రావణి పాల్గొన్నారు. ధర్మపురి నృసింహస్వామి ఆలయంలోని శేషప్ప కళావేదికపై స్వామివార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కోరుట్ల ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మహోత్సవానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరయ్యారు. రాయికల్ పట్టణంతో అయోధ్య, కుమ్మరిపల్లి, అల్లీపూర్, బోర్నపెల్లి, రామాజీపేట, తాట్లవాయి గ్రామాల్లో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. అయోధ్యలో వేద పండితులు అంగడి భువనేశ్వర్ ఆధ్వర్యంలో ఉప్పుమడుగు నుంచి సీతమ్మను, అయోధ్య నుంచి రామున్ని శోభాయాత్రగా తీసుకొచ్చి కల్యాణం జరిపించారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ గంగాధర్, ఈవో విక్రం, ట్రాన్స్‌కో ఏఈ తుమ్మల నవీన్, ఆర్‌ఐ పద్మయ్య పాల్గొన్నారు.


