మద్దుట్ల ఎత్తిపోతలు ఎప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

మద్దుట్ల ఎత్తిపోతలు ఎప్పుడో..?

Apr 7 2025 10:10 AM | Updated on Apr 7 2025 10:10 AM

మద్దు

మద్దుట్ల ఎత్తిపోతలు ఎప్పుడో..?

● రూ.45కోట్ల హామీకి ఏడాదిన్నర ● ఆరేళ్లుగా తప్పని ఎదురుచూపులు ● చెరువులు నింపాలంటున్న రైతులు ● ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న ఉద్యమం

మల్యాల(చొప్పదండి): భారీ వర్షాలు కురిసినా.. వ రద వచ్చే ప్రాంతాలు లేక మల్యాల మండలంలో చె రువులు ఎండిపోతున్నాయి. అలాంటి వాటిని ఎత్తి పోతల ద్వారా నింపాలంటూ ఆరేళ్లుగా ఇక్కడి రైతులు ఉద్యమిస్తున్నారు. యువకులు అన్నదాతల కో సం ముందువరుసలో నిలబడుతున్నారు. రైతులను చైతన్యపరుస్తూ.. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. తమ గ్రామంలోని చెరువులు నింపాలని కో రుతూ అప్పటి సీఎం కేసీఆర్‌కు పోస్టుకార్డులు రాశా రు. 15రోజులపాటు నిత్యం ఆన్‌లైన్‌లో ప్రజావా ణికి ఫిర్యాదు చేశారు. నేరుగా సీఎం కార్యాలయానికి ఫోన్లు చేసి తమ సమస్య పరిష్కరించాలని కో రారు. వీలైనంత త్వరగా పరిశీలించి సమస్య పరి ష్కరిస్తామని సీఎంఓ నుంచి రైతులకు సమాధానం వచ్చింది. ఇందులో భాగంగా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. మండలంలోని మద్దుట్ల గ్రామ రైతులకు సాగునీటికి ఆధారమైన కొత్త చెరువు నింపేందుకు రూ.45కోట్లు కేటాయిస్తామని 2022లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో హామీ ఇచ్చారు. ఈ నిధులతో మద్దుట్లలోని కొత్త చెరువు, గుడికుంట చెరువులను నింపాలని భావించారు. ఈ చెరువులు నిండితే పరిసరాల్లో భూగర్భజలాలు పెరిగి సుమారు 1500 ఎకరాలకు సాగునీరందించాలని భావించారు. మద్దుట్ల శివారులోని వరదకాలువ నుంచి కొత్త చెరువు నింపేందుకు రైతులే స్వయంగా ఖర్చు పెట్టుకుని సర్వే చేయించారు.

చెరువులు నింపాలని రైతుల పోరాటం

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ అటకెక్కింది. అప్పటి నుంచి చెరువులను ఎత్తిపోతల ద్వారా నింపాలని మద్దుట్ల రైతులు, ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఎత్తిపోతలతో వందలాది ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంది. కొత్త చెరువును నింపితే గ్రావిటీ ద్వారా గుడికుంట చెరువు నిండుతుంది. ఈ చెరువు వద్ద మరో మోటారు ఏర్పాటు చేస్తే గొర్రెగుండం గ్రామంలోని నల్ల మట్టికుంట (తాళ్లయ్యకుంట) గొలుసుకట్టు విధానంలో నూకపల్లిలోని అలుగుకుంట, రేగులకుంట, ఒబులాపూర్‌లోని కోమటికుంట, కుమ్మరికుంట, లక్ష్మణరావుకుంట, రాంపూర్‌ గ్రామంలోని పాతచెరువు, కొత్త చెరువులను నింపవచ్చు.

ఎత్తిపోతలు ప్రారంభించాలి

మద్దుట్ల శివారులోని వరదకాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా కొత్త చెరువు, గుడికుంట చెరువు నింపుతామని మాజీ సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో ప్రకటించారు. కానీ.. నిధులు విడుదల కాలేదు. పథకం ప్రారంభానికి నోచుకోలేదు. ఎత్తిపోతల పథకం ప్రారంభించి, చెరువులు నింపాలి.

– మ్యాకల మల్లేశం, రైతు, మద్దుట్ల

ఆరేళ్లుగా వేడుకుంటున్నాం

మద్దుట్లలోని సుమారు 1500 ఎకరాలకు ఆధారమైన కొత్త చెరువు, గుడికుంట చెరువులను నింపాలని ఆరేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. చెరువులు నింపితే భూగర్భజలాలు పెరిగి మా గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లోని రైతులకు కూడా సాగునీరు అందుతుంది.

– కట్ట శ్రీనివాస్‌, రైతు, మద్దుట్ల

మద్దుట్ల ఎత్తిపోతలు ఎప్పుడో..?1
1/2

మద్దుట్ల ఎత్తిపోతలు ఎప్పుడో..?

మద్దుట్ల ఎత్తిపోతలు ఎప్పుడో..?2
2/2

మద్దుట్ల ఎత్తిపోతలు ఎప్పుడో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement