
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
జగిత్యాల: ప్రజల అభ్యున్నతే లక్ష్యమని, రాజ కీయాలకతీతంగా చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం కొడిమ్యాలలో శివాజీ విగ్రహం నుంచి అంగడిబజార్ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ, కొడిమ్యాల మండలంలో ఎంపీ ల్యాండ్స్, ఉపాధిహామీ నిధులతో రోడ్లను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. అలా గే కిచెన్‌షెడ్స్, కమ్యూనిటీ హాల్స్, పీఏసీఎస్ భవనాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నా రు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా పనిచేస్తున్నామని, కొడిమ్యాల మండలంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించుకో వడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మండలంలో పర్యటించగా మహిళలు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యే బొడిగె శోభ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గోవులను రక్షించాలి
రాయికల్(జగిత్యాల): గోవులను పరిరక్షించా లని మంగళవారం హిందు ఆలయాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని శివాజీ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొద్ది రోజులుగా పట్టణంలోని ఆలయాల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు గోవులను ఎత్తుకెళ్తున్నారని, ఇటీవల దొంగలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోవ డం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు ధర్నా నిర్వహించడంతో వాహనా లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

రాజకీయాలకతీతంగా అభివృద్ధి