పెగడపల్లి(ధర్మపురి): వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. కమిటీ చైర్మన్‌గా రాములుగౌడ్, వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, డైరెక్టర్లు అజ్మీర అంజన్ననాయక్, లింగంపల్లి మహేశ్, సంకిటి శ్రీకాంత్‌రెడ్డి, చాట్ల విజయభాస్కర్, తవుటు లావణ్య, దేశెట్టి లక్ష్మీరాజం, శ్రీరాం అంజయ్య, బాలుసాని శ్రీనివాస్, మన్నె గంగరాజం, ట్రేడర్ల నుంచి మ్యాకల మల్ల య్య, చెట్ల కిషన్, కర్ర భాస్కర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ఏఎంసీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రాజరాంపల్లి, నందగిరి, పెగడపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మార్కెట్ కార్యదర్శి వరలక్ష్మి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభారాణి, నాయకులు గజ్జల స్వామి, రాజేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల మహిళ అధ్యక్షులు విజయలక్ష్మి, సత్యప్రసన్న పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు రానీయం
వెల్గటూర్(ధర్మపురి): ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తామని విప్ లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతమై రైతులకు సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతీ ఒక్కరికీ మాఫీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గోపిక, సంఘం అధ్యక్షుడు రత్నాకర్, నాయకులు తిరుపతి, రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్