
ప్రభుత్వ భూములు ఖాళీ చేయాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. నర్సింగాపూర్ గ్రామశివారులోని ఆక్రమణకు గురైన 90ఎకరాల స్థలాన్ని బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సింగాపూర్ శివారులోని సర్వేనంబరు 251, 437లో 90ఎకరాల్లో ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్‌ను సర్వే చేపట్టడం జరిగిందన్నారు. సర్వే తర్వాత ఎవరైతే పట్టా అయిన భూములున్నాయో అవన్నీ పీవోటీ యాక్ట్ కింద రద్దు చేయడం జరిగిందన్నారు. అందులో సేల్ అయిన, రిజిస్ట్రేషన్ అయిన భూములను కూడా రద్దు చేయడం జరుగుతుందన్నారు. 90 ఎకరాల ప్రభుత్వస్థలంలో సర్వే నంబరు 437, 251లో ఆన్ రికార్డ్ ప్రకారం గవర్నమెంట్ రికవరీ చేసుకుందని, ప్రభుత్వపరంగా గవర్నమెంట్ ల్యాండ్ జాబితాలో ఉందన్నారు. ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదన్నారు. గ్రౌండ్ లెవల్‌లో ఇప్పటికే పరిశీలన పూర్తయిందని తెలిపారు. సదరు భూమిలో ఇటుక బట్టీల వ్యా పారం చేస్తున్నవారు 48గంటల్లోపు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను బేఖా తరు చేస్తే ప్రభుత్వ పీవోటీ యాక్ట్ ప్రకారం క్రిమి నల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న వాటిని సీజ్ చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఆర్డీవో శ్రీనివాస్, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, ల్యాండ్ సర్వేయర్లు విఠల్ పాల్గొన్నారు.