
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
వెల్గటూర్: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన వంగపల్లి గౌతమి జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై ంది. ఈనెల 9న హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జాతీయస్థాయికి ఎంపికై నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. ఈనెల ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు యూపీలోని హత్రాస్‌లో జరిగే 53వ జాతీయస్థాయి సీనియర్ ఉమెన్ హ్యాండ్‌బాల్ పోటీలలో పాల్గొననుంది. గౌతమిని మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, సాన యాదిరెడ్డి, ఎంఈవో రాంచంద్రం, మాజీ సైనికులు వెంకటరమణారెడ్డి, సీనియర్ క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.
సైన్‌బోర్డులు ఏర్పాటు.. కూల్చివేత
జగిత్యాల: జిల్లాకేంద్రంలో కొత్తబస్టాండ్ నుంచి కరీంనగర్‌రోడ్.. కొత్తబస్టాండ్ నుంచి నిజామాబాద్ వెళ్లే రోడ్‌లో సెంట్రల్ డివైడర్లు ఉన్నాయి. వీటి మధ్య సైన్‌బోర్డులు ఏర్పాటు చేసుకునేందుకు గతంలో కరీంనగర్‌కు చెందిన రెండు ఏజెన్సీలు మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నాయి. నిబంధనల ప్రకారమైతే అందులో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయరాదు. అయినా అప్పట్లో టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేసిన కీలక అధికారి, కమిషనర్ ఓ ఏజెన్సీకి ప్రొసీడింగ్ ఇచ్చారు. అప్పుడే అది వివాదాస్పదంగా మారింది. అయినా సదరు ఏజెన్సీ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నట్లు తెలిసింది. ఏడాది గడుస్తున్న నేపథ్యంలో రెన్యువల్ చేసుకోకుండా.. టౌన్‌ప్లానింగ్ అనుమతి తీసుకోకుండా మూడు రోజుల క్రితం కొత్తబస్టాండ్ నుంచి కరీంనగర్ రోడ్‌లోని డివైడర్లలో తాజాగా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు సోమవారం వాటిని కూల్చివేశారు. డివైడర్లలో సైన్‌బోర్డుల ఏర్పాటుకే అనుమతి లేదంటే ఇష్టారాజ్యంగా వెలుస్తుండడం మున్సిపాలిటీ అవినీతికి అద్దం పడుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఇలా ఏర్పాటు చేస్తున్నారాన్న ఆరోపణలూ వస్తున్నాయి. సైన్‌బోర్డులు, అడ్వర్టయిజ్‌మెంట్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటితో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
కూల్చివేస్తున్న మున్సిపల్ సిబ్బంది

జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక

జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక