అకాలవర్షం.. రైతుకు కష్టం
కథలాపూర్/జగిత్యాలరూరల్: కథలాపూర్ మండలంలో గురువారం వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. రైతులు టార్పాలిన్ కవ ర్లు కప్పడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదని రైతులు తెలిపారు. టార్పాలిన్ కవర్లపై నిలిచిన నీటిని పారబోసి తిరిగి ఆరబెట్టారు. కేంద్రాలను త్వరగా ప్రారంభించాలని రైతులు కోరారు. అలాగే జ గిత్యాల రూరల్ మండలం అంతర్గాం, నర్సింగా పూర్, తాటిపల్లి, చల్‌గల్, అర్బన్ మండలం ధ రూర్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురి సింది. వరి, మామిడితోటలకు నష్టం వాటిల్లింది.
అకాలవర్షం.. రైతుకు కష్టం


