
మా తాతల కాలం నుంచి..
బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 25 ఏళ్లుగా ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. మా వంశంలో తాతలు, తండ్రుల కాలం నుంచి పంచాంగ శ్రవణం చేస్తున్నం. ప్రస్తుత విశ్వావసు నామ సంవత్సరంలో రవి రాజుగా వస్తున్నారు. పంచాంగ శ్రవణంలో రాశిఫలాలు, ఆదాయ వ్యయాలు, ధాన్యాధిపతి గూర్చి, ఎన్ని తూముల వర్షాలు కురుస్తాయి, పంటలు ఎన్ని పుట్లు పండుతాయి, రాజ్యాధికారం ఎలా ఉంటుంది, సీ్త్ర, పురుష జనన ఉత్పత్తి తదితర వివరాలు చెబుతాం. ఉగాది రోజు ప్రజలు పంచాంగ శ్రవణం వినడానికి వచ్చి తమ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు.
– శ్రీనివాసాచార్యులు, బోయినపల్లి