క్షీరాభిషేకం, పుష్పాలంకరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలతో అలంకరించారు. అర్చకులు శ్రీనివాసచార్యులు మంత్రోచ్ఛరణలతో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారలను దర్శించుకున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసమే తనిఖీలు
జగిత్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణ కో సమే గురువారం అర్ధరాత్రి పోలీసులు తని ఖీలు చేపట్టడం జరిగిందని ఎస్పీ అశోక్‌కుమా ర్ అన్నారు. ఈసందర్భంగా శుక్రవారం ఎస్పీ మాట్లాడుతూ, జగిత్యాల పట్టణంలో రాత్రి స మయంలో నిఘా మరింత పటిష్టం చేస్తూ చర్యలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నేరా లను నియంత్రించవచ్చన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ చౌరస్తాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, చట్ట విరుద్ధ వస్తువులను గుర్తించేందుకు శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్‌స్క్వాడ్స్, బాంబ్‌స్క్వాడ్ సిబ్బందితో విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
రాయికల్(జగిత్యాల): నిరుద్యోగ యువత ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కోరారు. శుక్రవారం రాయికల్ పట్టణంలోని చిన్నజీయర్‌స్వామి ట్రస్ట్ భవన్‌లో ప్రతి ఫౌండేషన్ సహకారంతో జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్, హౌస్‌వైరింగ్, టేలరింగ్‌లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ, యు వకులతో ముచ్చటించారు. ఆయన వెంట విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, ప్రతిమ ఫౌండేషన్ ఆ ర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి, కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రజతోత్సవ సభ విజయవంతం చేయాలి
రాయికల్(జగిత్యాల): ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత పిలుపునిచ్చారు. శుక్రవారం రాయికల్ పట్టణంలో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పోస్టర్ ఆవిష్కరించారు. పట్టణ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు ఎనగందుల ఉదయశ్రీ, మారంపల్లి రాణి, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, మహిళ అధ్యక్షురాలు స్పందన, నాయకులు శ్రీధర్‌రెడ్డి, మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
వృద్ధుల్లో మనోధైర్యం నింపేందుకే సదస్సులు
జగిత్యాల: వృద్ధుల్లో మనోధైర్యం నింపేందుకే సదస్సులు నిర్వహించడం జరుగుతుందని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో వృద్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధులు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారి పిల్లలు బాధ్యత వహించాలన్నారు. కొందరిని సొంత ఇంట్లోంచే గెంటివేయడం, వసతి గృహాలు, అనాథ శరణాలయాల్లో బలవంతంగా ఉంచుతున్నారని, తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వారిని పట్టించుకోకపోతే కఠిన శిక్షలు సైతం ఉన్నాయన్నారు. వారి ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానసిక వైద్యున్ని నియమించాలన్నారు. ప్రధాన కార్యదర్శి విశ్వనాథం, ప్రకాశ్‌రావు, అశోక్‌రావు పాల్గొన్నారు.
క్షీరాభిషేకం, పుష్పాలంకరణ
క్షీరాభిషేకం, పుష్పాలంకరణ
క్షీరాభిషేకం, పుష్పాలంకరణ


