ఆహార ఉత్పత్తులతో ఆర్థికాభివృద్ధి
జగిత్యాలరూరల్: ఆహార ఉత్పత్తుల ద్వారా మహిళ సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని సెర్ప్ జిల్లా అదనపు డైరెక్టర్ చరణ్‌దాస్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థ వ్యవస్థీకరణ పథకంపై సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలవారు ఆర్థికంగా ఎదగడానికి వివిధ ఆదాయాభివృద్ధి మార్గాలున్నాయని అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల వ్యవస్థీకరణ పథకం ద్వారా 35శాతం సబ్సిడీ రుణాలు అందించడం జరుగుతోందన్నారు. పీఎంఎఫ్‌ఎంఈ ద్వారా రుణాలు తీసుకుని వివిధ యూనిట్లు పెట్టుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం జిల్లా డీఎంపీ వెంకటేశ్ మాట్లాడుతూ నాణ్యతతో కూడిన ఉత్పత్తులతో పాటు వాటికి ప్యాకింగ్, బ్రాండింగ్ అతిముఖ్యమని అన్నారు. జిల్లా రిసోర్స్ పర్సన్లు వంశీకృష్ణ, జిల్లాస్థాయి శిక్షకులు కోల శ్రీనివాస్‌చక్రవర్తి, ఏపీఎం గంగాధర్, సీసీలు గంగారాం, రవీందర్, శ్రీనివాస్, విద్యాసాగర్ పాల్గొన్నారు.


