ఆహ్లాదం..అందనంతదూరం | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదం..అందనంతదూరం

Mar 28 2025 2:19 AM | Updated on Mar 28 2025 2:17 AM

జగిత్యాల: జిల్లాకేంద్రం.. గ్రేడ్‌–1 మున్సిపాలిటీ అయినప్పటికీ జగిత్యాలలో కనీసం సేద తీరుదామంటే ఉద్యానవనాలు లేవు. అమరవీరుల స్తూపం వద్ద పార్క్‌ ఉన్నప్పటికీ అందులో ఎలాంటి ఫౌంటెన్లు, పిల్లలు ఆడుకునే పరికరాలు ఏర్పాటు చేయలేదు. కేవలం గ్రీనరి మాత్రమే ఏర్పాటు చేశారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ పార్క్‌లో వసతులు లేక కళావిహీనంగా కనిపిస్తోంది. 1.34 లక్షల జనాభా ఉన్న ఈ పట్టణంలో ఒకేఒక్క పార్క్‌ ఉంది. అందులోనూ పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడంతో ఉన్న దాంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ఉద్యనవనానికి మరమ్మతుగానీ, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చేపడుదామన్న ఆలోచన చేయడం లేదు. గతంలో ఎన్నడో నిర్మించిన పరికరాలు, ఫౌంటేన్లకు వాటికి ౖపైపె పూతలు పూశారు. పచ్చదనం కోసం లాన్‌ ఏర్పాటు చేయలేదు. నడిబొడ్డున ఉండటంతో చాలామంది ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. పట్టణంలో సుమారు 50ఏళ్ల క్రితం యావర్‌రోడ్డు నడిబొడ్డున.. కొత్తబస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేశారు. ఇది ఎకరం స్థలంలో విస్తరించి ఉంది. గతంలో పిల్లలు ఆడుకోవడానికి ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. శిథిలావస్థకు చేరడంతో గతంలో రూ.10 లక్షలు పార్క్‌ కోసం బల్దియా కేటాయించినప్పటికీ ౖపైపె మరమ్మతు చేపట్టి మమ అనిపించారు. ఈ పార్క్‌లో మ్యూజికల్‌ ఫౌంటేన్‌, మరో ఫౌంటేన్‌ ఏర్పాటుకు, ఆట వస్తువుల ఏర్పాటుకు నిధులు మంజూరైనా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. పిల్లలు ఆడుకునే పరికరాలకు రంగులు పూసి వదిలేశారు. ప్రస్తుతం అవే వస్తువులతో ఆటలాడుకుంటున్నారు. మౌళిక వసతులు కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

వసతులు లేక..

పట్టణానికి నిత్యం వేలాది మంది వస్తూపోతుంటా రు. చదువుకునేందుకు విద్యార్థులు ఇక్కడకు ఉంటారు. సాయంత్రం పూట కాస్త సేద తీరుదామంటే పార్క్‌లో స్థలం కరువైంది. పట్టణవాసులకు ఆహ్లా దం అందడం లేదు. ఉన్న పార్క్‌లో సరైన వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి పట్టణంలో నివసించే వారి వద్దకు బంధువులూ వస్తుంటారు. కరీంనగర్‌ జిల్లా తర్వాత ప్రధాన పట్టణంగా గుర్తిపు పొందినప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. అధికారులు స్పందించి పార్క్‌లో అన్ని సౌకర్యాలు కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

జగిత్యాలలో ఏకై క పార్క్‌

పట్టణవాసుల ఆశలు ఆవిరి

పరికరాలు లేక చిన్నారుల తిప్పలు

సౌకర్యాలు లేక వచ్చేందుకు వెనుకంజ

రెనోవేషన్‌ చేపడతాం

పార్క్‌లో రెనోవేషన్‌ చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల కొన్ని మోటార్లు చెడిపోవడంతో ఫౌంటేన్లు నడవడం లేదు. త్వరలోనే వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటాం.

– అనిల్‌, మున్సిపల్‌ ఏఈ

ఆహ్లాదం..అందనంతదూరం1
1/5

ఆహ్లాదం..అందనంతదూరం

ఆహ్లాదం..అందనంతదూరం2
2/5

ఆహ్లాదం..అందనంతదూరం

ఆహ్లాదం..అందనంతదూరం3
3/5

ఆహ్లాదం..అందనంతదూరం

ఆహ్లాదం..అందనంతదూరం4
4/5

ఆహ్లాదం..అందనంతదూరం

ఆహ్లాదం..అందనంతదూరం5
5/5

ఆహ్లాదం..అందనంతదూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement