మరమ్మతు చేపట్టాలి
పైప్‌లైన్ వేసినప్పుడు సీసీరోడ్లు తవ్వి వదిలేశారు. వాటికి మరమ్మతు చేపట్టకపోవడంతో ఏ కాలనీకి వెళ్లినా రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. మున్సిపల్ పాలకవర్గాలు మారుతున్నా రోడ్లకు మాత్రం మరమ్మతు చేపట్టడం లేదు. ప్రజాప్రతినిధులు స్పందించాలి.
– అల్లె నారాయణ,కోరుట్ల
రోడ్లపై వెళ్తే నరకమే
రాయికల్ మున్సిపాలిటీలో ఏ రోడ్డుకు వెళ్లినా ఇబ్బందిగా మారింది. ఇటీవల బల్దియాలో కొన్ని వార్డులకే రోడ్లు మంజూరయ్యాయి. అవి కూడా పూర్తి చేయలేదు. అధికారులు స్పందించి సీసీరోడ్లు ప్రతి కాలనీలో చేపట్టాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
– గోపాల్, రాయికల్
రోడ్ల పరిస్థితి అధ్వానం
గత పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసిన రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతున్నాయి. నడవాలంటే ఇబ్బందిగా మారింది. పుణ్యక్షేత్రం కావడంతో నిత్యం భక్తులు వస్తుంటారు. రోడ్లు బాగుచేసేలా చర్యలు తీసుకోవాలి.
– శ్రీనివాస్, ధర్మపురి
నిత్యం ప్రమాదాలే
జిల్లాకేంద్రంలో ప్రధాన రహదారులపై అక్కడకక్కడ గుంతలున్నాయి. వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రతి గుంతలున్న చోట్లలో పూడ్చేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందికరంగా మారింది. చిన్నపిల్లలు సైతం పడిపోతున్నారు.
– శ్రీనివాస్, జగిత్యాల
మరమ్మతు చేపట్టాలి
మరమ్మతు చేపట్టాలి
మరమ్మతు చేపట్టాలి


