జిల్లాలో రేషన్ దుకాణాల వివరాలను రెవెన్యూ అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లాం. ప్రభుత్వ అనుమతులు రాగానే నియమ నిబంధనల ప్రకారం నూతన రేషన్ దుకాణాల ఎంపికపై కసరత్తు చేస్తాం. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా రేషన్‌దుకాణాలను ప్రారంభిస్తాం.
– చంద్రశేఖర్‌రెడ్డి,
జిల్లా సివిల్‌సప్లయ్ అధికారి
మూడు గ్రామాలకు ఒకటే దుకాణం
మాది ఆల్యనాయక్‌తండా. ఇటీవల గ్రామ పంచాయతీగా ఏర్పడింది. తండా గతంలో తాట్లవాయి పరిధిలో ఉండగా.. అదే గ్రామంలో కై రిగూడెం నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింది. మా గ్రామాలకు నేటి వరకూ రేషన్‌దుకాణాలు రాలేదు. పాత దుకాణాలకు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నాం. – నందునాయక్,
మాజీ సర్పంచ్, ఆల్యనాయక్‌తండా
సమస్యను మండలిలో లేవనెత్తా..
నూతన గ్రామపంచాయతీల్లో రేషన్ దుకాణాలుమంజూరు చేయాలని శాసనమండలిలో సమస్యను లేవనెత్తాను. గ్రామపంచాయతీలుగా ఏర్పడి సుమారు ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా పాత రేషన్ దుకాణాలకు వెళ్లే రేషన్ సరుకులు తెచ్చుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది.
– ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం


