
తల్లీకొడుకుల మృతితో రుద్రంగిలో ఉద్రిక్తం
రుద్రంగి(వేములవాడ): రుద్రంగికి చెందిన తల్లీకొడుకులు కాదాసు పుష్పలత, నిహాన్ మృతితో మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్తమామలే విషమిచ్చి చంపారంటూ మృతురాలి తల్లిగారి కుటుంబ సభ్యులు పుష్పలత అత్తమామల ఇంటిపై సోమవారం దాడి చేశారు. వారి మృతికి కారకులను శిక్షించాలని కోరుతూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాకు యత్నించారు. బాధితులకు న్యాయం చేస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై అశోక్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చేపట్టారు. పుష్పలత భర్త దుబాయ్ నుంచి మంగళవారం వస్తుండడంతో అంత్యక్రియలు సోమవారం జరుపలేదు. పుష్పలత మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచారు.
అనుమానితుల ఇంటిపై మృతురాలి కుటుంబీకుల దాడి
సముదాయించిన పోలీసులు

తల్లీకొడుకుల మృతితో రుద్రంగిలో ఉద్రిక్తం